ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: స్థానిక కొవ్వూరు గ్యారేజీ ప్రాంగణంలో పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు కొవ్వూరు బాలచంద్రారెడ్డి ఆదివారం పొదుపు సంఘాల మహిళలతో ఏర్పాటు చే సిన సంతలను ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ప్రారంభించారు. మార్కెట్‌లోకంటే తక్కువ ధరకకే సంతలో నిత్యావసర సరుకులు లభిస్తాయని బాలచంద్రారెడ్డి తెలిపారు. అంతేగాక నాణ్యతగల వస్తువులను ఇక్కడ విక్రయిస్తున్నామన్నారు. ప్రతి ఆదివారం కొవ్వూరు గ్యారేజీలో, బుధవారం ఆర్ట్స్ కాలేజి వెనుకవైపునున్న హనుమాన్‌నగర్‌లో సంతలు జరుగుతాయన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ మైదుకూరు ప్రాంతంతోపాటు కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సంతలు నడుస్తున్నాయని, మన ప్రాంతాల్లో ఇలాంటి సంతలు అభివృద్ధి చెందాలన్నారు. అన్ని రకాల వస్తువులు సంతల్లో లభించేలా చూడాలని సూచించారు. అనంతరం అతిధులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు రమేష్‌రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
‘పొదుపు’ మహిళలతో సంతలు ఏర్పాటు
Published Mon, Jan 13 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement