
విశ్వాస పరీక్షలో నెగ్గిన జితన్ రామ్ మంజి
పాట్నా: బీహార్ లో జితన్ రామ్ మంజి నేతృత్వంలోని జేడీ(యూ) సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. విశ్వాస పరీక్ష సమయంలో శాసనసభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. జేడీ(యూ) ప్రభుత్వానికి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో జేడీ(యూ) పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. నితీష్ స్థానంలో జితన్ రామ్ మంజి ఈనెల 20న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ 32వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్ నేడు బలపరీక్షలో నెగ్గారు.