
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల ప్రకారం.. ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా సునీల్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారని చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.