అమ్మ తర్వాత అమ్మగా, తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనుకున్న చిన్నమ్మ శశికళకు ఊహించని షాకులెదురవుతున్నాయి.
శశికళపై స్థానికులు తీవ్ర మండిపాటు
Published Sat, Feb 11 2017 6:14 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
చెన్నై : అమ్మ తర్వాత అమ్మగా, తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనుకున్న చిన్నమ్మ శశికళకు ఊహించని షాకులెదురవుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అనూహ్యంగా మద్దతు పెరగడంతో పాటు, ఆమెపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారిక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్న కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్ వైపు దారులన్నింటిల్లో ఆంక్షలు విధించడంపై అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. గోల్డెన్ బే రిసార్ట్ ఉన్న గ్రామ దారులన్నింటిన్నీ బ్లాక్ చేస్తున్నారు. అంతేకాక రాత్రిపూట రాజకీయ తతంగమంతా నడపాలనుకుంటున్న శశికళ వర్గం చీకటిపడ్డాక ఆ దారుల్లో వెలుతురు కూడా ఉండకుండా ఉండేందుకు లైట్స్ అన్నీ స్విచ్చాఫ్ చేస్తున్నారు.
మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అతి బలవంతం మీద అక్కడ ఉన్నారని తెలుస్తోంది. వారు శశికళపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వారిని బుజ్జగించడానికి శశికళ ఆ రిసార్ట్కు వెళ్లి మరీ ఎమ్మెల్యేలను కలిశారు. తన మెజార్జీని నిరూపించుకోవడానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా ఆమె కోరారు. అయితే ఇప్పటి వరకు గవర్నర్ శశికళకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. గవర్నర్ కనుక అపాయింట్మెంట్ నిరాకరిస్తే జయ సమాధి వద్ద దీక్షకు దిగేందుకు కూడా శశికళ సిద్ధమవుతున్నారు.
Advertisement
Advertisement