శశికళ ఎఫెక్ట్ గోల్డెన్ బే రిసార్ట్కు భారీగా తగులుతోంది. ఒక్కసారిగా తన పేరు ప్రతిష్టలన్నీ భారీగా కోల్పోతుంది. గూగుల్ రేటింగ్స్ అన్నీ తలకిందులుగా వస్తున్నాయి. శశికళ లాంటి రాజకీయ నాయకులకు సురక్షిత ప్రాంతంగా ఈ రిసార్ట్ మారడంతో దీనికి ఈ పరిస్థితి ఏర్పడింది. కనీసం ఈ రిసార్ట్ లో భద్రత ఉండదు, అక్కడ పొలికల్ మాఫీయా గ్రూప్ ఉందంటూ గూగుల్ రివ్యూలో నెటిజన్లు పేర్కొంటున్నారు. క్రిమినాల్స్ అక్కడ ఈజీగా లోపలికి రావడానికి, బయటికి వెళ్లడానికి వీలుందంటూ మరో నెటిజన్ చెప్పారు. హోటల్ మేనేజ్మెంట్ కూడా అక్కడ అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ చెబుతున్నారు. మొత్తం అక్కడ థర్డ్ క్లాస్ రౌడీలే ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లొదంటూ సూచిస్తున్నారు. మాఫియా గ్రూప్ ఉంటున్న ఈ ప్రాంతం పర్యాటకులకు ఎలా సురక్షితమో చెప్పడని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు కూడా ఈ రిసార్ట్పై మండిపడుతున్నారు.