karnataka floor test
-
‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’
బెంగళూరు: కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్స్‌ని బుజ్జగించడానికి రంగంలోకి దిగిన ట్రబుల్షూటర్ డీకే శివకుమార్ తొలిసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం కూడా విశ్వాసపరీక్ష పూర్తయ్యేలా కనిపించకపోవడంతో శివకుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. ‘నేను ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా ఆపలేకతున్నానని భావిస్తున్నారా.. ప్రస్తుతం మీ పక్కన చేరిన ఎంటీబీ నాగరాజుకు టికెట్ ఇప్పించిందే నేనే. ఆ విషయం మర్చిపోకండి’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శివకుమార్ వేదాంత ధోరణిలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు వెన్నుపోటు పొడిచిన నా మిత్రులు.. రేపు బీజేపీకి కూడా వెన్నుపోటు పొడుస్తారు. ఏదో ఓ రోజు మనమంతా చావాల్సిన వాళ్లమే కదా. మధ్యలో వచ్చే ఈ టెన్షన్స్ను తట్టుకోవడానికి మహా అయితే రాత్రికి రెండు పెగ్గులు వేసి పడుకుంటాను అంతే. ఇంకేం చేస్తాను’ అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు శివకుమార్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు తమను కలవాల్సిందిగా నన్ను కోరారు. దాంతో నేను, కుమార స్వామి ముంబై వెళ్దామని భావించాం. కానీ అధికారులు సీఎం ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదన్నారు. దాంతో నేను, మరి కొందరితో కలిసి ముంబై వెళ్లాను. రెబెల్ ఎమ్మెల్యేలున్న హోటల్లోనే ఓ గది బుక్ చేశాను. కానీ నన్ను హోటల్లోకి అనుమతించలేదు. కనీసం స్నానం కూడా చేయకుండా ఆదరాబాదరా ముంబై వెళ్లాను. కానీ ఎమ్మెల్యేలు నన్ను కలవలేదు. పైగా వారంతా నా మీద కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా చూసి నేను షాక్ అయ్యాను’ అన్నారు. ‘ఈ ఎమ్మెల్యేలంతా లోక్‌సభ ఎన్నికలప్పుడు కూడా నాతో కలిసి పని చేశారు. నా అడుగుజాడల్లోనే నడుస్తామన్నారు. కానీ చివరకిలా చేశారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్లో కూర్చోవడం చూశాను. అప్పుడే అక్కడికి వెళ్లి వారి రాజీనామాలను చింపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అలా చేయలేకపోయాను’ అని వాపోయారు శివకుమార్. అయితే ఏదేమైనా ఇవాళ బలపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 4 గంటలకల్లా చర్చ ముగించాలని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చిన సీఎం కుమార స్వామి తన ఛాంబర్‌లోనే ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎంకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ వెల్లడించారు. -
నేడే బల నిరూపణ!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో సోమవారం హైడ్రామా నెలకొంది. విశ్వాసపరీక్షను చేపట్టేందుకు తమకు బుధవారం వరకూ గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ రమేశ్ కుమార్ ఛాంబర్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగాల్సిందేనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చాం. మళ్లీ ఇవ్వాలంటే కుదరదు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సభ్యుల ఆందోళన.. విధానసౌధ సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు మధుస్వామి మాట్లాడుతూ.. నేడు ఎలాగైనా విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ‘విశ్వాసపరీక్షపై చర్చను సోమవారం నాటికి ముగించి బలపరీక్షను చేపడతామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య అసెంబ్లీలో చెప్పారు. వారి మాటలను మేం నమ్మాం. మీ(స్పీకర్) ఆదేశాలను గౌరవించాం. కాబట్టి విశ్వాసపరీక్షపై ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దు’ అని మధుస్వామి కోరారు. అనంతరం కాంగ్రెస్ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. అయితే చర్చ ముగిసినవెంటనే బలపరీక్ష చేపడతామని స్పీకర్ రమేశ్ ప్రకటించడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ‘మాకు న్యాయం కావాలి’ ‘విశ్వాస పరీక్షపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’ అంటూ సభలో ఆందోళనకు దిగారు. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్.. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. సోమవారం ఫేస్బుక్లో బీజేపీ స్పందిస్తూ..‘కుమారస్వామికి నిజంగా కర్ణాటక ప్రజలపై, భారత రాజ్యాంగంపై నమ్మకముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి’ అని పోస్ట్ చేసింది. కర్ణాటక ప్రజలు కుమారస్వామిని క్షమించబోరని స్పష్టం చేసింది. కాగా, సీఎం పదవిని త్యాగం చేసేందుకు సీఎం కుమారస్వామి ఒప్పుకున్నా, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సీఎం పదవిని వీడరాదని దేవెగౌడ ఆయనకు సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు కుమారస్వామి రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది నకిలీ లేఖ అని జేడీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా విషయాన్ని ఖండించిన సీఎం కుమారస్వామి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. స్వతంత్రులకు సుప్రీంలో నిరాశ.. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్‌లకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని వీరిద్దరు దాఖలుచేసిన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వతంత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ..‘కర్ణాటకలో బలపరీక్షను ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షను చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పందిస్తూ..‘అసాధ్యం. మేం ఇంతకుముందెప్పుడు ఇలా చేయలేదు. ఈ పిటిషన్‌ను మంగళవారం పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది. అర్ధరాత్రయినా అసెంబ్లీలోనే ఉంటాం: యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీని వాయిదావేస్తామంటే ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఇచ్చినమాట మేరకు సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలి. ఇందుకోసం అర్ధరాత్రివరకైనా వేచిఉంటాం. అంతేతప్ప సభను వాయిదా వేస్తామంటే ఒప్పుకోం. విశ్వాసపరీక్ష సమయాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. ఒకవేళ మాకు అసెంబ్లీలో న్యాయం జరగకుంటే గవర్నర్ వజూభాయ్వాలాతో భేటీ అవుతాం. బలపరీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. బలిపశువును చేయొద్దు: స్పీకర్ అధికార పక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ రమేశ్ సహనం కోల్పోయారు. ‘ప్రతీఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు సభకు ఎంతమాత్రం శోభనివ్వవు. మనం ప్రజాజీవితంలో ఉన్నాం. చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది నాతో పాటు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ వ్యవహారంలో నన్ను బలిపశువును చేయవద్దు. చర్చను వీలైనంత త్వరగా ముగించి బలపరీక్షను చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. విప్ల జారీవిషయంలో సుప్రీంకోర్టు జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వాలని కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఈ తీర్పును బూచీగా చూపి విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతారని చెప్పారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ..‘విప్ జారీచేయడం అన్నది రాజకీయ పార్టీల హక్కు. వాటిని పాటించడం, పాటించకపోవడం అన్నది ఎమ్మెల్యేల ఇష్టం. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే విప్‌ను పాటించలేదని నాకు ఫిర్యాదు అందితే, నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాల్సిందిగా రెబెల్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు చెప్పారు. -
ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు
-
విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్-జేడీఎస్ కలిశాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బీజేపీ వ్యవహరించిందని విమర్శించారు. హంగ్ అసెంబ్లీ రాష్ట్రానికి కొత్తేమీ కాదని, 2004లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభకు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబం ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి వస్తోందని ప్రకటించారు. చర్చ తర్వాత శాసనసభలో ఓటింగ్ నిర్వహించనున్నారు. తనకు ఎటువంటి ఆందోళన లేదని, బలపరీక్షలో విజయం సాధిస్తామని కుమారస్వామి అంతకుముందు అసెంబ్లీ వెలుపల విలేకరులతో అన్నారు. -
‘కుమారస్వామికి ఆఫర్ ఇచ్చింది మేమే’
సాక్షి, న్యూఢిల్లీ: కామన్ మినిమమ్ ప్రొగ్రామ్ ఆధారంగా కర్ణాటకలో తమ ప్రభుత్వం కొనసాగుతుందని కర్ణాటక కాంగ్రెస్ సహాయ ఇన్చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీతెలిపారు. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చింది తామేనని, తమ పార్టీ సీఎం పదవి అడగబోదని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మళ్లీ కాంగ్రెస్ సీఎం అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మంత్రివర్గ కూర్పు దామాషా పద్ధతిలో ఉంటుందన్నారు. దూరదృష్టితో తమ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సజావుగా నడించేందుకు సమన్వయ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. ఐదేళ్ళ పాటు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ త్యాగం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కుమారస్వామికి సీఎం సీటు ఎర కాదని మధు యాష్కీ స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకోవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలిసేందుకు కుమారస్వామికి ఢిల్లీకి వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ఆయన చర్చించనున్నారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్‌ను కుమారస్వామి ఆహ్వనించనున్నారు. -
సాక్షి ఉర్దూ న్యూస్ 19th May 2018
-
యెడ్డీ రాజీనామా : సోషల్ మీడియా పేలిపోతోంది
బెంగళూరు : కర్ణాటక సీఎం పదవి యడ్యూరప్పకు మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచిపోయింది. అసెంబ్లీలో బలం నెగ్గించుకోలేమని ముందుస్తుగా అర్థమైపోయి, బీజేపీ ముందుగానే చేతులెత్తేసింది. తమకు బలం లేదంటూ ఒప్పేసుకుని సీఎంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి, యడ్యూరప్ప అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. దీంతో ఇన్నిరోజుల నుంచి నడిచిన హైడ్రామాకు చెక్ పడింది. ఫలితాల ప్రకటన నుంచి నేటి వరకు కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై సోషల్ మీడియా చాలా చురుగ్గా స్పందిస్తూ వచ్చింది. తాజాగా యడ్యూరప్ప రాజీనామాపై కూడా సోషల్ మీడియా తనదైన శైలిలో జోకులు పేలుతోంది. ఆ జోకులు ఏ విధంగా ఉన్నాయో మీరే ఓసారి చూడండి... #karnataka cm #Yeddyurappa resign his cm post. #NoTrustVote in #KarnatakaAssembly. #KarnatakaFloorTest #southkicksbjp #Kumaraswamy #DemocracySaved #VidhanSoudha #Congress #jds #RahulGandhi #modi @PhoenixTamil pic.twitter.com/hm7LSywEDo — Phoenix Tamil (@PhoenixTamil) May 19, 2018 #Yeddyurappa resign his cm post. He said we will work for the people of #Karnataka. No trust vote in assembly. #CongressWin #Kumaraswamy will be the cm of kN. #KarnatakaFloorTest #KarnatakaCMRace #FloorTest #KarnatakaVerdict #Siddaramaiah #VidhanaSoudha @PhoenixTamil pic.twitter.com/nV1cLzRird — Phoenix Tamil (@PhoenixTamil) May 19, 2018 BJP’s Yeddyurappa resigns as chief minister ahead of #KarnatakaFloorTest pic.twitter.com/YHDfkcUcHC — Dhaval Maraskolhe (@Dhaval750) May 19, 2018 BJP in SouthIndia #KarnatakaFloorTest 😂😂 pic.twitter.com/PrUx96z3Ct — Sonia Arunkumar (@rajakumaari) May 19, 2018 -
సభలో యెడ్డీ ప్రసంగిస్తున్న వేళ...
సాక్షి, బెంగళూరు: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం కర్ణాటక సీఎం యెడ్యూరప్ప.. అసెంబ్లీలో భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ సీరియస్‌గా కునుకు తీశారు. మరోవైపు ప్రమాణ స్వీకారం ముగిశాక భోజన విరామ సమయంలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా ఆదమరిచి నిద్రపోయారు. ఓవైపు బలనిరూపణ గురించి కాంగ్రెస్-జేడీఎస్ నేతలంతా హడావుడి పడుతుంటే.. వాళ్లు కూల్‌గా కునుకు తీయటం విశేషం. ఇంకోవైపు సోషల్‌మీడియాలో వాళ్ల ఫోటోలపై జోకులు పేలుతున్నాయి. ఏదైతేనేం తమ వద్ద తగినంత బలం లేదని ఒప్పుకున్న యడ్యూరప్ప చివరకు ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
బలపరీక్ష: బీజేపీకి ఆప్షన్స్ ఇవే...
సాక్షి, బెంగళూరు: కాసేపట్లో కర్ణాటక అసెంబ్లీలో సీఎం యెడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ ఉదయం వరకు గెలుపుపై బీజేపీ ధీమాతో ఉండగా.. ఎమ్మెల్యేలను నిలువరించే పనిలో కాంగ్రెస్-జేడీఎస్‌లు ఉన్నాయి. కానీ, మధ్యాహ్ననికి ఎటూ అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బలపరీక్షలో నెగ్గాలంటే బీజేపీ ముందు ఐదు మార్గాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 1. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం.. తద్వారా బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటి విశ్వాస పరీక్షలో నెగ్గుతుంది. 2. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలువరించగలిగాలి.. అప్పుడు మెజార్టీ సంఖ్య ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. 3. ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావటం.. తద్వారా మెజార్టీ మార్క్‌పై ప్రభావం చూపుతుంది. 4. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించటం.. సంఖ్యా బలం తగ్గిపోయి బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటేస్తుంది. 5. సభ కార్యాకలాపాలకు అవాంతరం కలిగించి.. సభను వాయిదా వేయించటం. అప్పుడు విశ్వాస పరీక్ష జరగదు. ప్రస్తుతానికి యెడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. -
కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
-
బీజేపీకి ఝలక్ : బేరసారాల క్లిప్ లీక్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని బీజేపీ చెబుతుండగా, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఎత్తులకు పైఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. తమ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడానికి బీజేపీ బేరసారాలు మొదలుపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంధించింది. అందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ఒక ఆడియో క్లిప్ ను ఆ పార్టీ విడుదల చేసింది. సీఎం యెడ్యూరప్ప తరపున గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప మీడియా సమావేశంలో దీనికి సంబంధించి ఒక ఆడియోను విడుదల చేశారు. అయితే, వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ అది ఫేక్ ఆడియో క్లిప్ అంటూ ఖండించింది. ‘‘యెడ్యూరప్పకు మద్ధతు ఇస్తే నీ లైఫ్‌సెటిల్ చేస్తా. రూ. 150 కోట్లతోపాటు మంత్రి పదవి దక్కేలా చూస్తా. పాత విషయాలు మరిచిపోండి. మీకు ఏం కావాలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే నేరుగా మీతో మాట్లాడుతారు. శివన్నగౌడ గతంలో నా మాట వినే మంత్రి అయ్యారు. రాజీవ్ గౌడ నా వల్లే అభివృద్ధి చెందారు. ఇవాళ శివన్న గెలిచినా లాభం లేదు. నేరుగా పెద్ద వాళ్లతో మాట్లాడిస్తా. నువ్వు మంత్రివి అవుతావ్... నువ్వు ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తికన్నా వందరెట్లు ఎక్కువ సంపాదిస్తావ్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్న గౌడ (రాయచూర్)తో మంతనాలు జరిపినట్టుగా ఆ ఆడియో క్లిప్ లో వినిపిస్తోన్న విషయం ఉగ్రప్ప మీడియాకు వెల్లడించారు. ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ‘మీపై గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్‌కు నమ్మక ద్రోహం చేయలేను’ అని బసన్న బదులిచ్చారని చెబుతూ, ఇదే తరహాలో మరికొందరిని కూడా ప్రలోభపెట్టాలని చూశారని ఉగ్రప్ప బీజేపీపై మండిపడ్డారు. మొదట్లో 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 150 కోట్ల రూపాయలు ఇస్తామంటూ బేరసారాలకు దిగుతోందని ఉగ్రప్ప ఆరోపించారు. ఈఆరోపణలకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కూడా ఓ ట్వీట్ చేసింది. బీజేపీ స్పందన.. కాగా, ఈ ఆడియో క్లిప్‌పై బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. అది ఫేక్ క్లిప్ అని, కాంగ్రెస్ నీచపు రాజకీయాలకు తెరలేపిందని ఆయన మీడియాకు తెలియజేశారు. Congress released an Audio clip where BJP leader Janaradhana Reddy is trying to lure Congress MLA from Raichur Rural by offering money and posts. Janaradhana Reddy clearly says he has the backing of BJP President Amit Shah for doing horse trading! pic.twitter.com/oVEC88DgV2 — Karnataka Congress (@INCKarnataka) 18 May 2018