
విశ్వాసం నెగ్గుతాం.. రాష్ట్రపతి పాలన ఉండదు
తమ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అన్నారు.
తమ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అన్నారు. తప్పుకుండా విశ్వాస పరీక్షలో నెగ్గితీరుతామని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రపతి పాలనకు తాను ప్రయత్నిస్తున్నాని మాజీ సీఎం నితీష్కుమార్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. ఆయన అనవసరపు వదంతులతో పార్టీ ఎమ్మెల్యేలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు.
ఢిల్లీలో సోమవారం పలువురు కేంద్రమంత్రులను, బీహార్ గవర్నర్ను కలిసిన అనంతరం మాంఝీ మీడియాతో మాట్లాడారు. తమ సర్కారుకు మద్దతు ఇవ్వాలా.. లేదా అన్న విషయంలో బీజేపీ సొంతంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రపతి పాలన తీసుకురావాలన్న ఉద్దేశం తనకు లేదని, ఫిబ్రవరి 20న జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతివ్వాల్సిందిగా అన్ని పార్టీలను కోరినట్లు చెప్పారు. నితీష్ వద్ద ఉన్న ఎమ్మెల్యేలంతా బోగస్ అన్నారు.