
పట్నా: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బిహార్‌లో చేపట్టిన సంకల్ప ర్యాలీని బిగ్ ప్లాప్‌గా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ వర్ణించారు. జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్, మోదీ కలిసి 2019 సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని స్థానిక గాంధీ మైదాన్‌లో పూరించిన విషయం తెలిసిందే. ఈ సభ కోసం ప్రధాని, సీఎం కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచారని మాంఝీ ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఎంత కష్టపడ్డా సభ మాత్రం ఘోరంగా విఫలమైందని, వారనుకున్నంత విజయం సాధించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.
రానున్న ఎన్నికల్లో వారి ఓటమికి ఇదే సంకేతమని మాంఝీ పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులను నితీష్ ఇంతవరకు పరామర్శించలేదని, రాజకీయ సభలకు మాత్రం ఆయనకు సమయం దొరుకుతుందని విమర్శించారు. కాగా సంకల్ప ర్యాలీపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోడ్డు పక్కన ఉన్న పాన్ షాప్ దగ్గర కూడా ఆ మాత్రం జనాలు ఉంటారని సెటైర్లు వేశారు. కాగా నితీష్, మోదీ, పాశ్వాన్ కలిసి సభలో పాల్గొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment