బెంగళూరు: లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌ను జేడీఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మంగళవారం హుబ్బళిలో జేడీఎస్ కోర్ కమిటీ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడకు ప్రజ్వల్ సస్పెన్షన్‌పై సిఫార్సుచేసిన కొద్ది సేపటికే పార్టీ ప్రజ్వల్‌ను సస్పెండ్‌చేసింది. ‘‘ మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నట్లు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఆ వీడియోలు పార్టీకి, పార్టీ నాయకత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. పార్టీ నియమావళి, క్రమశిక్షణా నిబంధనావళిని ఉల్లంఘించిన కారణంగా తక్షణం ఆయన్ను సస్పెండ్‌చేస్తున్నాం’ అని సస్పెన్షన్ ఉత్తర్వులో పార్టీ పేర్కొంది. కోర్ కమిటీ భేటీలో కర్ణాటక రాష్ట్ర జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక, ప్రభుత్వ చర్యలను బట్టి సస్పెన్షన్‌ను పొడిగిస్తామని కుమారస్వామి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment