prajwala
-
జర్మనీ నుంచి ఇంగ్లండ్‌కు!.. ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ జారీ
బనశంకరి: హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎప్పుడు వస్తాడనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. గత నెల 27వ తేదీన దేశం విడిచి వెళ్లిన ఎంపీ ఆచూకీ కోసం రాష్ట్ర పోలీసులు, సిట్ ముమ్మరంగా గాలిస్తోంది. నగ్న వీడియోలు, లైంగికదాడి కేసులో నిందితుడైన ప్రజ్వల్ జర్మనీ నుంచి ఇప్పుడు ఇంగ్లండ్‌కి మకాం మార్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం శనివారం వారెంట్ జారీ చేసింది. ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుసార్లు భారత్‌కు టికెట్లు బుక్ చేసుకొని రద్దు చేసుకున్నట్లు గుర్తించింది. దీంతో చేసేది లేక కోర్టును ఆశ్రయించి సిట్ అరెస్టు వారెంటును జారీ చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.ఇంగ్లండ్‌లో ఓ భారత పారిశ్రామికవేత్త సహాయంతో ఎంపీ ప్రజ్వల్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బ్రిటన్‌కి వెళ్లాడని తెలిసింది. తన జాడ తెలుస్తుందనే భయంతో ప్రజ్వల్ గత 15 రోజులుగా కుటుంబంతో కూడా మాట్లాడలేదని తెలిసింది.జూన్ 4 తరువాతే నిర్ణయంప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటికే రెండుసార్లు లుఫ్తాన్సా విమాన టికెట్ రద్దు చేసుకున్నారు. మే 3, 15 తేదీన భారత్ కు రావడానికి టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేశారు. దీంతో సిట్ అదికారులు ప్రజ్వల్ మళ్లీ ఎప్పుడు టికెట్ బుక్ చేసుకుంటాడా అని నిఘాపెట్టారు. దేశమంతా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడతాయి. ఆ తరువాత పరిణామాలను బట్టి బెంగళూరుకు రావాలా, మరింత ఆలస్యం చేయాలా అనేది ప్రజ్వల్ నిర్ణయించుకుంటారు. మరోపక్క వెంటనే రావాలని కుటుంబసభ్యులు ఆయనను కోరినట్లు తెలిసింది.ఇక.. ప్రజ్వల్ బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు ఫ్రీజ్ చేశారు. ప్ర జ్వల్కు చెందిన అన్ని బ్యాంకు అకౌంట్ల సమాచారం సేకరించి వాటిని స్తంభింపజేశారు. ఆయనకు ఏయే ఖాతాల ద్వారా నగదు జమైందో విచారణ చేపట్టారు. విదేశాల్లో గడపాలంటే చాలా డబ్బులు కావాలి కాబట్టి ఆయనకు డబ్బు ఎలా చేరుతోందో కనిపెట్టే పనిలో ఉన్నారు. -
4 రోజులు సిట్ కస్టడీ
శివాజీనగర: లైంగిక దాడి, కిడ్నాప్ తదితర కేసుల్లో శనివారం రాత్రి అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణను ప్రత్యేక తనిఖీ బృందం (ఎస్ఐటీ) అధికారులు రాత్రంతా విచారించారు. మరోవైపు ఆయనకు కోర్టు 4 రోజుల పాటు సిట్ కస్టడీకి అనుమతించింది. రాత్రి విచారణలో రేవణ్ణ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. మహిళ కిడ్నాప్‌కు నాకు సంబంధం లేదు. నేను ఎవరినీ కిడ్నాప్ చేయలేదు అని చెబుతున్నారని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అర్ధరాత్రి వరకు రేవణ్ణను మహిళ కిడ్నాప్ కేసులో కూలంకుషంగా విచారించారు. సిట్ చీఫ్, ఏడీజీపీ బీ.కే.సింగ్ బృందం విచారణలో పాల్గొంది. ఆరోపణలను రేవణ్ణ నిరాకరించారు. నేను ఆమెను కిడ్నాప్ చేయలేదు, ఎన్నికలు ఉన్న కారణాన ఆమె నా ఇంటికి వచ్చారు. ఆమె కొన్ని సంవత్సరాల నుండి నా ఇంట్లో పని చేస్తుండేవారు. ఆమె గురించి గాని, కిడ్నాప్ గురించి ఏమీ తెలియదు అని రేవణ్ణ చెప్పినట్లు సమాచారం. రాత్రి ఆయనను సిట్ ఆఫీసులోనే నిద్రపోనిచ్చారు. ఆదివారం కొన్ని ప్రశ్నలను అడిగి విచారణను కొనసాగించారు. సదరు మహిళపై రేవణ్ణ తనయుడు, ఎంపీ ప్రజ్వల్ అత్యాచారం చేశాడా?, ప్రజ్వల్‌ను తప్పించేందుకు ఆమెను కిడ్నాప్ చేయించారా? అనే కోణాలలో సిట్ విచారణ జరుపుతోంది. కస్టడీకి అనుమతి ఆదివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య కోరమంగళలోని 17వ ఏసీఎంఎం కోర్టు జడ్జి రవీంద్ర కట్టిమని ఇంట్లో రేవణ్ణను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ కోసం ఆయనను వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ న్యాయవాదులు కోరారు. జడ్జి ఆలకించి, 4 రోజుల పాటు.. అంటే 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సిట్ కస్టడీకి అనుమతించారు. దీంతో రేవణ్ణను సిట్ అప్పటివరకు విచారించే అవకాశముంది. రేవణ్ణ బెయిలు కోసం ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో బెయిలు అర్జీ సమర్పించారు. సోమవారం విచారణ జరగనుంది. ప్రజ్వల్ నివాసం సీజ్ ఎంపీ ప్రజ్వల్ ప్రభుత్వ నివాసానికి సిట్ అధికారులు తాళాలు వేశారు. ప్రజ్వల్‌కు హాసన్ ఆర్సీ రోడ్డులో ప్రభుత్వం కేటాయించిన నివాసం ఉంది. బాధితుల సమక్షంలో శనివారం రాత్రి మహజరు జరిపిన సిట్ అధికారులు నివాసానికి తాళం వేసి సీల్ వేశారు. తొలి అంతస్తు గదిలో అత్యాచారం జరిగిందనే ఆరోపణ వినిపించింది. ఇక్కడే నగ్న వీడియోలు రికార్డు చేసినట్లు అనుమానాలున్నాయి. ప్రజ్వల్ సిట్ విచారణకు వస్తారా?, రారా? అన్నది మిస్టరీగా మారింది. పాస్‌పోర్టును రద్దు చేయరెందుకు? దొడ్డబళ్లాపురం: ప్రజ్వల్, రేవణ్ణ కేసుల్లో బాధిత మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా ఆదివారం తెలిపారు. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత 75 సంవత్సరాల్లో ఇలాంటి దారుణ సంఘటన జరగలేదని, బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని సుర్జేవాలా అన్నారు. ప్రధాని మోదీ ప్రజ్వల్ పాస్‌పోర్టును ఎందుకు రద్దు చేయలేదని, ఇంటర్‌పోల్ ద్వారా ఎందుకు బ్లూ కార్నర్ నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు. -
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
బెంగళూరు: లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్‌ను జేడీఎస్ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మంగళవారం హుబ్బళిలో జేడీఎస్ కోర్ కమిటీ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు ప్రజ్వల్ సస్పెన్షన్‌పై సిఫార్సుచేసిన కొద్ది సేపటికే పార్టీ ప్రజ్వల్‌ను సస్పెండ్‌చేసింది. ‘‘ మహిళలను ప్రజ్వల్ లైంగికంగా వేధిస్తున్నట్లు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలు పార్టీకి, పార్టీ నాయకత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. పార్టీ నియమావళి, క్రమశిక్షణా నిబంధనావళిని ఉల్లంఘించిన కారణంగా తక్షణం ఆయన్ను సస్పెండ్చేస్తున్నాం’ అని సస్పెన్షన్ ఉత్తర్వులో పార్టీ పేర్కొంది. కోర్ కమిటీ భేటీలో కర్ణాటక రాష్ట్ర జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక, ప్రభుత్వ చర్యలను బట్టి సస్పెన్షన్‌ను పొడిగిస్తామని కుమారస్వామి చెప్పారు. -
అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణతోపాటు ఆయన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా వైరల్ అవుతున్న అసభ్యకరమైన వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి ఎమ్మెల్యే హెడ్డీ రేవణ్ణ స్పందించారు. అసభ్యకరమైన వీడియోల వ్యవహారం.. పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. ఇక ఆ వీడియోలు నాలుగైదేళ్ల కిందటివని అన్నారు.‘ఇలాంటిది ఒక కుట్ర జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను వాటికి భయపడి పారిపోయేవాడిని కాదు. మాకు వ్యతిరేకంగా విడుదల చేసిన వీడియోలు నాలుగైదేళ్ల కిందటివి. ప్రజ్వల్ విదేశానికి వెళ్లాడు. అతనికి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి తెలియదు’ అని హెచ్డీ రేవణ్ణ తెలిపారు. ఈ కేసులో చట్టపరంగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. కాంగ్రెస్ హయాంలో గత 40 ఏళ్లుగా సీఐడీ, సిట్ వంటి అనేక విచారణలు తాము ధైర్యంగా ఎదుర్కొన్నామని తెలిపారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. -
అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక జనతాదళ్ (సెక్యులర్) అగ్రనేత దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణపై హాసన్ జిల్లా హోలెనరసిపూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆ ఎఫ్ఐఆర్లో 2019, 2022 మధ్య కాలంలో తాను అనేకసార్లు లైంగిక వేధింపులకు గురైనట్ల బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు సిట్ బృందానికి సమాచారం అందించారు. కాగా, మరింత మంది మహిళలు కేసులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే తనపై వస్తున్న ఆరోపణల్ని ప్రజ్వల్ రేవన్న ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్లీల వీడియోలు మార్ఫింగ్ చేసినవి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో ప్రజ్వల్ రేవణ్ణ నిన్న ఉదయం జర్మనీ వెళ్లారు.ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా దీనిలో దర్యాప్తు చేస్తామన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థిగా ఉన్నారు. ఏప్రిల్ 26న రెండో దశలో ఓటింగ్ జరిగింది. -
దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్..
సాక్షి, బెంగళూరు: జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందుకు ఎంపీగా రేవణ్ణ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. అతడి ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ తరఫున హసన్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో జేడీఎస్ తరపున లోక్‌సభకు ఎన్నికైన ఒకే ఒక్క నేత ప్రజ్వల్. అయితే రేవణ్ణ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని, ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తులను ప్రకటించలేదని ఆరోపిస్తూ ఆయనపై కర్ణాటక హైకోర్టు రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. నియోజకవర్గానికి చెందిన ఓటరు జీ దేవరాజేగౌడతోపాటు రేవర్ణ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఏ మంజు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం జస్టిస్ కె నటరాజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చింది నిజమేనని తేల్చింది. ఎంపీగా అతడి ఎన్నిక చెల్లదని చెప్పింది. చదవండి: ఆదిత్య ఎల్1: సూర్యుడిపై సరికొత్త ప్రయోగం.. US, చైనాకు ధీటుగా.. అంతేగాక వచ్చే 6 సంవత్సరాల పాటు రేవణ్ణ ఏ విధమైన ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అలాగే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు ప్రజ్వల్ రేవణ్ణపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉండగానే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై హైకోర్టు అనర్హత వేటు వేయడం గమనార్హం. అయితే, రేవణ్ణ అనర్హతతో తనను ఎంపీగా ప్రకటించాలని బీజేపీ అభ్యర్థి మంజు కోరగా... ఆమె అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇక లోక్‌భ ఎన్నికల్లో రేవణ్ణపై బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మంజు ఆ తరువాత జీడీఎస్‌లో చేరారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
Sunitha Krishnan: దయచేసి మారండి!
మహిళల అక్రమ రవాణా... ప్రభుత్వాలకు పెద్ద సవాల్. సమాజానికి తలవంపులు. బాధిత మహిళకు విషమ పరీక్ష. మహిళల రక్షణ ఆమె ఆకాంక్ష. తనకు తెలిసిన మార్గం పోరాటమే. పోరాటం... పోరాటం... పోరాటం. అసాంఘిక శక్తులతో పోరాటం. సామాజిక పరిస్థితులతో పోరాటం. మనసు మారితే సమాజం మారుతుంది. ఇప్పుడు ఆ మార్పు కోసం అభ్యర్థిస్తోంది. సునీతాకృష్ణన్ ‘నా బంగారు తల్లి’ సినిమా తీసి దాదాపుగా దశాబ్దమవుతోంది. మహిళలను మోసగించి అక్రమ రవాణాకు పాల్పడే దుర్మార్గాన్ని ఆ సినిమాలో కళ్లకు కట్టారు సునీతా కృష్ణన్, ఆమె భర్త రాజేశ్ టచ్‌రివర్. ప్రతి సన్నివేశమూ వాస్తవానికి అద్దం పట్టింది. సినిమా క్లైమాక్స్ దృశ్యాలు కన్నీటి పర్యంతం చేస్తాయి, మనసు ద్రవించిపోతుంది. సమాజంలో మహిళ ఎదుర్కొనే దాష్టీకాలకు మౌనంగా రోదిస్తూ బయటకు వస్తారు ప్రేక్షకులు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం అది. ఆ సందర్భంగా నిర్మాత సునీతా కృష్ణన్ మాట్లాడుతూ ‘‘1996లో ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి పోరాడుతున్నాను. అంతకంటే ముందు ప్రజ్వల వంటి ఫౌండేషన్ అవసరం ఉందని గ్రహించే వరకు నేను గుర్తించిన సామాజికాంశాలన్నింటి మీదా పోరాడాను. ‘స్త్రీ అంగడి సరుకు కాదు, దేహం మీద దాడి చేస్తే ఆమె మనసు ఎంతగా రోదిస్తుందో ఆలోచించండి’ అని గొంతుచించుకుని చెప్తున్నాను. నా ఉద్యమం సమాజంలో ప్రతి ఒక్కరినీ చేరాలంటే, ఏకకాలంలో ఎక్కువమందిని సెన్సిటైజ్ చేయాలంటే ప్రభావవంతమైన మాధ్యమం అవసరం అనిపించింది. అందుకే సినిమా తీశాను. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఎవరైనా కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించకపోతారా, స్త్రీ దేహాన్ని మాత్రమే కాంక్షించే మగవాళ్లకు తమ ఇళ్లలో ఉండే ఆడబిడ్డలు కళ్ల ముందు మెదలకపోతారా’ అనేది మా ఆశ. నేను యాక్టివిస్ట్‌ని, నా భర్త సినిమా దర్శకుడు కావడంతో మా ఆలోచన అనుకున్నది అనుకున్నట్లే కార్యరూపం దాల్చింది. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చిత్రించాం’’ అని చెప్పారామె. ఆమె సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు (మహిళాసాధికారత విభాగం)కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. ఎక్కడ ఉన్నా పోరాటమే! ‘‘నేను బెంగళూరులో పుట్టిన మలయాళీని. నేను పుట్టిన నెలరోజులకే మా నాన్నకు హైదరాబాద్‌కు బదిలీ అయింది. నా బాల్యం మూడేళ్లు ఇక్కడే గడిచింది. నేను మహిళల కోసం పని చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం అనుకోకుండా జరిగింది. బెంగళూరులో స్టూడెంట్‌గా నేను ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. స్త్రీ దేహం కాస్మటిక్ కంపెనీల నిబంధనల చట్రంలో ఇమడాలనే భావనను వ్యతిరేకించాను. స్త్రీ దేహం ఫలానా కొలతల్లో ఉంటేనే అందం అని ఒకరు నిర్ణయించడమేంటి, ఆ మాయలో చిక్కుకుని అమ్మాయిలు తమ దేహాన్ని నియంత్రించుకోవడానికి తంటాలు పడడం ఏమిటి? అని... స్త్రీ దేహాన్ని మార్కెట్ వస్తువుగా పరిగణించే ధోరణిని నిరసిస్తూ అందాల పోటీల నిర్వహణను అడ్డుకుని రెండు నెలలు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఇరవై రెండేళ్లు. నేను ఉద్యమించి జైలుకెళ్లడాన్ని మా ఇంట్లో సమ్మతించలేకపోయారు. అలా ఇల్లు వదిలి వచ్చేశాను. ఎక్కడికెళ్లాలో తెలియదు. రైల్వే స్టేషన్‌కెళ్లి కౌంటర్లో ఎటువెళ్లే రైళ్లున్నాయని అడిగాను. వాళ్లు చెప్పిన పేర్లలో ‘హైదరాబాద్’ వినిపించగానే ‘టికెట్ ఇవ్వండి’ అనేశాను. అలా హైదరాబాద్, చాదర్‌ఘాట్‌లో నివసిస్తున్న ఓ మిత్రురాలింటికి వచ్చాను. ఇక్కడ కూడా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మూసీ నది తీరాన్ని ‘నందనవనం’గా మార్చాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ‘పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మా ఇళ్లను కూలగొట్టండి’ అంటూ రోడ్డెక్కాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘మెహబూబ్ కీ మెహందీ’లో నివసిస్తున్న వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ మహిళల కోసం ఏదైనా చేయాలని పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాను. లైంగికహింస, అక్రమ రవాణాలకు గురయ్యి జైళ్లు, హోమ్‌లలో ఉన్న మహిళలను కలిశాను. వాళ్లలో చాలామంది తమ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వమని కోరారు. అలా ఐదుగురు పిల్లలతో స్కూలు ప్రారంభించాను. ఆ తర్వాత పదిమంది పిల్లలతో షెల్టర్ హోమ్ పెట్టాను. అలా మొదలైన చిన్న ప్రయత్నం ఇప్పుడు పదిహేడు ట్రాన్సిషన్ సెంటర్లలో ఏడు వందల మంది పిల్లలు చదువుకునేంతగా పరిణమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పన్నెండు వేల మంది చదువుకుని గౌరవప్రదమైన జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ ఫౌండేషన్ అవసరం ఉండకూడదు! ఆడపిల్లల అక్రమ రవాణాదారులు ఒక అమ్మాయిని తీసుకువచ్చినట్లు సమాచారం అందగానే దూకుడుగా వెళ్లిపోయేదాన్ని. అడ్డువచ్చిన వాళ్లతో బాహాబాహీకి దిగి మరీ ఆడపిల్లలను బయటకు తీసుకువచ్చేదాన్ని. అలా లెక్కలేనన్నిసార్లు నా మీద దాడులు జరిగాయి. చెవి మీద తగిలిన దెబ్బ కారణంగా వినికిడి కూడా తగ్గింది. ఆ దాడులను పట్టించుకోలేదు. కానీ నా అనుచరుడిని హత్య చేశారు. అప్పుడు నా పంథా మార్చుకుని పోలీస్, మహిళా సంక్షేమశాఖల వంటి ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 96 వేల మంది బాలికలు, యువతులు, మహిళలను రక్షించగలిగాను. ఆ నంబరు ఇంత పెద్దదిగా ఉన్నందుకు గర్వపడడం కాదు మనం సిగ్గుపడాలి. స్త్రీల రక్షణ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించాను. సమాజంలో స్త్రీల అక్రమ రవాణా పూర్తిగా అంతరించిపోవాలి. నేను బతికి ఉండగానే ఈ ఫౌండేషన్‌ను మూసివేయాలనేది నా ఆకాంక్ష. సమాజంలో సున్నితత్వం పెరిగి, మంచి మార్పు రావాలని అందరం ఆశిద్దాం. – సునీతాకృష్ణన్, సామాజిక ఉద్యమకారిణి మగవాళ్లకు చెప్పాలి! నా బంగారు తల్లి సినిమాతో సమాజాన్ని ఆలోచింపచేయగలిగాను. ఆ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నాలుగు నంది అవార్డులు ప్రకటించింది. ఇప్పుడు మగవారి మీద దృష్టి పెట్టాను. ఆడవాళ్ల మీద జరిగే దాడులను, మోసాలను అరికట్టడానికి భుజబలం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే మగవాళ్లను చైతన్యవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనిపించింది. అందుకే ఇప్పుడు ‘మ్యాన్ అగెనెస్ట్ డిమాండ్ (మ్యాడ్)’ నినాదంతో ముందుకు వెళ్తున్నాను. ‘మీ లైంగిక అవసరాలకు ఇతర స్త్రీలను కోరుకోవడం మానేయండి, మీలో ఈ మార్పు వస్తే స్త్రీల అక్రమ రవాణా మాఫియా దానంతట అదే అంతరించిపోతుంది’ అని అభ్యర్థిస్తున్నాను. మనిషిలో సహజంగానే సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని పురుషాహంకారంతో అణచివేయకుండా ఉంటే చాలు. మార్పు వచ్చి తీరుతుంది’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు సునీతా కృష్ణన్. ఇరవై ఆరేళ్ల తన పోరాటంలో తిరస్కారాలు తప్ప పురస్కారాలు అందలేదని, తన సొంతరాష్ట్రం కేరళలో ప్రభుత్వ పురస్కారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దక్కిన తొలి గౌరవం ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అని సంతోషం వ్యక్తం చేశారామె. – వాకా మంజులారెడ్డి -
'ప్రజ్వల' కోసం మేము సైతం...
హైదరాబాద్: దేశంలోని ప్రతి రెడ్ లైట్ ఏరియాలో తెలుగు అమ్మాయిలు ఉన్నారని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో వ్యభిచార గృహాలపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీఐడీ అధికారులు దాడి చేసి 64 మందిని రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యభిచార గృహాలలో దాదాపు 95 శాతం మంది తెలుగు అమ్మాయిలే ఉన్నారని చెప్పారు. ఇది అందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి వారిని రక్షించి... హైదరాబాద్‌లో ఆశ్రయం కల్పిస్తున్న గూడు ఈ ఏడాది సెప్టెంబర్ 30 తేదీతో చెదిరిపోనుంది. దీంతో ఆ తేదీ లోపు ఆశ్రయం పొందుతున్న వారందరికి కోసం కొత్తగా ఓ భవనం నిర్మించాలని ప్రజ్వల నిర్ణయించింది. అందులోభాగంగా సెప్టెంబర్ 30 లోపు ఓ భవనం కట్టుకుని అక్కడికి వెళ్లి పోవాల్సిన ప్రజ్వల భావిస్తుంది. అందుకోసం స్వచ్ఛందంగా విరాళాలు సేకరించేందుకు ఆదివారం 'సాక్షి' టీవీలో ఏర్పాటు చేసిన లైవ్ షోలో ఆ సంస్థ ప్రతినిధులు సునీతా కృష్ణన్‌తోపాటు మల్లేశ్, అహ్మద్ అలీ పాల్గొన్నారు. అక్రమ రవాణా నుంచి తప్పించిన వారిని, వ్యభిచార కూపంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చి... వారి కోసం ప్రజ్వల చేపడుతున్న సేవలను వారు వివరించారు. మానవత్వం మూర్తిభవించిన దాతలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. వారి స్పందనలు ఇలా ఉన్నాయి... దివ్య, రాజ్ ప్రొటెక్ట్ కంపెనీ : రూ.1,70, 000 ఇస్తున్నట్లు ప్రకటించారు. హేమంత్, హైదరాబాద్: తమ స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పి.. తనతో పాటు వారు కూడా సాయం చేస్తామని చెప్పారు నవ్య, హైదరాబాద్ : రూ 30 వేలు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు దేవి, బెంగళూరు : రూ. 5 వేలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆమె ఉద్వేగానికి లోనైంది. మనీ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ అవుతుంది కానీ సునీత కృష్ణన్లా చేసే వారు ఉండరని చెప్పారు. సుమంత్, హైదరాబాద్: తన జీతం నుంచి ప్రతినెల ఎంతో కొంత నగదు ఈ స్వచ్ఛంద సంస్థకు అందజేస్తామన్నారు. భార్గవ్, హైదరాబాద్ : రూ.50 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణారెడ్డి, తిరుపతి : రూ. 50 వేలు ఇస్తానన్నారు. తమ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల పేరు చెప్పేందుకు ఇష్టపడిన ఓ వ్యక్తి రూ. 3 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. స్వరూపరాణి, గుంతకల్ : రూ. 500 ఇస్తానన్నారు. ఆమె ఉద్యోగి, తనకు వచ్చే రూ. 5 వేల జీతంలో నుంచి 500 ఇస్తున్నట్లు చెప్పారు. లత, ఖమ్మం : సునీతా కృష్ణన్ గొప్ప కార్యం చేస్తున్నారని చెప్పారు. పద్మ , సిద్ధిపేట : రూ. 5 వేలు ఇస్తున్నట్లు చెప్పారు మాళవిక, హైదరాబాద్: రూ. 25 వేలు.. సునీత కృష్ణన్ గారు సేవలను ప్రశంసించారు. రమ్య, హైదరాబాద్: రూ. 5 వేలు శ్రీనివాసులు, రాయచోటి (వైఎస్ఆర్ జిల్లా) : రూ. వెయ్యి చైతన్య, మహబూబ్‌నగర్ : రూ. 5 వేలు వెంకటరమణ, దర్శి (ప్రకాశం జిల్లా) : రూ. 2 వేలు శ్రీనివాస్, భువనగిరి (నల్గొండ) : ప్రభుత్వం సాయం తీసుకుంటే ఈ సంస్థకు మరింత అభివృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. విజయలక్ష్మి, హైదరాబాద్ : రూ. వెయ్యి మేఘన(6), ప్రొద్దుటూరు (వైఎస్ఆర్ జిల్లా) : తన తండ్రిని అడిగి రూ. పదివేలు ఇస్తానని చెప్పింది. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అకౌంట్ నెం 30312010131345 సిండికేట్ బ్యాంకు, శాలిబండ శాఖ, హైదరాబాద్ ఐఎఫ్ఎస్ కోడ్: SYNB0003031 -
ఆ నవ్వులను ఆదుకుందామా!
160 మంది అమ్మాయిలు.. నెలల చిన్నారుల నుంచి టీనేజి అమ్మాయిల వరకు.. వాళ్లంతా కిలకిలా నవ్వుతుంటారు.. ఆ గాజుల గలగలలు ముచ్చటనిపిస్తాయి.. అంతా ఒకే గూటి కింద ఉంటూ.. ఆడుతూ, పాడుతూ, చదువుతూ, ఆడుకుంటూ ఉంటారు.. హైదరాబాద్: అయితే వాళ్లకు, మీ ఇంట్లో ఉండే సొంత చెల్లెళ్లు, కూతుళ్లకు తేడా ఏంటో తెలుసా? వీళ్లంతా మాజీ సెక్స్ వర్కర్ల పిల్లలు, మనుషుల అక్రమ రవాణా బాధితులు. అంగడి సరుకుల్లా డబ్బు కోసం ఎవరో ఒకరు.. కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులు కూడా అమ్మేసిన అభాగ్యులు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థకు చెందిన డాక్టర్ సునీతా కృష్ణన్ ఈ అమ్మాయిలతో పాటు మరో 15 వేల మందికి ఓ గూడు కల్పించారు. ఒక మంచి కుటుంబంలో అందే ఆప్యాయతానురాగాలను వారికి చవిచూపించారు. తమ పాత జీవితంలోని చేదు అనుభవాలను, నాటి భయానక గాధలను మర్చిపోయి.. సుఖసంతోషాలతో కూడిన సరికొత్త జీవితాన్ని అనుభవించేందుకు ఒక అవకాశం ఇచ్చారు. అయితే, ఇన్నాళ్ల బట్టి వాళ్లకు కాస్తంత నీడనిచ్చిన గూడు ఇప్పుడు లేదు. ఆ చిన్నారులను బుజ్జాయిల్లా కాపాడుతూ వస్తున్న బొమ్మరిల్లు ఇక లేదు. తిరిగి గూడు సమకూర్చుకోడానికి వాళ్లకు పెద్దంత సమయం కూడా లేదు. ఇలాంటి కష్టకాలంలో మనమంతా సహృదయంతో స్పందించాల్సిన అవసరం ఉంది. మనమధ్యే నవ్వుతూ.. తుళ్లుతూ తిరుగుతున్న ఈ అమాయకులను సంరక్షించేందుకు 'ప్రజ్వల' చేస్తున్న పోరాటానికి ఒకింత ఊతం అందించాలి. ప్రజ్వల కోసం ఒక గూడు కట్టుకోవాల్సిన సమయం వచ్చింది. అక్కడ ఉన్నవాళ్లు కూడా మన సొంత చెల్లెళ్లు, కూతుళ్లలాగే హాయిగా ఉండాలంటే.. ఇది తప్పనిసరి. ఇందుకోసం సహృదయంతో ముందుకొచ్చి ఇచ్చే తృణమైనా.. పణమైనా మహాప్రసాదమే. ప్రజ్వల గురించి తెలుసుకోవాలంటే.. డాక్టర్ సునీతా కృష్ణన్‌తో మాట్లాడాలంటే ఆదివారం.. ఆగస్టు రెండోతేదీ ఉదయం 11 గంటలకు 'సాక్షి టీవీ' చూడండి. మీ ఆపన్న హస్తాలను ఆమెకు అందించండి. విరాళాలు అందించడానికి, ఇతర వివరాలకు ప్రజ్వల వెబ్ సైట్ చూడండి. -
ప్రాంజల శుభారంభం
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్లోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం జరిగిన మొదటి రౌండ్లో ప్రాంజల 6-4, 6-0తో కొమోల ఉమరోవ (ఉజ్బెకిస్థాన్)పై గెలుపొందింది. తొలి సెట్లో ప్రాంజలకు కొంత పోటీ ఎదురైనప్పటికీ గెలుపు సాధించగా... రెండో సెట్లో అలవోకగా దూసుకువెళ్లింది. ప్రతిఘటించేందుకు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. బుధవారం రెండో రౌండ్లో ప్రాంజల బెల్జియంకు చెందిన నైనాతో తలపడనుంది. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: సియోవిపో ఆసియా ఓసియానియా ఇంటర్నేషనల్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో ఆమె 11వ సీడ్‌గా బరిలోకి దిగింది. రెండో రౌండ్ పోరులో ఆమె 3-6, 6-1, 6-3తో క్లెయిర్ యూన్కీ చోయ్ స్పాక్మన్ (హంకాంగ్)పై విజయం సాధించింది. తొలి సెట్లో చతికిలబడిన ప్రాంజల తర్వాతి సెట్లలో పుంజుకొని ఆడింది. దీంతో ప్రత్యర్థికి పరాజయం తప్పలేదు. ప్రిక్వార్టర్స్‌లో ఏపీ క్రీడాకారిణి... కొరియాకు చెందిన ఐదో సీడ్ డబిన్ కిమ్‌తో తలపడనుంది. -
రెండో రౌండ్లో ప్రాంజల
జింఖానా, న్యూస్‌లైన్: ఇంటర్నేషనల్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. కొరియాలోని చున్చియోన్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీ మొదటి రౌండ్లో ప్రాంజల 6-3, 7-6తో లిజెటీ క్యాబ్రెర (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. మొదటి సెట్లో ప్రాంజల సునాయాసంగా గెలిచినప్పటికీ, రెండో సెట్లో గట్టి పోటీ ఇచ్చిన క్యాబ్రెర 5-3 ఆధిక్యంలో నిలిచినా... ప్రాంజల 5-5తో స్కోరు సమం చేసుకుని, చివరకు టై బ్రేక్‌లో గెలిచింది. -
టైటిల్ పోరులో ప్రాంజల, స్నేహదేవి
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, రెండో సీడ్ యడ్లపల్లి ప్రాంజల తుదిపోరుకు సిద్ధమైంది. ఫైనల్లో తమిళనాడుకు చెందిన టాప్ సీడ్ స్నేహదేవి రెడ్డితో ఆమె తలపడనుంది. సికింద్రాబాద్ క్లబ్లో శుక్రవారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ఆమె 7-5, 5-7, 6-1తో ఐదో సీడ్ రియా వైద్య (సింగపూర్)పై చెమటోడ్చి నెగ్గింది. మరో సెమీస్‌లో స్నేహ 6-1, 6-1తో మూడో సీడ్ యా టింగ్ చాంగ్ (చైనీస్ తైపీ)ను ఓడించింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ గర్విత్ బాత్రాతో పదో సీడ్ హర్దీప్ సింగ్ సంధు పోటీపడతాడు. సెమీస్‌లో గర్విత్ 6-1, 6-4తో యి వే హంగ్ (చైనీస్ తైపీ)పై, హర్దీప్ 6-3, 6-4తో ఆర్యన్ గోవియస్పై గెలుపొం దారు. బాలుర డబుల్స్ టైటిల్స్ టైటిల్‌ను బాసిల్ ఖుమా-దీపక్ విశ్వకర్మ జోడి చేజిక్కిం చుకుంది. ఫైనల్లో బాసిల్-దీపక్ ద్వయం 6-4, 3-6 (10/8)తో టాప్ సీడ్ గర్విత్ బాత్రా (భారత్)-శోకి కసహర (జపాన్) జంటకు షాకిచ్చింది. బాలికల డబుల్స్ ట్రోఫీని స్నేహదేవి-ధ్రుతి తటచార్ జోడి గెలుచుకుంది. ఫైనల్లో స్నేహ-ధ్రుతి జంట 6-1, 6-0తో మూడో సీడ్ ఓజస్వినీ సింగ్-కర్మాన్ కౌర్ తాండి ద్వయంపై నెగ్గింది. -
సెమీస్‌లో ప్రాంజల
జింఖానా, న్యూస్‌లైన్: ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ప్రాంజల క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఎల్.బి స్టేడియంలోని ‘శాప్’ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల 2-6, 6-3, 6-0తో 10వ సీడ్ ఓజస్వినీ సింగ్‌పై విజయం సాధించింది. మూడో సీడ్ యా తింగ్ చాంగ్ (చైనీస్ తైపీ) 6-2, 7-5తో ఆరో సీడ్ వాసంతీ షిండేపై, ఐదో సీడ్ రియా వైద్యా 6-1, 6-1తో 16వ సీడ్ దేవన్షి జి భయామనిపై గెలుపొందారు. టాప్ సీడ్ స్నేహదేవి రెడ్డి 6-3, 6-0తో 11వ సీడ్ ప్రియాంక సుందర్‌పై అలవోకగా గెలిచింది. అండర్-18 బాలుర సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ గార్విత్ బట్రా 6-3, 6-2తో నిక్షేప్ బల్కరే రవికుమార్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నాడు. మూడో సీడ్ యై వీ హాంగ్ (చైనీస్ తైపీ) 6-4, 6-2తో చింగ్ హాంగ్ త్సాయ్ (చైనీస్ తైపీ)పై, 10వ సీడ్ హర్దీప్ సింగ్ సందూ 4-6, 6-2, 6-2తో నాల్గో సీడ్ చంగ్ ఉలూ (చైనీస్ తైపీ)పై గెలవగా, ఏడో సీడ్ ఆర్యన్ గోవీస్ 4-6, 6-2, 7-6తో 14వ సీడ్ షావ్ఫాన్ లూయి (చైనీస్ తైపీ) ైపై విజయం సాధించారు. అండర్-18 బాలుర డబుల్స్ ఫలితాలు హన యు చెన్-చింగ్ హాంగ్ త్సాయ్ (చైనీస్ తైపీ) 7-6, 7-5తో ఆదిత్య దేశ్వాల్-హర్దీప్ సింగ్ సందూపై, గార్విట్ బాట్రా-షోకి కషారా 6-4, 6-0తో సింగ్ బాజ్వా-మయూఖ్ రావత్‌పై, షావ్ ఫాన్ లూయి- యుట్సెట్సౌ (చైనీస్ తైపీ) 6-2, 6-3తో సాహిల్ ఘవారె- ఆర్యన్ గోవీస్పై, బాసిల్ ఖుమా- దీపక్ విశ్వకర్మ 7-5, 6-1తో యై వీ హాంగ్- చాంగ్ ఉలూ (చైనీస్ తైపీ)పై నెగ్గారు. అండర్-18 బాలికల డబుల్స్ ఫలితాలు స్నేహదేవి రెడ్డి- ధృతి తతచార్ 6-0, 6-3తో జీల్ దేశాయ్-స్నేహల్ మానెపై, యా టింగ్ చాంగ్-జు హుయ్ చెన్ (చైనీస్ తైపీ) 4-6, 6-4తో ఇస్కా అక్షర-వాసంతి షిండేపై, ఓజస్వినీ సింగ్-కర్మాన్ కౌర్ 6-2, 6-3తో దేవన్షి భిమ్జియాని-నందిని శర్మపై గెలుపొందారు.