సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, రెండో సీడ్ యడ్లపల్లి ప్రాంజల తుదిపోరుకు సిద్ధమైంది. ఫైనల్లో తమిళనాడుకు చెందిన టాప్ సీడ్ స్నేహదేవి రెడ్డితో ఆమె తలపడనుంది. సికింద్రాబాద్ క్లబ్‌లో శుక్రవారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ఆమె 7-5, 5-7, 6-1తో ఐదో సీడ్ రియా వైద్య (సింగపూర్)పై చెమటోడ్చి నెగ్గింది. మరో సెమీస్‌లో స్నేహ 6-1, 6-1తో మూడో సీడ్ యా టింగ్ చాంగ్ (చైనీస్ తైపీ)ను ఓడించింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ గర్విత్ బాత్రాతో పదో సీడ్ హర్‌దీప్ సింగ్ సంధు పోటీపడతాడు.
సెమీస్‌లో గర్విత్ 6-1, 6-4తో యి వే హంగ్ (చైనీస్ తైపీ)పై, హర్‌దీప్ 6-3, 6-4తో ఆర్యన్ గోవియస్‌పై గెలుపొం దారు. బాలుర డబుల్స్ టైటిల్స్ టైటిల్‌ను బాసిల్ ఖుమా-దీపక్ విశ్వకర్మ జోడి చేజిక్కిం చుకుంది. ఫైనల్లో బాసిల్-దీపక్ ద్వయం 6-4, 3-6 (10/8)తో టాప్ సీడ్ గర్విత్ బాత్రా (భారత్)-శోకి కసహర (జపాన్) జంటకు షాకిచ్చింది. బాలికల డబుల్స్ ట్రోఫీని స్నేహదేవి-ధ్రుతి తటచార్ జోడి గెలుచుకుంది. ఫైనల్లో స్నేహ-ధ్రుతి జంట 6-1, 6-0తో మూడో సీడ్ ఓజస్వినీ సింగ్-కర్మాన్ కౌర్ తాండి ద్వయంపై నెగ్గింది.
టైటిల్ పోరులో ప్రాంజల, స్నేహదేవి
Published Sat, Sep 7 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement
Advertisement