గోల్డెన్ బే రిసార్ట్‌లో శశికళ కంటతడి
చెన్నై: ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకువచ్చి నిర్బంధించలేదని, అందరూ ఓ కుటుంబంలా ఉంటున్నారని అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చెప్పారు. కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపులో ఉంటున్న ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఇక్కడ ఎవరినీ బంధించలేదని, మీరు వాస్తవాన్ని చూడవచ్చని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి శశికళ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే వదంతులను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలందరూ తమ కుటుంబమని అన్నారు. కొందరు తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం కోసం మరో రోజు ఎదురు చూస్తామని చెప్పారు. గవర్నర్ నుంచి ఆహ్వానం రాకపోతే నిరసన తెలియజేస్తారా అన్న ప్రశ్నకు తదుపరి అడుగేంటో వేచి చూడండని చెప్పారు. పన్నీరు సెల్వం వర్గీయులు పార్టీని చీల్చేందుకు కుట్ర పనుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలందరూ కలసికట్టుగా ఉండాలని సూచించారు. సమావేశంలో మాట్లాడుతూ ఓ దశలో ఆమె కంటతడి పెట్టారు.
శశికళ ఇంకా ఏం మాట్లాడారంటే..
- మన పార్టీని, ప్రభుత్వాన్ని ఎవ్వరూ కదపలేరు
- కొన్నేళ్లుగా మంత్రిగా పనిచేసిన పన్నీరు సెల్వం.. ఈ సంక్షోభానికి కారణం
- మన వేలితో మన కళ్లనే పొడుస్తున్నారు
- కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
- ఆ తర్వాత అమ్మ సమాధి వద్ద ఫొటో దిగి ప్రపంచానికి చూపిస్తాం
- అసెంబ్లీలో అమ్మ చిత్రపటాన్ని ఏర్పాటు చేద్దాం
- కొందరు ఇది జరగకుండా అడ్డుపడుతున్నారు
- అమ్మ నాతో ఉన్నంత వరకూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
- నాకు 129 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది
- విజయం సాధించాక అమ్మకు అంకితం ఇద్దాం
- డీఎంకే కుట్రలను గెలిపించవద్దు
- నేను మహిళను కాబట్టి భయపెట్టాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు
తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు
డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!
శశి నుంచి మా మంత్రిని కాపాడండి!
అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!
శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్!
దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి