రిసార్ట్‌లో శశకళ వర్గీయుల సంబరాలు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామిని ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో శశికళ శిబిరం కళకళలాడుతోంది. గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న శశికళ వర్గం ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నా డీఎంకే చీఫ్ శశికళకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరినా గవర్నర్ వేచిచూడటం, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీరు సెల్వం వర్గంలోకి చేరుతుండటం, ఇంతలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడటం, బెంగళూరు పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లడంతో ఆమె వర్గీయులు ఢీలాపడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ గవర్నర్.. పళనిస్వామిని ఆహ్వానించడంతో శశికళ వర్గీయులకు కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది. కాగా పళనిస్వామి అప్పుడే సీఎం అయినట్టు కాదని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు లేదని పన్నీరు సెల్వం వర్గీయులు చెబుతున్నారు. మొత్తానికి ఎవరిబలమెంత అన్నది అసెంబ్లీలో బలపరీక్షలో తేలనుంది.
తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..?