కాకతీయ జట్టు విజయం
ఎ-డివిజన్ వన్డే లీగ్
జింఖానా, న్యూస్‌లైన్: కాకతీయ జట్టు బ్యాట్స్‌మన్ సాయి వెంకట కృష్ణ (112 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో పీకేసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పీకేసీసీ 158 పరుగుల వద్ద ఆలౌటైంది. కుమార్ (81) అర్ధ సెంచరీతో రాణించాడు. కాకతీయ బౌలర్లు రాము, చందు చెరో 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన కాకతీయ.. వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది.
తుకారామ్ శతకం
ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఏపీ హైకోర్టు బ్యాట్స్‌మన్ తుకారామ్ (115) సెంచరీతో విజృంభించాడు. దీంతో ఆ జట్టు ఐఐసీటీ జట్టుపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. శశిధర్ 30 పరుగులు చేశాడు. ఐఐసీటీ బౌలర్ సత్యం రెడ్డి 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఐఐసీటీ 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పరమేశ్ (109) సెంచరీతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 4 వికెట్ల తేడాతో హెచ్‌ఏఎల్ జట్టుపై నెగ్గింది. మొదట హెచ్‌ఏఎల్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గణేశ్ (45 నాటౌట్), సందీప్ (35) మెరుగ్గా ఆడారు. పోస్టల్ బౌలర్ శివప్రసాద్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. నిషాంత్ యాదవ్ (54) అర్ధ సెంచరీతో రాణించగా... వేణు గోపాల్ (30 నాటౌట్), విజయ్ కుమార్ (30) ఫర్వాలేదనిపించారు.
వెంక ట కృష్ణ అజేయ సెంచరీ
Published Sun, Mar 16 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM
Advertisement
Advertisement