తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది. విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. మొత్తంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనగా, పళనికి అనూకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో మెజార్టీ ఓట్లు సాధించిన పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో పళని విజయం నల్లేరుపై నడకగా మారింది. రిసార్ట్ రాజకీయాలు నెగ్గాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పది రోజుల కిందటి వరకూ ఎవరికీ తెలియని కువతూర్‌కు సమీపంలోని గోల్డెడ్ బే రిసార్టులో చిన్నమ్మ శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అక్కడ నిర్బంధించారని కథనాలు వచ్చాయి.