JDS party
-
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
బెంగళూరు: లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌ను జేడీఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మంగళవారం హుబ్బళిలో జేడీఎస్ కోర్ కమిటీ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు ప్రజ్వల్ సస్పెన్షన్‌పై సిఫార్సుచేసిన కొద్ది సేపటికే పార్టీ ప్రజ్వల్‌ను సస్పెండ్‌చేసింది. ‘‘ మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నట్లు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలు పార్టీకి, పార్టీ నాయకత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. పార్టీ నియమావళి, క్రమశిక్షణా నిబంధనావళిని ఉల్లంఘించిన కారణంగా తక్షణం ఆయన్ను సస్పెండ్చేస్తున్నాం’ అని సస్పెన్షన్ ఉత్తర్వులో పార్టీ పేర్కొంది. కోర్ కమిటీ భేటీలో కర్ణాటక రాష్ట్ర జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక, ప్రభుత్వ చర్యలను బట్టి సస్పెన్షన్‌ను పొడిగిస్తామని కుమారస్వామి చెప్పారు. -
కర్నాటక: బీజేపీకి ఊహించని షాక్.. మరో సీనియర్ నేత గుడ్‌బై
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జేడీఎస్‌లో చేరారు. దీంతో, బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం, జేడీఎస్ నేత కుమారస్వామి ఆధ్వర్యంతో జేడీఎస్‌లో చేరారు. ఈ క్రమంలోనే తాను శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో నిలుస్తున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 20న ఒక పార్టీ తరఫున తాను నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే తాను బీజేపీని వీడుతున్నట్టు వెల్లడించారు. అలాగే, తన నియోజకవర్గ ప్రజలు, నాయకుల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. In another setback to ruling BJP, party MLC from Shivamogga #AyanurManjunath quit the party and joined JD(S)#KarnatakaElection2023 pic.twitter.com/BoJ69ySKBN — TOI Bengaluru (@TOIBengaluru) April 19, 2023 కాగా, బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో అయనూర్ మంజునాథ్ పేరు లేదు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటికే 222 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే శివమొగ్గ, మాన్వి స్థానాల్లో ఎవరు పోటీలో ఉంటారనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన సమయం నుంచి బీజేపీకి వరుసగా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కమలం పార్టీకి ఇప్పటికే మాజీ సీఎం జగదీష్ షెట్టర్, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు లక్ష్మణ్ సవదితోపాటు పలువురు నాయకులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, వీరి ప్రభావం బీజేపీపై ఎంతమేర పడనుందో ఎన్నికల ఫలితాల అనంతరం తెలుస్తుంది. I will resign from both, the Legislative Council membership and the primary membership of the BJP. I will file my nomination papers today to contest the elections from the Shivamogga Assembly constituency: Ayanur Manjunath, Member of the Legislative Council pic.twitter.com/eGT8FAsYT7 — ANI (@ANI) April 19, 2023 ఇది కూడా చదవండి: మమతా బెనర్జీకి మరో షాక్ -
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
ఊగిసలాడే ఓటర్లే కీలకం
224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలైంది. మే 10న ఎన్నికలు జరిగి, 13న ఫలితాలు వెలువడుతాయి. నాలుగు దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి గెలుపొందలేదు. దీన్ని తిరగరాయాలని బీజేపీ అనుకుంటోంది. సంప్రదాయ ధోరణి మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అదే తనను మెజారిటీ మార్కు దాటిస్తుందని ఆశిస్తోంది. మూడవ స్థానంలో ఉన్న జేడీఎస్, మళ్లీ కింగ్ మేకర్‌గా ఆవిర్భవించే, వీలైతే కింగ్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. చాలామంది ఓటర్లు ఎన్నికల ప్రకటనకు చాలాముందుగానే తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నది నిర్ణయించుకుంటున్నట్లు గత సర్వేలు సూచిస్తున్నాయి. అందువల్ల ఊగిసలాడే ఓటర్లకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. సుమారు నెల రోజుల్లో రాష్ట్ర రాజకీయ సంక్లిష్టత విషయంలో ఒక స్పష్టత వస్తుంది. కర్ణాటక ఓటర్లు కొత్త ఎన్నికల ట్రెండును మొదలు పెడతారా, లేక పాత రాజకీయ సంప్రదాయాన్నే పాటిస్తారా అనేది ప్రశ్న. ‘రెండో’ గెలుపు ఒక్కసారే... దాదాపు నాలుగు దశాబ్దాలుగా కర్ణాటక ఎన్నడూ అధి కారంలో ఉన్న పార్టీకి తిరిగి గట్టి మెజారిటీని కట్టబెట్టలేదు. చివరిసారిగా రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ 1985లో రెండోసారి కూడా స్పష్టమైన మెజారిటీని సాధించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ మెజారిటీతో గెలుపొందలేదు. 2008లో, 2018లో అది మెజారిటీకి సమీ పంలోకి వచ్చింది. 2008లో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో అది మెజారిటీని సాధించగలిగింది. 2018లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా వల్ల బీజేపీ మెజారిటీ సాధించుకుంది. ఈ రెండు ధోరణులను ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తిరగరాయా లని ఆశ పడుతోంది. సంప్రదాయ ధోరణి మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అదే తనను మెజారిటీ మార్కు దాటిస్తుందని అనుకుంటోంది. మూడవ స్థానంలో దూరంగా ఉన్న జేడీఎస్, ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించని స్థితిలో అసెంబ్లీలో అధికారంపై ఆశలు పెట్టుకుంటోంది. మళ్లీ ఒకసారి కింగ్ మేకర్‌గా ఆవిర్భవించే అవకాశం కోసం, వీలైతే మరో సారి కింగ్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపున కర్ణాటకలో నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి రాష్ట్రాన్ని నిలుపుకొనేందుకు సకల ప్రయ త్నాలూ చేస్తోంది. చతుర్ముఖ వ్యూహంతో అది పనిచేస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే... మొదటిది: కేంద్రప్రభుత్వం, దాని నాయకత్వానికి స్పష్టంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. గత మూడు నెలలుగా జరుగుతున్నది ఒక సూచిక అనుకుంటే, కేంద్ర నాయకత్వమే నేరుగా ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రదర్శించు కోవడంపై దృష్టి పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏదైనా ప్రస్తా వించడం, కొంత ఆలస్యమైన రెండో ఆలోచనగానే కనబడుతోంది. రెండు: తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అధికారంలో ఉంటు న్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతోంది. రాష్ట్ర నాయకులలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్పష్టంగానే పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు. రాష్ట్రంలో పార్టీని నిర్మించి ఘనత ఆయ నదే. ఆయన కరిష్మా ఆధారంగానే నిలబడాలని బీజేపీ ఆశలు పెట్టు కుంటోంది. అయితే ఈసారి కాస్త తేడా ఉంది. తాను ఈ దఫా ఎన్ని కల్లో పోటీ చేయనని యడ్యూరప్ప ప్రకటించారు. ఇంతకుముందటి ఎన్నికల్లో పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు కొచ్చారు. ఇదేమైనా వ్యత్యాసం తేగలదేమో చూడటం ఆసక్తికరం. మూడు: ఉత్తర, కోస్తా కర్ణాటకలో తనకున్న సాంప్రదాయిక మద్దతును నిలబెట్టుకోవలసిన అవసరం బీజేపీకి ఉంది. అలాగే పాత మైసూర్ ప్రాంతంలోకి చొచ్చుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మైసూరు ప్రాంతంలో ఎక్కువగా కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే పోటీ ఉంటోంది. అవసరమైన మెజారిటీని సాధించాలంటే ఉత్తర కర్ణా టకలో తన బలమైన ఉనికిని నిలబెట్టుకుంటూనే, పాత మైసూరులో బీజేపీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ఆ ప్రాంతంలో బీజేపీ జాతీయ నాయకులు పదేపదే పర్యటనలు చేస్తుండటం దీన్నే తేటతెల్లం చేస్తోంది. చివరగా, కర్ణాటకలో విస్తృతమైన సామాజిక ఏకీభావాన్ని నిర్మించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. పార్టీకి లింగాయతులు తమ మద్దతును ఎప్పటిలా కొనసాగిస్తారని నమ్ముతూనే వక్కళిగలు, ఓబీసీలు, దళితుల మద్దతును కూడగట్టుకోవాలని బీజేపీ ప్రయత్ని స్తోంది. రిజర్వేషన్ కోటాను తిరగరాయడం ఈ కులాల్లోకి వ్యాప్తి చెందే లక్ష్యంలో భాగమేనని చెప్పాలి. ఐక్యత లేమి పార్టీకి నష్టం కర్ణాటకలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రధాన పక్షంగానే ఉంటూ వచ్చింది. కానీ ముఠాతత్వం, కీలక సమయాల్లో ఐక్యతా లేమి కారణంగా పార్టీ మట్టికొట్టుకుపోతోంది. అయితే, ఐక్యత లేకుండా ఈ దఫా ఎన్నికల్లో మెజారిటీ వచ్చే అవకాశం కలగానే మిగిలిపోతుందని పార్టీ, ప్రత్యేకించి దాని రాష్ట్ర నాయకత్వం గుర్తిస్తోంది. ఇద్దరు కీలక నేతలు సిద్ధ రామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై తమ ఆకాంక్షలను ఇప్పటికే ప్రకటించారు. అయితే తమ లక్ష్మణ రేఖను మాత్రం వారు దాటలేదు. ఎన్నికల అనంతరమే ముఖ్య మంత్రి అభ్యర్థి నిర్ణయం జరుగుతుందని వీరు ప్రకటించారు. పార్టీలో ఐక్యత కొన సాగుతుందో లేదో తేల్చడానికి అభ్యర్థలకు టికెట్ల పంపిణీ సమయమే లిట్మస్ పరీక్ష అవుతుంది (అయితే ఇప్పటికి రెండు జాబితాలను కాంగ్రెస్ వెలువరించింది). ఇంతవరకు పార్టీ స్థానిక సమ స్యలపై, బీజేపీ పాలనపై దృష్టి పెట్టింది. అయితే, లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీ బహిష్కరణను కూడా తమ ప్రచా రంలో అదనపు అంశంగా జోడించింది. సాంప్రదాయకంగా మద్దతు పొందుతున్న పలు వర్గాల పొత్తును కాంగ్రెస్ పట్టుదలతో సాధించిందని గుర్తుంచుకోవాలి. స్పష్టమైన ఫలితమే... జేడీఎస్ పార్టీ సుదూరంలోని మూడవ శక్తిగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాజకీయంగా పెను నష్టాన్ని చవిచూసింది. దాంతో పాత మైసూరు రీజియన్‌లోని జేడీఎస్ సాంప్రదాయిక పునాదిలోకి బీజేపీ చొచ్చుకు వెళ్లడానికి ఇది అనుమతించింది. అయితే కాంగ్రెస్, బీజేపీ రెండూ తమ పార్టీతో టచ్‌లో ఉంటున్నాయని చెప్పడం ద్వారా జేడీఎస్ నేత కుమారస్వామి రాజకీయంగా సంచలనం సృష్టించారు. చాలామంది ఓటర్లు ఎన్నికల ప్రకటనకు చాలాముందుగానే తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నది నిర్ణయించుకుంటున్నట్లు గత కొన్నేళ్లలో లోక్‌నీతి–సీఎస్డీఎస్ జరిపిన పోల్ అనంతర సర్వేలు సూచిస్తున్నాయి. క్రితంసారి కర్ణాటక ఎన్నికల విషయంలో ఇదే నిజమైంది. కొంతమేరకు ఇది రాజకీయ పోలరైజేషన్‌ను ప్రతిఫలించింది. ఈ పార్టీలకు ఉన్న నిబద్ధ ఓటర్ల రీత్యా, ఇది అంత ఆశ్చర్యం కలిగించదు. అందువల్ల ఊగిసలాడే ఓటర్లకు ప్రాధాన్యత పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు తీవ్రమవుతాయి. చాలామంది ఎన్నికల వ్యాఖ్యాతలు ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఊహిస్తున్నారు. కానీ ఈ అసెంబ్లీ ఫలితాలు మరింత స్పష్టతతో వెలువడతాయి. సందీప్ శాస్త్రి వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు;జాతీయ సమన్వయకర్త, లోక్‌నీతి నెట్వర్క్ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
‘ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 లక్షలు ఇచ్చారు.. అందుకే వాళ్లకి ఓటు వేశా’
కోలారు(బెంగళూరు): రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు చొప్పున ఇచ్చి కొనుగోలు చేసిందని కోలారు ఎమ్మెల్యే కె శ్రీనివాసగౌడ ఆరోపించారు. శనివారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు కూడా రూ. 50 లక్షలు ఇవ్వజూపారని, అయితే తాను తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యేలను లంచం ఇచ్చి కొనుగోలు చేసిన పార్టీ నాయకులు తన గురించి ఆరోపణలు చేయడంలో అర్థం లేదని అన్నారు. జేడీఎస్‌కి ఎప్పటి నుంచో దూరంగా ఉన్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటేశానని బహిరంగంగానే చెప్పానని అన్నారు. స్థానిక జేడీఎస్ నాయకులు తన ఇంటి ముందు ఆందోళన చేస్తే తాను భయపడేది లేదని అన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ బ్యాంకు డైరెక్టర్ బ్యాలహళ్లి గోవిందగౌడ పాల్గొన్నారు. చదవండి: బాబు, పవన్‌కు రాజకీయ హాలిడే -
డబ్బుల్లేక ఎన్నికలకు దూరం అంటున్న మాజీ ప్రధాని
బెంగళూరు: భారత మాజీ ప్రధాని, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవేగౌడ బుధవారం సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో త్వరలో జరుగబోయే ఓ లోక్‌సభ, మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని ప్రకటించారు. డబ్బుల్లేక పోవడంతో వారి పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో బెల్గాం లోక్‌సభతో పాటు బసవకళ్యాణ్, సింధి, మస్కీ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే 2023లో జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషిని చేస్తానని దేవేగౌడ ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో పార్టీని కాపాడుకునేందుకు తన ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. కాగా, దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు కుమారస్వామి కూడా కర్ణాటక సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేవేగౌడ చేసిన ప్రకటనను రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన ఇలాంటి ప్రకటన చేసివుండవచ్చని అభిప్రాపడుతున్నాయి. -
కర్ణాటకలో ఆపరేషన్ ఆకర్ష్ షురూ..!
సాక్షి, బెంగళూరు : కింగ్ మేకర్‌గా వెలుగు వెలిగి అధికారం కోల్పోయిన జేడీఎస్‌కు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. పార్టీ అధినేతల వైఖరి నచ్చక చాలామంది నేతలు పార్టీ వీడుతున్నారు. గతేడాది అసమ్మతి పర్వం రూపంలో పలువురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఇంతలో మరికొందరు సీనియర్ నాయకులు రాజీనామాబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ, మరో నేత మధు బంగారప్ప కూడా వీడ్కోలు చెబుతారనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా తుమకూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు జేడీఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జేడీఎస్ బలం దక్షిణ కర్ణాటకలో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఉత్తర కర్ణాటకలో ఏ జిల్లాలోనూ పార్టీకి బలమైన నాయకులు లేక సతమతమవుతోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత దక్షిణాది జిల్లాల్లో కూడా బీజేపీ ఆపరేషన్ చేపట్టి ఎమ్మెల్యేలను, నాయకులను చేర్చుకోవాలని ఎత్తులు వేస్తోంది. బుజ్జగింపుల పర్వం మధు బంగారప్ప, జీటీ దేవెగౌడ జేడీఎస్ వీడుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాకుండా మాజీ మంత్రి జీటీ దేవెగౌడ జేడీఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆ ఇద్దరితో మంతనాలు జరిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటీవల పార్టీ ప్రముఖులతో సమావేశం కూడా నిర్వహించారు. అయినా పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో బుజ్జగించినా ఫలితం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ రమేశ్‌బాబు జేడీఎస్‌కు రాజీనామా చేశారు. వస్తుంటారు, పోతుంటారు తాజా పరిణామాలపై దేవెగౌడ స్పందిస్తూ రాజకీయ పార్టీ అంటే వస్తుంటారు.. పోతుంటారు. వెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, జేడీఎస్‌కు ఇది కొత్తేమీ కాదు. పార్టీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అన్నారు. -
జనం చూస్తున్నారు...జాగ్రత్త!
అంతర్గత సంక్షోభంలో కాంగ్రెస్ పీకల్లోతు కూరుకుపోయి చేష్టలుడిగిన వేళ, ఆ పార్టీ జేడీ(ఎస్)తో కలిసి కర్ణాటకలో నడుపుతున్న సంకీర్ణ ప్రభుత్వం గుడ్లు తేలేసింది. అది కూలిపోవడం ఖాయమన్న విషయంలో అందరికీ ఏకీభావముంది. భిన్నాభిప్రాయాలు ఉంటే గింటే... అది ఎప్పుడు జరుగుతుందన్న విషయంలో మాత్రమే! ఎందుకంటే ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేల స్కోరు బుధవారానికల్లా 16కి చేరింది. ఇది ఇక్కడితో ఆగుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. వీరందరి రాజీనామాలు స్పీకర్ ఆమోదిస్తే సంకీర్ణ సర్కారు బలం 101కి పడిపోతుంది. బీజేపీ బలం ఇద్దరు ఇండిపెండెంట్లతో కలుపుకుని 105. మహారాష్ట్ర వేదికగా సాగుతున్న ఈ అయోమయ, అసంబద్ధ నాటకం ఇంకా ఒక కొలిక్కి రాకుండానే, దానికి పొరుగునే ఉన్న గోవా కాంగ్రెస్ శాసనసభాపక్షంలో ఉన్నట్టుండి ముసలం పుట్టింది. ఏం జరుగుతున్నదో తెలిసే లోపే అక్కడున్న 15మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 10 మంది విడివడి బీజేపీలో విలీనమయ్యారు. కొన్ని దశాబ్దాలక్రితం కాంగ్రెస్ మార్కు రాజకీయాలు తెలిసినవారికి పాత పాపాలు ఆ పార్టీకి శాపాలుగా మారి కాటేస్తున్నాయన్న అభిప్రాయం కల గొచ్చు. కానీ ఈ క్రమంలో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ రాజకీయాలు నవ్వులపాలవుతున్నాయి. తాము పట్టంగట్టి చట్టసభలకు పంపినవారిలో అనేకులకు కనీసస్థాయి నైతిక విలువలు లేవని సాధారణ జనం గ్రహిస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక సంక్షోభం ఒకచోట కాదు... వేర్వేరుచోట్ల ప్రకం పనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి డీకే కుమారస్వామి రాజీనామా చేయాలంటూ బెంగళూరు విధానసౌధ ముందు బీజేపీ ధర్నా చేస్తే, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరత్వంపాలు చేయడం ఆపా లని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన చేశాయి. కర్ణాటక సంక్షోభానికి కర్త, కర్మ, క్రియ బీజేపీయేనని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు మొదట్లో ఆరో పించినప్పుడు అదంతా వారి అంతర్గత వ్యవహారమని, తమకేం సంబంధమని బీజేపీ నేతలు ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడూ ఆ మాటే అంటున్నారు. కానీ ఎవరేమిటో చేతలే చెబుతున్నాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీ ఏలుబడిలోని మహారాష్ట్రలో తలదాచుకోవడం, వారున్న హోటల్ ముందు బుధవారం జరిగిన డ్రామా వగైరాలు గమనిస్తే ఈ విషయంలో ఎవరికీ ఏ అను మానమూ తలెత్తదు. 225 స్థానాలున్న అసెంబ్లీకి నిరుడు మే లో జరిగిన ఎన్నికల్లో అప్పటివరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 78 మాత్రమే దక్కగా, 104 స్థానాలతో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. ‘కింగ్ మేకర్’ అవుతుందనుకున్న జేడీ(ఎస్) 37తో సరిపెట్టుకుంది. బీజేపీకి అధికారం దక్కనీయరాదన్న పట్టుదలతో కాంగ్రెస్ జేడీ(ఎస్)తో కూటమి కట్టింది. సీఎం పదవి ఆ పార్టీకే ఇస్తానని వాగ్దానం చేసింది. అయినా అతి పెద్ద పార్టీగా అక్కడి గవర్నర్ వాజూభాయ్ వాలా బీజేపీకే అవకాశమిచ్చారు. యడ్యూరప్ప నేతృత్వంలో ఏర్పడ్డ బీజేపీ సర్కారు మూన్నాళ్ల ముచ్చటే అయింది. కనీసం మరో 9మంది ఎమ్మెల్యేల అవసరం ఉండగా అప్పట్లో అది సాధ్యం కాలేదు. చివరకు డీకే కుమారస్వామి నాయకత్వాన కాంగ్రెస్–జేడీ(ఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇంతవరకూ కాంగ్రెస్ తెలివిగానే చేసినా ఆ తర్వాతకాలంలో తప్పుటడుగులు వేసింది. సీఎం పదవికి దూరం కావడంతో లోలోన కుమిలిపోయిన సిద్ధరామయ్య తన వర్గం ఎమ్మెల్యేలతో తరచు కుమారస్వామికి సమస్యలు సృష్టిస్తూనే వచ్చారు. ఒక సందర్భంలో సీఎం కన్నీటిపర్యంతమ య్యారు. రాత్రుళ్లు నిద్ర కూడా పట్టడం లేదని వాపోయారు. దీన్నంతటినీ సకాలంలో జోక్యం చేసుకుని సరిదిద్దాల్సిన కాంగ్రెస్ పెద్దలు మౌనం వహించారు. చివరకు అలకపాన్పు ఎక్కినవారిని పదవులతో సంతృప్తిపరిచారు. ఇది సంకీర్ణాన్ని మరింత బలహీనపరిచింది. ఒకపక్క అధికారానికి కూతవేటు దూరంలో ఆగిపోయిన బీజేపీ అవకాశం కోసం కాచుక్కూర్చున్నదని తెలిసినా ఇల్లు చక్కదిద్దుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. సావాసదోషం కావొచ్చు...ముగ్గురు జేడీ(ఎస్) ఎమ్మె ల్యేలు కూడా ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేలతో జతకలిశారు. దేశంలో స్పీకర్ల వ్యవస్థ ఎలా ఉన్నదో అటు కర్ణాటక పరిణామాలు చూసినా, బుధవారం గోవాలో చోటుచేసుకున్న డ్రామాను గమనించినా అర్థమవుతుంది. అధికారపక్షం ఏవైపు ఉందన్న దాన్నిబట్టే ఆ రెండు రాష్ట్రాల్లోనూ స్పీకర్ల నిర్ణయాలున్నాయి. కర్ణాటక ఎమ్మెల్యేలు రాజీనామాలిచ్చి రోజులు గడుస్తున్నా అక్కడి స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడంలో తాత్సారం చేస్తున్నారు. కొందరి రాజీనామా పత్రాలు సక్రమంగా లేవంటున్నారు. అది నిజమే కావొచ్చు. కానీ గోవాలో కాంగ్రెస్ చీలికవర్గం తాము బీజేపీలో విలీనమవుతున్నామని చెప్పిన మరుక్షణం అక్కడి స్పీకర్ ఆమోదముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖ రిని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. తాము ఫిరాయింపుల్ని ప్రోత్సహించబోమని, ఒకవేళ తాము ఆ పని చేసినా స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించి ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయొ చ్చని ఆయన అసెంబ్లీలో చెప్పారు. రాజకీయాల్లో విలువలు లుప్తమైపోతున్న వర్తమాన దశలో ఒక ముఖ్యమంత్రి నిండు సభలో ఇలా ప్రకటించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. కానీ ఆయన ఎంచుకున్న మార్గం అది. అసలు 1985లో ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినప్పుడే దాన్ని కట్టుదిట్టంగా రూపొం దించడంలో ఆనాటి ప్రభుత్వం విఫలమైంది. ఆ తర్వాత సవరణలు చేసినవారు సైతం మరికొన్ని కంతల్ని విడిచిపెట్టారు. అందుకనే కేంద్ర స్థాయిలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ తరచుగా ఫిరా యింపులు యధేచ్ఛగా సాగుతున్నాయి. కర్ణాటక తెరిపిన పడగానే మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఈ మాదిరి డ్రామాలు మొదలైనా బిత్తరపోనక్కరలేదు. పార్టీలన్నీ బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించకపోతే మన ప్రజాస్వామ్యం నవ్వులపాలవుతుంది. జనానికి నమ్మకం పోతుంది. ఆ సంగతి అందరూ గుర్తిస్తే మంచిది. -
బలపరీక్ష: బీజేపీకి ఆప్షన్స్ ఇవే...
సాక్షి, బెంగళూరు: కాసేపట్లో కర్ణాటక అసెంబ్లీలో సీఎం యెడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ ఉదయం వరకు గెలుపుపై బీజేపీ ధీమాతో ఉండగా.. ఎమ్మెల్యేలను నిలువరించే పనిలో కాంగ్రెస్-జేడీఎస్‌లు ఉన్నాయి. కానీ, మధ్యాహ్ననికి ఎటూ అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బలపరీక్షలో నెగ్గాలంటే బీజేపీ ముందు ఐదు మార్గాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 1. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం.. తద్వారా బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటి విశ్వాస పరీక్షలో నెగ్గుతుంది. 2. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలువరించగలిగాలి.. అప్పుడు మెజార్టీ సంఖ్య ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. 3. ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావటం.. తద్వారా మెజార్టీ మార్క్‌పై ప్రభావం చూపుతుంది. 4. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించటం.. సంఖ్యా బలం తగ్గిపోయి బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటేస్తుంది. 5. సభ కార్యాకలాపాలకు అవాంతరం కలిగించి.. సభను వాయిదా వేయించటం. అప్పుడు విశ్వాస పరీక్ష జరగదు. ప్రస్తుతానికి యెడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. -
ఎమ్మెల్యేల తరలింపు.. పె...ద్ద హైడ్రామా
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే వారిని తొలుత పంజాబ్‌గానీ, కేరళగానీ తరలించాలని భావించగా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఒకానోక దశలో శరవేగంగా పరిణామాలు మారే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకుండా వారిని హైదరాబాద్ తరలించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం... యెడ్డీ ఆదేశాల తర్వాత... ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గంట తర్వాత యెడ్యూరప్ప.. పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్, షాంగ్రీ-లా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తేయాలని, భద్రత ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు. గంటల వ్యవధిలోని పోలీస్‌శాఖ ఆ ఆదేశాలను అమలు చేసింది. దీంతో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు వారిని వెంటనే రాష్ట్రం తరలించాలని ఆయా పార్టీలు ప్రణాళిక రచించాయి. కాంగ్రెస్ తరపున డీకే శివకుమార్, జేడీఎస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఎమ్మెల్యేలు వారిని ఎక్కడ దాచాలన్న దానిపై మంతనాలు జరిపారు. ఆటంకాలు... తొలుత వారిని ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా కొచ్చి(కేరళ)కు గానీ తరలించాలని అనుకున్నారు. అయితే డీజీసీఏ(Directorate General of Civil Aviation) నుంచి విమానానికి అనుమతి లభించకపోవటం, దానికి తోడు కొచ్చిలో హోటళ్లు ఖాళీగా లేవని సమాచారం రావటంతో (ఇదంతా బీజేపీ కుట్ర అన్నది వారి ఆరోపణ) తప్పనిసరై మరోచోటకు తరలించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అంతకు ముందు జేడీఎస్ సుప్రీం దేవగౌడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి.. వారి నుంచి హామీ పొందిన విషయం తెలిసిందే. దీనికితోడు పొరుగునే ఉన్న తమిళనాడు అన్నాడీకేం ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అందుకే వారి కోసం హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని భావించి ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేల తరలింపు సాగిందిలా... తమ తరలింపు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఎమ్మెల్యేలు.. దుస్తులను నేరుగా హోటళ్ల వద్దకే తెప్పించుకున్నారు. రాత్రి 11.30 ని. సమయంలో డీజీసీఏ.. ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించింది. దీంతో ఫ్లాన్ మార్చి వారిని రాష్ట్రం దాటించాలని నిర్ణయించారు. చివరకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయం తెలీకుండా జాగ్రత్త పడ్డారు. అర్ధరాత్రి 12గం.15 ని. సమయంలో శర్మ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఈగల్టన్ రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరాయి. అనంతరం షాంగ్రీ-లా హోటల్ వద్దకు చేరుకుని అక్కడ జేడీఎస్ ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బయలుదేరాయి. బస్సులు నిండిపోవటంతో మరో బస్సు(స్లీపర్) వాటికి కలిసింది. ఎమ్మెల్యేలకు భోజనం, దుప్పట్లు ఇలా పరిస్థితులు సర్దుకున్నాక ఆ మూడు బస్సులు వేగంగా ఆంధ్రా సరిహద్దు వైపు కదిలాయి. ముందస్తు జాగ్రత్తగా... అయినప్పటికీ బీజేపీ నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి సరిహద్దు వరకు పలు ప్రాంతాల్లో(గౌరీబిదనూరు, చికబళ్లాపూర్ జిల్లాలో) ముందస్తుగా కొన్ని వాహనాలను ఉంచారు. ఒకవేళ వారిని అడ్డుకునే యత్నాలు జరిగితే స్థానిక నేతల సాయంతో ఆయా వాహనాల్లో వారిని రహస్య ప్రదేశాలకు తరలించాలని భావించారు. శర్మ ట్రావెల్స్ డ్రైవర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. ఆంధ్రా బార్డర్ వరకు ఎమ్మెల్యేలు జమీర్ అహ్మద్ ఖాన్, శివరామ హెబ్బర్‌లు స్వయంగా బస్సులు నడిపినట్లు తెలుస్తోంది. కర్నూల్ మీదుగా ప్రయాణించిన వాహనాలు ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు 80 కిలోమీటర్లు దూరంలో ఆగారు. అక్కడ ఎమ్మెల్యేలు కాఫీ బ్రేక్ తీసుకున్నాక తిరిగి బయలుదేరారు. చివరకు గంటర్నర ప్రయాణం తర్వాత నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మధు యాష్కీ మాటల్లో.. ‘మా పార్టీ ఎమ్మెల్యేల తరలింపు చాలా ప్రణాళిక బద్ధంగా జరిగింది. వారికి హైదరాబాద్‌లో ఉంచటమే సురక్షితమని భావించి ఇక్కడికి రప్పించాం. అధికారం కోసం బీజేపీ దారుణంగా దిగజారింది. అందుకు ప్రధాని మోదీ మద్ధతు పలకటం దారుణం. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ కిడ్నాప్ చేసింది. ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తోంది. బీజేపీ నేతలు క్రిమినల్స్‌లాగా వ్యవహరిస్తున్నారు’ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ మండిపడ్డారు. -
అధికారంలోకి వచ్చేది జేడీఎస్ పార్టీనే
మైసూరు : కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జేడీఎస్ పార్టీయేనన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. కొన్ని పార్టీలు ప్రైవేటు సంస్థలకు డబ్బులిచ్చి తమకు అనుకూలంగా ఎన్నికల సమీక్షలను చేయించి వాటిని విడుదల చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీల తరహాలో రోడ్‌షోలు, ప్రచారాలు నిర్వహించే శక్తి తమకు లేదన్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలకు పంచడానికి కూడా తమవద్ద డబ్బులు లేవన్నారు. సీఎం సిద్దరామయ్య,ఎంపీ శ్రీరాములు వంటి హేమాహేమీలు బరిలో దిగనున్న బాదామి నియోజకవర్గంలో తమ పార్టీ తరపున ఓ సామాన్య కార్యకర్తను బరిలో దింపామన్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే క్రమంలో ఓటర్లకు పంచడానికి తమ వద్ద డబ్బులు లేవన్నారు.హై–క, ముంబయి–కర్ణాటక ప్రాంతాల్లో జేడీఎస్‌కు ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందన్నారు. స్వతంత్ర అభ్యర్థులతో టచ్‌లో ఉన్నాం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పది నుంచి 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, వారిని జేడీఎస్‌లో ఆహ్వానించడానికి ఇప్పటికే ఆయా అభ్యర్థులతో మంతనాలు కూడా జరిపామన్నారు. సోమవారం తాము విడుదల చేసిన మేనిఫెస్టో పేదలు, మహిళలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించామన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే సోమవారం విడుదల చేసిన మేనిఫెస్టోను యథాతథంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అభ్యర్థుల తరపున ప్రచారాలు నిర్వహించే శక్తి తమకు లేదని అందుకే సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున బరిలో దిగనున్న జీటీ.దేవేగౌడ తరపున కూడా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం లేదన్నారు. వరుణ,కే.ఆర్ నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. -
‘బీజేపీతో పొత్తా?.. వెలేస్తా’
సాక్షి, బెంగళూరు: జనతా దళ్(సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ.. తనయుడు కుమార్‌స్వామికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ పార్టీతో పొత్తు లాంటి ప్రయత్నం చేస్తే కొడుకని కూడా చూడకుండా కుమారస్వామిని వెలేస్తానని ప్రకటించారు. సోమవారం తన నివాసంలో ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు దేవెగౌడ ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీతో కుమారస్వామి పొత్తు అంశం గురించి జర్నలిస్ట్ ప్రస్తావించగా... ‘ఒకవేళ అలాంటిదే జరిగితే నేను, నా భార్య, నా కుటుంబమే కుమార స్వామిని వెలిస్తుంది. గతంలోనే అతను (కుమారస్వామి) తప్పు చేశాడు. వ్యక్తిగతంగా నష్టపోవటంతోపాటు పార్టీని కొలుకోలేని దెబ్బతీశాడు. మళ్లీ ఇప్పుడు అదే తప్పు చేస్తానంటే ఎలా ఊరుకుంటా?. పార్టీలోంచే కాదు, ఇంట్లో కూడా అతనికి స్థానం ఉండదు’ అని దేవెగౌడ హెచ్చరించారు. తండ్రి ప్రకటనపై తనయుడు కుమారస్వామి స్పందించారు. ‘ఆయన(దేవెగౌడ) ఆ మాటలు ఏ సందర్భంలో అన్నారో నాకు తెలీదు. కానీ, అలాంటి పరిస్థితి రాదనే నా నమ్మకం. ఖచ్ఛితంగా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని కుమారస్వామి తెలిపారు. కాగా, సర్వే ఫలితాల్లో ‘హంగ్’ ఏర్పడొచ్చన్న కథనాలమేర కుమారస్వామి.. బీజేపీతో దోస్తీ వైపు అడుగులు వేస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
జేడీఎస్ అభ్యర్థి ఇంటి ఎదుట క్షుద్రపూజలు
తుమకూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల్లో విజయం కోసం ఆరాటపడుతున్న నేతలు అందుకు తమకు అందుబాటులోనున్న ప్రతీమార్గాలను అనుసరిస్తున్నారు. మరికొంత మంది నేతలు ప్రత్యర్థులను మానసికంగా దెబ్బ తీయడానికి, విజయం సాధించడానికి క్షుద్ర పూజలు చేయిస్తున్న ఘటనలు తరచూ ఏదోఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. శుక్రవారం తుమకూరు గ్రామీణ నియోజకవర్గ జేడీఎస్ అభ్యర్థి గౌరీశంకర్ ఇంటి ముందు కూడా ఎవరో క్షుద్రపూజలు చేసి సందేశంతో కూడా కాగితాన్ని ఉంచి పరారైన ఘటన వెలుగు చూసింది. పట్టణంలోని నాగరబావిలోని గౌరీశంకర్ ఇంటి ఎదుట గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి కుంకుమ పూసిన కత్తితో పాటు ఒక లెటర్‌ను కూడా పళ్లెంలో ఉంచి పారిపోయారు. తమకు దక్కుతున్న ప్రజాదరణ చూసి ఎన్నికల్లో విజయం సాధించలేమనే భయంతో ప్రత్యర్థులు తమను మానసికంగా దెబ్బతీయడానికి తమ ఇంటి ముందు క్షుద్రపూజలు చేసి ఉంటారంటూ గౌరీశంకర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి కృత్యాలకు తాము భయపడే ప్రసక్తి లేదని ఇకపై తాము మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళతామంటూ స్పష్టం చేసారు. -
ఒక్క రూపాయికే చీర
సాక్షి, బెంగళూరు, బళ్లారి: మామూలుగానైతే ఒక్క రూపాయికి ఏం వస్తుంది? పిప్పరమెంటు, చాక్లెట్టు, లేదా బిస్కెట్లో వస్తుంది. రూపాయికి విలువ లేని ఈ రోజుల్లో ఒక్కరూపాయికే చీర కావాలా?? అయితే బీదర్‌కు వెళ్లాల్సిందే. చీర కావాలంటే ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. అసలు విషయం ఏమిటంటే బీదర్‌కు చెందిన ఒక చీరల దుకాణం యజమాని చంద్రశేఖర్ జేడీఎస్ పార్టీకి వీరాభిమాని. 2018లో జరిగే శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి విజయం సాధించి తీరాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ ఒక్క రూపాయికి చీర స్కీమును ప్రారంభించాడు. ఈ ఆఫర్ కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో మహిళలు దుకాణం ముందు క్యూ కట్టారు. తిరుమల వెంకటేశ్వరుడు కలలో చెప్పాడట : దీనిపై షాపు యజమానిని మీడియా ప్రశ్నిస్తే తన అభిమాన నాయకుడు కుమారస్వామి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే 5 లక్షల చీరలను పంచాలని కొద్దిరోజుల క్రితం తిరుమల వేంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పినట్లు చంద్రశేఖర్ తెలిపాడు. ఏడుకొండలవాని ఆదేశాల మేరకే తాను ఒక్క రూపాయికి చీర స్కీమును చేపట్టానన్నాడు. ఈసారి ఆరునూరైన తమ నాయకుడు ముఖ్యమంత్రి అయి తీరుతారని చెప్పాడు. -
దారి తప్పిన నాయకురాలు
యలహంక (కర్ణాటక): ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినవారు సన్మార్గంలో నడుస్తూ ఆదర్శంగా నిలవాలి. అప్పుడే ప్రజలు ఆదరిస్తారు. అయితే ఆమె రూటు మార్చుకుని కటకటాలు లెక్కిస్తున్నారు. వాకింగ్‌కు వెళ్లిన మాజీ నగర సభ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లికార్జునప్పను కిడ్నాప్ చేసి రూ 60 లక్షలు నగదును తీసుకోని విడిచిపెట్టిన నలుగురు నిందితులను ఈశాన్య విభాగం పోలీసులు అరెస్టు చేశారు. జేడిఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు అర్షియా ఆలీ ఈ కేసులో పట్టుబడడం విశేషం. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు అవసరమని ఆమె అపహరణ మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యలహంక సమీపంలోని మారుతీ నగరలో నివాసముండే రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లికార్జునప్ప ఈ నెల 11వ తేదీ ఉదయాన్నే జికెవికెలో వాకింగ్‌కని కారులో బయలుదేరాడు. మారణాయుధాలతో బెదిరించి కిడ్నాప్ కోగిల్ క్రాస్‌లో హెచ్బిఆర్ లేఔట్‌కు చెందిన కాంతరాజ్ గౌడ (30), ప్రసాద్ (41, బాగలూరు రోడ్డు), అర్షియా ఆలీ (32, శ్రీనివాసగార్డెన్స్), డ్రైవర్ ప్రదీప్ (27, హొరమావు)లు మల్లికార్జునప్ప కారును అడ్డగించి మారణాయుధాలతో బెదిరించి తమ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హొరమావులోని ఒక గ్యారేజులో బంధించి, మల్లికార్జునప్ప కుమారుడు డాక్టర్ రవికుమార్‌కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. మీ తండ్రిని కిడ్నాప్ చేశాం, రూ. 100 కోట్లు ఇవ్వాలి, పోలీసులకు ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలుంటాయి అని బెదిరించా రు. పనిపైన హైదరాబాదుకు వెళ్లిన రవికుమార్, తన తండ్రికి ఏ హానీ చేయయద్దని, నగదు తీసుకొస్తానని కిడ్నాపర్లకు హామీ ఇచ్చాడు. తన స్నేహితుల దగ్గర రూ 60 లక్షల నగదు సమకూర్చుకుని బాగేపల్లి సమీపంలోని ముఖ్య రోడ్డులో ఉన్న దేవస్థానంలో రాత్రి సమయంలో నగదు బ్యాగు పెట్టి కొంతదూరంలో ఉన్న తన తండ్రిని పిలుచుకుని ఇంటికి వెళ్లాడు. బంధువులు, స్నేహితుల సలహా మేరకు యలహంక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. 24 గంటల్లో అరెస్టు డిసీపి గిరీశ్ నాయకత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కిడ్నాప్ చేసిన స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వారువాడిన మొబైల్ నెంబర్, టవర్ ఆధారంగా హొరమావి ప్రాంతాన్ని చూపించడంతో అక్కడ ఉన్న కారు డ్రైవర్ ప్రదీప్‌ను పట్టుకున్నారు. ప్రదీప్ ఇచ్చిన సమాచారం ప్రకారం మరో అర్షియా అలీ సహా ముగ్గురుని పోలీసులు నిర్బంధించి ప్రశ్నించగా, తప్పును ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.1.04 కోటి నగదు, 3 లక్షల విలువ చేసే బంగారు నగలు, ఒక పిస్టల్, తూటాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. -
నాది ఆశావాద దృక్పథం: దేవెగౌడ
బెంగళూరు:జేడీఎస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరాలనుకునే వారికి జ్ఞానోదయమయ్యే సమయం వస్తుందని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని కేఈబీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్.డి.దేవేగౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘జేడీఎస్ పార్టీని చాలా మంది విడిచి వెళ్లిపోతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నేను ఆశావహ దృక్పథంతో ఉన్నాను. పార్టీని వీడాలనుకునే వారికి జ్ఞానోదయమయ్యే సమయం వస్తుంది’ అని దేవేగౌడ పేర్కొన్నారు. రానున్న శనివారం మైసూరులో జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు దేవేగౌడ ప్రకటించారు. -
రాష్ట్రానికి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సీఎం కావాలి
బెంగళూరు : రైతులు, శ్రామికులు, చిన్నస్థాయి ఉద్యోగులు.... ఇలా సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి చెందిన ప్రజల కష్టాలకు స్పందించి వారికి మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి అవసరం ప్రస్తుతం కర్ణాటకకు ఉందని మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ అభిప్రాయపడ్డారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్ పార్టీ కెంగేరి ఉపనగరలో యశ్వంత్‌పుర నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తల బృహత్ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవెగౌడ మాట్లాడుతూ... ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. దేశానికి వెన్నముకలాంటి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుండటం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 213 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడగా బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందడం లేదని తెలిపారు. గతంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పల్లె నిద్ర పేరుతో చేపట్టిన కార్యక్రమం వల్ల రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలను చూపెట్టేవారని గుర్తు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సిద్ధరామయ్య వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుండటం వల్లే రైతుల బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. పార్టీలోని కొంతమంది నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా బీబీఎంపీ ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలన్నారు. అప్పుడు మాత్రమే మెజారిటీ సీట్లు సాధించడానికి వీలవుతుందని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే బీబీఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్టు కేటాయిస్తామని ఈ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి, శాసనమండలి సభ్యుడు ఈ.కృష్ణప్పతోపాటు నియోజకవర్గానికి చెందిన పలువురు జేడీఎస్ నేతలు హాజరయ్యారు. -
నిరాశతోనే అలా మాట్లాడుతున్నారు
- రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ బెంగళూరు: రాజకీయ అస్థిత్వాన్ని జేడీఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కోల్పోయిందని రాష్ట్ర ఆ హార, పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ విమర్శించారు. ఈ పరిణామంతో జేడీఎస్ పార్టీ నేత హెచ్.డి.కుమారస్వామి నిరాశలో కూరుకుపోయారని, అందుకే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దినేష్ గుండూరావ్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేపాల్ భూకంప బాధితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిం చిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నభాగ్య పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది పేదలకు మూడు పూటలా భోజనం చేసే అదృష్టాన్ని కల్పించిందని అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయలేదని, అందుకే ప్రజలు ఆయన్ను అధికారం నుంచి దించేశారని విమర్శించారు. ఇక కుమారస్వామి తనపై చేసిన వ్యాఖ్యలపై దినేష్ గుండూరావ్ స్పందిస్తూ....‘నేను అవినీతికి పాల్పడినట్లు, అందుకు సంబంధించిన ఆధారాలు ఆయన వద్ద ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా కుమారస్వామి చెబుతూనే ఉన్నారు. అయితే కుమారస్వామి ఎప్పుడూ ఆ ఆధారాలను బయటపెట్టలేదు. ఎందుకంటే అసలు నేను అవినీతి చేసి ఉంటే, అందుకు సంబంధించిన ఆధారాలు ఉండేది, వాటిని బయటపెట్టగలిగేది. ఇదంతా ప్రజలను మభ్యపెట్టేందుకు కుమారస్వామి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే’ అని పేర్కొన్నారు. -
సోమరులుగా మారుస్తున్నారు.!
అన్నభాగ్యతో ప్రజలను పనికిరానివాళ్లుగా మారుస్తున్న ప్రభుత్వం ఆకలి రహిత రాష్ట్రం కాదు అప్పుల కర్ణాటక జేడీఎస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి బెంగళూరు : ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమానికి దోహపడేలా ఉండాలే కాని ప్రజలను సోమరులను చేసేలా ఉండరాదని జేడీఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి విమర్శించారు. హుబ్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలను సోమరులుగా చేసేందుకే ఉచితంగా ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. దీని ఫలితంగా రాష్ట్రం మానవ వనరులు లభ్యం కాక ఉత్పాదకత సామర్థ్యం తగ్గి అభివృద్ధి విషయంలో కర్ణాటక తిరోగమనంలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార ధాన్యాలను ఉచితంగా వితరణ చేస్తున్నామంటూ గొప్పలు పోతున్న ప్రభుత్వం గతంలో ఒక్కొక్క కుటుంబానికి ఇస్తున్న ఆహార ధాన్యాల పరిమాణాన్ని ఎందుకు తగ్గించిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలు అన్నం తినగలుగుతున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ రాష్ట్ర ప్రజలు ఉపవాసం ఉండేవారా? అంటూ ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకునే సిద్ధరామయ్య పాలనలో దానిమ్మ రైతులు దయా మరణం కోరుతూ గవర్నర్‌కు అర్జీలు దాఖలు చేసుకోవడం శోచనీయమని అన్నారు. ఈ విషయంలో సిద్ధు సిగ్గుపడాలని అన్నారు. రాష్ట్ర రైతుల పై ఏమాత్రం గౌరవమున్నా దానిమ్మ పంటవేసి నష్ట పోయిన వారికి పరిహారం అందించడానికి వీలుగా వెంటనే రూ.335 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన రుణం కంటే అభివృద్ధి పేరుతో సిద్ధరామయ్య ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ‘ఆకలి రహిత కర్ణాటక కాదు అప్పుల కర్ణాటక’గా రాష్ట్రం పేరుతెచ్చుకోవడం కచ్చితమని కుమారస్వామి జోష్యం చెప్పారు. బీబీఎంపీ విభజనకు జేడీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోదన్నారు. పాలనా విషయంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి సలహాలు చెప్పడం మాని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచనలు ఇవ్వడం సబబుగా ఉంటుందని అన్నారు. -
...అవి ప్రభుత్వ హత్యలే..
రెండేళ్లలో 132 మంది రైతుల బలవన్మరణం జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి బెంగళూరు : రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 132 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జేడీఎస్ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి తెలిపారు. రెండేళ్లుగా ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలవల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా రైతులను ఆత్మహత్యలవైపు పురిగొల్పడంతో ఇవన్నీ ప్రభుత్వం సాగించిన హత్యలుగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లిలో స్థానిక ఎమ్మెల్యే సి.బి.సురేష్ జన్మదినోత్సవ వేడుకల్లో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 17వందల మందికి సామూహిక సీమంతాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో కుమారస్వామి మాట్లాడుతూ... సరైన సమయంలో రైతులకు పంట రుణాలను అందించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. దీంతో వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల అధిక వడ్డీకి రైతులు అప్పులు చేస్తున్నారని తెలిపారు. ఎంతో శ్రమతో పంట పండిస్తే రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ఫలితంగా అప్పులు తీర్చే మార్గం కానరాక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇకనైన ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని సూచించారు. లేకుంటే బృహత్ పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. -
జేడీఎస్ కార్యాలయంలో సినిమా సెట్
దర్శన్ ‘ఐరావత’ షూటింగ్ పై జేడీఎస్ నేతల్లో అసహనం బెంగళూరు: ఎప్పుడూ రాజకీయ నేతలతో కిటకిటలాడే జేడీఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం సోమవారం ఖాకీలతో కిక్కిరిసింది. పార్టీ ప్రధాన కార్యాలయం కాస్తా పోలీస్ స్టేషన్‌గా మారిపోయింది. ప్రముఖ నటుడు దర్శన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఐరావత చిత్రం షూటింగ్‌కు పార్టీ కార్యాలయం ఆదివారం వేదికైంది. జేడీఎస్ ఎమ్మెల్సీ సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం జేడీఎస్ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చేశారు. దీంతో జేడీఎస్ పార్టీ బోర్డును తొలగించి పోలీస్ స్టేషన్ బోర్డును కార్యాలయానికి తగిలించారు. ఇక జేడీఎస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీకి చెందుతుందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పును ప్రశ్నిస్తూ జేడీఎస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ అర్జీని సైతం దాఖలు చేశారు. ఈ గందరగోళం నడుమనే పార్టీ కార్యాలయాన్ని షూటింగ్ కోసం కేటాయించడంపై జేడీఎస్‌కు చెందిన కొందరు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విషయాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదని జేడీఎస్ సీనియర్ నేతలు తమ ఆప్తుల వద్ద వాపోయినట్లు సమాచారం. -
శిరసా వహిస్తాం
సుప్రీం తీర్పు మేరకు కార్యాలయాన్ని అప్పగించేందుకు మేం సిద్ధం జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ బెంగళూరు : సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకు అప్పగించనున్నామని జేడీఎస్ పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన న్యూ ఇయర్ డైరీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కార్యాలయాన్ని నమ్ముకుని తాను పార్టీని స్థాపించలేదన్నారు. కార్యకర్తల నుంచి విరాళాలు సేకరించి నూతన కార్యాలయాన్ని నిర్మించగలనని దేవెగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘జేడీఎస్ రాజకీయ పార్టీ. రాజకీయ కార్యకలాపాల కోసం కార్యలయ స్థాపనకు సరైన చోట స్థలాన్ని కేటాయించండి. పూర్తి స్థాయి కార్యాలయాన్ని నిర్మించేంత వరకూ లీజు ప్రతిపాదికన ఓ కట్టడాన్ని కేటాయించండి’ అని బీడీఏకు లేఖ రాసినా అధికారులు స్పందించడం లేదన్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తముందని ఆరోపించారు. జేడీఎస్‌ను రూపుమాపాలని ఆయన భావిస్తున్నారని, అయితే అది ఎన్నటికీ జరగదని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కుమారుడికే పగ్గాలు
సాక్షి,బెంగళూరు : జేడీఎస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఆ పార్టీ శాసనసభపక్ష నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ గురువారం జరిగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మెజారిటీ నాయకులు కుమారస్వామి పేరును సూచిం చడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయంలో వ్యక్తిగత అభిమానం కాని, కుటుంబ సభ్యుడనే అభిమానం కాని లేదని ఆయన స్పష్టం చేశారు. ‘జేడీఎస్‌ను కొంతమంది అప్ప-మక్కలు (తండ్రి-కొడుకుల) పార్టీ అంటూ ఎద్దేవా చేయడం మానుకోవాలి. ప్రధాని నరేంద్రమోడీతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మమతాబెనర్జీ, మాయావతిలకు కుమారులు ఉంటే వారిని తాముం టున్న పార్టీల్లో ఎదగనిచ్చేవారుకాదా?’ అని పేర్కొన్నారు. దేశంలో చాలా మంది తండ్రి, కొడుకులు ఒకే పార్టీలో ఉంటూ ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన సంఘటనలు తన రాజకీయ జీవితంలో అనేకం చూసానన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జేడీఎస్‌ను నాశనం చేయడానికి వీలుకాదని పేర్కొన్నారు. 28న పార్టీ సమావేశం... ఈనెల 28న బెంగళూరులో పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు దేవెగౌడ తెలిపారు. 1970 నుంచి జేడీఎస్ పార్టీలో ఉన్నవారితో పాటు ఇతర పార్టీలోకి వెళ్లి తిరిగి జేడీఎస్‌లోకి రావాలనుకునేవారు ఈ సమావేశానికి హాజరుకావచ్చని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరూ పాల్గొంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా కుమారస్వామి పేర్కొన్నారు. కాగా, కృష్ణప్ప మరణం తర్వాత దాదాపు ఏడు నెలలు జేడీఎస్ రాష్ర్ట అధ్యక్ష పదవి ఖాళీగా ఉండగా తాత్కాలిక అధ్యక్షుడిగా నారాయణరావు వ్యవహరించిన విషయం తెలిసిందే. -
పార్టీని నాశనం చేయడం అసాధ్యం
డీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ సాక్షి,బెంగళూరు : తన ఊపిరి ఉన్నతం వరకూ జేడీఎస్ పార్టీని నాశయం చేయడానికి సాధ్యం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. బెంగళూరులోని జేడీఎస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నయని కొందరూ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పార్టీని నాశనం చేయడానికి సాధ్యం కాదన్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని అడ్డుకోబోమన్నారు. అయితే వారు అనవసరంగా జేడీఎస్ పట్ల, అందులోని నాయకుల పై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నైస్ ప్రాజెక్టు అక్రమాల్లో ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్‌కూ భాగముందని దేవెగౌడ ఆరోపించారు. ఈ విషయాలన్నీ తెలిసినా సీఎం సిద్ధరామయ్య మిన్నకుండటం పలు అనుమానాలకు తావిస్తోందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు.