సీవీ ఆనంద్ సెంచరీ వృథా | CV Anand century not make win the game | Sakshi
Sakshi News home page

సీవీ ఆనంద్ సెంచరీ వృథా

Published Mon, Oct 7 2013 12:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

CV Anand century not make win the game

జింఖానా, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ క్లబ్ జట్టు బ్యాట్స్‌మన్ సీవీ ఆనంద్ (115) సెంచరీతో కదంతొక్కినప్పటికీ ఆ జట్టుకు విజయం దక్కలేదు. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో అపెక్స్ సీసీ జట్టు చేతిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ క్లబ్ 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అపెక్స్ సీసీ బౌలర్స్ సయ్యద్ పాషా, అబ్దుల్ అజీమ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు.
 
 అనంతరం అపెక్స్ సీసీ 5 వికె ట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. అబ్దుల్ కరీమ్ (58), సయ్యద్ తౌఫిక్ (54) అర్ధ సెంచరీలతో రాణించగా జాఫర్ అలీ 45 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచాడు. సికింద్రాబాద్ క్లబ్ బౌలర్ అనూప్ 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో ఏవీసీసీ ఆటగాళ్లు సంహిత్ రెడ్డి (118), ఈశ్వర్ (6/39) విజృంభించడంతో జట్టు 185 పరుగుల తేడాతో అక్షిత్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఏవీసీసీ 284 పరుగులు చేసింది. అక్షిత్ సీసీ బౌలర్ చంద్రశేఖర్ 5, తనూజ్ 3 వికెట్లు చేజిక్కించుకున్నారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన అక్షిత్ సీసీ.. ప్రత్యర్థ్ధి బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఠ ఎంపీ స్పోర్టింగ్: 188 (రవీష్ 54, వినీత్ శెట్టి 31; అర్జున్ 3/31, విజయ్‌కుమార్ 4/64); ఆర్‌కే పురం: 181 (శుభమ్ 62, విజయ్‌కుమార్ 50; వినీత్ శెట్టి 6/47)
 హెచ్‌పీఎస్, బేగంపేట: 320/2 (సచిన్ 56, రాజశేఖర్ రెడ్డి 112, ఆశిష్ 66 నాటౌట్, యాదవ్ 33 నాటౌట్); సటన్ సీసీ: 47 (హమ్జా 6/18, సమీ 3/25)
 ఠ సఫిల్‌గూడ: 130 (రవికిరణ్ 70; కౌషిక్ 3/23, మహేందర్ యదవ్ 5/47); సత్యా సీసీ: 131/8 (జోసెఫ్ 34; రవికిరణ్ 5/30)
 ఠ డె క్కన్ బ్లూస్: 136 (సోహైల్ 33), ఏబీ కాలనీ: 137/5 (అరవింద్ స్వామి 73; సోహైల్ 3/28).
 
 అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్
 వరంగల్ తొలి ఇన్నింగ్స్: 227, ఆదిలాబాద్ తొలి ఇన్నింగ్స్: 190 (లుఖ్మాన్ 33 నాటౌట్, వినోద్ 50; ఫరూఖ్ 5/44), వరంగల్ రెండో ఇన్నింగ్స్: 211/5 (సుకాంత్ 97, సాయినాథ్ 32); ఆదిలాబాద్ రెండో ఇన్నింగ్స్: 167 (రాజశేఖర్ 34; జైకృష్ణ 4/35, దీపక్ 3/29).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement