చెలరేగిన విఘ్నేశ్, అభిషేక్ | well performance vingnesh,abhishek | Sakshi
Sakshi News home page

చెలరేగిన విఘ్నేశ్, అభిషేక్

Published Sun, Sep 15 2013 12:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

well performance vingnesh,abhishek

జింఖానా, న్యూస్‌లైన్: యాదవ్ డెయిరీ బ్యాట్స్‌మెన్ విఘ్నేశ్ (112), అభిషేక్ రెడ్డి (138 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో యాదవ్ డెయిరీ 191 పరుగుల భారీ తేడాతో న్యూ స్టార్‌పై గెలుపొందింది. తొలుత యాదవ్ డెయిరీ వికెట్ నష్టానికి 338 పరుగులు చేసింది.
 
 భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూ స్టార్ జట్టును... యాదవ్ డెయిరీ బౌలర్లు రణ్‌వీర్ (5/50), శ్రీహరి (3/17) కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు 147 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో యూనివర్సల్ ఆరు వికెట్లతో కాంకార్డ్‌పై గెలుపొందింది. మొదట యూనివర్సల్ 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. సిద్ధార్థ్ (109) సెంచరీ చేశాడు. కాంకార్డ్ 80 పరుగుల వద్ద ఆలౌటైంది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్: బీడీఎల్: 178/4 (నవీన్ 59, సుమంత్ 48 నాటౌట్, శబరీష్ 36; నిఖిల్‌దీప్ 3/70); ఈఎంసీసీతో మ్యాచ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement