సాక్షి, బెంగళూరు: కాసేపట్లో కర్ణాటక అసెంబ్లీలో సీఎం యెడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ ఉదయం వరకు గెలుపుపై బీజేపీ ధీమాతో ఉండగా.. ఎమ్మెల్యేలను నిలువరించే పనిలో కాంగ్రెస్-జేడీఎస్‌లు ఉన్నాయి. కానీ, మధ్యాహ్ననికి ఎటూ అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బలపరీక్షలో నెగ్గాలంటే బీజేపీ ముందు ఐదు మార్గాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
1. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం.. తద్వారా బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటి విశ్వాస పరీక్షలో నెగ్గుతుంది.
2. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలువరించగలిగాలి.. అప్పుడు మెజార్టీ సంఖ్య ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
3. ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావటం.. తద్వారా మెజార్టీ మార్క్‌పై ప్రభావం చూపుతుంది.
4. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించటం.. సంఖ్యా బలం తగ్గిపోయి బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటేస్తుంది.
5. సభ కార్యాకలాపాలకు అవాంతరం కలిగించి.. సభను వాయిదా వేయించటం. అప్పుడు విశ్వాస పరీక్ష జరగదు. ప్రస్తుతానికి యెడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment