ప్రొద్దుటూరు: ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు విచ్చల విడిగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. మండలంలోని శంకరాపురం గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నదిలో కొద్ది రోజులుగా యథేచ్చగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సుమారు రూ.2 కోట్ల 70 లక్షలతో ప్రొద్దుటూరు-చౌడూరు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పెన్నానదిలో అక్రమ తవ్వకాలు చేపట్టారు.
ఏకంగా పొక్లైయినర్‌ను నదిలోకి దింపి తవ్వకాలు సాగించి ట్రాక్టర్లతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇప్పటి వరకు వందల ట్రాక్టర్ల గ్రావెల్‌ను రోడ్డు నిర్మాణానికి తరలించారు. రాత్రిళ్లే ఈ రవాణా సాగుతోంది. ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని అక్రమ రవాణా చేస్తుండటంతో పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలు నిద్రలేని రాత్రిళ్లు గుడుపుతున్నారు. ఈ కారణంగా పెన్నానదిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ సమస్యపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట్లలోని మైన్స్ అండ్ జియాలజీ అధికారులు గురువారం దాడులు చేశారు.
గ్రావెల్ రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లతోపాటు నదిలో తవ్వకాలు సాగిస్తున్న పొక్లెయినర్ యంత్రాన్ని మైన్స్ అధికారులు సీజ్ చేశారు. అసిస్టెంట్ జియాలజిస్టు సుధాకర్, ఆర్‌ఐలు నాగరాజు, రామసుబ్రమణ్యం, వీఆర్‌ఓలు నరసింహులు, బాదుల్లా తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. తహశీల్దార్ రాంభూపాల్‌రెడ్డికి మైన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయన వీఆర్‌ఓలను పంపి ట్రాక్టర్లను ఎక్కడికక్కడే పట్టుకున్నారు. అయితే సాయంత్రానికే నామమాత్రపు జరిమానా చెల్లించి నేతలు వాహనాలను విడిపించుకు పోవడం కొసమెరుపు.
పచ్చ నేతలా.. మజాకా!
Published Fri, Jul 10 2015 3:09 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
Advertisement
Advertisement