హైదరాబాద్‌కు తొలి ఓటమి | Hyderabad first Defeat in Womens One Day Leagu | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు తొలి ఓటమి

Published Thu, Dec 6 2018 10:18 AM | Last Updated on Thu, Dec 6 2018 10:24 AM

Hyderabad first Defeat in Womens One Day Leagu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌లో రెండు వరుస విజయాలు సాధించి జోరు మీదున్న హైదరాబాద్‌కు హిమాచల్‌ ప్రదేశ్‌ కళ్లెం వేసింది. కటక్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌ చేతిలో ఓడిపోయింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 49.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్న త్రిష (8) ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయింది.  హిమానీ యాదవ్‌ (2), కెప్టెన్‌ స్రవంతి నాయుడు (5) విఫలమయ్యారు. మమత కనోజియా (30), రమ్య (25), వంక పూజ (34) ఫర్వాలేదనిపించారు.

ప్రత్యర్థి బౌలర్లలో రేణుక, హర్లీన్‌ డియోల్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం హిమాచల్‌ ప్రదేశ్‌ 37.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసి గెలుపొందింది. నీనా చౌదరీ (49 నాటౌట్‌; 5 ఫోర్లు) ఆకట్టుకుంది. హైదరాబాద్‌ బౌలర్లలో హిమానీయాదవ్‌ 3 వికెట్లు పడగొట్టగా... రచన, యశశ్రీ,, త్రిష తలా ఓ వికెట్‌ తీశారు. శనివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో హైదరాబాద్‌ ఆడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement