secendrabad club
-
అశ్విన్‌కు ఆరు వికెట్లు
సాక్షి, హైదరాబాద్: కీలక సమయంలో ఆరు వికెట్లు తీసిన అశ్విన్ మన్నే... ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో తిరుమల జట్టుకు చక్కని విజయాన్ని అందించాడు. దీంతో మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తిరుమల జట్టు 98 పరుగుల భారీ తేడాతో ఎస్.రేమండ్స్ టీమ్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తిరుమల జట్టు 219 పరుగులు చేసింది. పవన్ (90), సారథి (64) రాణించారు. రేమండ్స్ బౌలర్ అరుణ్ 5 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రేమండ్స్ జట్టు 121 పరుగులకే కుప్పకూలింది. అశోక్ (44), విఘ్నేశ్ (33 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడారు. అశ్విన్ దెబ్బకు మిగతా వారు విఫలమయ్యారు. మరో మ్యాచ్‌లో అషీర్ (6/30) చెలరేగడంతో అభివన్ కోల్ట్స్... 3 పరుగుల స్వల్ప తేడాతో ఎస్యూసీసీపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన అభినవ్ కోల్ట్స్ 148 పరుగులు చేసింది. ప్రణీత్ (31) ఫర్వాలేదనిపించాడు. నవీద్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత ఎస్‌యూసీసీ 145 పరుగులకు పరిమితమైంది. మన్సూర్ (40), జీషాన్ (30) శ్రమ వృథా అయ్యింది. ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు షాలిమర్: 249/7 (శాంతన్ రెడ్డి 32, పవన్ 33, కృష్ణ ప్రసాద్ 51); రిలయన్స్: 55 (అక్షయ్ 4/17, వినీత్ 3/9). పీకేసీసీ: 92 (కుమార్ 33); గౌలిపురా: 94/5 (విష్ణువర్ధన్ 30). యూత్: 127 (వెంకట్ రెడ్డి 42, శ్రీనాథ్ 3/24, జితేశ్ 3/10); ఎల్‌ఎన్‌సీసీ: 98 (ముఖీత్ అహ్మద్ 3/31). గ్రీన్‌ల్యాండ్స్: 265 (సుందర్ 34, ప్రత్యూష్ 51, కిరణ్ 61, మహేందర్ 5/75); కన్సల్ట్స్: 97 (శ్రీ చరణ్ 3/32, ప్రత్యూష్ 4/38). సదరన్ స్టార్: 244 (హర్షిత్ 73, విజయ్ 51, వరుణ్ 30, రుద్రా అత్రి 6/69); చీర్‌ఫుల్ చార్మ్స్: 79 (కృష్ణ 5/31, వినోద్ 4/48). భారతీయ: 158 (బాబు 78); డబ్ల్యూమ్సీసీ: 159/3 (సుశీల్ 83, వీవీవీఎస్ సాయిచరణ్ 38 నాటౌట్). టైమ్ సీసీ: 297 (సవన్ 33, సంజీవ్ 39, కోటి రెడ్డి 82, చందు 49, బిందు 5/66); లక్కీ ఎలెవన్: 96 (ఫణి 43, కోటి రెడ్డి 4/24). సికింద్రాబాద్ క్లబ్: 201/9 (దీపేందర్ 59, అక్షత్ 42, మోషిన్ 3/30); రుషి రాజ్: 169 (మోషిన్ 40, హసన్ 41, అక్షత్ 3/49). భరత్ సీసీ: 171/7 (వికాస్ 42, తేజోదర్ రావు 44); సత్యం కోల్ట్స్: 127 (చందు 43, సోహన్ 3/39, గణేశ్ 3/28, హర్షవర్ధన్ 3/11). మయూర్: 225 (అనంత్ 44, షరీఫ్ 3/44); యంగ్ మాస్టర్: 183 (షహజతుల్లా 36, ఇబ్రహీం 42). మహావీర్: 132 (దీపక్ 30, షకీల్ 3/35, అజ్మత్ 5/37); బాయ్స్టౌన్: 135/2 (ఖురేషి 50, దూబే 32). విజయానంద్: 131 (అవినాశ్ 34, కరీమ్ 30, భాను 3/18); ఎంఎల్ జైసింహా: 123 (నీరజ్ 55, యాది రెడ్డి 4/6). -
సీవీ ఆనంద్ సెంచరీ వృథా
జింఖానా, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ క్లబ్ జట్టు బ్యాట్స్‌మన్ సీవీ ఆనంద్ (115) సెంచరీతో కదంతొక్కినప్పటికీ ఆ జట్టుకు విజయం దక్కలేదు. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో అపెక్స్ సీసీ జట్టు చేతిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ క్లబ్ 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అపెక్స్ సీసీ బౌలర్స్ సయ్యద్ పాషా, అబ్దుల్ అజీమ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం అపెక్స్ సీసీ 5 వికె ట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. అబ్దుల్ కరీమ్ (58), సయ్యద్ తౌఫిక్ (54) అర్ధ సెంచరీలతో రాణించగా జాఫర్ అలీ 45 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచాడు. సికింద్రాబాద్ క్లబ్ బౌలర్ అనూప్ 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో ఏవీసీసీ ఆటగాళ్లు సంహిత్ రెడ్డి (118), ఈశ్వర్ (6/39) విజృంభించడంతో జట్టు 185 పరుగుల తేడాతో అక్షిత్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఏవీసీసీ 284 పరుగులు చేసింది. అక్షిత్ సీసీ బౌలర్ చంద్రశేఖర్ 5, తనూజ్ 3 వికెట్లు చేజిక్కించుకున్నారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన అక్షిత్ సీసీ.. ప్రత్యర్థ్ధి బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఠ ఎంపీ స్పోర్టింగ్: 188 (రవీష్ 54, వినీత్ శెట్టి 31; అర్జున్ 3/31, విజయ్‌కుమార్ 4/64); ఆర్కే పురం: 181 (శుభమ్ 62, విజయ్‌కుమార్ 50; వినీత్ శెట్టి 6/47) హెచ్‌పీఎస్, బేగంపేట: 320/2 (సచిన్ 56, రాజశేఖర్ రెడ్డి 112, ఆశిష్ 66 నాటౌట్, యాదవ్ 33 నాటౌట్); సటన్ సీసీ: 47 (హమ్జా 6/18, సమీ 3/25) ఠ సఫిల్‌గూడ: 130 (రవికిరణ్ 70; కౌషిక్ 3/23, మహేందర్ యదవ్ 5/47); సత్యా సీసీ: 131/8 (జోసెఫ్ 34; రవికిరణ్ 5/30) ఠ డె క్కన్ బ్లూస్: 136 (సోహైల్ 33), ఏబీ కాలనీ: 137/5 (అరవింద్ స్వామి 73; సోహైల్ 3/28). అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ వరంగల్ తొలి ఇన్నింగ్స్: 227, ఆదిలాబాద్ తొలి ఇన్నింగ్స్: 190 (లుఖ్మాన్ 33 నాటౌట్, వినోద్ 50; ఫరూఖ్ 5/44), వరంగల్ రెండో ఇన్నింగ్స్: 211/5 (సుకాంత్ 97, సాయినాథ్ 32); ఆదిలాబాద్ రెండో ఇన్నింగ్స్: 167 (రాజశేఖర్ 34; జైకృష్ణ 4/35, దీపక్ 3/29). -
టైటిల్ పోరులో ప్రాంజల, స్నేహదేవి
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, రెండో సీడ్ యడ్లపల్లి ప్రాంజల తుదిపోరుకు సిద్ధమైంది. ఫైనల్లో తమిళనాడుకు చెందిన టాప్ సీడ్ స్నేహదేవి రెడ్డితో ఆమె తలపడనుంది. సికింద్రాబాద్ క్లబ్లో శుక్రవారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో ఆమె 7-5, 5-7, 6-1తో ఐదో సీడ్ రియా వైద్య (సింగపూర్)పై చెమటోడ్చి నెగ్గింది. మరో సెమీస్‌లో స్నేహ 6-1, 6-1తో మూడో సీడ్ యా టింగ్ చాంగ్ (చైనీస్ తైపీ)ను ఓడించింది. బాలుర సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ గర్విత్ బాత్రాతో పదో సీడ్ హర్దీప్ సింగ్ సంధు పోటీపడతాడు. సెమీస్‌లో గర్విత్ 6-1, 6-4తో యి వే హంగ్ (చైనీస్ తైపీ)పై, హర్దీప్ 6-3, 6-4తో ఆర్యన్ గోవియస్పై గెలుపొం దారు. బాలుర డబుల్స్ టైటిల్స్ టైటిల్‌ను బాసిల్ ఖుమా-దీపక్ విశ్వకర్మ జోడి చేజిక్కిం చుకుంది. ఫైనల్లో బాసిల్-దీపక్ ద్వయం 6-4, 3-6 (10/8)తో టాప్ సీడ్ గర్విత్ బాత్రా (భారత్)-శోకి కసహర (జపాన్) జంటకు షాకిచ్చింది. బాలికల డబుల్స్ ట్రోఫీని స్నేహదేవి-ధ్రుతి తటచార్ జోడి గెలుచుకుంది. ఫైనల్లో స్నేహ-ధ్రుతి జంట 6-1, 6-0తో మూడో సీడ్ ఓజస్వినీ సింగ్-కర్మాన్ కౌర్ తాండి ద్వయంపై నెగ్గింది.