one day league
-
హైదరాబాద్‌కు తొలి ఓటమి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో రెండు వరుస విజయాలు సాధించి జోరు మీదున్న హైదరాబాద్‌కు హిమాచల్ ప్రదేశ్ కళ్లెం వేసింది. కటక్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్ చేతిలో ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 49.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్న త్రిష (8) ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయింది. హిమానీ యాదవ్ (2), కెప్టెన్ స్రవంతి నాయుడు (5) విఫలమయ్యారు. మమత కనోజియా (30), రమ్య (25), వంక పూజ (34) ఫర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో రేణుక, హర్లీన్ డియోల్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 37.5 ఓవర్లలో 6 వికెట్లకు 152 పరుగులు చేసి గెలుపొందింది. నీనా చౌదరీ (49 నాటౌట్; 5 ఫోర్లు) ఆకట్టుకుంది. హైదరాబాద్ బౌలర్లలో హిమానీయాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... రచన, యశశ్రీ,, త్రిష తలా ఓ వికెట్ తీశారు. శనివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో హైదరాబాద్ ఆడుతుంది. -
ఆంధ్ర జట్టుకు రెండో విజయం
సాక్షి, గుంటూరు వెస్ట్: సమష్టి ప్రదర్శనతో రాణించిన ఆంధ్ర జట్టు బీసీసీఐ మహిళల వన్డే లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. విదర్భ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 17 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 45.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఎన్. అనూష (45; 7 ఫోర్లు), హిమబిందు (21; 4 ఫోర్లు), ఇ. పద్మజ (39; 3 ఫోర్లు) రాణించారు. పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన మరో ఓపెనర్ ఝాన్సీ లక్ష్మి ఈ మ్యాచ్‌లో తాను ఆడిన తొలి బంతికే ఔటయ్యింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు 43 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. బీఎస్ ఫుల్మాలి (83 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడినా ఆమెకు సరైన సహకారం లభించకపోవడంతో విదర్భకు ఓటమి తప్పలేదు. ఆంధ్ర బౌలర్లలో చంద్రలేఖ 15 పరుగులిచ్చి 3 వికెట్లు, ఝాన్సీ లక్ష్మి 43 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు. మూలపాడులో జరిగిన మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర 183 పరుగుల తేడాతో హరియాణాను ఓడించింది. టీఎస్ హసాబ్నిస్ (131 బంతుల్లో 148; 23 ఫోర్లు) సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 2 వికెట్లకు 311 పరుగులు చేసింది. ఎం.ఆర్.మాగ్రే (70; 7 ఫోర్లు)తో కలిసి హసాబ్నిస్ తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించడం విశేషం. అనంతరం మాయా సోనావానె (6/23) ధాటికి హరియాణా 33.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. సౌరాష్ట్రతో జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
సౌత్‌జోన్ చాంప్ ఆంధ్ర
సాక్షి, హైదరాబాద్: జోనల్ లీగ్ అండర్–23 మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు సత్తా చాటింది. సౌత్‌జోన్ గ్రూప్‌లో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి చాంపియన్‌గా అవతరించింది. గ్రూప్‌లో భాగంగా ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించిన ఆంధ్ర ఒక మ్యాచ్‌లో పరాజయం పాలైంది. లీగ్ దశలో ఆకట్టుకున్న ఎన్. అనూష, కె. అంజలి శర్వాణి, ఇ.పద్మజ నాకౌట్ పోరులో పాల్గొనే సౌత్‌జోన్ అండర్–23 మహిళా జట్టుకు ఎంపికయ్యారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సహాయంతో 279 పరుగులు సాధించిన అనూష టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో గురువారం గోవాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 181 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి కేరళతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ఆంధ్ర అగ్రస్థానాన్ని దక్కించుకోగా, కేరళ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు జీవీకే రంగరాజు, కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ శుక్రవారం క్రీడాకారులను అభినందించారు. -
శ్రవణ్ రావు అద్భుత సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో రాజూస్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్‌మెన్ ఎ. శ్రవణ్ రావు (149) అద్భుత సెంచరీతో చెలరేగాడు. దీంతో సత్య సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 164 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజూస్ క్లబ్ 37 ఓవర్లలో 294 పరుగులు చేసింది. శ్రవణ్ రావు త్రుటిలో 150 పరుగుల మార్క్‌ను కోల్పోయాడు. కమల్ యాదవ్ (39) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో కె. రిత్విక్ రెడ్డి 5, హర్ష 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ జట్టు 33.2 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రిత్విక్ రెడ్డి (30), గౌరీ శంకర్ (39) పోరాడారు. రాజూస్ క్లబ్ బౌలర్లలో శ్రవణ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు రోషనారా సీసీ: 341/6 (ముకేశ్ 76, సయ్యద్ జీషాన్ 53, బిజయ్ కల్యాణ్ 56 నాటౌట్), ఎల్‌ఎన్‌సీసీ: 88 (అమీర్ 3/25, కునాల్ 3/20, విను 3/29). రంగారెడ్డి జిల్లా: 87 (నదీమ్ ఖాన్ 3/10), షాలిమార్ సీసీ: 92/1 (నదీమ్ ఖాన్ 51 నాటౌట్). హైదరాబాద్ వాండరర్స్: 167 (జమీల్ 62; భరద్వాజ్ 4/40), అక్షిత్ సీసీ: 168/3 (రిత్విక్ 61 నాటౌట్, శ్రునోత్ 43). మహేశ్ సీసీ: 209 (పి. వినయ్ 43, కె. శ్రవణ్ 55 నాటౌట్; రాజశేఖర్ 7/68), కాకతీయ సీసీ: 181 (అనంత్ 54; వినయ్ 4/20). సాక్రెడ్ హార్ట్: 244 (లెస్లీ 102, జెరోమ్ 42; చైతన్య 4/50, స్వామి 3/36), ఎంపీ బ్లూస్: 247/8 (రాజు 59, యేసుదాస్ 3; లెస్లీ 5/52). ఎస్ఎన్ గ్రూప్: 127 (శ్రీనివాస్ 3/28, భరత్ 4/9), అంబర్పేట్ సీసీ: 128/6 (రిజ్వాన్ 39 నాటౌట్). అక్షిత్ సీసీ: 319 (శ్రునోత్ 79, షహాంక్ 63; సంజయ్ 3/78), యూనివర్సల్ సీసీ: 149 (యశ్వంత్ 47). -
50 ఓవర్లు... 510 పరుగులు...
ఆల్ సెయింట్స్ స్కూల్ సంచలనం సాక్షి, హైదరాబాద్: ఓ మ్యాచ్‌లో తొలుత 500 పరుగులు చేసి, ఆ తర్వాత ప్రత్యర్థిని 100 పరుగులకు ఆలౌట్ చేస్తే... ఇది చాలామంది క్రికెటర్లు కనే కల. దీనిని నిజం చేశారు హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్ స్కూల్ పిల్లలు. హెచ్‌సీఏ ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 50 ఓవర్లలో 510 పరుగులు బాదారు. ఎలెవన్ మాస్టర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌సెయింట్స్ ఆటగాళ్లు ఏకంగా 79 బౌండరీలు, 12 సిక్సర్లు బాదారు. మధు కుమార్ (145 బంతుల్లో 185; 32 ఫోర్లు, 1సిక్స్), ఆదిశ్ శశిధరన్ (73 బంతుల్లో 143; 22 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. మారుతి రెడ్డి (64 బంతుల్లో 90; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), సులేమాన్ (23 బంతుల్లో 53 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం అసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన ఎలెవన్ మాస్టర్స్ 25.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ఆల్ సెయింట్స్ బౌలర్లు అద్వైత్ 5, హితేశ్ యాదవ్ 4 వికెట్లు తీశారు. -
బ్లూస్‌ను గెలిపించిన చంద్రశేఖర్
ఎ-డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: చంద్రశేఖర్ (7/35) నిప్పులు చెరగడంతో డెక్కన్ బ్లూస్ 64 పరుగుల తేడాతో ఎస్.రేమండ్స్పై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన డెక్కన్ బ్లూస్ 236 పరుగులు చేసి ఆలౌటైంది. శేషగిరి 46, శ్రీకాంత్ 35 పరుగులు చేశారు. రేమండ్స్ బౌలర్ తేజోధర్కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఎస్.రేమండ్స్ జట్టు 172 పరుగుల వద్ద ఆలౌటైంది. వికాస్ (58) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయ్‌నగర్: 220 (కమల్ 31, నర్సింహా 30; గణేశ్ 6/63), స్పోర్టీవ్: 221/8 (రోషన్ 70, ధీరజ్ 48; సతీశ్ 4/53) యాదవ్ డెయిరీ: 242 (శ్రీనివాస్ 53, సూర్యతేజ 53; ప్రణవ్ 4/87), డెక్కన్ కోల్ట్స్: 174 (రమేశ్ 47, అర్జున్ 44; రిషబ్ 5/35) శాంతి ఎలెవన్: 146 (జగన్ 47 నాటౌట్; సుశిక్షిత్ 5/37), భరత్: 147/4 (రోహిత్ దివేశ్ 52) సెయింట్ ప్యాట్రిక్స్: 229 (నిఖిల్ 40 నాటౌట్, శ్రీమాన్ 37; నీరజ్ 5/48), ఎం.ఎల్.జయసింహా: 189 (వినయ్ 55, సాత్యకి 3/40) ఎంపీ బ్లూస్: 236 (యేసుదాస్ 77 నాటౌట్; కశ్యప్ 4/64), మాంచెస్టర్: 178 (సొహైల్ ఖాన్ 47 నాటౌట్; సతీశ్ 4/58) -
వెంక ట కృష్ణ అజేయ సెంచరీ
కాకతీయ జట్టు విజయం ఎ-డివిజన్ వన్డే లీగ్ జింఖానా, న్యూస్‌లైన్: కాకతీయ జట్టు బ్యాట్స్‌మన్ సాయి వెంకట కృష్ణ (112 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో పీకేసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పీకేసీసీ 158 పరుగుల వద్ద ఆలౌటైంది. కుమార్ (81) అర్ధ సెంచరీతో రాణించాడు. కాకతీయ బౌలర్లు రాము, చందు చెరో 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన కాకతీయ.. వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది. తుకారామ్ శతకం ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఏపీ హైకోర్టు బ్యాట్స్‌మన్ తుకారామ్ (115) సెంచరీతో విజృంభించాడు. దీంతో ఆ జట్టు ఐఐసీటీ జట్టుపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. శశిధర్ 30 పరుగులు చేశాడు. ఐఐసీటీ బౌలర్ సత్యం రెడ్డి 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఐఐసీటీ 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పరమేశ్ (109) సెంచరీతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 4 వికెట్ల తేడాతో హెచ్ఏఎల్ జట్టుపై నెగ్గింది. మొదట హెచ్ఏఎల్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గణేశ్ (45 నాటౌట్), సందీప్ (35) మెరుగ్గా ఆడారు. పోస్టల్ బౌలర్ శివప్రసాద్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. నిషాంత్ యాదవ్ (54) అర్ధ సెంచరీతో రాణించగా... వేణు గోపాల్ (30 నాటౌట్), విజయ్ కుమార్ (30) ఫర్వాలేదనిపించారు. -
తేజోధర్కు 5 వికెట్లు
జింఖానా, న్యూస్‌లైన్: భారత్ సీసీ జట్టు బౌలర్ తేజోధర్ (5/24) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భరత్ సీసీ 71 పరుగుల తేడాతో ఇంటర్నేషనల్ జట్టుపై నెగ్గింది. తొలుత భరత్ సీసీ 193 పరుగులకు ఆలౌటైంది. తేజోధర్ 41, గణేశ్ 35, వికాస్ రావు 31 పరుగులు చేశారు. ఇంటర్నేషనల్ జట్టు బౌలర్ బాలకృష్ణ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత ఇంటర్నేషనల్ జట్టు 122 పరుగులకే చేతులెత్తేసింది. అమిత్ (35) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. భరత్ సీసీ బౌలర్ యశ్వంత్ 3 వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్‌లో ఎంపీ యంగ్‌మెన్ బ్యాట్స్‌మన్ శ్రీకాంత్ (103 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 30 పరుగుల తేడాతో ఎంపీ స్పోర్టింగ్ జట్టుపై నెగ్గింది. తొలుత ఎంపీ యంగ్‌మెన్ 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. నితిన్ 39 పరుగులు చేశాడు. తర్వాత ఎంపీ స్పోర్టింగ్ 230 పరుగులు చేసి ఆలౌటైంది. చైతన్య (55), వినీత్ (56 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఎంపీ యంగ్‌మెన్ బౌలర్ అమృత్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అగర్వాల్ సీనియర్స్: 184 (ఫారుఖ్ 43, అజీమ్ 5/44); అపెక్స్ ఎలెవన్: 122 (బిపిన్ 4/12, షాకీర్ 3/25). స్పోర్టివ్ సీసీ: 212 (రోషన్ శ్యామ్యూల్ 54, గణేశ్ 35, తరుణ్ 31; విద్యాసాగర్ 5/72, యోగేష్ మెహతా 4/54); ఆజాద్ సీసీ: 214/7 (సాయి చరణ్ 62 నాటౌట్, హుజేఫా 67; మురళీ మోహన్ 5/28). సదరన్ స్టార్: 85 (నాగరాజు 3/20, నగేంద్ర కుమార్ 4/6); ఇన్కమ్ టాక్స్: 86/2 (సాయి లక్ష్మణ్ 39 నాటౌట్). హెచ్‌పీఎస్: 257/5 (విఘ్నేశ్ 35, రాజా 111 నాటౌట్, యాదవ్ 63); లాల్ బహదూర్: 253 (పరమేశ్వర్ రెడ్డి 42, పవన్ కుమార్ 60; ధీరజ్ 3/32, గౌస్ బాబా 3/48). చీర్‌ఫుల్ చమ్స్: 153 (రాజశేఖర్ 41, సందీప్ 31; ప్రేమ్ 5/38, సాయి కార్తీక్ 3/5); ఎస్ఎన్ గ్రూప్: 154/8 (ఫిరోజ్ 3/45, మధు 3/35). యునెటైడ్ సీసీ: 187 (శ్రవణ్ 70; భార్గవ్ 4/50); గగన్‌మహల్: 89 (శ్రవణ్ 5/42, విక్రమ్ 4/30). సఫిల్‌గూడ: 82 (ఆదిత్య 5/11); సెయింట్ ఆండ్రూస్: 87 (బౌమిక్ 44 నాటౌట్). ఏపీ హైకోర్ట్: 161/4 (అనిల్ 71, అభిషేక్ 70; సూర్య కుమార్ 4/41); కెనరా బ్యాంక్: 79 (కుమార్ 35 నాటౌట్; చంద్రశేఖర్ 5/20). -
మల్లికార్జున్ మెరుపు శతకం
జింఖానా, న్యూస్‌లైన్: స్టార్లెట్స్ బ్యాట్స్‌మన్ మల్లికార్జున్ (146) మెరుపు సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 244 పరుగులు భారీ తేడాతో కాంకార్డ్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్లెట్స్ 356 పరుగులకు ఆలౌటైంది. హర్ష (73) అర్ధ సెంచరీతో రాణించాడు. కాంకార్డ్ సీసీ బౌలర్ నితిన్ 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన కాంకార్డ్ సీసీ 112 పరుగులకే కుప్పకూలింది. శ్రీనివాస్ (74) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. స్టార్లెట్స్ సీసీ బౌలర్లు సాయి అనూప్ రెడ్డి, సాయి తేజ చెరో 4 వికెట్లు తీసుకున్నారు. మరో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో జితేందర్ గౌడ్ (101), సందీప్ కుమార్ (102) బౌలింగ్‌లో అరవింద్ (6/10) రాణించడంతో అంబర్పేట్ సీసీ జట్టు 278 పరుగుల భారీ తేడాతో ఎల్‌ఎన్‌సీసీ జట్టు గెలుపు దక్కించుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అంబర్పేట్ సీసీ 7 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రాజ్‌కుమార్ (78) అర్ధ సెంచరీతో రాణించగా... ముబాషీర్ (48) మెరుగ్గా ఆడాడు. ఎల్‌ఎన్‌సీసీ బౌలర్లు జితేష్ 3, అజయ్ 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎల్‌ఎన్‌సీసీ... అరవింద్ ధాటికి 79 పరుగులకే చేతులెత్తేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు... ఆర్కె పురం: 243/9 (శుభమ్ 87, విజయ్ కుమార్ 35; వినోద్ 3/53, కిరణ్ 3/61, హ ర్షిత్ 2/48); సదరన్ స్టార్స్ : 61 (అరుణ్ కుమార్ 5/26, రమేష్ 5/28). హెచ్‌జీసీ: 221 (రణధీర్ 110, సాయి చరణ్ 46; అబ్బాస్ 2/41, మహేష్ 2/54); యంగ్ మాస్టర్స్ సీసీ: 225 (సయ్యద్ అజ్మద్ 79, ఉజైర్ 53; భరత్ ముంద్ర 4/60, శ్రవణ్ నాయుడు 3/55). రుషిరాజ్ : 257 (ఎండీ ఖాజా నిజాముద్దీన్ 85, అలీమ్ 53; అద్వైత్ ఆర్యన్ 4/60); హెచ్‌యూసీసీ: 119 (పాషా 5/36, రషీద్ 5/29). -
సీవీ ఆనంద్ సెంచరీ వృథా
జింఖానా, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ క్లబ్ జట్టు బ్యాట్స్‌మన్ సీవీ ఆనంద్ (115) సెంచరీతో కదంతొక్కినప్పటికీ ఆ జట్టుకు విజయం దక్కలేదు. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో అపెక్స్ సీసీ జట్టు చేతిలో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ క్లబ్ 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అపెక్స్ సీసీ బౌలర్స్ సయ్యద్ పాషా, అబ్దుల్ అజీమ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం అపెక్స్ సీసీ 5 వికె ట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. అబ్దుల్ కరీమ్ (58), సయ్యద్ తౌఫిక్ (54) అర్ధ సెంచరీలతో రాణించగా జాఫర్ అలీ 45 పరుగులు చేసి చక్కని ఆటతీరు కనబరిచాడు. సికింద్రాబాద్ క్లబ్ బౌలర్ అనూప్ 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో ఏవీసీసీ ఆటగాళ్లు సంహిత్ రెడ్డి (118), ఈశ్వర్ (6/39) విజృంభించడంతో జట్టు 185 పరుగుల తేడాతో అక్షిత్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఏవీసీసీ 284 పరుగులు చేసింది. అక్షిత్ సీసీ బౌలర్ చంద్రశేఖర్ 5, తనూజ్ 3 వికెట్లు చేజిక్కించుకున్నారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన అక్షిత్ సీసీ.. ప్రత్యర్థ్ధి బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఠ ఎంపీ స్పోర్టింగ్: 188 (రవీష్ 54, వినీత్ శెట్టి 31; అర్జున్ 3/31, విజయ్‌కుమార్ 4/64); ఆర్కే పురం: 181 (శుభమ్ 62, విజయ్‌కుమార్ 50; వినీత్ శెట్టి 6/47) హెచ్‌పీఎస్, బేగంపేట: 320/2 (సచిన్ 56, రాజశేఖర్ రెడ్డి 112, ఆశిష్ 66 నాటౌట్, యాదవ్ 33 నాటౌట్); సటన్ సీసీ: 47 (హమ్జా 6/18, సమీ 3/25) ఠ సఫిల్‌గూడ: 130 (రవికిరణ్ 70; కౌషిక్ 3/23, మహేందర్ యదవ్ 5/47); సత్యా సీసీ: 131/8 (జోసెఫ్ 34; రవికిరణ్ 5/30) ఠ డె క్కన్ బ్లూస్: 136 (సోహైల్ 33), ఏబీ కాలనీ: 137/5 (అరవింద్ స్వామి 73; సోహైల్ 3/28). అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ వరంగల్ తొలి ఇన్నింగ్స్: 227, ఆదిలాబాద్ తొలి ఇన్నింగ్స్: 190 (లుఖ్మాన్ 33 నాటౌట్, వినోద్ 50; ఫరూఖ్ 5/44), వరంగల్ రెండో ఇన్నింగ్స్: 211/5 (సుకాంత్ 97, సాయినాథ్ 32); ఆదిలాబాద్ రెండో ఇన్నింగ్స్: 167 (రాజశేఖర్ 34; జైకృష్ణ 4/35, దీపక్ 3/29). -
చెలరేగిన విఘ్నేశ్, అభిషేక్
జింఖానా, న్యూస్‌లైన్: యాదవ్ డెయిరీ బ్యాట్స్‌మెన్ విఘ్నేశ్ (112), అభిషేక్ రెడ్డి (138 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో యాదవ్ డెయిరీ 191 పరుగుల భారీ తేడాతో న్యూ స్టార్‌పై గెలుపొందింది. తొలుత యాదవ్ డెయిరీ వికెట్ నష్టానికి 338 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూ స్టార్ జట్టును... యాదవ్ డెయిరీ బౌలర్లు రణ్వీర్ (5/50), శ్రీహరి (3/17) కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు 147 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో యూనివర్సల్ ఆరు వికెట్లతో కాంకార్డ్పై గెలుపొందింది. మొదట యూనివర్సల్ 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. సిద్ధార్థ్ (109) సెంచరీ చేశాడు. కాంకార్డ్ 80 పరుగుల వద్ద ఆలౌటైంది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్: బీడీఎల్: 178/4 (నవీన్ 59, సుమంత్ 48 నాటౌట్, శబరీష్ 36; నిఖిల్‌దీప్ 3/70); ఈఎంసీసీతో మ్యాచ్. -
రాణించిన వరుణ్, రుత్విక్
జింఖానా, న్యూస్‌లైన్: వరుణ్ గౌడ్ (109), రుత్విక్ (100 నాటౌట్) రాణించడంతో టిమ్కున్ జట్టుకు విజయం దక్కింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 179 పరుగుల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ కున్ జట్టు 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఫ్యూచర్ స్టార్ జట్టు 119 పరుగుల వద్ద కుప్పకూలింది. టీమ్ కున్ జట్టు బౌలర్ అంకిత్ సింగ్ 5 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో పాంథర్స్ ఎలెవన్ 10 వికెట్ల తేడాతో విజయ్ భారత్ జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన విజయ్ భరత్ జట్టు 152 పరుగులు చేసింది. నరసింహ (41), రాజు (33) ఫర్వాలేదనిపించారు. షాజీల్ 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టును కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాంథర్స్ జట్టు వికెట్టు కోల్పోకుండా 155 పరుగులు చేసి గెలిచింది. జీషాన్ అలీ ఖాన్ 102 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ స్కోర్లు వరంగల్ తొలి ఇన్నింగ్స్: 112, రెండో ఇన్నింగ్స్: 157 (సాయినాథ్ 37, ఫరూఖ్ 43; మజీదుద్దీన్ 6/29), నిజామాబాద్ తొలి ఇన్నింగ్స్: 253, రెండో ఇన్నింగ్స్: 17/0. కరీంనగర్: 208 (కృష్ణారెడ్డి 34, కిషోర్ 35, శశి 42), ఆదిలాబాద్: 138 (సైఫ్ అలీ 39, రాజశేఖర్ రెడ్డి 52; కృష్ణారెడ్డి 3/29, షన్వాజ్ 4/40). -
రాణించిన వరుణ్, రుత్విక్
జింఖానా, న్యూస్‌లైన్: వరుణ్ గౌడ్ (109), రుత్విక్ (100 నాటౌట్) రాణించడంతో టిమ్కున్ జట్టుకు విజయం దక్కింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 179 పరుగుల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ కున్ జట్టు 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఫ్యూచర్ స్టార్ జట్టు 119 పరుగుల వద్ద కుప్పకూలింది. టీమ్ కున్ జట్టు బౌలర్ అంకిత్ సింగ్ 5 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో పాంథర్స్ ఎలెవన్ 10 వికెట్ల తేడాతో విజయ్ భారత్ జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన విజయ్ భరత్ జట్టు 152 పరుగులు చేసింది. నరసింహ (41), రాజు (33) ఫర్వాలేదనిపించారు. షాజీల్ 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టును కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాంథర్స్ జట్టు వికెట్టు కోల్పోకుండా 155 పరుగులు చేసి గెలిచింది. జీషాన్ అలీ ఖాన్ 102 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ స్కోర్లు వరంగల్ తొలి ఇన్నింగ్స్: 112, రెండో ఇన్నింగ్స్: 157 (సాయినాథ్ 37, ఫరూఖ్ 43; మజీదుద్దీన్ 6/29), నిజామాబాద్ తొలి ఇన్నింగ్స్: 253, రెండో ఇన్నింగ్స్: 17/0. కరీంనగర్: 208 (కృష్ణారెడ్డి 34, కిషోర్ 35, శశి 42), ఆదిలాబాద్: 138 (సైఫ్ అలీ 39, రాజశేఖర్ రెడ్డి 52; కృష్ణారెడ్డి 3/29, షన్వాజ్ 4/40). -
రాణించిన అజయ్
జింఖానా, న్యూస్‌లైన్: అజయ్ దేవ్ 6 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంతో యంగ్ సిటిజన్ జట్టుకు విజయం దక్కింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కన్సల్ట్ జట్టు 36 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యంగ్ సిటిజన్ మూడు వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసి విజయం సాధించింది. కన్సల్ట్ జట్టు ఆటగాడు మహేష్ 2 వికె ట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో బాయ్స్ టౌన్ జట్టు ఆటగాడు ప్రగున్ ధూబే(134 నాటౌట్), అజ్మత్ ఖాన్ (90) చెలరేగడంతో 186 పరుగుల భారీ తేడాతో ధ్రువ్ ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. బాయ్స్ టౌన్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగగా, మూడు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ధ్రువ్ ఎలెవన్ జట్టు 98 పరుగుల వద్ద కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు విజయానంద్: 148 (విక్రాంత్ 37; సాత్విక్ 7/45), మణికుమార్: 151/3 (సిద్ధార్ధ 60, రామ్‌దేవ్ 39, రాహుల్ 33). గ్రీన్లాండ్: 228/7 (శ్రీచరణ్ 36, సుందర్ 66; కౌషిక్ 3/39), సత్య సీసీ: 136 (కౌషిక్ 50; ప్రత్యూష్ 3/41, ఆశిష్ 3/2). టీమ్ కెఎన్వి: 298 (వరుణ్ గౌడ్ 109, రుత్విక్ 100 నాటౌట్), ఫ్యూచర్ స్టార్: 119 (అశోక్ 34; అక్షిత్ 5/25) విజయ్ భరత్: 152 (నరసింహ 41; షాజీల్ 6/56), హైదరాబాద్ పాంథర్స్ ఎలెవన్: 155 (జీషాన్ అలీ ఖాన్ 102 నాటౌట్, అక్రమ్ 32 నాటౌట్).