venkat krishna
-
వెంక ట కృష్ణ అజేయ సెంచరీ
కాకతీయ జట్టు విజయం ఎ-డివిజన్ వన్డే లీగ్ జింఖానా, న్యూస్‌లైన్: కాకతీయ జట్టు బ్యాట్స్‌మన్ సాయి వెంకట కృష్ణ (112 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో పీకేసీసీ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పీకేసీసీ 158 పరుగుల వద్ద ఆలౌటైంది. కుమార్ (81) అర్ధ సెంచరీతో రాణించాడు. కాకతీయ బౌలర్లు రాము, చందు చెరో 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన కాకతీయ.. వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది. తుకారామ్ శతకం ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఏపీ హైకోర్టు బ్యాట్స్‌మన్ తుకారామ్ (115) సెంచరీతో విజృంభించాడు. దీంతో ఆ జట్టు ఐఐసీటీ జట్టుపై 22 పరుగుల తేడాతో గెలుపొందింది. శశిధర్ 30 పరుగులు చేశాడు. ఐఐసీటీ బౌలర్ సత్యం రెడ్డి 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన ఐఐసీటీ 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పరమేశ్ (109) సెంచరీతో చెలరేగాడు. మరో మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 4 వికెట్ల తేడాతో హెచ్ఏఎల్ జట్టుపై నెగ్గింది. మొదట హెచ్ఏఎల్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గణేశ్ (45 నాటౌట్), సందీప్ (35) మెరుగ్గా ఆడారు. పోస్టల్ బౌలర్ శివప్రసాద్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలోకి దిగిన పోస్టల్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. నిషాంత్ యాదవ్ (54) అర్ధ సెంచరీతో రాణించగా... వేణు గోపాల్ (30 నాటౌట్), విజయ్ కుమార్ (30) ఫర్వాలేదనిపించారు. -
‘పొదుపు’ మహిళలతో సంతలు ఏర్పాటు
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: స్థానిక కొవ్వూరు గ్యారేజీ ప్రాంగణంలో పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు కొవ్వూరు బాలచంద్రారెడ్డి ఆదివారం పొదుపు సంఘాల మహిళలతో ఏర్పాటు చే సిన సంతలను ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ప్రారంభించారు. మార్కెట్‌లోకంటే తక్కువ ధరకకే సంతలో నిత్యావసర సరుకులు లభిస్తాయని బాలచంద్రారెడ్డి తెలిపారు. అంతేగాక నాణ్యతగల వస్తువులను ఇక్కడ విక్రయిస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం కొవ్వూరు గ్యారేజీలో, బుధవారం ఆర్ట్స్ కాలేజి వెనుకవైపునున్న హనుమాన్‌నగర్‌లో సంతలు జరుగుతాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ మైదుకూరు ప్రాంతంతోపాటు కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సంతలు నడుస్తున్నాయని, మన ప్రాంతాల్లో ఇలాంటి సంతలు అభివృద్ధి చెందాలన్నారు. అన్ని రకాల వస్తువులు సంతల్లో లభించేలా చూడాలని సూచించారు. అనంతరం అతిధులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాల్స్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు రమేష్‌రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
అయిదు నిమిషాల్లోనే..
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: జనన, మరణ సర్టిఫికెట్ పొందాలంటే ఇక నెలల తరబడి మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి సారిగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జనన, మరణ ధ్రువీకరణ దరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తోంది. అడిగిన అయిదు నిమిషాలకే ధ్రువీకరణ పత్రం ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లో జనన, మరణ ధ్రువీకరణ పత్రం అడిగిన అయిదు నిమిషాలకే ఇచ్చే విధంగా కంప్యూటరీకరణ చేస్తున్నారు. గత మూడు నెలల నుంచి కొనసాగుతున్న కంప్యూటరీకరణతో ఇప్పటి దాకా 1 లక్షా, 30 వేల మంది వివరాలను కంప్యూటర్లో పొందుపరిచారు. 1915 నుంచి ప్రస్తుత తేదీ దాకా కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. ఇందులో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక బ్యాచ్, తిరిగి రాత్రి నుంచి ఉదయం వరకు మరో బ్యాచ్ ఆపరేటర్లు కంప్యూటరీకరణ చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులోగా కంప్యూటరీకరణ పూర్తి... డిసెంబర్ నెలాఖరులోగా కంప్యూటరీకరణ పూర్తి చేయనున్నారు. అనంతరం ఏరోజుకారోజు కంప్యూటర్లో పొందుపరిచే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ప్రజారోగ్యశాఖలో పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఇప్పటి దాకా కంప్యూటర్ ఆపరేటర్లు లక్షా 30 వేల మంది వివరాలను కంప్యూటర్లో పొందుపరచగా అందులో 10,559 మంది వివరాలు అప్‌గ్రేడ్ అయ్యాయి. అప్‌గ్రేడ్ అయిన వారికి సంబంధించి అరగంటలోపే జనన, మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో 1980 సంవత్సరంలో 2225 మంది వివరాలు, 1982లో 2028, 1984లో 803, 1986లో 1464, 1987లో 1172, 1989లో 33, 1990లో 824, 1991లో 934, 1992లో 1076 అప్‌గ్రేడ్ అయ్యాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు.