tractors
-
సోనాలికా చిన్న కార్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల ఎగుమతుల్లో అతిపెద్ద భారతీయ సంస్థ సోనాలికా ట్రాక్టర్స్ త్వరలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ (చిన్న కార్లు) విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తొలుత యూరప్‌కు వీటిని ఎగుమతి చేయాలన్నది సంస్థ ఆలోచన. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి ఇప్పటికే ప్రోటోటైప్‌కు రూపకల్పన చేసినట్టు పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సోనాలికా వెల్లడించింది. ఒకట్రెండేళ్లలో ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ నెదర్లాండ్స్ రోడ్లపై పరుగు తీయనుందని తెలిపింది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ అభివృద్ధి, ఈవీ ప్లాంటుకై సంస్థ రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ కొత్త మోడల్ పూర్తిగా సంస్థకు చెందిన మూడవ అత్యాధునిక, నూతన ఈవీ ఫ్యాక్టరీలో తయారు కానుంది. ఈవీ క్వాడ్రిసైకిల్‌తో పాటు సోనాలికా ఇదే ప్లాంటులో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను కూడా ఉత్పత్తి చేయనుంది. మూడవ ప్లాంటు ఉత్తరాదిన కొలువుదీరనుంది. నడపడం సులభం.. యూరప్‌లో ఆదరణ లభిస్తున్నందున ఎలక్ట్రిక్ మైక్రోకార్ల విభాగంలోకి ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని సోనాలికా గ్రూప్ అభిప్రాయపడింది. ‘ఇవి సంప్రదాయ కార్ల కంటే చాలా చిన్నవి. తేలికైనవి కూడా. రద్దీగా ఉండే వీధుల్లో పార్క్ చేయడం, నడపడం సులభం’ అని కంపెనీ వివరించింది. మైక్రోకార్లు వాటి చిన్న సైజు, పార్కింగ్ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి యూరోపియన్ దేశానికి అవసరమయ్యేవి అని అభిప్రాయపడింది. భారత్ మాదిరిగా కాకుండా పాశ్చాత్య దేశాలలో ప్రవేశ స్థాయి/చిన్న కార్ల ధరలను నిర్ణయించడం సవాలు కాదని తెలిపింది. కాగా, ట్రాక్టర్ల ఎగుమతుల పరంగా 34.3 శాతం వాటాతో సోనాలికా భారత్‌లో అగ్రస్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్లో కంపెనీకి 13.5 శాతం వాటా ఉంది. -
ట్రాక్టర్లన్నీ బందర్ రోడ్డులో ఆపేసి వరదల్లో బాబు బిల్డప్..
-
కష్టజీవులపై కర్కశం
కనిగిరి రూరల్: వేకువజామున 4 గంటల సమయం.. కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులపైకి జేసీబీలు, ట్రాక్టర్లు దూసుకొచ్చాయి. వాటి వెనుకే మునిసిపల్, రెవెన్యూ అధికారులు, సచివాయల సిబ్బంది మందీమార్బలంతో చేరుకున్నారు. ఏకంగా 80 మంది పోలీసులను వెంటబెట్టుకొచ్చారు. రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు, బడ్డీలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో కనిగిరి మునిసిపల్ కమిషనర్ టీవీ రంగారావు కనీస నిబంధనలు పాటించకుండా.. కష్టజీవులపై కర్కశంగా వ్యవహరించారు. తొలుత చెప్పుల బజార్, పామూరు బస్టాండ్ వైపు బడ్డీలను పెకిలించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన చిరు వ్యాపారులను పోలీస్‌లు, మునిసిపల్ సిబ్బందితో అడ్డుకున్నారు. కనీసం తమ బడ్డీల్లో ఉన్న సామగ్రి తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరినా అంగీకరించకుండా జేసీబీలతో నుజ్జునుజ్జు చేశారు. పిండి వంటలు, చెప్పుల దుకాణాలు, సెల్ పాయింట్లు, వాచీ షాపులు, గాజుల షాపులు ఇలా అనేక దుకాణాల్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక వీధి వ్యాపారులు లబోదిబోమన్నారు. మొత్తం మీద చిరు వ్యాపారులకు రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.పోలీస్ పహారాతో దమనకాండ వాస్తవానికి చెప్పుల బజార్‌లోని కొన్ని దుకాణాలు, చర్చి సెంటర్లోని బడ్డీలు తొలగించనున్నట్టు కొంతకాలంగా చర్చ నడుస్తోంది. కానీ.. బుధవారం ఒక్కసారిగా పట్టణంలోని పామూరు రోడ్డు, కందుకూరు రోడ్డు, ఒంగోలు బస్టాండ్ రోడ్డులోని దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. 50 మంది స్పెషల్ పోలీసులు, 20 మంది పోలీస్ సిబ్బంది, నలుగురు ఎస్సైలు, సీఐలు ఈ దమనకాండలో పాల్గొన్నారు. కమిషనర్ టీవీ రంగారావు, ఆర్డీఓ పి.జాన్ ఇర్విన్, సీఐలు, ఎస్సైలు బడ్డీల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యాపారుల శాపనార్థాలుబడ్డీల తొలగింపు సందర్భంగా కమిషనర్ రంగారావు వ్యవహరించిన తీరుపై చిరు వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. నోటికాడి కూడును నేలపాలు చేసి, తమ జీవితాలను రోడ్డున పడేసిన వారంతా దుమ్ము కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే అధికారులు దమనకాండకు పాల్పడ్డారని ప్రజా సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. చిరు వ్యాపారుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు. -
వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాల్లో భారీ వృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. 2021–22తో పోల్చి చూస్తే 2022–23లో వ్యవసాయ ట్రాక్టర్ల అమ్మకాల్లో ఏకంగా 82.14 శాతం వృద్ధి నమోదయ్యింది. 2021–22లో 19,259 వ్యవసాయ ట్రాక్టర్లను రైతులు కొనుగోలు చేయగా.. 2022–23లో ఏకంగా 35,079 వ్యవసాయ ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడంతో పాటు రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గించడం ద్వారా ఎక్కువ ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీ రూపంలో రూ.1,052 కోట్లు వెచి్చంచి రైతులకు లబ్ధి చేకూర్చింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయని రవాణా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను ప్రభుత్వమే సబ్సిడీపై అందిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూస్తోంది. -
Fact Check: ‘యాంత్రిక’ రాతలు పనిచేయవు రామోజీ..
సాక్షి, అమరావతి: పచ్చ కామెర్లు అలుముకున్న పచ్చ పత్రికలు చంద్రబాబు జమానాలో జరిగినట్లుగా ఇప్పుడూ అవినీతి జరుగుతోందన్న భ్రమల్లోనే ఉంటాయి. బాబు జమానాలో పచ్చ పార్టీ నేతలకు యంత్రపరికరాలను కట్టబెట్టడమే కాదు.. సబ్సిడీ మొత్తాన్ని వారికి చెందిన వారికే పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. అదే రీతిలో ఇప్పుడు కూడా జరుగుతోందన్న భ్రమల్లో కళ్లుమూసుకొని కథనాలు అల్లేస్తున్నారు రామోజీ. క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలించకుండా అబద్ధాలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయ యాంత్రీకరణ అంటే పచ్చపార్టీ నేతలకు పండగలా ఉండేది. కమీషన్ల కోసం ట్రాక్టర్లు (రైతురథాలు), యంత్రాలను వారి తాబేదార్లకు కట్టబెట్టారు. 2014–2019 వరకు ఇష్టమైన వారితో 3,584 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు(సీహెచ్‌సీ) ఏర్పాటు చేశారు. వీటిలో రైతులన్న వారు చాలా తక్కువ. వీటిద్వారా రూ.239.16 కోట్ల సబ్సిడీతో కూడిన ట్రాక్టర్లు పంపిణీ చేశారు. అయితే, ఏ కంపెనీవి కొనాలో, ఏ డీలర్ దగ్గర కొనాలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా స్థానిక టీడీపీ నాయకులే నిర్దేశించేవారు. తద్వారా కంపెనీలు, డీలర్ల నుంచి కమీషన్లు పొందే వారు. వాటికి రుణాల కోసం రైతులే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. రాయితీ సొమ్మును కంపెనీ డీలర్ల ఖాతాకు జమ చేసేవారు. చాలాచోట్ల ట్రాక్టర్లు రైతులకు ఇవ్వకుండానే సబ్సిడీ సొమ్ము స్వాహా చేసినట్టుగా అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అక్రమాలకు చెక్ పెట్టారు. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే అందించి, వారికి ఎక్కువ లాభాలు వచ్చేలా చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని ప్రవేశపెట్టారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసిన రైతు కమిటీల (సీహెచ్‌సీ)కు వారు కోరుకున్న యంత్ర పరికరాలను అందిస్తున్నారు. తక్కువ అద్దెకే రైతులకు వీటిని అందిస్తున్నారు. అద్దె వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈనాడు మాత్రం వాస్తవాలకు పాతరేస్తూ ‘వైకాపా నేతలకే యంత్ర సేవ’ అంటూ అబద్ధాలను అచ్చేసింది. జిల్లాల్లో యంత్ర పరికరాలు అమ్ముకున్నారని, వైఎస్సార్సీపీ నేతల బంధువుల ఇళ్లల్లో ఉన్నాయని, ఇసుక, మట్టి తవ్వకాలకు ఉపయోగిస్తున్నారని, పాత పరికరాలకు రంగులేసి సొమ్ము చేసుకున్నారంటూ ఇష్టానుసారం ఆరోపణలు చేసింది. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: పారదర్శకతకు పాతరేశారు వాస్తవం: గ్రామాల్లో సాగయ్యే పంటలకు కావలసిన, స్థానికంగా డిమాండ్ కలిగిన పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని రైతు కమిటీలకే అప్పగించారు. నిర్ణయాధికారం వాటికే ఇచ్చారు. అంతేకాదు.. వాటిని వారికి నచ్చిన కంపెనీల నుంచి కొనుక్కొనే అవకాశం కల్పించారు. పైగా సబ్సిడీ మొత్తం గతంలో మాదిరిగా కంపెనీల ఖాతాలకు కాకుండా నేరుగా రైతు కమిటీల ఖాతాలకు జమ చేశారు. ఇందులో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేశారు. ఆరోపణ: ఆర్బీకేల్లో కానరాని అద్దెల బోర్డులు వాస్తవం: ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఇచ్చే పరికరాల రెంట్లకంటే తక్కువ అద్దెలుండేలా ప్రతి వ్యవసాయ సీజన్‌కు ముందు వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో అద్దెలను నిర్ణయించి, ఆ వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఇలా 3 ఏళ్లలో అక్షరాలా 3.3 లక్షల మంది రైతులు ఈ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లను అద్దెకు తీసుకున్నారు. 8.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పనులకు ఉపయోగించుకున్నారు. ఆరోపణ: నాయకులు. వారి అనుచరుల పేర్లతోనే సంఘాలు వాస్తవం: వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ఆర్బీకే పరిధిలోని గ్రామంలో భూమి కలిగి వ్యవసాయం చేస్తున్న ఐదారుగురు రైతులతో కమిటీ (సీహెచ్‌సీ)లను ఏర్పాటు చేశారు. పార్టీ, కులం, వ్యక్తిగత వివరాలతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయ ప్రమేయం, సిఫార్సులకు తావులేకుండా అర్హులైన రైతులతో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా 10,444 గ్రామాల్లో ఆర్బీకే స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో ఏర్పాటైన 492 రైతు కమిటీలకు రూ.1052.42 కోట్ల విలువైన యంత్ర పరికరాలు, ట్రాక్టర్లను అందించారు. వీటి కోసం రూ.366.25 కోట్లు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం భరించింది. యంత్ర సేవా కేంద్రాల్లో 6,362 ట్రాక్టర్లు, 492 హార్వెస్టర్లు, 31,356 ఇతర యంత్రపరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరోపణ: ఆన్లైన్లో కానరాని సేవలు వాస్తవం: రైతులు గ్రామంలోనే కాకుండా, మండలంలోని ఏ ఆర్బీకే పరిధిలోఉన్న యంత్ర సేవా కేంద్రం నుంచైనా యంత్రాలను తక్కువ అద్దెకు పొందవచ్చు. ఈ రేట్లను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వీటికోసం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ను తీసుకొచ్చారు. అగ్రీనెట్ వెబ్సైట్లో వైఎస్సార్ యాప్‌లో పొందుపరిచిన లింక్ ద్వారా రైతులు వారికి కావలిసిన పరికరాలు, యంత్రాలను 15 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ విధానం తెలియని వారు ఆర్బీకేలోని వీఏఏ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆరోపణ: ఈ యంత్ర పరికరాలతో మట్టి, ఇసుక తవ్వకాలు వాస్తవం: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలంలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 647 మంది రైతులు యంత్ర సేవలు పొందారు. అద్దెకు తీసుకున్న యంత్ర పరికరాలను 2,008 ఎకరాల్లో వ్యవసాయ పనుల కోసం ఉపయోగించుకున్నారు. అద్దె రూపంలో కమిటీలకు రూ.9.45 లక్షల ఆదాయం వచ్చింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో 21 ఆర్బీకేల్లో ఏర్పాటైన కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 385 రైతులు యంత్ర సేవలు పొందారు. అద్దెకు తీసుకున్న యంత్రాలతో 1,793 ఎకరాల్లో వ్యవసాయ పనులు చేశారు. రైతు కమిటీలకు బాడుగ రూపంలో రూ.5.47 లక్షల ఆదాయం వచ్చింది. నంద్యాల మండలంలో 19 యంత్ర సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,106 మంది రైతులు 2,905 ఎకరాలలో అద్దెకు యంత్ర సేవలు పొందారు. ఈ కేంద్రాలు రూ.13.72 లక్షలు బాడుగ సొమ్ము పొందాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరి కోత యంత్రంతో కూడా యంత్ర సేవ కేంద్రాలను రైతు కమిటీలకే ఇచ్చారు. జిల్లాల్లో రైతులు గ్రామం, మండలం పరిధిలోని యంత్ర సేవా యాప్ ద్వారా పరికరాలను వినియోగించుకుంటున్నారు. ఇవి వాస్తవాలు. వీటిని పట్టించుకోకుండా యాంత్రికంగా అసత్యాలతో రాసే రాతలను ప్రజలు తిరస్కరిస్తారు రామోజీ. ఆరోపణ: రాయితీ సొమ్ము పక్కదారి వాస్తవం: ఎంపిక చేసిన రైతు కమిటీలకు ఆప్కాబ్, డీసీసీబీలతో పాటు హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐవోబీ తదితర బ్యాంకుల ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా యూనిట్ మొత్తంలో 50 శాతం రుణం రూపంలో అందించారు. పైగా తీసుకున్న రుణాలను రైతు కమిటీలు సకాలంలో చెల్లించేలా వైఎస్సార్ యంత్ర సేవా యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆరోపణ: ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు అమ్మేసుకుంటున్నారు వాస్తవం: యంత్ర సేవా కేంద్రాలకు సరఫరా చేసిన యంత్రాలను వ్యవసాయ శాఖ, బ్యాంకులు సంయుక్తంగా తనిఖీ చేసిన తరువాతే ఆ కమిటీలకు రాయితీ సొమ్ము విడుదల చేశారు. పైగా తీసుకున్న రుణాలను 3 నుంచి 5 ఏళ్లలో చెల్లిస్తేనే ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లుపై హక్కులు వస్తాయి. అప్పటివరకు అవి బ్యాంకుల తనఖాలో ఉంటాయి. అలాంటప్పుడు వాటిని అమ్ముకునే అవకాశం ఎక్కడ ఉంటుందో రామోజీకే తెలియాలి. -
రైతు బిడ్డగా ఓ వరుడి ఆలోచన..మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్లతో..
ఓ వరుడి వినూత్న ఆలోచన అందర్నీ ఆలోచింపచేసేలా చేసింది. తమ వివాహాన్ని వెరైటీగా లగ్జరీగా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. ఐతే దానికో విలువ, అర్థం వచ్చేలా జరుపుకునేవారు కొందరే. ఇక్కడ ఓ వరుడు తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టగుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకోసం ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున్న ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు. ఈ ఘటన రాజస్తాన్ బార్మర్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే..గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో వివాహం నిశ్చయం అయ్యింది. వధువు ఇల్లు వరుడి ఇంటికి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో వరడు వధువు గ్రామానికి అంతే సంఖ్యలో 51 ట్రాక్టర్లతో పెద్ద ఊరేగింపుగా వెళ్లి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. వారంతా అలా రావడం చూసి వధువు తరుపు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు వరుడు ప్రకాశ్ మాట్లాడుతూ..నా కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయం. అందరూ వ్యవసాయమే చేస్తారు. అలాగే ట్రాక్టర్‌ను రైతుకు గుర్తింపుగా భావిస్తారు. మా నాన్న పెళ్లి ఊరేగింపుకి ఒక ట్రాక్టర్ ఉపయోగించారు. నేనెందుకు 51 ట్రాక్టర్లు ఉపయోగించకూడదు అని అనుకుని ఇలా చేసినట్లు వివరించాడు వరుడు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తండ్రి జేతారామ్ మాట్లాడుతూ..ట్రాక్టర్‌ను భూమి కొడుకుగా పరగణిస్తాం. మా నాన్న, తాతయ్యల ఊరేగింపు ఒంటెలపై సాగింది. అదీగాక మా కుటుంబంలో ఇప్పటికే 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉన్నాయి. నా రైతు మిత్రులతో కలిసి ఇన్ని ట్రాక్టర్లను ఏర్పాటు చేశాం. ట్రాక్టర్లతోనే వ్యవసాయం చేస్తున్నప్పుడూ వాటిపై ఎందుకు ఊరేగింపు చేయకూడదన్న ఆలోచనతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు జేతారామ్. #WATCH | Rajasthan: A bridegroom arrived with 51 tractors as part of his wedding procession, from Sewniyala to Borwa village in Barmer district. The 1-km long wedding procession had around 150 guests and was led by the bridegroom who himself was driving a tractor. (08.06.2022) pic.twitter.com/euK16AO9LQ — ANI (@ANI) June 9, 2022 (చదవండి: దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? ఒక సారి మీ సబ్బు సంగతి తేల్చండి) -
రైతులకు ఏమి కావాలో వారినే అడిగి అందజేస్తాం: సీఎం జగన్
సాక్షి, చుట్టుగుంట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. దీనిలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం సీఎం జగన్ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రైతన్నకు అండగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం ఉంది. ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నాం. ప్రతీ ఆర్బీకేలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందించాం. ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయి. రైతు గ్రూపులకు కొత్తగా రూ. 361.29కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను అందించాం. ప్రతీ ఆర్బీకే సెంటర్లో యంత్రాలకు రూ.15లక్షలు కేటాయించాం. ప్రతీ ఆర్బీకే సెంటర్లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, ఏమి అవసరమో వారినే అడిగి అందజేస్తాం. అందులో భాగంగానే వైఎస్సార్ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తాం. రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: వైఎస్సార్ బీమా నమోదు ప్రారంభం -
నేడు మెగా యంత్ర సేవా మేగా మేళా
-
వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ
Mallika Srinivasan Success Story: ప్రపంచం అభివృద్ధి పైపు పరుగులు పెడుతున్న సమయంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ మేము సైతం అంటున్నారు. పని ఏదైనా మనసు పెట్టి చేస్తే తప్పక విజయం సాధిస్తావన్నది లోకోక్తి. అలాంటి కోవకు చెందిన 'ట్రాక్టర్ క్వీన్' గా పిలువబడే 'మల్లిక శ్రీనివాసన్' (Mallika Srinivasa) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న కొంత మంది మహిళల్లో మల్లిక శ్రీనివాసన్ ఒకరు. 1959 నవంబర్ 19న జన్మించిన మల్లికకు చిన్నప్పటి నుంచి బిజినెస్ స్టడీస్‌పై ఉన్న ఆసక్తి కారణంగా మద్రాస్ యూనివర్సిటీలో ఎమ్ఏ పూర్తి చేసి, ఆ తరువాత ఉన్నత చదువులు కోసం విదేశాలకు పయనమైంది. వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. చదువు పూర్తయిన తరువాత 1986లో, చెన్నైని 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా'గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన దివంగత ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ అనంతరామకృష్ణన్ స్థాపించిన కుటుంబ వ్యాపారంలో మల్లిక జనరల్ మేనేజర్‌గా చేరింది. రోజు రోజుకి TAFE కంపెనీని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడానికి మల్లిక చాలా కృషి చేసింది. అతి తక్కువ కాలంలోనే కంపెనీ మంచి లాభాలను ఆర్జించగలిగింది. TAFE (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్) కంపెనీ ఆదాయం & అమ్మకాల పరిమాణంలో మహీంద్రా ట్రాక్టర్ల తర్వాత భారతదేశపు రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీ. మల్లిక నాయకత్వంలో, టాఫె సంస్థ 2022లో ఫ్రెంచ్ సంస్థ ఫౌరేసియా (Faurecia) ఇండియా వ్యాపారాన్ని రూ. 400 కోట్ల డీల్‌తో, 2018లో IMT వంటి కంపెనీలను కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) మల్లికా శ్రీనివాసన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) చెన్నై, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) హైదరాబాద్, AGCO, టాటా స్టీల్ అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ వంటి పెద్ద సంస్థలలో ఉన్నారు. ఆమె ఇటీవల బిలియన్ డాలర్ల స్టార్టప్ స్విగ్గీ బోర్డులో కూడా అడుగుపెట్టడం గమనార్హం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల కంటే ఎక్కువ ఆస్తులున్న మహిళ గురించి తెలుసా?) మల్లిక శ్రీనివాసన్ ఒక వైపు కంపెనీ విషయాలను చూసుకుంటూనే.. తిరునెల్వేలిలోని అనేక ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాలకు కూడా మద్దతు ఇస్తున్నారు. అంతే కాకుండా ఆమె ఇందిరా శివశైలం ఎండోమెంట్ ఫండ్ ద్వారా చెన్నై శంకర నేత్రాలయలోని క్యాన్సర్ ఆసుపత్రికి మద్దతు ఇస్తుంది. కర్ణాటక సంగీతం సంగీత సంప్రదాయాన్ని కూడా ప్రోత్సహించడంలో తన వంతు కృషి చేస్తోంది. ట్రాక్టర్ ఇండస్ట్రీ పురుషుల ఆధిపత్యంలోనే ఉంటుందని భావిస్తారు. అలాంటి భావనకు చరమగీతం పాడి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా, భారతదేశంలో రెండవ అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా తీర్చిదిద్ది 'ట్రాక్టర్ క్వీన్' పేరు పొందింది. మల్లిక శ్రీనివాసన్ మొత్తం ఆస్తుల విలువ రూ. 200 కోట్లకంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈమె భర్త టీవీఎస్ మోటార్స్ సీఎండీ వేణు శ్రీనివాసన్. పారిశ్రామిక రంగంలో ఈమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సోలిస్ ట్రాక్టర్స్ చేతికి జర్మనీ కంపెనీ థాలర్
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ గ్రూప్ అనుబంధ సంస్థ సోలిస్ ట్రాక్టర్స్ అగ్రికల్చరల్ మిషనరీ జర్మనీకు చెందిన థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ ని కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక విలీనంతో సోలిస్ ట్రాక్టర్స్ యూరప్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. అలాగే 19–75 హెచ్‌పీ శ్రేణికి చెందిన నాణ్యమైన జేసీబీలను తన పోర్ట్ ఫోలియోలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.200 కోట్ల ముందస్తు పెట్టుబడులతో ఈ డీల్‌ను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ఎండీ దీపక్ మిట్టల్ తెలిపారు. జర్మనీలోనీ థాలర్ ఫ్యాక్టరీ కార్యాలయంలో జరిగిన టేకోవర్ కార్యక్రమంలో ఐటీఎల్ గ్రూప్ ఎండీ దీపక్ మిట్టల్, థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ కంపెనీ అధినేత మ్యాన్‌ఫ్రెడ్ థాలర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
KISAN Agri Show: న్యూ హాలండ్ రెండు కొత్త ట్రాక్టర్లు
హైదరాబాద్: న్యూ హాలండ్ అగ్రికల్చర్ (సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్) రెండు నూతన ట్రాక్టర్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన కిసాన్ అగ్రి షోలో భాగంగా ‘బ్లూ సిరీస్ సింబా 30’, ‘5620 పవర్ కింగ్’ పేరుతో వీటిని ఆవిష్కరించింది. ఈ వ్యవసాయ సదస్సులో ఆరు ట్రాక్టర్లు, మూడు సాగు ఎకిŠవ్ప్మెంట్లను ప్రదర్శించింది. ఇందులో సింబా 30 అనేది స్ప్రేయింగ్, రోటావేషన్, కల్టివేషన్, అంతర్గత కల్టివేషన్ పనులకు అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. అధిక పవర్‌తో, ఇంధనం ఆధా సామర్థ్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఇక 5620 పవర్ కింగ్ అనేది రవాణాకు, సాగుకు సంబంధించి పనులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. -
సోనాలిక ట్రాక్టర్స్ బంపర్ సేల్స్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో మొత్తం లక్ష ట్రాకర్లను అమ్మినట్లు సోనాలిక ట్రాక్టర్స్ ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలంలో జరిగిన విక్రయాలతో పోలిస్తే 11.2 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపింది. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) కాగా, ఇదే కాలంలో పరిశ్రమ కేవలం 8.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2017-18 నుంచి ప్రతీ ఏడాది ఒక లక్ష పైగా ట్రాక్టర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ అత్యంత వేగంగా లక్ష ట్రాక్టర్ల అమ్మకాలను 8 నెలల్లోనే నమోదు చేయడం పట్ల కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్) -
రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్లు 3.52 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.963.26 కోట్లు ఖర్చు చేసింది. దీంతో వివిధ రకాల వ్యవసాయ యంత్రాల సంఖ్య పెరిగింది. 2014–15లో తెలంగాణలో వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 94,537 ఉండగా, ప్రస్తుతం 3.52 లక్షలకు పెరిగాయి. 2014–15లో 6,318 వరి కోత యంత్రాలు ఉండగా, అవి ప్రస్తుతం 19,309కు చేరా యని వ్యవసాయశాఖ వెల్లడించింది. వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధిపై ఒక నివేదికను విడుదల చేసింది. 2014–15లో గోదాముల సామర్థ్యం 39 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 68.28 లక్షలకు పెరిగింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషితో 2014 నాటికి సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలుంటే, అదిప్పుడు 2.03 కోట్ల ఎకరాలకు పెరిగింది. అలాగే 11.50 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2014–15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉంటే, 2021–22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది. అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50 కోట్ల టన్నులకు చేరుకుంది. 2014–15లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉండగా, 2020–21 నాటికి 60.53 లక్షల ఎకరాలకు చేరుకుంది. 2014–15లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, ఇప్పుడు 60.44 లక్షల బేళ్లకు చేరుకుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,07,748 కోట్ల విలువైన 6.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. పంటలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రూ. 36,703 కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు 9 విడతల్లో రూ. 57,881 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రైతుబీమా కింద ఇప్పటివరకు 88,963 మంది రైతు కుటుంబాలకు5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం 2014–15లో రూ.1,12,162 ఉండగా, 2021–22 నాటికి రూ.2,78,833లకు పెరిగింది. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి కూడా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేసిందని ఆ శాఖ పేర్కొంది. -
సోనాలిక ట్రాక్టర్ అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో సోనాలిక ట్రాక్టర్స్ అక్టోబర్‌లో 20,000 ట్రాక్టర్లను విక్రయించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసిన 7అమ్మకాల వృద్ధిని అధిగమించి ఏకంగా 16 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఒక నెలలో తమకు ఇవే అత్యధిక అమ్మకాలని కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ తెలిపారు. తమ ట్రాక్టర్ల తయారీలో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నందున రైతుల నుంచి తమ బ్రాండ్‌కు విశేషమైన ఆదరణ లభిస్తుందని రమణ్ అన్నారు. -
మోంట్రా ఈ-త్రీ వీలర్స్ వచ్చేశాయ్.. ధర ఎంతంటే?
హైదరాబాద్: ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా అనుబంధ కంపెనీ టీఐ క్లీన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మోంట్రా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. సబ్సిడీ అనంతరం ధర రూ.3.02 లక్షలు. 10 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందు పరిచారు. మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా (టిఐఐ) అనుబంధ సంస్థ ఐ క్లీన్ మొబిలిటీ (టిసిఎమ్) మంగళవారం చెన్నైలో మోంట్రా ఎలక్ట్రిక్ 3డబ్ల్యు ఆటోను ప్రారంభించడంతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం ఒకసారి చార్జ్ చేస్తే వాహనం 197 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈవీ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అనేది అతిపెద్ద వృద్ధి సామర్థ్యం కలిగిన ఒకటని ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ మురుగప్పన్ తెలిపారు. మెంట్రా ఎలక్ట్రిక్ బ్రాండ్‌తో ఇ-త్రీ-వీలర్ ఉత్పత్తులను, సెలెస్టియల్ ఎగాట్ బ్రాండ్‌లో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను, రైనో 5536 ద్వారా ఎలక్ట్రిక్ భారీ వాణిజ్య వాహనాలను పరిచయం చేయనుంది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూకుడుగా ఉంది. చెన్నై సమీపంలోని అంబత్తూరు ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 100కుపైగా డీలర్షిప్ కేంద్రాల ద్వారా ఈ త్రిచక్ర వాహనాలను విక్రయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈవీ విభాగంలో కనీసం నాలుగు ప్లాట్‌ఫారమ్స్ కోసం సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బెంగళూరులో వరద విలయం.. ట్రాక్టర్లలో ఆఫీసులకు ఐటీ ఉద్యోగులు
బెంగళూరు: ఐటీ నగరి బెంగళూరును వరద కష్టాలు వదలడం లేదు. ఆదివారం రాత్రి నుంచి కురిసిన కుండపోతకే నగరం అల్లాడిపోగా మంగళవారం కూడా భారీ వర్షం కురవడంతో పరిస్థితి పులిమీద పుట్రలా మారింది. గత 42 సంవత్సరాల్లో ఎన్నడూ చూడనంతటి వర్షం కురవడంతో నగరంలో 164 చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. ద్విచక్ర వాహనాలు, ఖరీదైన కార్లు వర్షార్పణం కావడంతో చివరికి రవాణాకు ట్రాక్టర్లు దిక్కయ్యాయి! ఎక్కడ చూసినా జనాన్ని తరలిస్తున్న ట్రాక్టర్లే దర్శనమిచ్చాయి. ఐటీ ఉద్యోగులు కూడా ట్రాక్టర్లలో ఆఫీసులకు వెళ్లారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అన్అకాడమీ వ్యవస్థాపకుడు గౌరవ్ ముంజల్ జలమయమైన తన నివాసం నుంచి ట్రాక్టర్లోనే కుటుంబీకులతో సహా సురక్షిత ప్రాంతానికి వెళ్లారు! స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని త్వరలో చక్కదిద్దుతామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే బెంగళూరులో ఇలాంటి సమస్యలని విమర్శించారు. బెల్లందూర్‌లో చేతికందిన సామాన్లతో వరద నీటి గుండా వెళ్తున్న జనం సోషల్ మీడియాలో జోకులు, విమర్శలు కుండపోత వర్షంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ‘బెంగళూరు వెనిస్లా మారింది’, ‘నగరమే వాటర్ పార్క్‌గా మారినప్పుడు ఇక వండర్లా అవసరమా?’, ‘ఖరీదైన కార్లు నీళ్లలో ఈదులాడుతుంటే రవాణాకు ట్రాక్టర్లే దిక్కయ్యాయి’ అంటూ పోస్టులు పెట్టారు. ముడుపుల పాలన అంటూ ఆగ్రహించారు. బెల్లందూర్‌లో జలమయమైన ఇంటెల్ ముఖద్వారం VIP treatment pic.twitter.com/OENbNLybtn — DID intern ⚛️ (@bhushan_vikram) September 5, 2022 -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. 12 ట్రాక్టర్లతో బీభత్సం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను ట్రాక్టర్లతో బద్దలుకొట్టింది. 12 మంది ట్రాక్టర్ డ్రవైర్లు టోల్ రుసుం చెల్లించకుండానే మెరుపువేగంతో దూసుకెళ్లారు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా ట్రాక్టర్లను వేగంగా నడుపుతూ ముందుకెళ్లారు. ఆగ్రాలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. #WATCH | Uttar Pradesh: At least 12 sand-laden tractors, belonging to the sand mafia, break toll barricading and speed past, in Saiyan Police Station area in Agra on 4th September. (Source: CCTV) pic.twitter.com/p2mfPseths — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022 ఈ ఘటనపై ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరీ స్పందించారు. వారం క్రితం ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 51 ట్రక్కులను సీజ్ చేసి కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ చర్యలతో మాఫియా మకాం మార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే హైడ్రాలిక్ ట్రాలీలతో టోల్ ప్లాజా గేట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఘటనపై ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు ఎస్ఎస్పీ వివరించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులందరూ ధోల్పూర్ ప్రాంతానికే చెందినవారని, అక్కడి పోలీసుల సహకారంతో అందర్నీ పట్టుకుంటామన్నారు. చదవండి: బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం -
త్వరలో మోంట్రా ఈ–వాహనాలు
చెన్నై: మోంట్రా బ్రాండ్ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్లు రెండు నెలల్లో భారత మార్కెట్లో రంగ ప్రవేశం చేయనున్నాయి. మురుగప్ప గ్రూప్ కంపెనీ అయిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియాకు (టీఐఐ) చెందిన టీఐ క్లీన్ మొబిలిటీ మోంట్రా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు టీఐఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ మురుగప్పన్ వెల్లడించారు. ‘కంపెనీ త్రిచక్ర వాహనాలు మార్కెట్లో సంచలనం సృష్టించనున్నాయి. ఇవి విలక్షణమైన, ఉన్నతమైన పనితీరు కలిగి ఉంటాయి. వినియోగదార్లు లక్ష్యంగా అధునాతన సాంకేతికతతో రూపొందుతున్నాయి. పర్యావరణ అనుకూల ఉత్పత్తులతో జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చడం మా ధ్యేయం. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన విపణి 2025 నాటికి 1.7 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అంతర్జాతీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాల్లో ఒకటిగా నిలవనుంది. తొలి ఏడాది చెన్నై ప్లాంటులో 75,000 యూనిట్ల త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తాం. ప్రయాణికులు, సరుకు రావాణాకు అవసరమైన వాహనాలను రూపొందిస్తాం. దేశవ్యాప్తంగా 40 కేంద్రాల్లో పంపిణీ వ్యవస్థ ఉంది. దీనిని డిసెంబర్‌కల్లా 100కు చేరుస్తాం. ఇతర విభాగాల్లోకి ప్రవేశిస్తాం. ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ సెలెస్ట్రియల్‌ను కొనుగోలు చేశాం. చెన్రై వెలుపల సెలెస్ట్రియల్ ట్రాక్టర్స్ కొత్త ప్లాంటును స్థాపిస్తోంది’ అని వివరించారు. -
CM Jagan: ఈనెల 7న గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. మెగా మేళాలో రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేయనున్నారు. అలాగే హరిత నగరాలు కింద పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ వారి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర రైతాంగం కోసం జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘వైఎస్సార్ యంత్ర సేవ’ పథకం క్రింద రాష్ట్ర స్థాయి మెగా మేళా కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జూన్ 7వ తేది నాడు రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చదవండి👉 వరదాపురం X పరిటాల.. ఢీ అంటే ఢీ! కొనసాగుతున్న మాటల యుద్ధం రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, మరింత మెరుగైన ఆదాయం అందించాలనే తపనతో.. వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసి.. పేద రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే అందుబాటులోకి తెచ్చి సాగు వ్యయం తగ్గించడంతో పాటు నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. రైతన్నలకు తక్కువ అద్దెకే సాగు యంత్రాలు, పనిముట్లు అందుబాటులో ఉంచి, విత్తు నుంచి కోత వరకు అవసరమైన పరికరాలను సకాలంలో అందించడానికి తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి రైతన్నలకు మరింత రాబడి అందించేలా, వారికి మంచి జరిగేలా రూ. 2,106 కోట్ల వ్యయంతో ఆర్బీకే స్థాయిలో ఒక్కొక్కటి రూ. 15 లక్షల విలువ గల 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కొక్కటి రూ. 25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలు నిర్వహిస్తాయి. పంటల సరళి, స్థానిక డిమాండ్ కు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను ఎంపిక చేసుకోవడంలో రైతు గ్రూపులదే తుది నిర్ణయంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న యంత్ర పరికరాలు, వాటి అద్దె. సంప్రదించ వలసిన వారి వివరాలు రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు ప్రభుత్వంగా, ‘వ్యవసాయం దండగ’ అంటూ సాగును నిర్లక్ష్యం చేసి అన్నదాతలను కడగండ్ల పాలు చేసిన గత పాలకుల నాటి దుస్థితిని సమూలంగా మారుస్తూ... రైతన్నకు ప్రతి అడుగులోనూ వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగగా మార్చింది. "విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే" అందించే వన్ స్టాప్ సెంటర్లుగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి, వైఎస్సార్ రైతు భరోసా క్రింద రైతన్నలకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. చదవండి👉🏻 పవన్ కల్యాణ్‌కి చురకలంటించిన కేవీపీ రైతులపై పైసా భారం పడకుండా సాగు చేసి, ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి రైతులపై పైసా భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా క్రింద ఒక ఖరీఫ్ కు సబంధించిన బీమా పరిహారం ఆ తరువాతి ఖరీఫ్ ప్రారంభ సమయానికే చెల్లిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఏ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగా ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తూ అన్నివేళలా రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోంది. రైతులు యంత్ర సేద్యం దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో యాంత్రీకరణకు పెద్దపీట వేసి యంత్ర పరికరాలు రైతులకు పెద్ద సంఖ్యలో అందజేస్తుంది. రైతుల గ్రూపులకు 40 శాతం రాయితీతో సబ్సిడీ సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తోంది. అలాగే ఆప్కాబ్, డిసిసిబి ద్వారా యంత్ర పరికరాల ఖరీదులో మరో 50 శాతం రుణాన్ని తక్కువ వడ్డీకే అందిస్తోంది. వైఎస్సార్ యంత్రసేవా పథకం క్రింద మొత్తం సబ్సిడీగా మొత్తం రూ.806 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంగళవారం నాడు జరిగే మెగా మెళాలో ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్ లింకేజ్, హెచ్ బార్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే కంబైన్డ్ హార్వెస్టర్ల ఒక ట్రాక్, ఒక సంవత్సరం పాటు సర్వీసింగ్, ఆపరేటర్ కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. డ్రోన్ పరికరాల సహాయంతో పంటలకు సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను అందించి రైతన్నలకు పెట్టుబడి ఖర్చును తగ్గించే దిశగా ఈ ఏడాది 2,000 గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్ కూడా సరఫరా చేసేవిధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. యాంత్రీకరణలో భాగంగా దుక్కి యంత్రాలు, దమ్మచదను చేసే పరికరాలు, వరినాటు యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, విత్తనం-ఎరువు పరికరాలు, కలుపుతీసే పరికరాలు, సస్యరక్షణ పరికరాలు, కోతకోసే యంత్రాలు మొదలైనవాటిలో స్థానిక రైతుల అవసరాలకు అనుగుణంగా కావాల్సిన యంత్రాలు, పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు కూడా యంత్ర పరికరాలపై చేస్తున్న పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకం ఉపయోగపడుతుంది. చదవండి👉🏼 ఇలాంటి పోలీస్ ఒక్కడున్నా చాలు! సొంత డబ్బులతో.. -
ఈ నెల 7న ‘వైఎస్సార్ యంత్ర సేవ’ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతాంగం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకాన్ని 7వ తేదీన ప్రారంభించనున్నారు. పథకం కింద వివిధ జిల్లాల రైతులకు 3,800 ట్రాక్టర్లు, 300 కంబైన్డ్ హార్వెస్టర్స్ అందిస్తారు. గుంటూరు జిల్లా కేంద్రంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మేళా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హరికిరణ్ గురువారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వ్యవసాయ శాఖ అధికారులు, ట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న సీఎం చేతుల మీదుగా ఆయా జిల్లాలకు చెందిన రైతులకు 1,215 ట్రాక్టర్లు, 77 కంబైన్డ్ హార్వెస్టర్స్‌ను పంపిణీ చేస్తారని, దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ జరిగే ప్రాంతానికి రవాణా సౌకర్యం, తాగునీరు, వసతి వంటి సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకూడదని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మేళా ప్రాంతానికి ముందుగానే యంత్రాలు చేరేలా కంపెనీ ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. (చదవండి: అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ) -
టఫే నుంచి ప్రీమియం ట్రాక్టర్లు
హైదరాబాద్: ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ (టఫే) తాజాగా ఐషర్ బ్రాండ్‌లో ప్రైమా జీ3 సిరీస్ పేరిట ప్రీమియం ట్రాక్టర్లను ఆవిష్కరించింది. స్టైల్, దృఢత్వం కోరుకునే కొత్త తరం రైతుల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు తెలిపింది. సామర్థ్యంపరంగా 40–60 హెచ్‌పీ శ్రేణిలో ఇవి ఉంటాయని టఫే సీఎండీ మల్లికా శ్రీనివాసన్ తెలిపారు. ఇంధనం ఆదా చేయడంతో పాటు ఉత్పాదకత అత్యధిక స్థాయిలో ఉండేలా వీటిని తీర్చిదిద్దినట్లు ఆమె పేర్కొన్నారు. ఎత్తు సర్దుబాటు చేసుకోగలిగే సీటు, వైవిధ్యమైన ఏరోడైనమిక్ హుడ్, డిజి నెక్ట్స్ డ్యాష్‌బోర్డు, వన్ టచ్ ఓపెన్ బానెట్ తదితర ఫీచర్లు ఈ ట్రాక్టర్లలో ఉంటాయి. దేశీయంగా యువ రైతులు వ్యవసాయ రంగంలో సాంకేతికత ఊతంతో గరిష్ట రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వారికి అనువుగా ఉండేలా జీ3 సిరీస్ ట్రాక్టర్లను ఆవిష్కరించినట్లు మల్లికా శ్రీనివాసన్ వివరించారు. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు! -
వరదల్లో చిక్కుకున్న 30 ట్రాక్టర్లు : వైఎస్సార్ జిల్లా
-
26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా రైతులు అడుగు ముందుకేస్తున్నారు. 26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ సన్నాహకాల్లో (రిహార్సల్) భాగంగా గురువారం ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్లతోపాటు హరియాణాలోని రేవసాన్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. 26వ తేదీన హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నట్లు రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు.కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఎనిమిదో దఫా చర్చలు శుక్రవారం జరగనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు తప్ప రైతుల నుంచి వచ్చే ఏ ఇతర ప్రతిపాదనైనా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ గురువారం పునరుద్ఘాటించారు. రైతులు, ప్రభుత్వం మధ్య శుక్రవారం చర్చల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
మహిళా రైతుల ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయ్
రెండు నెలలుగా ఢిల్లీలో రైతుల పోరు. మళ్లీ ఈరోజు ప్రభుత్వంతో చర్చలు. నేటి చర్చల్లో ప్రభుత్వం ‘ఓకే’ అనలేదా.. ఈ ఏడాది ఢిల్లీలో రెండు పరేడ్లు! ఒకటి.. గణతంత్ర దినోత్సవ శకటాల పరేడ్. రెండు.. రైతుల రణన్నినాద ట్రాక్టర్ పరేడ్. ట్రాక్టర్ పరేడ్‌లోకి మహిళలూ దిగుతున్నారు. అందుకోసమే వాళ్లు హైవే పైకి వచ్చి.. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు! బండెనక బండి కట్టి మహిళలు కదలక ముందే.. ప్రభుత్వంలో కదలిక వస్తుందా? రైతులకు, ప్రభుత్వానికి కొద్ది వారాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పరోక్ష యుద్ధం జరుగుతోంది. రైతుల కోసం గత సెప్టెంబరులో పార్లమెంటు తెచ్చిన చట్టాలు మంచివని ప్రభుత్వం అంటుంటే.. ఆ చట్టాలు తమ బతుకును కోరేవి కాకపోగా బలి తీసుకునేవని రైతులు భావిస్తున్నారు. అందుకే ఆ చట్టాలను రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి నలువైపులా ఎండకు, వానకు, చలికి చలించకుండా సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని కూర్చున్నారు. మళ్లీ ఈ రోజు (జనవరి 8) చర్చలు జరుగుతున్నాయి. ఇవీ విఫలమైతే? విఫలమైన మరుక్షణం నుంచే రైతు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల నుంచి రైతులు ట్రాక్టర్లు వేసుకుని ఢిల్లీ బయల్దేరతారు. జనవరి 26 నాటికి ఢిల్లీ చేరుకుంటారు. గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్‌డే పరేడ్కి సమాంతరంగా ట్రాక్టర్ పరేడ్ జరుపుతారు. రైతు సంఘాల పోరు ప్రణాళిక ఇది. ఇందుకు మహిళా రైతులూ ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్రాక్టర్ నడపడం రాని మహిళలు సైతం హైవే మీదకు వెళ్లి ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్నారు. మొదట ఇందుకు హర్యానా మహిళా రైతులు మార్గదర్శకులు అయ్యారు. హర్యానాలోని రొహ్టాక్లో ట్రాక్టర్ పరేడ్‌కు రిహార్సల్స్ వేస్తున్న మహిళా రైతులు ట్రాక్టర్ పరేడ్ కోసమే మహిళలు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడం పోరాట పథానికి ఒక కొత్త ఆదర్శం అయింది. అంతే కదా. ఇప్పుడు ఆడవాళ్లూ డ్రైవింగ్ నేర్చుకుని టూ–వీలర్లు, ఫోర్ వీలర్లు నడుపుతున్నప్పటికీ అదంతా ఆసక్తి ఉన్నందువల్లనో, అవసరం అయినందు వల్లో. అయితే ఒక ఉద్యమ పోరాటంలో పాల్పంచుకోడానికి మహిళలు డ్రైవింగ్ నేర్చుకోవడమే మరింతగా అభినందించాల్సిన సంగతి. అయితే మహిళా రైతు ఉద్యమకారులెవరూ అభినందనల్ని పట్టించుకునేంత స్థిమితంగా లేరు. హర్యానాలోని జింద్ జిల్లాలో గత సోమవారం నుంచీ జింద్–పటియాలా నేషనల్ హైవే మీద ఖట్కర్ టోల్ ప్లాజా సమీపంలో మహిళలు దీక్షగా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. టోల్ ప్లాజా వాళ్లు కూడా వారి దగ్గర రుసుమేమీ వసూలు చేయడం లేదు! అదీ ఒక విధంగా రైతు ఉద్యమానికి మద్ధతు తెలియజేయడం అనుకోవాలి. ఆ ప్రదేశంలో డ్రైవింగ్ శిక్షణ పగలంతా మూడు విడతలుగా జరుగుతోంది. ట్రాక్టర్ స్టార్ట్ చెయ్యడం, స్టీరింగ్ తిప్పడం, వాహనానికి రెండువైపులా వచ్చే వాహనాలను అద్దాల్లో చూస్తూ రోడ్డు రెండు వైపులను పరిశీలిస్తూ ట్రాక్టర్ నడపడం వంటి ప్రాథమిక విషయాలను డ్రైవింగ్ వచ్చిన బంధువుల నుండి, ప్రత్యేక శిక్షకుల ద్వారా ఈ మహిళలంతా నేర్చుకుంటున్నారు. ‘‘ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం దిగి రాకుంటే ఈసారి నేరుగా ఎర్రకోటలోకే మా ట్రాక్టర్లు దూసుకువెళ్తాయి’’ అని 38 ఏళ్ల నైన్ అంటున్నారు. ట్రైనింగ్ అవుతున్న మహిళలో నైన్ ఒకరు. నైన్ ఖట్కర్ గ్రామ మహిళ. అదే గ్రామం నుంచి ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చిన వారిలో సరోజ్ కూడా ఉన్నారు. ఆమెకు 35 ఏళ్లు. ‘‘నేను రైతు కూతుర్ని. రైతులపై ప్రభుత్వం ఇప్పటికే అనేక అరాచకాలకు పాల్పడింది. ఇప్పుడైతే మేము అస్సలు వెనక్కు తగ్గాలని అనుకోవడం లేదు. ఇది రెండో స్వాతంత్య్ర సంగ్రామం అనుకోండి’’ అంటున్నారు సరోజ్. విజయేందర్ సిం«ధూ, సత్బీర్ పెహల్వాల్ కూడా అదే మాట చెబుతున్నారు. సత్బీర్ వయసులో పెద్దావిడ. అయినా ధైర్యంగా ట్రాక్టర్ నేర్చుకోడానికి వచ్చారు. ‘‘ఇప్పుడు మేము మౌనంగా ఉంటే, మా తర్వాతి తరం వారికి ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా నోరు తెరిచే అవకాశమే ఉండదు. మా పిల్లలు సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్నారు. మా భర్తల్ని మాత్రం లోనికి పోనివ్వకుండా ఢిల్లీసరిహద్దుల్లోనే ఆపేశారు. ఏమైనా న్యాయంగా ఉందా?’’ అని సత్బీర్ అడుగుతున్నారు. రైతు సంఘాల వారికి, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు చర్చలు జరిగాయి. ఒక్కటీ సఫలం కాలేదు. ఎనిమిదో రౌంyŠ చర్చలు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నాయి. రైతులు కోరుతున్నట్లు ఆ మూడు సాగుచట్టాల్ని ప్రభుత్వం రద్దు చేసిందా, కనీసం మార్పులు చేర్పులు చేసిందా.. ఢిల్లీలో ఒకే పరేడ్ జరుగుతుంది... గణతంత్ర దినోత్సవ పరేడ్. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం తలవొగ్గలేదా.. ట్రాక్టర్ పరేడ్ తప్పని వాతావరణం ఏర్పడుతుంది. ‘‘ఇప్పటి వరకు రైతు ఉద్యమాన్ని మాత్రమే ప్రభుత్వం చూసింది. ఇకముందు మహిళా రైతు దళం బలాన్ని కూడా కూడగట్టుకున్న రైతు మహోద్యమాన్ని చూడవలసి ఉంటుంది. అది మరింత తీవ్రంగా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు ట్రాక్టర్ నడపడం నేర్చుకుంటున్న హర్యానా మహిళలు. -
టీడీపీని వెంటాడుతున్న పాపాలు
చిత్తూరు అగ్రికల్చర్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు దక్కాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లను జిల్లాలోని టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు యథేచ్ఛగా దోచుకున్నారు. దీనిపై గత నెల 16న సాక్షిలో ‘ట్రాక్టర్లు మింగేశారు’ అనే కథనంతో వార్త ప్రచురితమైంది. ఈ కథనంలో ఓ ఎమ్మెల్సీ కూడా రెండు ట్రాక్టర్లను మంజూరు చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై వాస్తవ నివేదిక రూపొందించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కలికిరిలో ట్రాక్టర్‌ను అక్రమంగా మంజూరు చేసుకున్న జన్మభూమి కమిటీ సభ్యుడిపై వ్యవసాయశాఖాధికారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి రానున్నాయి. కాగా టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు బుధవారం జిల్లా వ్యవసాయ కార్యాలయానికి చేరుకొని మంతనాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఏకపక్షంగా స్వాహా.. ప్రభుత్వ పథకాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షంగా స్వాహా చేశారు. 2015–16 ఏడాదిలో ఆర్కేవీవై కింద జిల్లాలోని రైతు సంఘాలకు 75 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను మంజూరు చేసింది. ఒక రైతు సంఘానికి ఒక యూనిట్ కింద ట్రాక్టర్, రోటోవేటర్, విత్తనాలు వేసే మడకలు తదితరాలను మంజూరు చేసింది. ఒక యూనిట్ విలువ రూ.8.60 లక్షలకు రాయితీ కింద రూ.6.02 లక్షలు ప్రభుత్వం అందించగా, మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించారు. ఈ విధానం ద్వారా జిల్లాలోని మొత్తం 470 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా రైతురథం పథకం ద్వారా ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షలు సబ్సిడీతో మొత్తం 1,047 ట్రాక్టర్లను మంజూరు చేసింది. వీటిని మంజూరు చేయడంలో జన్మభూమి కమిటీలు కీలకపాత్ర పోషించాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ట్రాక్టర్లను అర్హతతో ప్రామాణికం కాకుండా అక్రమంగా దోచుకున్నారు. ఆర్కేవీవై పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతు సంఘాలకు అందాలి్సన ట్రాక్టర్లను టీడీపీ నాయకులే దక్కించుకున్నారు. అదేవిధంగా రైతురథం పథకం కింద కూడా ట్రాక్టర్లను బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారు. టీడీపీ నేతపై కేసు నమోదు.. సబ్సిడీ ట్రాక్టర్ల మంజూరులో చోటు చేసుకున్న అక్రమాలపై వ్యవసాయశాఖాధికారుల విచారణలో అసలు రంగు బయటపడింది. ఇందులో భాగంగా కలికిరి మండలం కె.కొత్తపల్లెలోని ఏసుప్రభు రైతుమిత్ర సంçఘానికి అందాలి్స న ట్రాక్టర్‌ను టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు మున్నాఫ్ సాహెబ్ మంజూరు చేసుకుని, తర్వాత విక్రయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై గత నెల 22న వ్యవసాయ అధికారిణి హేమలత పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. టీడీపీ నేతల్లో గుబులు.. గత ప్రభుత్వ హయంలో అక్రమంగా మంజూరు చేసుకున్న ట్రాక్టర్లపై విచారణ ప్రారంభం కావడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. అప్పట్లో మంజూరైన ట్రాక్టర్లను దాదాపు రైతుల ముసుగులో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేజిక్కించుకున్నారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోనే ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణను ముమ్మరం చేయడంతో ప్రస్తుతం పలువురు టీడీపీ నాయకులు వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నారు. అక్రమంగా దోచుకున్న ట్రాక్టర్ల జాబితాలో తమ పేర్లు లేకుండా చూసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చర్చనీయాంశమైన ఎమ్మెల్సీ రాక.. ట్రాక్టర్ల అక్రమ దోపిడీలో ఓ ఎమ్మెల్సీ ఏకంగా రెండు ట్రాక్టర్లను మంజూరు చేసుకుని క్వారీల్లో, వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకుంటున్నట్లు ‘సాక్షి’లో వార్తాకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన దాదాపు అరగంట పాటు ఉండి పలువురు అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీనే నేరుగా జిల్లా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
అక్రమాలకు అంతే లేదు..
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకుల అక్రమాలకు అంతే లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు రథం పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్లను కూడా అక్రమంగా స్వాహా చేశారు. పలువురు టీడీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీ రైతుల పేరుతో రాయితీ ట్రాక్టర్లను మంజూరు చేసుకుని యథేచ్ఛగా దోచుకున్నారు. టీడీపీ జిల్లా స్థాయి నాయకుడు ఏకంగా రెండు ట్రాక్టర్లు, ఓ ఎమ్మెల్సీ రెండు ట్రాక్టర్లను ఎస్సీ రైతుల పేరుతో మంజూరు చేసుకుని వారి సొంత క్వారీల్లో, వ్యవసాయ పనుల్లో వాడుకుంటున్నారు. కలికిరి మండలం కె.కొత్తపల్లెలోని యేసుప్రభు రైతు మిత్ర సంఘం రైతులు 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆర్కేవీవై (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) ద్వారా 75 శాతం రాయితీతో ట్రాక్టర్, మల్టీక్రాప్ ప్లాంటర్ (రొటోవేటర్), విత్తనం వేసే మడకలు తదితరాల మంజూరు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ అభ్యర్థన మేరకు వారికి ట్రాక్టర్, ఇతర యంత్రాలు మంజూరయ్యాయి. అయితే ఆ విషయం లబ్ధిదారులైన రైతులకు తెలియకుండా నేరుగా ఆ మండల టీడీపీ నాయకుడు మంజూరు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో అసలు విషయం లబ్ధిరులకు తెలిసింది. దీనిపై టీడీపీ నాయకున్ని వారు ప్రశి్నస్తే సరైన సమాధానం చెప్పలేదు. కనీసం మంజూరైన ట్రాక్టర్ కూడా అతని వద్ద లేకపోగా ఇతరులకు అమ్ముకుని సొమ్ముచేసుకున్నట్లు రైతులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు ప్రయత్నించగా వారిని ఆ నాయకుడు బెదిరిస్తున్నాడు. సాక్షి, చిత్తూరు : వ్యవసాయంలో యాంత్రికీకరణను ప్రతి రైతు వినియోగించాలని అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయి. అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆర్కేవీవై పథకం ద్వారా ప్రతి ఐదుగురు రైతులతో కూడిన రైతు సంఘాలకు ఒక యూనిట్ కింద ట్రాక్టర్, రొటోవేటర్, విత్తనాలు వేసే మడకలు తదితరాలను 75 శాతం రాయితీతో మంజూరు చేసింది. ఇందుకుగాను మొత్తం యూనిట్ విలువ రూ.8.60 లక్షలకు రాయితీ కింద రూ.6.02 లక్షలు ప్రభుత్వం చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని రైతు చెల్లించేలా పథకాన్ని అమలు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 2015–16 ఏడాదిలో మొత్తం 470 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. టీడీపీ నాయకుల చేతివాటం గత ప్రభుత్వ హయాంలో ఏ పథకాన్ని అమలు చేయాలన్నా జన్మభూమి కమిటీల పాత్రే కీలకంగా ఉండేది. దీంతో ఆర్కేవీవై కింద మంజూరైన ట్రాక్టర్ యూనిట్‌ను పొందేందుకు ముందస్తుగా రైతులు జన్మభూమి కమిటీలకే దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీ సభ్యుల సహకారంతో రైతు సంఘాల నుంచి సంతకాలు చేసిన దరఖాస్తులు, వాటికి జతచేయాల్సిన పత్రాలను సేకరించారు. తరువాత లబ్ధిదారులకు తెలియకుండానే ట్రాక్టర్ యూనిట్‌ను మంజూరు చేసుకున్నారు. ప్రతి యూనిట్‌పై రూ.6 లక్షల మేరకు రాయితీ రావడంతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకున్నారు. తీరా లబ్ధిదారులకు విషయం తెలిసి టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: జేసీ ప్రభాకర్ రెడ్డిపై పీటీ వారెంట్ నిబంధనలు ఇలా.. ఆర్కేవీవై కింద రైతు సంఘాలు పొందిన ట్రాక్టర్లను కనీసం 5 ఏళ్ల కాలం వరకు ఎవరికి గాని విక్రయించకూడదు. అలా విక్రయించినట్లు అధికారుల విచారణలో తేలితే లబ్ధిదారుల నుంచి రాయితీ మొత్తాలను వసూలు చేస్తారు. ఒకవేళ రైతులు కట్టకపోతే ఆఖరికి కేసులు పెట్టే అవకాశం ఉంది. దీంతో పలువురు రైతులు ట్రాక్టర్ యూనిట్లు పొందకపోయినా అధికారిక లెక్కల్లో పొందినట్లు నమోదై ఉన్నాయి. దీంతో ఎవరైనా అధికారులు విచారణ చేపడితే ఆఖరికి రైతులు దోషులుగా నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో కొందరు రైతులు అక్రమంగా ట్రాక్టర్లను మంజూరు చేసుకున్న వారిపై కేసులు పెట్టేందుకు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై సంబంధిత అధికారులు ముందస్తుగానే విచారణ చేపట్టి అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. రైతు రథంలోనూ.. రైతు రథం పధకం ద్వారా రైతులకు అందాల్సిన రాయితీ ట్రాక్టర్లు కేవలం టీడీపీ నాయకులకే పరిమితమైపోయాయి. రైతు రథం కింద ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షల మేరకు అప్పటి ప్రభుత్వం రాయితీ కల్పించింది. జిల్లాలో మొత్తం 1,047 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఈ ట్రాక్టర్లను టీడీపీ జిల్లా నాయకుడు, ఓ ఎమ్మెల్సీ ఏకంగా రెండేసి ట్రాక్టర్లను ఎస్సీ రైతుల పేరుతో మంజూరు చేసుకున్నారు. దీనిపై ఇటీవల కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించిన విషయం విదితమే. ఈ పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్లు ఎక్కడగాని రైతులకు అందిన దాఖలాలు లేవు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం రైతుల సౌకర్యార్థం ఆర్కేవీవై కింద రాయితీపై మంజూరు చేసిన ట్రాక్టర్లు అక్రమంగా ఇతరుల వద్ద ఉన్నట్లు గుర్తిస్తే తగు చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం అందరు ఏఓలను అప్రమత్తం చేసి విచారణ చేపడతాం. ఎక్కడైనా రైతులకు చెందాల్సిన ట్రాక్టర్లను ఇతరులు అక్రమంగా అనుభవిస్తుంటే ఆయా మండల ఏఓల దృష్టికి తీసుకువస్తే విచారణ చేపడతాం. –విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ -
పల్లెకో ట్రాక్టర్, డోజర్
సాక్షి, జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతంలో చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గ్రామాల అభివృద్ధికి గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు పలు అ«ధికారాలు, విధులు కట్టబెట్టింది. అభివృద్ధిలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేయడానికి కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. ఇటీవలే పల్లెల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేశారు. కేవలం నెలరోజుల పాటే కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామానికి ఓ ట్రాక్టర్, ఓ డోజర్ మంజూరు చేసింది. వీటి నిర్వహణకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక నిధులు లేకున్నా.. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజురు చేయకపోయినా గ్రామ పంచాయతీ నిధుల్లో నుంచి కొనుగోలుకు వెసులుబాటు కల్పించింది. పంచాయతీల వారీగా జనాభాకు అనుగునంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి తీర్మానంతో ట్రాక్టర్మోడల్ను ఎంపిక చేయాలి. ఆ తీర్మాణాన్ని మండల స్థాయిలో నుంచి జిల్లాకు పంపిన తరువాత అక్కడ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే కమిటీ ఆమోదం తెలుపుతుంది. అనంతరం ట్రాక్టర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జనాభా వారీగా.. 500 వరకు జనాభా కలిగిన పంచాయతీలకు 15 హెచ్‌పీ కలిగిన మినీ ట్రాక్టర్, 500 నుంచి 3 వేల జనాభా కలిగిన జీపీలకు 20 నుంచి 21 హెచ్‌పీ కలిగిన మినీ ట్రాక్టర్ కొనుగోలు చేయాలి. 3 వేల కంటే ఎక్కవ జనాభా కలిగిన జీపీలకు 35 నుంచి 40 హెచ్‌పీ కలిగిన రెగ్యులర్ ట్రాక్టర్ కొనుగోలుకు అనుమతి ఇస్తారు. ఇందులో చిన్న గ్రామ పంచాయతీలకు మహేం ద్ర, యువరాజ్, స్వరాజ్, ఐచర్, మిస్ట్బుష్, కుబోటా లాంటి కంపెనీలకు చెందిన మిని ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని సూచించారు. వీటి విలువ రూ.2.70 లక్షల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుంది. ఇక పెద్ద గ్రామ పంచాయతీల్లో హెచ్ఎంటీ, ప్రీతీ, ఐచర్, స్వరాజ్, జాన్డీ, మమేంద్ర, కుబోటా వంటి కంపెనీలకు చెందిన 35 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ట్రాక్లర్లను కొనుగోలు చేయాలి. కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ.. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా పంచాయతీ అధికా రి కన్వీనర్‌గా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరు, జిల్లా పరిశ్రమల అధికారి సభ్యులుగా ఉంటారు. అయితే అన్ని జీపీల నుంచి తీర్మాణాలు అందగానే ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించిన అనుమతులు ఇస్తారు. పచ్చదనం.. పరిశుభ్రతే లక్ష్యం గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీకి కెటాయిచనున్న ట్రాక్టర్ ద్వారా పనిచేయాలి. ట్రాక్టర్‌తోపాటు బ్లెడ్ (చదును చేసే యంత్రం), ట్యాంకర్ సైతం ఇవ్వనున్నారు. ప్రతీ గ్రామంలోని చెత్తాచెదారాన్ని ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించనుండడంతో పల్లెలు శుభ్రంగా మారుతాయని భావిస్తున్నారు. ఇక బ్లేడ్లో పిచ్చిమొక్కలను శుభ్రం చేసేందుకు ట్యాంకర్ ద్వారా హరితహారంలో నాటిన మొక్కలకు నీటిని అందించేందుకు వీలుకలుగుతుంది. జీపీల్లోని సిబ్బందిలో ఎవరికైనా ట్రాక్టర్ నడిపిన అనుభవం ఉంటే ఆయనే డ్రైవర్‌గా నియమిస్తారు. ఎవరికి రాని పక్షంలో ట్రాక్టర్ నడపడంలో శిక్షణ ఇప్పిస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాని ప్రకారం జిల్లాలోని 441 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేస్తాం. జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్ మోడల్ ఉంటుంది. ఆయా గ్రామాల నుంచి ట్రాక్టర్ కొనుగోలుకు సంబంధించిన అంశాలు సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారి తీర్మాణం అందించాలి. – డీపీఓ వెంకటేశ్వర్లు -
ట్రాక్టర్స్.. మిలియన్ మార్చ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ట్రాక్టర్ల పరిశ్రమ మిలియన్ మార్కు దిశగా వెళ్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో సుమారు 8 లక్షల ట్రాక్టర్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2020–21లో ఈ సంఖ్య 10 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నాయి. భారత్‌లో వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాధాన్యత పెరుగుతుండటమే ఈ అంకెలకు కారణమని కంపెనీలు అంటున్నాయి. 2017–18లో దేశంలో 7,11,478 ట్రాక్టర్లు రోడ్డెక్కాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 22% అధికం. 2018 ఏప్రిల్–2019 ఫిబ్రవరి పీరియడ్‌లో 7,26,164 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019–20లో సైతం రెండంకెల వృద్ధి ని పరిశ్రమ ఆశిస్తోంది. వ్యవసాయాధార రాష్ట్రాల్లో కరువుతో పరిశ్రమ 2014–15, 2015–16లో తిరోగమనం చూసింది. ప్రస్తుతం దేశంలో రైతుల వద్ద 45 లక్షల ట్రాక్టర్లున్నట్టు సమాచారం. సానుకూల అంశాలు.. వ్యవసాయ రంగం దేశవ్యాప్తంగా కార్మికుల కొరతతో సతమతమవుతోంది. కార్మికులు నగరాలకు వలసలు, ఇతర రంగాల వైపు మళ్లడం ఇందుకు కారణం. దీంతో వ్యవసాయానికి యాంత్రికీకరణే పెద్ద అండగా నిలుస్తోంది. మహీంద్రా, టఫే, ఎస్కార్ట్స్, సొనాలికా, జాన్ డీర్, క్లాస్ అగ్రి మెషినరీ వంటి ప్రధాన కంపెనీలు కొత్త టెక్నాలజీ, సేవలతో రైతులకు చేరువ అవుతున్నాయి. జీడీపీ వృద్ధిరేటు, వాణిజ్య అవసరాలకు ట్రాక్టర్ల వినియోగం, సానుకూల వాతావరణం, నీటి లభ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం.. వెరశి ట్రాక్టర్ పరిశ్రమ వరుసగా మూడో ఏడాది రెండంకెల వృద్ధి నమోదు చేయనుందని టఫే ఇండియా చైర్మన్ మల్లిక శ్రీనివాసన్ తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు వ్యవసాయ రంగం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. మూడేళ్లలో వ్యవసాయానికి కేంద్రం చేసిన కేటాయింపులు 9 శాతం పెరిగాయి. సబ్సిడీ స్కీంలు దీనికి అదనం. 21 ప్రధాన రాష్ట్రాలు చేసిన కేటాయింపులు 47 శాతం అధికమయ్యాయి. మరోవైపు ట్రాక్టర్లు కొనుగోలుకు రైతుల కు ఈఎంఐలు ఇవ్వడంలో ఫైనాన్స్ కంపెనీలు పోటీపడడం పరిశ్రమకు కలిసి వచ్చే అంశాలు. వేగంగా యాంత్రీకరణ.. దేశంలో 5.2 శాతం వ్యవసాయ కుటుంబాలు ట్రాక్టర్‌ను కలిగి ఉన్నాయి. పవర్ టిల్లర్ విషయంలో ఇది 1.8 శాతమేనని నాబార్డ్ సర్వే చెబుతోంది. వ్యవసాయం అధికంగా ఉండే ప్రతి రాష్ట్రంలో ఏటా 4,000 రోటావేటర్లు, 3,000 దాకా సీడ్ డ్రిల్లర్లు అమ్ముడవుతున్నాయని క్లాస్ అగ్రి మెషినరీ చెబు తోంది. భారత్‌లో 6,70,000 గ్రామాలు ఉన్నాయి. 2016 వరకు ఏటా 6 లక్షల లోపే ట్రాక్టర్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఒక్కో ఊరికి ఒక ట్రాక్టర్ చొప్పున తీసుకున్నా విక్రయాలు తక్కువే అన్నమాట. గతంలో కంటే ఇప్పుడు యాంత్రీకరణ వేగం గా జరుగుతోందని ఇండో ఫామ్ ఎక్విప్మెంట్స్ డైరెక్టర్ డి.ఎల్.రానా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అమ్మకాలే ఇందుకు నిదర్శనమని, ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. పెరగనున్న డిమాండ్.. ప్రస్తుతం దేశంలో 20 కోట్ల మంది రైతులు యాంత్రికీకరణకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లు, యంత్రాల తయారీ కంపెనీలు రెంటల్ మోడల్‌తో దూసుకెళ్తున్నాయి. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసే స్తోమత లేని రైతులు వీటిని అద్దెకు తీసుకోవడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఔత్సాహిక యువత ద్వారా కంపెనీలు ఏర్పాటు చేయిస్తున్నాయి. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తుండడం విశేషం. మూడేళ్లలో 75 మంది యువత ద్వారా దోస్త్ సెంటర్లను ఏర్పాటు చేశామని క్లాస్ అగ్రి మెషినరీ నేషనల్ సేల్స్ హెడ్ ప్రేమ్ కుమార్ తెలిపారు. దోస్త్ కేంద్రం నిర్వాహకులు యంత్రం కొనుగోలుకు 20 శాతం డౌన్ పేమెంట్ చేస్తే చాలని చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే యాంత్రికీకరణ వేగంగా వృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఇన్నాళ్లకు గుర్తొచ్చామా బాబు..!
విజయనగరం, రామభద్రపురం:గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త గిమ్మిక్కులకు తెరదీస్తున్నారు. దానిలో భాగంగానే ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు ఆటోవాలాలు, ట్రాక్టర్ల యజమానుల విమర్శిస్తున్నారు. గతంలో ఆటోలకు త్రైమాసిక పన్ను విధానం అమల్లో ఉండేది. దాన్ని రద్దు చేసి జీవిత కాల పన్నులు తీసుకొచ్చారు. దాంతో ఒక్కో ఆటోకు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు ఆయా కార్మికులు పన్ను చెల్లిస్తున్నారు. ఇది తమకు భారంగా ఉందని, దీన్నుంచి మినహాయించాలని పలుసార్లు సీఎంకు ఆటోవాలాలు, వారి యూనియన్లు సీఎంకు వినతులు ఇచ్చారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అప్పుడు ఏ మాత్రం సీఎం పట్టించుకోలేదు. కానీ వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఆటో కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓట్ల కోసం.. జగన్ పాదయాత్ర, ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు ఎన్నికల రాజకీయానికి తెరదీశారు. ఆటోవాలాల్లో ఎక్కువమంది పేదవారే, పోషణ కోసం ఆటో నడుపుతూ బతుకుబండి సాగిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం త్రైమాసిక విధానాన్ని పక్కనపెట్టి జీవిత కాల పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల ఒక ఆటోకు ఒకే సారి రూ.2వేల నుంచి రూ.4వేలు వరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. లేనిపక్షంలో ఆటోలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వొద్దన్న నిబంధనను ఈ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఈ నిర్ణయం వచ్చేముందే చాలా మంది కార్మికులు అప్పులు చేసి మరీ పన్నులు కట్టేశారు. నాలుగున్నరేళ్లుగా వారి బాధలను పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిపై ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కట్టేయడం వల్ల నష్టపోయామని ఆటోవాలాలు చెబుతున్నారు. అధికారం కోసమే గిమ్మిక్కులు.. ఇన్నాళ్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గిమ్మిక్కులకు తెరదీస్తుందని ఆటోవాలాలు, ట్రాక్టర్ల యజమానులు అంటున్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఈ సారి చంద్రబాబును నమ్మేది లేదని చెబుతున్నారు. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని పెంచిన ఘనత బాబుదే అని అంటున్నారు. జగన్ ఏడాది రూ.10వేలు ఇస్తామని చెప్పగానే ఇలాంటి గాలాలు వేస్తున్నామని, తామంతా జగనన్న వెంటే నడవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. -
ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు
సాక్షి, అమరావతి: ఆటోలకు జీవిత కాలం, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయాలన్న ప్రతిపా దనలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వివరించారు. ముగ్గురి నుంచి ఏడుగురు ప్రయాణించే మూడు చక్రాల ఆటోలు, సరకు రవాణా చేసే మూడు చక్రాల ఆటోలు, 3 టన్నుల బరువు తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన తేలికపాటి వాహనాలు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టరు ట్రయలర్లపై పన్ను మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మోటారు వెహికిల్ ట్యాక్స్ ఎరియర్స్ రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటోలు నడిపేవారికి ఈ ఏడాది రూ.60 కోట్లు , ప్రతి ఏటా రూ.55 కోట్లు లబ్ధి పొందుతారని చెప్పారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు వల్ల 9.79 లక్షల వాహన యజమానులకు లబ్ధి కలుగుతుందన్నారు. పాసింజర్ ఆటో రిక్షాలు 5.66 లక్షలు ఉన్నాయని, వీటిపై ఏడాదికి రూ.20 కోట్ల జీవిత కాల, త్రైమాసిక పన్ను మినహాయించారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం రూ. వెయ్యి ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలు, రూ.1500 ఉన్న పెన్షన్‌ను రూ.3 వేలు చేశామన్నారు. మంత్రి వర్గం ఆమోదించిన మరిన్ని అంశాలు.. – ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏలలో ప్రస్తుతం ఒక డీఏ ఈ జీతం నుంచి సర్దుబాటు. ఒక డీఏ బకాయి మొత్తం రూ.513.13 కోట్లు వాయిదాల రూపంలో చెల్లించేలా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయం. – వివిధ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్ పే స్కేలు 2015 ప్రకారం మినిమం టైమ్ స్కేలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు. – చుక్కల భూములు, ఇళ్ల పట్టాల విషయంలో జాయింట్ కలెక్టర్‌కు బదులుగా ఆర్డీవోలకే అధికారం. – 2014 జూన్ నుంచి మంజూరు కాకుండానే నిర్మించుకున్న లక్షా 26 వేల 97 ఇళ్లకు ప్రభుత్వ సాయం అందించాలని నిర్ణయం. ఒక్కో ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ.15 వేలతో కలిపి రూ.60 వేల చొప్పున లబ్దిదారునికి ఇవ్వనున్నారు. దీని కోసం రూ.756 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 1996–2004 మధ్య వివిధ పట్టణ ప్రాంతాలలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం 20 వేల యూనిట్లకు రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. – అర్బన్ హౌసింగ్ కోసం భీమునిపట్నం మండలం కొత్తవలసలో 94.86 ఎకరాలు, పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 127.46 ఎకరాలు (మొత్తం 222.32 ఎకరాలు) చొప్పున ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ఉడాకు అనుమతి. – రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జుడీషియల్ అఫీషియల్స్‌కు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు కేటాయింపుపై నూతన విధానం. మార్గదర్శకాలు రూపొందించేందుకు ఆమోదం. ఆలిండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు చొప్పున సొసైటీల ద్వారా స్థలాలు కేటాయిస్తారు. ఈ ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు సీఆర్డీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రెండేళ్లకు మించి రాష్ట్రంలో పని చేస్తున్న అందరికీ స్థలాలు కేటాయిస్తారు. సెక్రటేరియెట్, లెజిస్లేచర్లలో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు, హైకోర్టులో పనిచేసే సబార్డినేట్ సిబ్బందికి, రాష్ట్ర రాజధానిలోని హెచ్వోడీల్లో పనిచేసే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులకు స్థలాలు కేటాయిస్తారు. అటానమస్ ఆర్గనైజేషన్లలో పని చేసే వారికి స్థలాలు కానీ, ఫ్లాట్లను కానీ భూమి లభ్యతను బట్టి నామినల్ మార్కెట్ రేటుకు కేటాయిస్తారు. రాష్ట్రంలో రీజినల్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ వారీగా పనిచేసే ఉద్యోగులకు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి నివాసాలు కల్పిస్తారు. గ్రూపు, లేదా కోఆపరేటీవ్ సొసైటీ ద్వారానే ఈ కేటాయింపులు జరుగుతాయి. – ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు జనరల్ హౌసింగ్ పాలసీ, కేపిటల్ సిటీ హౌసింగ్ ఎంకరేజ్మెంట్ పాలసీలు తీసుకొచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం. – అమరావతి అక్రిడేటెడ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జర్నలిస్టులకు సంబంధించి)కు ఎకరం రూ.25 లక్షల చొప్పున 30 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నగర ప్రాంతంలో హౌస్ సైట్, ఇల్లు ఉన్నవాళ్లు అర్హులు కారు. గతంలో ప్రభుత్వ లబ్ధి పొందని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం. – రూ.10 కోట్ల బడ్జెట్‌తో చేనేత కార్మికుల వైద్య ఆరోగ్య బీమా పథకం. కుటుంబానికి రూ.20 వేల చొప్పున బీమా. – ఇప్పటికే ఉన్న రూ.50 కోట్ల డిపాజిట్లతో కలిపి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.300 కోట్లు ముందస్తుగా చెల్లించేలా కోర్టును కోరాలని నిర్ణయం. – చిత్తూరు, నెల్లూరు జిల్లాలు.. పుంగనూరులోని కేబీడీ షుగర్స్, నిండ్రాలోని ప్రొడెన్షియల్ షుగర్స్, బీఎన్ కండ్రిగలోని సుదలగుంట షుగర్స్, పొదలకూరులోని సుదలగుంట షుగర్స్, నాయుడుపేటలోని ఎంపీ షుగర్స్ సంస్థలకు రూ.47.54 కోట్ల మేర పన్ను మినహాయింపు. కోఆపరేటీవ్, నిజాం షుగర్స్ (పబ్లిక్ సెక్టారు), ఖండసారి షుగర్ మిల్లులకు సంబంధించి కొనుగోలు పన్ను, వడ్డీలు, పెనాల్టీలకు సంబంధించి రూ.227,04,59,292 మినహాయింపు. – పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఏపీ అర్బన్ వాటర్ సప్లయ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కింద రూ.2,685.58 కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం. – బందరు డీప్ వాటర్ పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అవసరమైన భూమి ఎకరం రూ.40 లక్షల చొప్పున 122.95 ఎకరాలను ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద మేకవానిపాలెం, పోతిపల్లి గ్రామాల్లో కొనుగోలు చేయాలన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలకు ఆమోదం. – రాజధానిలోని ఐనవోలులో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) భవనాలను 45 మీటర్ల మేర ఎత్తుకు నిర్మించుకునేందుకు అనుమతి. – ఏపీ కో–ఆపరేటీవ్ సొసైటీల చట్టం–1964లో తగిన మార్పులు చేస్తారు. – గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన ల్యాండ్ పూలింగ్ రైతులకు రాజధానిలో కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్సే్ఛంజ్ డీడ్ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు. – రాజధానిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్ర నిర్మాణానికి సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాల భూమి సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ పత్రాలపై స్టాంపులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ పన్ను రూ.1,00,20,600 మినహాయింపు. – విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలో 1052.86 చదరపు గజాల మునిసిపల్ ల్యాండ్‌ను మంత్రాలయం శ్రీరాఘవేంద్ర మఠం వారికి ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలో నాలుగో వంతు ధరకు కేటాయింపు. – ఆర్మ్డ్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా, హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్ఐలుగా పదోన్నతికి ఆమోదం. – హైకోర్టుకు కొత్తగా తొమ్మిది రిజిష్ట్రార్ పోస్టులు మంజూరు. – జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సూపరాన్యుయేషన్ వయసు కంటే తక్కువగా ఉంటే ఒక ఏడాది పదవీకాలం పొడిగింపు. – తూర్పుగోదావరి జిల్లా చింతూరు గ్రామంలోని నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమయ్యే 27 టీచింగ్, 14 నాన్ టీచింగ్ ఉద్యోగాలు మంజూరు. విశాఖ జోన్–1 కు జాయింట్ డెరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టు మంజూరు. ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఒక చీఫ్ ఇంజనీర్, రెండు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఆరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ల పోస్టులు మంజూరు. – శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల పార్కు నిర్మాణం కోసం 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. – శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరం గ్రామంలో పట్టణ ప్రాంత పేదల గృహ నిర్మాణం కోసం మునిసిపల్ కమిషనర్‌కు 23.36 ఎకరాల ప్రభుత్వ భూమి ముందస్తుగా స్వాధీనం. – కృష్ణా జిల్లా చల్లపల్లిలో శ్రీ విజయ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీకి ఐదు ఎకరాల భూమి 20 ఏళ్ల పాటు లీజు. – అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమిటికుంట గ్రామం వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం నెడ్‌క్యాప్‌కు 2.44 ఎకరాల భూమి కేటాయింపు. – వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం బూచుపల్లి, మల్లెల, తొండూరు ప్రాంతంలో విండ్ పవర్ ప్రాజెక్టు కోసం నెడ్‌క్యాప్‌కు 42.70 ఎకరాల భూమి కేటాయింపు. – బాబు జగ్జీవన్ రామ్ సమతా స్ఫూర్తివనం నిర్మాణానికి రూ.50 కోట్లు, 10 సెంట్ల భూమి కేటాయింపు. అమరావతిలో సీఆర్డీఏ నిర్మాణ స్థలాన్ని గుర్తించాక మరో రూ.50 కోట్లు చెల్లించాలని నిర్ణయం. -
‘ప్రత్యేక కోటా’.. త్వరలో టాటా !
సాక్షి, హైదరాబాద్: రైతులకు సబ్సిడీపై అందజేసే ట్రాక్టర్ల ‘ప్రత్యేక రిజర్వు కోటా (ఎస్‌ఆర్‌క్యూ)’ను రద్దు చేయాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీని పట్టించుకోకుండా హైదరాబాద్ నుంచే నేరుగా ఇచ్చే ఈ పద్దతికి చరమగీతం పాడాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇష్టారాజ్యంగా సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చారన్న విమర్శలు రావడంతో ప్రత్యేక కోటాను రద్దు చేయడమే పరిష్కారంగా భావిస్తున్నారు. మరో వైపు ట్రాక్టర్ల కేటాయింపునకు సరికొత్త మార్గదర్శకాలు తయారు చేయాలని యోచిస్తున్నారు. అర్హుల గుర్తింపునకు వీటిని రూపొందించనున్నారు. ప్రస్తుతం సబ్సిడీ ట్రాక్టర్ కేటాయింపునకు ఇన్నెకరాలు ఉండాలన్న నిబంధన లేదు. ఏభై ఎకరాలున్న ధనిక రైతు కూడా సబ్సిడీ ట్రాక్టర్ పొందే అర్హత ఉంది. దీంతో సన్నచిన్నకారు రైతులకు దక్కాల్సిన సబ్సిడీ పక్కదారి పడుతోందన్న విమర్శలు వచ్చాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఎవరైనా పదెకరాల లోపున్న రైతులకే ట్రాక్టర్లు దక్కేలా నిబంధన తేవాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. కోటా తెచ్చిన తంటా... వ్యవసాయ యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేస్తుంది. వీటిని గ్రూపు లేదా వ్యక్తిగతంగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టర్ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. వీటికోసం రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మండలాల్లో వ్యవసాయాధికారి, ఎండీవో, తహసీల్దార్ల బృందం పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. ఆ జాబితాను జిల్లా వ్యవసాయశాఖకు పంపిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాలను పరిశీలించి తుది జాబితాను రూపొందిస్తుంది. ఆ పద్దతిని తోసిపుచ్చుతూ వ్యవసాయశాఖ 2016–17 నుంచి ట్రాక్టర్ల కేటాయింపులో ఎస్‌ఆర్‌క్యూ పద్దతిని ప్రవేశపెట్టింది. ఆ శాఖ మంత్రి సిఫారసు చేసిన రైతులకే ట్రాక్టర్లు మంజూరు చేయడం దీని ఉద్దేశం. దీంతో కలెక్టర్ల ఆమోదం లేకుండానే చాలా ట్రాక్టర్లను సిఫారసు లేఖలతోనే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. మంత్రి పేషీ నుంచి సిఫారసు లేఖ వస్తే చాలు వ్యవసాయశాఖ అనుమతి ఇచ్చి జిల్లాలకు పంపించేవారు. దీంతో కొందరు దళారులు సచివాలయంలోనూ, వ్యవసాయశాఖ కమిషనరేట్‌లోనూ తిష్ట వేసి దందా చేశారన్న ఆరోపణలున్నాయి. వారికి రెండుచోట్లా ఒకరిద్దరు అధికారుల సహకారమున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 8 వేల ట్రాక్టర్లు అనర్హులకేనా? 2016–18 మధ్య దాదాపు 15 వేల వరకు ట్రాక్టర్లు సబ్సిడీపై వ్యవసాయశాఖ ఇవ్వగా, వాటిలో దాదాపు 8 వేల ట్రాక్టర్లు ఎస్‌ఆర్‌క్యూ కిందే ఇచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కొందరు ఫైరవీదారులు వాటిని అమ్ముకొని ఒక్కో ట్రాక్టర్‌పై రూ.లక్ష కమీషన్ తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇలా ఎస్‌ఆర్‌క్యూ కింద భారీ అక్రమాలు జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా. ప్రస్తుత కమిషనర్ రాహుల్ బొజ్జా ట్రాక్టర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై అంతర్గతంగా విచారణ చేసినట్లు తెలిసింది. పైగా ఆర్థికశాఖ వర్గాలు కూడా ఎస్‌ఆర్‌క్యూ కోటా లోపాలను గుర్తించినట్లు తెలిసింది. దీంతో ఈ కోటా రద్దు చేయడమే మేలని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పైగా అర్హత లేకుండా ఇవ్వడంతో ధనికులే అధికంగా ట్రాక్టర్లు దక్కించుకున్నట్లు తేలిందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఇక ఆన్లైన్లో ట్రాక్టర్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: ఉబర్, ఓలా యాప్‌ల ద్వారా కార్లను అద్దెకు బుక్ చేసుకున్నట్లే ఇక నుంచి రైతులు ట్రాక్టర్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ‘టేఫ్’కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ట్రాక్టర్లను బుక్ చేసుకునేందుకు ‘జేఫామ్ సర్వీసెస్’ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సోమవారం ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద ఈ సర్వీసులను అందజేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ట్రాక్టర్లు ఉన్న రైతులు, కస్టమ్ హైరింగ్ సెంటర్లలో ఉన్న ట్రాక్టర్లను ఈ కంపెనీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సంబంధిత యాప్ ద్వారా ట్రాక్టర్ అవసరమైన రైతులు బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇతర వ్యవసాయ యంత్రాలు సైతం.. ట్రాక్టర్లతోపాటు ఇతరత్రా వ్యవసాయ యంత్రాలను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్లు వచ్చి పొలం దున్నాక దానికి అవసరమైన అద్దెను రైతులు ఆన్లైన్ లేదా నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. దేశంలోని 85శాతం మంది సన్న, చిన్నకారు రైతులకు సేవలు అందించేందుకే దీన్ని ప్రవేశపెట్టామని టేఫ్ కంపెనీ చైర్మన్ మల్లిక శ్రీనివాసన్ అన్నారు. ట్రాక్టర్లను యాప్ లేదా హెల్ప్‌లైన్ నంబర్లు 1800 4200 100, 1800 208 4242 ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. తక్కువ ధర ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ట్రాక్టర్లను బుక్ చేసుకునేలా యాప్‌ను తీర్చిదిద్దామన్నారు. టేఫ్ ప్రెసిడెంట్ టీఆర్ కేశవన్ మాట్లా డుతూ.. రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను ఆన్లైనన్లో అద్దెకు అందజేసేలా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ప్రస్తుతం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణల్లో జేఫామ్ సర్వీసుల ద్వారా 65 వేల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇప్పటివరకు 1.45 లక్షల ఆర్డర్లు పొందినట్లు తెలిపారు. జేఫామ్ సర్వీసు దేశంలో ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే పెద్ద వేదికగా మారిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. -
ట్రాక్టర్ల దొంగ అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : అతని కన్ను పడితే ట్రాక్టర్లు మాయం కావాల్సిందే.. ఎంతో చాకచక్యంగా ట్రాక్టర్లను దొంగిలించడంలో అతను సిద్ధహస్తుడు. వివిధ ప్రాంతాల్లో ట్రాక్టర్లను దొంగలించిన కర్నాటి కృష్ణారెడ్డి అనే నిందితుడిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ట్రాక్టర్ ట్రాయిలర్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం వన్‌టౌన్ పోలీస్ష్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరులోని మిట్టమడివీధికి చెందిన కర్నాటి కృష్ణారెడ్డి వ్యవసాయం, ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులు అధికం కావడంతో మూడేళ్ల క్రితం నుంచి వ్యసనాలకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా చేసుకుంటుండగా రాజుపాళెం తహసీల్దార్ అతని ట్రాక్టర్‌ను సీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ప్రొద్దుటూరు వదిలి వెళ్లాడు. ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కృష్ణారెడ్డి ఏడాదిన్నర క్రితం ప్రొద్దుటూరులోని ఆటోనగర్‌లో ఒక ట్రాక్టర్, అద్దంకిలో మరో ట్రాక్టర్‌ను దొంగిలించాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లిపోయి కాంట్రాక్టర్ వద్ద పని చేసుకుంటూ ఉండేవాడు. అప్పడప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి పోయేవాడు. ఈ క్రమంలో 2017 నవంబర్ 17న పెన్నానగర్‌కు చెందిన బత్తల గంగాప్రసాద్‌కు చెందిన ఓ ట్రాక్టర్, అదే నెల 22న సుబ్బిరెడ్డి కొట్టాలలో మరో ట్రాక్టర్‌ను దొంగిలించుకొని పోయాడు. ట్రాక్టర్ యజమానుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డికి నిందితుడు జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులో ఉన్నాడని సమాచారం రావడంతో ఆదివారం సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన రెండు ట్రాక్టర్లను ఎవరికైనా విక్రయించాలనే ఉద్దేశంతో జమ్మలమడుగు మండలం, కన్నెతీర్థం శివాలయం వద్ద పెట్టినట్లు అతను పోలీసు అధికారులకు తెలిపాడు. దీంతో రెండు ట్రాక్టర్లను వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కృష్ణారెడ్డిపై ఆదిలాబాద్, ప్రకాశం జిల్లాలోని పొదిలి పోలీస్ స్టేషన్లో కేసులున్నట్లు డీఎస్పీ తెలిపారు. సుమారు రూ.6 లక్షలు విలువైన ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని, నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐలు నారాయణయాదవ్, ఎంఏఖాన్, హెడ్‌కానిస్టేబుల్ రహంతుల్లా, కానిస్టేబుళ్లు శివనాగిరెడ్డి, ఇస్రాయిల్, మధుసూదనరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. -
ట్రాక్టర్ల దొంగ అరెస్ట
కరీంనగర్‌క్రైం: పదమూడు ఏళ్లుగా రెండు తెలుగురాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర దొంగ కొత్తపల్లిరాజు అలియాస్ బానోత్ రాజును పోలీసులు అరెస్టు చేశారు.అతని వద్దనుంచి రూ.20 లక్షల విలువైన ట్రాక్టర్లు, ట్యాంకర్లు స్వాధీనం చేస్నుఆ్నరు. హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజు అలియాస్ బానోత్ రాజు(40) స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో చెడువ్యసనాలకు బానిసై డబ్బుకోసం చోరీలు చేయడం ప్రారంభించాడు.అతడి భార్య వదిలివెళ్లిపోవడంతో ఓ బాలికను వివాహం చేసుకున్నాడు. తనుకూడా ప్రస్తుతం రాజుతో ఉండడం లేదు. దీంతో ఒంటరిగా ఉంటూ చెడువ్యసనాలకు అలవాడు పడ్డాడు. బస్సుల్లో, రైళ్లలో దూరప్రాంతాలు తిరుగుతూ.. రోడ్డు పక్కన నిలిపిఉంచిన ట్రాక్టర్లు, వాటర్ట్యాంకర్లపై నిఘా ఉంచేవాడు. ఈ క్రమంలో సమీపగ్రామంలో తిష్టవేసి సమయాన్ని చూసుకుని ట్రాక్టర్లు, ట్యాంకర్లు చోరీ చేస్తాడు. తెలంగాణ చోరీచేసిన వాటిని ఆంధ్రాలో, ఆంధ్రాలో చోరీ చేసిన వాటిని తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు. రెండేళ్లు జైలులో ఉండి.. ఈ క్రమంలో ఓ జిల్లాపోలీసులకు చిక్కాడు. రెండేళ్లు జైలు జీవితం అనుభవించాడు. బయటికి వచ్చాక సొంతగ్రామం నుంచి ఓ మారుమూల గ్రామానికి మకాం మార్చాడు. అప్పటి నుంచి మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడు.వరంగల్ జిల్లాలో ఓ ట్రాక్టర్ చోరీచేసి.. దానికి ఇద్దరు పేరున్న రాజకీయ నాయకుల ఫొటోలు అంటించి సబ్సిడీ ట్రాక్టర్‌గా చెప్పుకుంటూ తిరిగేవాడు. దాని సాయంతో కరీంనగర్ టూటౌన్ పరిధిలో, కొత్తపల్లి మండలం పరిధిలో రెండు వాటర్ ట్యాంకర్లు చోరీ చేశాడు. పక్కా నిఘాతో.. చోరీ విషయమై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును సీసీఎస్‌కు అప్పగించారు. ఏసీపీ సూచనలతో సీఐ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. చోరీజరిగిన ప్రాంతాలను పరిశీలించి రాజే నిందితుడిగా గుర్తించారు. అతడిపై నిఘా ఉంచారు. బుధవారం ఉదయం తాను చోరీ చేసిన ట్రాక్టర్ ట్రాలీ, వాటర్ ట్యాంకర్లను ఆటోనగర్‌లో అమ్మడానికి రాజు వస్తుండగా పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద రూ.20 లక్షల విలువైన మాచారెడ్డి, చిల్లకల్లులో చోరీ చేసిన రెండు ట్రాక్టర్లు, బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన ఓ ట్రాలీ, చిల్లకల్లు, సూర్యపేట, కరీంనగర్ టూటౌన్ పీస్‌ల పరిధిలో చోరీకి గురైన నాలుగు వాటర్ ట్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిరణ్, ఎస్సై నాగరాజు,సిబ్బందికి నగదు రివార్డు అందించారు. సీఐకి కిరణ్‌కు ఎంఎస్ఈకి రికమండ్ పలు నేరాల్లో నిందితులను చాకచక్యంగా పట్టుకు న్న సీసీఎస్ సీఐ ఎర్రల కిరణ్‌ను ఎంఎస్ఈ(మెరిటోరియర్స్ సర్వీస్ ఎంట్రీ) మెడల్‌కు రికమండ్ చేస్తున్నామని సీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. త్వరలో ట్రాఫిక్ సిగ్నళ్లు కరీంనగర్ మరో రెండు నెలల్లో సుమారు 18 జంక్షన్ల వద్ద ట్రాపిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిని నియంత్రించడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు ప్రకటించారు. -
చెత్త కుంభకోణం
కర్నూలు నగరంలో చెత్త తరలించడానికి 12 ట్రాక్టర్లు, 2 టిప్పర్లు 4 కాంపాక్టర్లు ( భారీ స్థాయిలో చెత్త తరలించే వాహనాలు) ఉన్నాయి. ఇవి చాలదన్నట్లు అధికారులు ప్రైవేట్ చెత్త ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.780 ప్రకారం ఏడాదికి కోటి రూపాయలకు పైగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు (టౌన్): కర్నూలులో 5.50 లక్షల జనాభా ఉంది. ఇక్కడ 51 వార్డులను పారిశుద్ధ్య పరంగా 13 డివిజన్లుగా విభజించారు. ప్రతి రోజు 170 మెట్రిక్ టన్నుల చెత్త తరలించాల్సి ఉంది. వీటిని తరలించేందుకు నగరపాలక సంస్థకు సంబంధించిన ట్రాక్టర్లు ఉన్నా వినియోగించడం లేదు. ప్రైవేట్ ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే.. చెత్తను తరలించేందుకు ట్రిప్పుల విధానం అమలవుతోంది. ప్రభుత్వ ట్రాక్టర్లను ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు. వీటికి ఎలాంటి ఖర్చు ఉండదు. అయితే ప్రైవేట్ ట్రాక్టర్లకు ప్రతి రోజు ఐదు ట్రిప్పులు కేటాయించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 780ప్రకారం ఐదు ట్రిప్పులకు రూ. 3,900 నగరపాలక సంస్థ చెల్లిస్తుంది. ప్రతి రోజూ 13 ప్రైవేట్ ట్రాక్టర్లకు రూ. 49,400 చెల్లిస్తున్నారు. నెలకు. రూ. 14,80,000 ప్రకారం ఏడాదికి రూ.1,77,84,000 చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేట్ ట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తున్నా...కర్నూలులో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్న ప్రభుత్వ ట్రాక్టర్లకు డీజీల్ ఖర్చు ఏటా రూ.1,20,00,000 అవుతున్న విషయం విదితమే. ప్రైవేట్ ట్రాక్టర్ల నుంచి మున్సిపల్ అధికారులు ట్రిప్పుకు ఇంత అని కమీషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డంపింగ్ యార్డు వద్దా ఇదే పరిస్థితి.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు 25కు పైగా ట్రాక్టర్ల ద్వారా వస్తున్న చెత్తను పాతబస్తీ జమ్మిచెట్టు వద్ద (ట్రాన్సిట్ పాయింట్)కు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి చెత్తను గార్గేయపురానికి తరలించాలి. ఇక్కడ కూడా ప్రభుత్వ ట్రాక్టర్లు ఉన్నాయి. టిప్పర్లు ఉన్నాయి. కాంపాక్టర్లు ఉన్నాయి. అయినా... వీటన్నింటినీ పక్కన పెట్టారు. ఇక్కడి నుంచి చెత్తను తరలించేందుకు రెండు ప్రైవేట్ టిప్పర్లకు అప్పగించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 2 వేల ప్రకారం చెల్లిస్తున్నారు. -
తెలంగాణలో తొలి టఫే ప్లాంటు ఏర్పాటు
-
తెలంగాణలో టఫే ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల తయారీలో ఉన్న ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టఫే) తెలంగాణలో హై ప్రెసిషన్ ఇంప్లిమెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. హై ప్రెసిషన్ ఇంప్లిమెంట్స్‌తో తక్కువ నీటి వినియోగం, తక్కువ ఎరువు వాడకం, విత్తనాలు, మొక్కలు సరైన రీతిలో నాటేందుకు వీలవుతుంది. కంపెనీ విదేశాల్లో ఉన్న ప్లాంట్లలో వీటిని తయారు చేసి విక్రయిస్తోంది. యూనిట్ కార్యరూపంలోకి వస్తే భారత్‌లో టఫేకు ఇది తొలి కేంద్రం అవుతుంది. ఈ యంత్రాల తయారీ యూనిట్ కోసం తొలుత రూ.200 కోట్ల వరకు పెట్టుబడి అవసరం ఉండొచ్చని టఫే ప్రొడక్ట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టి.ఆర్.కేశవన్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. విదేశీ కంపెనీల సహకారంతో వీటిని భారత్‌లో తయారు చేస్తామన్నారు. రైతులకు ఉచిత సేవలు.. తమిళనాడు, రాజస్థాన్‌లో టఫే జేఫామ్స్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ విత్తన పరిశోధన చేస్తారు. తక్కువ రోజులకు పంట చేతికొచ్చే కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకంపై రైతులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తారు. అవసరమైన వ్యవసాయ పరికరాలను అభివృద్ధి చేస్తారు. టఫే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద జేఫామ్ సేవలన్నీ రైతులకు ఉచితంగా అం దిస్తోంది. అస్పాం, తెలంగాణలో సైతం జేఫామ్ ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. 50 హెక్టార్ల స్థలం సమకూర్చాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కంపెనీ కోరింది. 30 సంవత్సరాల తర్వాత ఈ స్థలాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇస్తామని కేశవన్ తెలిపారు. తెలంగాణలో ఎఫ్2ఎఫ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అద్దెకు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు కావాల్సిన వారు ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చు. -
‘రైతురథం’ పచ్చ చొక్కాలకే
సాక్షి, ఆదోని: వ్యవసాయం చేసుకునేందుకు ట్రాక్టర్లు ఇచ్చే రైతు రథం పథకం పచ్చచొక్కాలకే పరిమితమైందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకున్నా ట్రాక్టర్లు మంజూరు కావడం లేదన్నారు. ఈ విషయం పలువురు రైతులు తన దృష్టికి తీసుకురావడంతో ఒక్కో ట్రాక్టర్‌పై రూ. లక్ష సబ్సిడీతో నియోజకవర్గంలోని 20 మందికి ఇప్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా అలసందగుత్తి గ్రామానికి చెందిన రైతు ఉరుకుందప్పకు ట్రాక్టర్ అందజేశారు. అన్నదాత ఆనందంగా ఉండటం కోసం ఆ సబ్సిడీ మొత్తాన్ని ట్రాక్టర్ కంపెనీకి తానే చెల్లిస్తానన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పార్టీలకతీతంగా రైతు రథం కింద ట్రాక్టర్లు మంజూరు చేయాలని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పార్టీలకతీతం సంక్షేమ పథకాలు మంజూరయ్యాయన్నారు. బాబు పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెద్దయ్య, మాజీ సర్పంచ్ పెద్ద పెద్దయ్య, ఉప సర్పంచ్ బసరకోడు ఈరన్న, పెద్దయ్య, రైతులు పాల్గొన్నారు. -
రైతు రథం పథకాన్ని దారి మళ్లిస్తోన్న టీడీపీ
-
‘తమ్ముళ్ల’కే ట్రాక్టర్లు!
- ‘రైతురథం’ కింద జిల్లాకు 520 సబ్సిడీ ట్రాక్టర్లు – మండలానికి 6–10 వరకు కేటాయించే అవకాశం – దందాకు తెరలేపిన అధికార పార్టీ నేతల అనుచరులు – మార్గదర్శకాలు రాకనే పైరవీలు సాక్షి ప్రతినిధి, కర్నూలు : రైతులకు సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీకి ఉద్దేశించిన ‘రైతురథం’ పథకం కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లకు బ్రహ్మరథంగా మారుతోంది. తాము చెప్పిన వారికే ట్రాక్టర్లు ఇవ్వాలంటూ ఇప్పటికే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. వారి అనుచరులు ఒకడుగు ముందుకేసి.. ట్రాక్టర్లు ఇచ్చేది తమ వారికేనంటూ మండలాల వారీగా జాబితాలు తయారుచేసే పనిలో పడ్డారు. ఇదే అదనుగా ట్రాక్టర్లు ఇప్పిస్తామంటూ కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు కమీషన్లు దండుకునే పనిలో పడ్డారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల ట్రాక్టర్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాకు 520 ట్రాక్టర్లు వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. జిల్లాలో 54 మండలాలను లెక్కిస్తే ఒక్కో మండలానికి 6 నుంచి 10 ట్రాక్టర్లు వచ్చే అవకాశముంది. వీటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పోటీ ప్రారంభమయ్యింది. దీన్ని అదనుగా చూసుకుని కొద్ది మంది అమ్యామ్యాలకు తెరలేపారు. దీనికితోడు జిల్లాలో మొత్తం అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో సిద్ధం చేయనుండడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు దక్కేది అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్చార్జ్ మంత్రికే అధికారాలు! రైతురథం పథకం కింద ట్రాక్టర్‌తో పాటు వ్యవసాయ పనిముట్లకు ఒక్కో దానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకూ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల జాబితాను ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)తో కలిసి తయారుచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో నియోజకవర్గాల వారీగా జాబితాల తయారీని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు చేపడుతున్నారు. ఇదే అదనుగా కొద్ది మంది వారి అనుచరులు కమీషన్లకు తెరలేపారు. మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి... మీకు ట్రాక్టర్ ఇప్పిస్తామని ఆశలు రేపుతున్నారు. మరికొంత మంది అధికార పార్టీ నేతలు బినామీ పేర్లతో దరఖాస్తు చేయించేందుకు సిద్ధమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాక్టర్ల పంపిణీకి ఇంకా నిర్దిష్ట మార్గదర్శకాలు రాలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గానికి ఎన్ని ట్రాక్టర్లు కేటాయించిన విషయమూ ఇంకా తమకు తెలియలేదని అంటున్నారు. ఇవీ నిబంధనలు –రైతురథం పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుకు కనీస రెండెకరాల పొలం ఉండాలి. – అప్పటికే సబ్సిడీ కింద ట్రాక్టర్లను తీసుకుని ఉండరాదు. – దరఖాస్తుదారుడి పేరు మీద ఇప్పటికే ట్రాక్టర్ ఉంటే అనర్హుడు. – ఆధార్, పాస్‌బుక్‌లను చూపించి మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేయాలి. – దరఖాస్తు సమయంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. – వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హులను ఎంపిక చేస్తారు. ఇన్చార్జ్ మంత్రి, జేడీఏ కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇన్చార్జ్ మంత్రి కాస్తా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చెప్పిన వారినే ఎంపిక చేసే అవకాశముంది. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కర్నూలు: నగర శివారులోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో ఎస్ఐ గిరిబాబు తన సిబ్బందితో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. పంచలింగాల గ్రామానికి చెందిన షేక్ మౌలాలి, ఆంజనేయులు, బోయ రాజు నాయుడు, బిచ్చన్న నాయుడు, వెంకటనారాయణ, నిడ్జూరు గ్రామానికి చెందిన సయ్యద్‌మహబూబ్, సయ్యద్ రాజుబాష, బోయ రఘుబాబు, పంచలిగాల గ్రామానికి చెందిన బోయ మహేంద్ర, శివప్రసాద్, అయ్యస్వాములు, మునగాలపాడుకు చెందిన బోయ శివుడు, ఆంబోతు అంత్య, రంగారెడ్డి జిల్లా చెంగారెడ్డి గూడెంకు చెందిన ఐచ్చర్ లారీతో పాటు 12 ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. అందరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
జగిత్యాల రూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను తిప్పన్నపేట గ్రామ శివారులో రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. వీటిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
25 ఇసుక ట్రాక్టర్లు సీజ్
జగిత్యాల: అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన సబ్ కలెక్టర్ 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన సబ్ కలెక్టర్ శశాంక్ ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివారు నుంచి తరలుతున్న 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. -
9 ట్రాక్టర్లు, 6 ఆటోలు సీజ్
కోవూరు: నిబంధనలకు విరుద్ధంగా, సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 9 ట్రాక్టర్లు, 6 ఆటోలను సోమవారం సీజ్ చేసి కోవూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ అళహరి వెంకట్రావు కోవూరులో తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి లైసెన్స్ లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్ లేకపోతే బాధితులకు ఎటువంటి ఆర్థిక భరోసా ఉండదన్నారు. దీన్ని దష్టిలో పెట్టుకుని వాహన చోదకులు సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. -
వృద్ధికి జల సంరక్షణే మార్గం
♦ వర్షాలపై ఆధారపడటం తగ్గించాలి ♦ డ్రైవర్లు లేని ట్రాక్టర్లు తయారు చేస్తాం ♦ ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్య ముంబై : వర్షపాతంపైనే ఆధారపడటం, దీని ప్రాతిపదికననే ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ప్రణాళికలు రూపొందించుకోవడం సరికాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. జల సంరక్షణ, జల వనరుల సక్రమ వినియోగం, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించడంపై పరిశోధన వంటివి చేయాలన్నారు. దీంతో నీటి వనరుల సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి కూడా పెరుగుతాయని, జల కాలుష్య నివారణపైనా దృష్టి సారించాల్సి ఉందని చెప్పారాయన. ‘‘ఇలా చేస్తే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంతవరకూ రుతుపవన ఒడిదుడుకుల నుంచి బయటపడతాం. పూర్తి స్వరాజ్యం సాధిస్తాం. ఈ దిశగా కృషి చేయాలి’’ అని బుధవారమిక్కడ జరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) 70వ వార్షిక సాధారణ సమావేశంలో చెప్పారు. జీఎస్టీతో వృద్ధి పరుగు దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు చర్యల పట్ల ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. భారత్ భారీ మార్కెట్‌ను బోనులో ఉన్న పులితో ఆయన పోలుస్తూ, ఇప్పుడు దీనికి విముక్తి లభించిందన్నారు. దీనివల్ల దేశంలో ప్రైవేటు పెట్టుబడుల వాతావరణం మరింత మెరుగుపడుతుందని, వృద్ధి పటిష్టమవుతుందని చెప్పారు. డ్రైవర్ రహిత ట్రాక్టర్లు..! డ్రైవర్ రహిత ట్రాక్టర్ల గురించి ఆనంద్ మహీంద్రా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ ట్రాక్టర్ల ఉత్పత్తి ద్వారా భవిష్యత్‌లో ఆహారోత్పత్తి విధానంలో గణనీయమైన మార్పులు వస్తాయని ఆయన చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు, కీలక స్థానంపై సంస్థ దృష్టి సారించనుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మహీంద్రా లాభం రూ.955 కోట్లు ఎంఅండ్ఎం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.955 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.850 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని సంస్థ తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.10,471 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.11,943 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ1లో వాహన విక్రయాలు 10 శాతం పెరిగి 1,10,959కు, యుటిలిటి వాహనాల అమ్మకాలు 13 శాతం వృద్ధితో 55,909కు, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం వృద్ధితో 71,785కు పెరిగాయని వివరించింది. -
ఐడియా అదుర్స్
కేజ్‌వీల్స్ ట్రాక్టర్ల రాకపోకలపై ఆంక్షలు రోడ్డెక్కితే కొరడా ఝళిపిస్తున్న అధికారులు ప్రత్యామ్నయం ఆలోచించిన రైతులు ప్రత్యేక ట్రాలీలపై ట్రాక్టర్ల తరలింపు మోర్తాడ్:రోడ్లపై కేజ్‌వీల్స్ ట్రాక్టర్ల రాకపోకలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై కనబడితే చాలు జరిమానాలు, కేసు నమోదులతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. దీంతో కేజ్‌వీల్స్ ట్రాక్టర్లను పొలాల వరకు తరలించడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు తమ ఆలోచనకు పదును పెట్టారు. రోడ్లు పాడవకుండా కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌ను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేజ్‌వీల్స్ ఉన్న ట్రాక్టర్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడానికి ప్రత్యేకంగా ట్రాలీని తయారు చేయించారు. ఈ ట్రాలీలో కేజ్‌వీల్స్‌తో కూడిన వాహనాన్ని ఉంచి, మరో ట్రాక్టర్ సాయంతో పొలాలకు తరలిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. వరినాట్లు వేసేందుకు కేజ్‌వీల్స్‌తో పొలాలను దమ్ము చేస్తారు. ఎడ్లతో దమ్ము చేసే విధానం ఎప్పుడో కనుమరుగైంది. రైతులు పూర్తిగా యాంత్రీకరణపైనే ఆధారపడ్డారు. కేజ్‌వీల్స్ ఉన్న ట్రాక్టర్లతో దమ్ము చేసి నాట్లు వేస్తున్నారు. అయితే కేజ్‌వీల్స్ ఉన్న ట్రాక్టర్లు రోడ్లపై వెళ్తుండడంతో రహదారులు త్వరగా దెబ్బ తింటున్నాయి. ఎంతో ఖర్చు చేసి తారు రొడ్లు నిర్మిస్తే కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్ల రాకపోకలతో రహదారులను పాడు చేస్తున్నారని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. రోడ్లపై కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లను తిప్పడాన్ని పూర్తిగా నిషేధించింది. ఒకవేళ ఎవరైనా కేజ్‌వీల్స్‌తో ట్రాక్టర్లను తిప్పితే జరిమానాల విధింపుతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు. కేజ్‌వీల్స్‌ను ట్రాక్టర్‌కు అమర్చిన తరువాత వాటిని తొలగించి మళ్లీ అమర్చాలంటే అంత సులభం కాదు. అలాగని రోడ్లపై తిప్పితే అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేజ్‌వీల్స్ ట్రాక్టర్లను తరలించేందుకు మోర్తాడ్ మున్నూరు కాపు సంఘానికి చెందిన కొందరు రైతులు ప్రత్యేకంగా ట్రాలీని తయారు చేయించారు. దీనిపై కేజ్‌వీల్స్ ట్రాక్టర్‌ను ఉంచి, మరో ట్రాక్టర్ సాయంతో పంట పొలాలకు తరలిస్తున్నారు. ట్రాలీ తయారీకి రూ.70 వేల వరకు ఖర్చయిందని రైతులు తెలిపారు. తమ కేజ్‌వీల్స్ ట్రాక్టర్లతో పాటు ఇతరుల వాహనాలు కూడా తరలించేందుకు అద్దెకు ఇస్తున్నారు. దూరాన్ని బట్టి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. -
సబ్సిడీ ట్రాక్టర్ల దరఖాస్తులపై డీడీఏ ఆరా
రఘునాథపల్లి : సబ్సిడీ ట్రాక్టర్ల మంజూరుకి వచ్చిన దరఖాస్తులపై వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ (డీడీఏ) మోహన్‌రెడ్డి గురువారం ఆరా తీశారు. ముడుపులిస్తేనే ట్రాక్టర్ శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. స్థానిక వ్యవసాయ కార్యాయంలో సబ్సిడీ ట్రాక్టర్ల దరఖాస్తులు, రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర పర్టిలైజర్షాపులో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ రిని హుమేరానౌసిన్, ఏఈఓలు సుప్రజ్యోతి, రోజా పాల్గొన్నారు. -
పది ఇసుక ట్రాక్టర్లు సీజ్
సుండుపల్లి(వైఎస్సార్): వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని బాహుదా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పది ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. నిత్యం నది నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పడ్డబలిజపల్లి గ్రామస్తులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు. ఈ మేరకు వారు ఎమ్మార్వో సుబ్రమణ్యంరెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన వీఆర్వోను సంఘటన స్థలికి పంపారు. ఆయన అక్కడికి చేరుకుని పది ఇసుక ట్రాక్టర్లను ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు. -
ఆరు ఇసుక ట్రాక్టర్ల సీజ్
పెద్దకందుకూర్ (యాదగిరిగుట్ట) : మండలంలోని పెద్దకందుకూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు, ఒక జేసీబీసీ యాదగిరిగుట్ట ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి సీజ్ చేశారు. గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో వాగులో నిఘాపెంచిన ఎస్ఐ ఆదివారం పక్క సమాచారంతో అక్కడి వెళ్లి పట్టుకున్నారు. దీంతో ఆ ట్రాక్టర్లను స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే సహించేది లేదన్నారు. -
ఎమ్మెల్యే చెబితేనే మంజూరు!
అనంతపురం: వ్యవసాయశాఖ అమలు చేస్తున్న మినీట్రాక్టర్ల పథకంలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ పథకాన్ని రాజకీయ నాయకులే అమలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ప్రతి పథకంలోనూ రాజకీయ నాయకులు జోక్యం ఎక్కువ కావడంతో అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇపుడు మినీట్రాక్టర్ల మంజూరులో అధికార పార్టీ నేతలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఓకే చేయకుంటే ఏ పార్టీకి చెందిన రైతుకైనా ట్రాక్టర్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. తొలివిడతలో 60 మందికి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ ఏడాది జిల్లాకు 500 మినీట్రాక్టర్లు మంజూరయ్యాయి. 50 శాతం రాయితీ లేదా గరిష్టంగా రూ.1.93 సబ్సిడీ వర్తింపజేశారు. కుబోటా, మిత్సుబిషి శక్తి, మహింద్రా, కెప్టెన్, ఇంటర్నేషనల్ కంపెనీలకు చెందిన ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో చివరి మూడు కంపెనీలకు చెందిన మినీట్రాక్టర్లపై రైతులు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. కుబోటా, మిత్సుబిషి కంపెనీలకు చెందిన ట్రాక్టర్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ రెండు కంపెనీలకు చెందిన డీలర్లకు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల అండదండలు ఉన్నట్లు కూడా సమాచారం. ఈ క్రమంలో తొలివిడత జాబితాలో 60 మంది వరకు దరఖాస్తు చేసుకోగా అనుమతుల కోసం కలెక్టర్‌కు ఫైలు సిద్ధం చేశారు. ఇందులో మిత్సుబిషి కంపెనీ ట్రాక్టర్ కోసం ఎక్కువ దరఖాస్తులు రావడంతో మరో కంపెనీకి మింగుడుపడటం లేదని సమాచారం. ఆ ట్రాక్టరే బాగుంటుంది... ఎక్కువ మంది రైతులు ఒకే కంపెనీ ట్రాక్టర్లకోసం దరఖాస్తులు చేసుకోవడంతో..ఇతర కంపెనీల డీలర్లు కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా ట్రాక్టర్లు మంజూరు చేయకూడదని షరతు పెట్టినట్లు సమాచారం. అంతేకాకుండా వ్యవసాయశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులను ఆ ట్రాక్టర్ అయితే ఇస్తామనేలా చెప్పిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్ అదే బాగుంటుందని, దాన్ని కోరుకుంటే ఇవ్వడానికి సిద్ధమని లేదంటే ఇంకో ట్రాక్టర్ అయితే రావడం కష్టమని రైతులను మభ్యపెడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ ట్రాక్టర్పైనే మక్కువ ఎందుకంటే.. చాలా మంది మండల స్థాయి అధికారులు ఒక కంపెనీ ట్రాక్టర్‌నే సిఫారసు చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఎక్కువ మంది రైతులు మరో ట్రాక్టర్‌పై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ధరలు, విడిభాగాల విషయానికి వస్తే రెండింటి మధ్య తేడా ఎక్కువగానే ఉంది. మిగతా కంపెనీల ట్రాక్టర్లతో పోల్చిచూసినా తేడా స్పష్టంగా కనిపిస్తుంది. విడిభాగాల విషయానికి వస్తే రూ.20 విలువ చేసే వస్తువు రూ.100 పెట్టి కొనాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని విడిభాగాలు దొరకడం కూడా కష్టమంటున్నారు. మిత్సుబిషి కంపెనీ ట్రాక్టర్‌తో పాటు రోటోవీటరు ఇస్తుండగా, కుబోటా కేవలం ట్రాక్టర్ మాత్రమే పంపిణీ చేసే పరిస్థితి ఉందంటున్నారు. మిగతా జిల్లాల్లో పూర్తయిన ప్రక్రియ జిల్లాలో అధికార పార్టీ రాజకీయ నేతలు, వారి అనుచర డీలర్ల మధ్య మినీట్రాక్టర్లు నలుగుతుండగా వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే రైతులకు ఇవ్వగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ మాత్రం తొలివిడతగా ఫైలు సిద్ధం చేసిపెట్టారు. ట్రాక్టర్ మాది బాగుందంటూ ఒకరు... కాదు కాదు... మాది అంతకన్నా బాగుందంటూ ఇంకొకరు తెరవెనుక రాజకీయం నడుపుతుండటంతో 500 ట్రాక్టర్లు రైతులకు చేరాలంటే ఎన్ని నెలలు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ఒకే చెప్పనిదే ఇచ్చేది లేదంటే వైఎస్సార్ సీపీ మద్దతుదారు రైతులకు 10 శాతం కూడా మంజూరు చేసే పరిస్థితి అసలు కనిపించడం లేదు. -
కాకతీయకు ‘మెషినరీ’ దెబ్బ!
♦ చెరువుల పూడికతీత పనులకు దొరకని ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లు ♦ కావాల్సిన ప్రొక్లెయిన్లు 10 వేలు.. అందుబాటులో ఉన్నవి 6 వేలే.. ♦ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెప్పిస్తున్నా చాలని వైనం ♦ మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పనులకు ఆటంకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ను మెషినరీ కొరత వేధిస్తోంది. చెరువుల పూడికతీతకు అవసరమయ్యే ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, కాంక్రీట్ మిక్సర్ల కొరత మిషన్ పనులకు అడ్డంకిగా మారింది. రాష్ట్రంలో ఉన్నవి కాక.. పక్క రాష్ట్రాల నుంచి ప్రొక్లెయిన్లు తెప్పిస్తున్నా సరిపోవడం లేదు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, రోడ్లు, భవనాల నిర్మాణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతుండటం, ప్రధాన కాంట్రాక్టర్లంతా మెషినరీని ఆ పనులకు తరలిస్తుండటంతో చెరువు పనులకు యంత్రాలు దొరకడం లేదు. దీంతో ఒక చెరువు పరిధిలో రోజుకు 300 నుంచి 400 క్యూబిక్ మీటర్ల పూడికను తీయాల్సిం ఉండగా.. ప్రస్తుతం అది 100 క్యూబిక్ మీటర్లను కూడా దాటడం లేదు. రాష్ట్రంలో రెండో విడత మిషన్ కాకతీయ కింద 9,035 చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా, అందులో 8,862 చెరువులకు టెండర్లు పిలిచారు. ఇందులో 7,746 చెరువు పనులకు ఒప్పందాలు కుదరగా, 7,108 చెరువుల్లో పనులు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం పూడికతీత పనులు చేసేందుకు గరిష్టంగా మరో నెల గడువే ఉన్నా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పనుల్లో వేగం కనిపించడం లేదు. ఇతర కారణాలు ఎలా ఉన్నా.. మెషినరీ కొరత మాత్రం పనులకు బంధనమేస్తోంది. ఉన్నవి ఆరు వేలే... రాష్ట్రంలో చెరువుల పనులకు 10 వేల ప్రొక్లెయిన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 6 వేలు మాత్రమే ఉన్నాయి. ట్రాక్టర్ల అవసరం 15 వేల వరకు ఉండగా, అవి 10 వేల మేర ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ దృష్ట్యా పనుల కోసం ఖమ్మం, నల్లగొండ జిల్లా కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి, మహబూబ్‌నగర్ కాంట్రాక్టర్లు రాయలసీమ, కర్ణాటక నుంచి, ఆదిలాబాద్ జిల్లా కాంట్రాక్టర్లు మహారాష్ట్ర నుంచి మెషినరీ తెప్పిస్తున్నారు. దీంతో ఈ జిల్లాల్లో పనుల్లో కొంత మెరుగుదల కనబడుతోంది. మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం మెషినరీ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో వరంగల్ జిల్లాలో 1,081 చెరువులకు గానూ 649, కరీంనగర్లో 1,054 చెరువులకు 753, నిజామాబాద్‌లో 649కి 547, మెదక్‌లో 1,679కి 1,512 చెరువుల్లో మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండటంతో ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లు ఆ పనులకు తరలివెళుతున్నాయి. వీటితో పాటే గ్రామీణ రోడ్లు, రెండు పడకల ఇళ్ల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలుకావడంతో ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, కాంక్రీట్ మిక్సర్లు, సెల్ఫ్ లోడర్స్ అన్నీ ఆ పనులకే వెళుతున్నాయి. తగ్గిన పూడికతీత సామర్థ్యం గత ఏడాది ఒక్కో చెరువు కింద 3 నుంచి 4 ప్రొక్లెయిన్లు.. 30 నుంచి 40 ట్రాక్టర్లు పనిచేసేవి. దీంతో ప్రతి రోజూ సుమారు 300 క్యూబిక్ మీటర్ల పూడికను తీసే వీలు కలిగింది. ప్రస్తుతం ఒక్కో చెరువు పరిధిలో ఒక ప్రొక్లెయిన్, 10కి మించని ట్రాక్టర్లు ఉండటంతో రోజూ 100 క్యూబిక్ మీటర్ల పూడికతీత కూడా సాధ్యం కావడం లేదు. ఈ సమస్య కారణంగా వర్షాలు మొదలయ్యే నాటికి అనుకున్న మేర పూడికతీత సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. -
ఎస్సీ, ఎస్టీ రైతులకు ట్రాక్టర్లు ఉచితం
సీఎం వద్దకు ఫైలు... ఆమోదం తర్వాత జీవో విడుదల హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా వ్యవసాయ ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ట్రాక్టర్ల సబ్సిడీని మరింత పెంచింది. ప్రస్తుతం అన్ని వర్గాల రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లను ఇస్తుండగా... ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 95% వ్యవసాయశాఖ ద్వారా, మిగిలిన 5% ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ సొమ్ము అందజేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్రీన్హౌస్ సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% చేయగా... దాంతోపాటు ట్రాక్టర్లకూ అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. సీఎం ఆమోదించాక రెండింటికీ కలిపి త్వరలో జీవోలు విడుదల కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీని వ్యక్తిగతంగా ఇవ్వడంతోపాటు ట్రాక్టర్లను అద్దెకు ఇచ్చుకునేట్లయితే దానికీ 100% సబ్సిడీ ఇస్తారు. ఇతర వ్యవసాయ యంత్రాలతోపాటు వీటినీ సరఫరా చేస్తారు. ఇతర వ్యవసాయ యంత్రాలకు మాత్రం అందరికీ ఉన్న సబ్సిడీ ఎస్సీ, ఎస్టీలకూ కొనసాగుతుంది. -
వ్యవ‘సాయం’లో మహీంద్రా ట్రింగో
♦ అద్దెకు ట్రాక్టర్లు, యంత్రాలు ♦ సొంత యంత్రాలుంటే... వారే ఫ్రాంచైజీలు ♦ దశలవారీగా దేశవ్యాప్త విస్తరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ట్రాక్టర్లు కొనలేని వారికి వాటిని అద్దెకివ్వటం కూడా చేయాలని వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది. ఇందుకోసం ‘ట్రింగో’ పేరిట ఓ యాప్ ద్వారా పలు సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. సాగుకు కావాల్సిన ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను అద్దెకివ్వడమే ఈ కొత్త సేవల లక్ష్యం. ఖరీదైనవి కావడంతో లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు, యంత్ర పరికరాల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. వ్యవసాయం ఒకవంక పెరుగుతున్నా... ట్రాక్టర్ల పరిశ్రమ గతంలో ఏడాదికి 6.30 లక్షల యూనిట్లు విక్రయించి... ఇపుడు 5 లక్షల లోపే నమోదు చేస్తోందంటే... కారణమదే. దీంతో ఫ్రాంచైజీలను ప్రోత్సహించడం ద్వారా తక్కువ అద్దెకు అత్యాధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచాలని మహీంద్రా భావిస్తోంది. ట్రింగో యాప్ లేదా ఫోన్ ద్వారా రైతులు తమ అవసరం ఏంటో చెబితే చాలు... చెప్పిన సమయానికి పొలం ముందు ఇవి ప్రత్యక్షమవుతాయి. తొలుత ఈ సేవలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో అందుబాటులోకి రానున్నాయి. దశల వారీగా దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. అదనపు ఆదాయం..: రెండు మూడు నెలల అవసరానికి ట్రాక్టర్లు, యంత్రాలను కొనుగోలు చేయడం వృథా అన్న భావన చాలామందికి ఉంటుంది. మరోవైపు రైతులందరికీ వీటిని కొనుగోలు చేసే స్తోమత లేదని మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. ఇటువంటి వారికి ట్రింగో పెద్ద ఉపశమనమని చెప్పారాయన. కాగా, ట్రాక్టర్లు, వీడర్లు, రైస్ ట్రాన్స్‌ప్లాంటర్, ఫెర్టిలైజర్ స్ప్రెడర్, హార్వెస్టర్, బేలర్, ష్రెడ్డర్, ముల్చర్, కేన్ థంపర్ తదితర యంత్రాలు సొంతానికి కొన్నా వీటి వినియోగం కొన్ని రోజులకే పరిమితమవుతోంది. మిగిలిన రోజులు ఓ మూలన పడి ఉంటున్నాయి. ఇటువంటి యజమానులు ఫ్రాంచైజీలుగా మారి తమవద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వవచ్చు. కంపెనీతో చేతులు కలపడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. ట్రింగో అగ్రిగేటర్ పాత్ర పోషిస్తూ రైతులను, యజమానులతో అనుసంధానిస్తుంది. సేవలకుగాను ఫ్రాంచైజీల నుంచి కమిషన్ తీసుకుంటుంది. మహీంద్రాతోపాటు ఇతర బ్రాండ్ల ట్రాక్టర్లనూ అద్దెకు ఇవ్వవచ్చు. నియంత్రణలో చార్జీలు..: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన కస్టమ్ హైరింగ్ స్కీంలో మహీంద్రా సైతం భాగస్వామిగా ఉంది. రైతులకు తక్కువ ధరకే అద్దెకు ట్రాక్టర్లు, యంత్రాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతోనూ తాము చర్చిస్తున్నామని సాహా తెలిపారు. గుజరాత్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందన్నారు. ఔత్సాహికులకు వ్యాపార అవకాశమని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ఇక ట్రింగో సేవల్లో యంత్రాలు, నేల రకాలు, సమయాన్నిబట్టి అద్దె ఎంత ఉండాలో మహీంద్రా నిర్ణయిస్తుంది. మహీంద్రాతో తొలి అడుగు.. భారత్‌లో ట్రాక్టర్లు, యంత్రాల అద్దె వ్యాపారం పూర్తిగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది. ఏటా రూ.15,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. మహీంద్రా అడుగు పెట్టడం ద్వారా పరిశ్రమకు కొత్తరూపు రానుంది. మరో విశేషమేమంటే ట్రాక్టర్ల అమ్మకాల పరంగా భారత్‌లో తొలి స్థానాన్ని సొంతం చేసుకున్న మహీంద్రా... వ్యవసాయ పనిముట్ల తయారీలోనూ తనదైన ముద్రవేసింది. 2015-16లో సుమారు 5 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయితే దీన్లో 41 శాతం వాటా మహీంద్రాకు ఉంది. 85-90 శాతం మంది వాయిదా పద్ధతిలో ట్రాక్టర్లను, యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. తమ కస్టమర్లలో ప్రస్తుతం 35-40 శాతం మందికి మహీంద్రా ఫైనాన్స్ రుణం సమకూరుస్తోందని కంపెనీ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.సాహా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పరిగి: పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను రంగారెడ్డి జిల్లా పరిగి మండలం శిగుపల్లి సమీపంలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో.. అప్రమత్తమైన స్థానికులు ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 11 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. -
వ్యవసాయ ట్రాక్టర్ల రాయితీలో కోత!
* 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని యోచన * రైతుల నుంచి డిమాండ్ పెరగడం వల్లే... ఇప్పటికే పెండింగ్‌లో 10 వేల దరఖాస్తులు * రాజకీయ నాయకుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు సరఫరా చేస్తోన్న ట్రాక్టర్ల రాయితీని తగ్గించాలని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ట్రాక్టర్లకు ఇస్తున్న 50 శాతం రాయితీని 25 శాతానికి తగ్గించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సగం ధరకే ట్రాక్టర్లను అందజేస్తుండటంతో రైతుల నుంచి, అధికార పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. నిర్ణీత సంఖ్యకు మించి అనేక రెట్లు డిమాండ్ ఉండటంతో రాయితీని తగ్గించడమే పరిష్కారమని వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేవలం అధికార పార్టీ నేతల అనుచరులకే ఈ సబ్సిడీ ట్రాక్టర్లు అందాయన్న విమర్శలున్నాయి. రాయితీని తగ్గిస్తే రాబోయే రోజుల్లో సాధారణ రైతులు నష్టపోయే అవకాశం ఉండనుంది. కేటాయింపులే తక్కువ తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల సరఫరాకు రూ. 200 కోట్లు కేటాయించింది. అందులో కేంద్రం వాటా, రాష్ట్రం వాటా ఉన్నాయి. వ్యవసాయ యంత్రాల్లో భూమిని చదును చేయడం నుంచి కోతల వరకు పనికి వచ్చే యంత్రాలున్నాయి. వాటిని 30 నుంచి 50 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. అందులో ప్రధానంగా వరికి భూమిని సిద్ధం చేయడం, కోతలకు ఉపయోగించడం కోసం 34 హెచ్‌పీ సామర్థ్యం పైగా ఉన్న ట్రాక్టర్లను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఇస్తోంది. ఆ ట్రాక్టర్ల వాస్తవ ధర రూ. 10 లక్షలు ఉండగా... సబ్సిడీపై అది రూ. 5 లక్షలకే లభిస్తోంది. ఎప్పుడూ లేనివిధంగా ఇంత భారీ సబ్సిడీ ప్రకటించడంతో రైతుల్లో పెద్ద ఎత్తున ఉత్సుకత పెరిగింది. మొదట్లో రాష్ట్రవ్యాప్తంగా రూ. 35 కోట్ల సబ్సిడీ ఇచ్చి 740 ట్రాక్టర్లనే జిల్లాలకు కేటాయించారు. అవి సరిపోకపోవడంతో ప్రత్యేక అనుమతి తీసుకొని ఇప్పటివరకు మొత్తంగా 2,500 వరకు ట్రాక్టర్లను అందజేసినట్లు సమాచారం. వాటిలో చాలావరకు అధికార పార్టీ నేతలు చెప్పిన వారి చేతుల్లోకే వెళ్లాయన్న విమర్శలూ లేకపోలేదు. పెపైచ్చు ఇంకా 10 వేల మందికిపైగా రైతులు ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారని వ్యవసాయమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి తలనొప్పిగా మారిందని తెలిసింది. మరో 10 వేల దరఖాస్తుల ప్రకారం పది వేల ట్రాక్టర్లు మంజూరు చేయడం అసాధ్యమంటున్నారు. ప్రస్తుతం ఇతర వ్యవసాయ యంత్రాలకు ఇస్తున్న సబ్సిడీని ట్రాక్టర్లకు మళ్లించడం నిబంధనల ప్రకారం సాధ్యంకాదని... కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అందుకు ఒప్పుకోవని అంటున్నారు. ఈ నేపథ్యంలో సబ్సిడీని తగ్గిస్తే తప్ప ఈ సమస్యను పరిష్కరించలేమని అంటున్నారు. 25 శాతానికే పరిమితం చేస్తేనే డిమాండ్ తగ్గుతుందని అంటున్నారు. 25 శాతానికి తగ్గించాలనుకుంటున్నాం ట్రాక్టర్లకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇస్తుండటంతో రైతుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కోటాకు మించి అందించాం. అయినా ఇంకా 10 వేలకుపైగా దరఖాస్తులు వ్యవసాయశాఖకు వచ్చాయి. ట్రాక్టర్ల కోటా పెంచడం సాధ్యం కాదు. కాబట్టి సబ్సిడీని 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలనే ఆలోచన చేస్తున్నాం. - పోచారం శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
ట్రాక్టర్లతో నేషనల్ అసెంబ్లీకి
-
4 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
నెల్లూరు: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లతో పాటు ఓ జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవురు మండలం జమ్మిపాలెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్సై సుధాకర్‌రెడ్డి తనిఖీలు చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సరికి ఇసుకను తరలిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. ఇసుక తరలింపునకు ఉపయోగిస్తున్న 4 ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకుని వాటిని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
8 ఇసుక ట్రాక్టర్లు సీజ్
కర్నూలు(ఎమ్మిగనూరు): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బొడబండలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాక్టర్ యాజమానులపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. -
పచ్చ నేతలా.. మజాకా!
ప్రొద్దుటూరు: ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు విచ్చల విడిగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. మండలంలోని శంకరాపురం గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నదిలో కొద్ది రోజులుగా యథేచ్చగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సుమారు రూ.2 కోట్ల 70 లక్షలతో ప్రొద్దుటూరు-చౌడూరు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పెన్నానదిలో అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏకంగా పొక్లైయినర్ను నదిలోకి దింపి తవ్వకాలు సాగించి ట్రాక్టర్లతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇప్పటి వరకు వందల ట్రాక్టర్ల గ్రావెల్‌ను రోడ్డు నిర్మాణానికి తరలించారు. రాత్రిళ్లే ఈ రవాణా సాగుతోంది. ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని అక్రమ రవాణా చేస్తుండటంతో పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలు నిద్రలేని రాత్రిళ్లు గుడుపుతున్నారు. ఈ కారణంగా పెన్నానదిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ సమస్యపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట్లలోని మైన్స్ అండ్ జియాలజీ అధికారులు గురువారం దాడులు చేశారు. గ్రావెల్ రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లతోపాటు నదిలో తవ్వకాలు సాగిస్తున్న పొక్లెయినర్ యంత్రాన్ని మైన్స్ అధికారులు సీజ్ చేశారు. అసిస్టెంట్ జియాలజిస్టు సుధాకర్, ఆర్ఐలు నాగరాజు, రామసుబ్రమణ్యం, వీఆర్ఓలు నరసింహులు, బాదుల్లా తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. తహశీల్దార్ రాంభూపాల్రెడ్డికి మైన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయన వీఆర్ఓలను పంపి ట్రాక్టర్లను ఎక్కడికక్కడే పట్టుకున్నారు. అయితే సాయంత్రానికే నామమాత్రపు జరిమానా చెల్లించి నేతలు వాహనాలను విడిపించుకు పోవడం కొసమెరుపు. -
మహీంద్రా అర్జున్ నోవోకు ఆదరణ
♦ 48 పనులు చేయడానికి వీలుగా తయారీ ♦ ఆధునిక టెక్నాలజీతో మార్కెట్లోకి... కరీంనగర్ : రైతులకు అవసరమైన ట్రాక్టర్స్ తయారీలో పేరున్న మహీంద్రా కంపెనీ సరికొత్త డిజైన్‌లో ఇటీవల విడుదల చేసిన‘అర్జున్ నోవో’ ట్రాక్టర్‌కు మంచి ఆదరణ లభిస్తుందన్నదని కంపెనీ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సౌరభ్ వాత్స తెలిపారు. రైతులు వివిధ సందర్భాల్లో ఏకంగా 48 రకాల పనులు చేసేలా ఈ ట్రాక్టర్‌ను రూపొందించింది. బుధవారం కరీంనగర్‌లోని మహీంద్రా కంపెనీడీలర్ షోరూంకు వచ్చిన ఆయన ‘అర్జున్ నోవో’ ట్రాక్టర్ ప్రత్యేకతను, వీటి అమ్మకాల తీరు తెన్నులను ‘సాక్షి’కి వివరించారు. వివరాలు... పొలాల్లో సునాయాసంగా పనులు అడ్వాన్స్డ్ ఎర్గొనామిక్స్, ఫ్లాట్‌ఫారం డిజైన్‌తో రూపొందించిన ‘అర్జున్ నోవో’తో సమయం ఎలా గడిచిపోతుందన్నది తెలియదు. గంటల పనిని కొద్ది నిమిషాల్లోనే సునాయాసంగా పూర్తి చేస్తుంది. ఫుల్ ఫ్లాట్‌ఫారం వేడి రాని విధానం, సులువుగా ఎక్కి దిగే సౌకర్యం, పవర్ఫుల్ ర్యాప్ అరౌండ్ హెడ్ ల్యాంప్స్, ఫోర్వే అడ్జస్టబుల్ డీలక్స్ సీట్, కారులాంటి సస్పెండెడ్ పెడల్స్ ఈ ట్రాక్టర్ ప్రత్యేకతలు. ఆధునిక ఇంజిన్ ఆధునిక ఇంజిన్ కలిగిన ‘ఆర్జున్ నోవో’ ఎక్కువ శక్తి కలిగివుంటుంది. 4 సిలిండర్ ఉన్న శక్తివంతమైన ఇంజిన్, తక్కువ ఇంధన ఖర్చు, అన్నింటికన్నా పెద్ద ఎయిర్‌క్లీనర్, రేడియేటర్లతో రూపొందించిన ట్రాక్టర్. గట్టి గరుకైన భూములను సైతం సునాయసంగా దున్నే సామర్థ్యం. అన్నిటికంటే ఎక్కువగా 15 ఫార్వర్డ్, 3 రివర్స్ గేర్లు, గంటకు 1.69 కిలోమీటర్ల అతి తక్కువ స్పీడ్కాగా, అధికంగా గంటకు 33 కిలోమీటర్లు ప్రయాణించే సౌకర ్యం. పీటీవో లీవర్లు కలిగి ఉంది. ఆధునిక క్లచ్, డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంది. రైతులకు అత్యంత అనువు నూతనంగా విడుదల చేసిన ‘మహీంద్రా నోవో’ ట్రాక్టర్‌కు అన్ని ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉంది. కరీంనగర్ జిల్లాలోని రెండు గుర్తింపు కలిగిన షోరూం లలో వీటిని అందుబాటులో ఉంచాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వందలాది ట్రాక్టర్లు అమ్మడుపోయాయి. ఆధునిక టెక్నాలజీతో దీనిని డిజైన్ చేశాం. రైతులకు అత్యంత అనువుగా ఉండటమే కాకుండా దాదాపు 48 పనులు చే సేలా దీనిని తయారు చేశాం. -
రైతుల గుండెల్లో గునపాలు
సాక్షి, గుంటూరు: మంత్రులు ట్రాక్టర్లు ఎక్కి ఇనుప నాగళ్ళతో పొలాలను దున్నేస్తున్న దృశ్యాలు రైతుల గుండెల్లో గునపాలను దించుతున్నట్లున్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ 33 వేల ఎకరాల రైతుల భూములను రూపాయి ఖర్చు లేకుండా సమీకరించామని ప్రపంచమంతటా డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబుకు చెక్కుల పంపిణీ ఎందుకు చిక్కులు తెచ్చిపెడుతోందని ప్రశ్నించారు. సమీకరించామని చెప్పుకుంటున్న భూముల యజమానుల్లో పదిశాతం కూడా చెక్కులు తీసుకొనేందుకు ముందుకు రాకపోవటం వెనుక రైతుల గుండెకోత ఉందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. రైతులు కార్యాలయాలకు రాకపోవటంతో నాయకులు, అధికారులు వారి ఇళ్లకు వెళ్లి బతిమాలి మరీ చెక్కులు అందజేస్తున్నారని ఆర్కే ఎద్దేవా చేశారు. ఎలాగోలా రైతులను ఒప్పించి సంతకాలు పెట్టించుకొంటే తన లక్ష్యం నెరవేరుతుందని మంత్రి నారాయణ ఇక్కడే మకాం వేసి మంత్రాంగం నడుపుతున్నారన్నారు. ఈ ఏడాది చెక్కులు ఇస్తున్న నారాయణ ప్రతి ఏడాదీ ఇలాగే అందరికీ చెక్కులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. అనధికారిక రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన 13 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును తయారు చేసే పనిలో పడ్డారని, మరెందరో రైతులను మభ్యపెట్టాల్సిన గురుతర బాధ్యతను చంద్రబాబు ఆయనకు అప్పగించారని తెలిపారు. రుణాలు మాఫీ కాక హైద రాబాద్ చుట్టూ తిరుగుతున్నట్లుగానే వచ్చే ఏడాది నుంచి కౌలు చెక్కుల కోసం రైతులంతా నారాయణ కాలేజిల గేట్ల ముందు పడిగాపులు కాయాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేళ్ళ పోస్ట్ డేటెడ్ చెక్కులు లేదా కాలావ్యవధి బాండ్లను రైతులకు ఇప్పుడే అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు కౌలు చెక్కులతో పాటు రైతుకూలీలకు రూ. 2,500 చొప్పున భృతి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కౌలు రైతులు, చేతి వృత్తిదారులు, వ్యవసాయ అనుబంధ వృత్తుల వారి గతి ఏమిటని ప్రశ్నించారు. నాలుగేళ్ళవరకు ఎన్నికలు లేవన్న ధైర్యం తో నియంతృత్వ నిర్ణయాలకు తెగబడుతున్న చంద్రబాబు అండ్ కోకు న్యాయస్థానాలు బుద్ధి చెబుతాయని ఆర్కే హెచ్చరించారు. -
అక్రమ రవాణా ఆగేదెలా?
‘ఇకపై ఇసుక అక్రమ రవాణా చేస్తే సంబంధిత వాహనాలను వేలం వేస్తాం. బాధ్యులపై చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తాం’ ఈనెల 12న జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ లోకేష్‌కుమార్ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి పాల్గొన్న ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలివి. ‘ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, లారీలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపకండి. ఎక్కువ మొత్తంలో జరిమానా విధిస్తే చాలు’ ఇసుకు నూతన పాలసీపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పిన మాటలవి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తరువాత జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతుందని అంతా భావించారు. ఇకపై ఇసుక అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు వాహనాలను వేలం వేస్తామని ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయడంతో ఇసుకాసురుల అక్రమాలకు కళ్లెం పడినట్లేనని అనుకున్నారు. తాజాగా మంత్రి టి.హరీష్‌రావు చేసిన ప్రకటన ఇసుకాసురులకు ఊరట కలిగిస్తోంది. ఇసుక అక్రమ రవాణా చేసే వారిని జైలుకు పంపొద్దని, జరిమానాతో సరిపెట్టండంటూ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. మంత్రి తాజా వ్యాఖ్యలతో ఇసుకాసురుల్లో మళ్లీ నూతన ఉత్సాహం వచ్చింది. యథేచ్ఛగా ఇసుకను జిల్లా సరిహిద్దులు దాటించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారుల అండదండలతో చెక్‌పోస్టులు దాటుతున్న వాహనాలు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లాలో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే ఆయా చెక్‌పోస్టులు అక్రమ రవాణాకు నిలయాలుగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల డివిజన్లలో పలు ప్రాంతాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఒక్క కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచే సగటున 200 లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. కరీంనగర్ సమీపంలోని అల్గునూరులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసినప్పటికీ, రాత్రిపూట ఇసుక రవాణాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ అధికారులు అండదండలు, కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అర్ధరాత్రి వందల కొద్ది లారీలు చెక్‌పోస్టులు దాటుతున్నారుు. అల్గునూరుతోపాటు మిగిలిన చెక్‌పోస్టుల వద్ద సైతం దాదాపు ఇదే తంతు కొనసాగుతోంది. ఇసుక లారీల యజమానులు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల్లో కొందరిని మచ్చిక చేసుకుని తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నకిలీ వే బిల్లులు సృష్టించడంతోపాటు అధికారులు జారీ చేసిన వే బిల్లుల్లో తేదీలను తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో వే బిల్లుల్లో అక్రమాలను పసిగట్టిన పోలీసులు అల్గునూరు చెక్‌పోస్టు వద్ద ఏడు లారీలను పట్టుకున్నప్పటికీ ఆ తరువాత ఏమైందో ఏమోగానీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే రైట్ చెప్పేశారు. ఇసుక లారీలను వదిలిపెట్టేందుకు లారీల యజమానులతో ముందుగానే అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక్కో లారీకి వెయ్యి నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల సహకారంతో ఇసుకాసురులు కొత్త అవతారాలెత్తుతున్నారు. బొగ్గు లారీలకు అతికించే స్టిక్కర్లను డూప్లికేట్‌గా ముద్రించి ఇసుక లారీలకు అంటిస్తున్నారు. చెక్‌పోస్టు సిబ్బందితో ముందుగానే కుమ్మక్కు కావడంతో వారు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పైనుంచి ఆదేశాలు వచ్చిన సమయంలో మాత్రం లారీలను పట్టుకుని జరిమానా విధిస్తున్నారు. జీవో5 కాగితాలకే పరిమితమా? ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం మోపడానికి కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 5ను జారీ చేసింది. గతంలో ఇసుక అక్రమ రవాణ చేసే వాహనాలను పోలీసులు పట్టుకుని రెవెన్యూ విభాగానికి అప్పగించేవారు. అనంతరం జరిమానాతో సరిపెట్టేవారు. ఒకవేళ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే ఇసుక చోరీ కేసులు నమోదు చేసేవారు. అయితే ఇవి చాలా తక్కువ సందర్బాల్లో నమోదు అయ్యేవి. వీటిలో ఎక్కువభాగం నేతల అనుచరులకు చెందినవి కావడంతో తూతూమంత్రంగా జరిమానా వేసి వదిలివేసేవారు. వీటికి జీవో నంబర్ 5 ముక్కుతాడు వేసినట్లయింది. ఈ జీవో ప్రకారం ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్, లారీలను ఏకంగా వేలం వేస్తారు. అట్లాగే అక్రమ రవాణా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అయినా వారిలో మార్పు రానిపక్షంలో అవసరమైతే వారిపై రౌడీషీట్ కూడా తెరవొచ్చని జీవోలో పేర్కొన్నారు. అయితే తాజాగా సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు సదరు జీవోను నీరుకార్చేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు వద్దని కేవలం జరిమానాతో వదిలివేయాలని సూచించడంతో పరోక్షంగా ఇసుక అక్రమ రవాణాకు ఊతం ఇచ్చినట్లయిందని అధికారులే అభిప్రాయపడుతున్నారు. మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించడంతో అధికారుల జీవోను తు.చ. తప్పకుండా అమలు చేసే అవకాశాలే లేవని చెబుతున్నారు. -
ప్రమాదమని తెలిసీ...
యలమంచిలి : ప్రమాదమని తెలిసినప్పటికీ తప్పనిస్థితిలో ప్రయాణాలు సాగిస్తున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు. ఎక్కువ మంది ఆటోలు, ట్రాక్టర్లు, వ్యాన్లపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు సాగిస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు కొందరు, రోజువారి కూలి పనులకు వెళ్లేందుకు మరికొందరు, కూలీలు, మహిళలు కిక్కిరిసిపోయి లగేజీ వాహనాలపై ప్రయాణిస్తున్నారు. అలాంటి సమయాల్లో ప్రమాదాలు జరిగితే తేరుకోలేని కష్టాన్ని, అంతకుమించిన నష్టాన్ని వారు ఎదురుకోవాల్సి వస్తోంది. యలమంచిలి ప్రాంతంలో ఇటీవల పలుచోట్ల ట్రాక్టర్లు, వ్యాన్లపై నిలబడి కాళ్లు కదిపే వీలులేకుండా కిక్కిరిసిపోయి గ్రామీణ ప్రాంత మహిళలు ప్రయాణిస్తున్నారు. తరచూ ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రయాణాలు సర్వసాధారణమైపోయాయి. పరిమితికి మించి ఆటోల్లో సైతం ప్రయాణికులను ఎక్కించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. లగేజీ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదన్న నిబంధన అమలు కావడం లేదు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే కొన్ని సందర్భాల్లో భారీ రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రాణనష్టాలు సంభవించడం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రయాణాలను నియంత్రించాల్సిన రోడ్డు రవాణా, పోలీసు శాఖాధికారులు, సిబ్బంది చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రమాదం జరిగినపుడు అధికారులు ప్రకటనలకు పరిమితమవుతున్నారు తప్ప చిత్తశుద్ధితో నిబంధనలు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి ఇటువంటి ప్రయాణాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కాడెద్దులైన రైతన్నలు
తొండూరు : తమ పొలంలోని కలుపు తీసేందుకు ఆ రైతులు కాడెద్దులుగా మారారు. మండలంలోని ఇనగలూరు గ్రామానికి చెందిన వాసుదేవరెడ్డి తన పొలంలో పొద్దుతిరుగుడుతో పాటు జొన్న, మినుము సాగు చేశాడు. పంటతో పాటు కలుపు కూడా పెరుగుతూ వచ్చింది. కలుపు నివారణకు ఎద్దులతో మెట్లను దున్నుతారు. ట్రాక్టర్లు రావడంతో వ్యవసాయ పనులకు ఎద్దులు దొరకుండా పోయాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు తండ్రితో పాటు మరో వ్యక్తిని కలుపుకుని వాసుదేవరెడ్డి కాడెద్దులుగా మారారు. -
ఆటోలకు వాహన పన్ను మినహాయింపు
ట్రాక్టర్లు, ట్రాలీలకు కూడా వర్తింపు రూ.76.26 కోట్ల బకాయిల రద్దు హైదరాబాద్: ఆటోలు, ట్రాలీ ఆటోలు, వ్యవ సాయ పనులకు వినియోగించే ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రాలీల యజమానులకు శుభవార్త. వీటిని వాహన పన్ను నుంచి మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఆటోలతోపాటు సెవెన్‌సీటర్ ఆటోలకూ ఇది వర్తిస్తుంది. త్రైమాసిక పన్ను భారంగా పరిణమించిందని, దాన్ని మినహాయిస్తే తమకు కొంత వెసులుబాటు కలుగుతుందని గతంలో ఆటోల యజమానుల జేఏసీ చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిం చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ జూన్ రెండో తేదీ నాటికి ఈ వాహనాలకు సంబంధించి పేరుకుపోయిన రూ.76.26 కోట్ల పన్ను బకాయిలు రద్దు చేశారు. గత జూలైలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటికి పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆటోల ద్వారా రవాణా శాఖకు సంవత్సరానికి పన్ను రూపంలో రూ.10 కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే వ్యవసాయ అవసరాలకు వాడుతున్న ట్రాక్టర్లు, ట్రాలీలకు రూ.300 పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తం ఇప్పుడు రద్దయింది. ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ ఈ అంశానికి సంబంధించి హామీ ఇచ్చింది. ఆర్టీసీకి మినహాయించాలి: ఎన్ఎంయూ ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాలీల పన్ను మినహాయిస్తూ నిర్ణయించిన తరహాలోనే.. ఆర్టీసీ బస్సులపై విధిస్తున్న ఎంవీ టాక్స్‌ను రద్దు చేయాలని ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, మహమూద్‌లు ప్రభుత్వాన్ని కోరారు. -
విచ్చలవిడిగా ఇసుక డంప్‌లు
సుండుపల్లి: మండలంలో ఇసుక డంప్‌లు భారీగా ఉన్నాయి. ఈ డంప్‌లు అధికార పార్టీ నాయకులవి కాబట్టే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మడితాడు పంచాయతీ సానిపాయి రోడ్డు మార్గంలో ఉన్న ఉప్పరపల్లి వెనుక వైపున మామిడి తోటల్లో ఇసుక డంప్‌లు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. అదే మార్గంలో గల చండ్రాయుడు ఆలయం వద్ద కూడా డంప్‌లున్నాయి. ఒక్కో డంప్‌లో వందల ట్రాక్టర్ల ఇసుక నిల్వ చేసి పెట్టారు. ఒక పక్క పోలీసులు, మరో పక్క రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే మండల కేంద్రానికి కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలో సానిపాయి రోడ్డుకు కూత వేటులోనే డంప్‌లు ఉన్నప్పటికీ అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యం. మండలంలోని పేదలు గృహ నిర్మాణాలకు ఇసుక లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇసుకాసురులు మాత్రం డంప్‌లను ఏర్పాటు చేసుకొని దర్జాగా పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఐదు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సానిపాయి మార్గంలోని కృష్ణారెడ్డి చెరువు వద్ద ఉన్న ఇసుక డంప్‌ను సీజ్ చేశారు. అయితే అక్కడికి దగ్గరగా ఉన్న మామిడి తోటలోని ఇసుక డంప్‌ల విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
హెచ్ఎంటీలో వాలంటరీ రిటైర్మెంట్ !
న్యూఢిల్లీ: హెచ్ఎంటీ సంస్థ స్వచ్ఛంద పదవీ విరమణ/ స్వచ్ఛంద విభజన స్కీమ్‌ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వాచ్‌లు, ట్రాక్టర్లు తయారు చేస్తున్న ఈ సంస్థ గత 15 సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తోంది. సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడానికి హెచ్ఎంటీ ఈ ప్రతిపాదనలను సమర్పించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1.045 మంది ఉద్యోగులున్నారు. వీరి వార్షిక వేతన బిల్లు రూ.45కోట్లుగా ఉంది. భారీ పరిశ్రమల విభాగం ఆదేశాలననుసరించి ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్రానికి సమర్పించామని హెచ్ఎంటీ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు నివేదించింది. కాగా ఈ సంస్థను మూసేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. గత పదేళ్లుగా వేతనాలకు, ఇతర బకాయిలకు బడ్జెటరీ మద్దతు లభిస్తోంది. గత ఏడాది కేంద్రం రూ.1,083 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఆధునీకరణ, ఐదేళ్లలో టర్న్ అరౌండ్ కావడానికి తోడ్పటటానికి ఈ ప్యాకేజీని కేంద్రం ఆమోదించింది. -
పంట తొలగింపుపై ఆందోళన
- భూములను రిజిస్ట్రేషన్ చేయలేదన్న రైతులు - చేసినవేనని హిమామి సిమెంట్స్ యజమాన్యం వెల్లడి తంగెడ(దాచేపల్లి): మండలంలోని తంగెడ, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు, ముత్యాలంపాడు గ్రామాల్లో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లోని పత్తి, మిరప పంటలను హిమామి సిమెంట్స్ సిబ్బంది శనివారం ట్రాక్టర్లు, పొక్లెయిన్‌తో తొలగించారు. దీంతో రైతులు పొలాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు పాడి రామకోటయ్య, మాదినపాడు జానీ, మాడుగుల సైదావలి, కందుల సాల్మాన్, కందుల ఏసు, లింగిరి నాగుల్‌మీరా, గోపి దావీదులు మాట్లాడుతూ 2010 నవంబర్‌లో హిమామి సిమెంట్స్ యాజమాన్యం తంగెడ, ముత్యాలంపాడు, సారంగపల్లి అగ్రహారం, మాదినపాడు గ్రామాల్లో 800 ఎకరాలను కొనుగోలు చేసేందుకు వచ్చిందని తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న భూములతోపాటు డీకే పట్టాలు, ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను కూడా కొనుగోలు చేయాలని అంగీకారం కుదిరిందని తెలిపారు. కొందరి భూములకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించగా, మరికొంతమందికి ఎకరానికి రూ1.10 లక్షల చొప్పున అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారన్నారు. ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పామని తెలిపారు. 2011 ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్‌కు రాగా మార్కెట్ ధర ఇవ్వాలని డిమాండ్ చేశామని, అప్పటినుంచి యాజమాన్యం కాలయూపన చేస్తోందని ఆరోపించారు. రెండు నెలల కిందట గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో కంపెనీ యజమాన్యంతో జరిపిన చర్చల సందర్భంగా భూములను సాగు చేసుకోమంటేనే పంటలు వేశామన్నారు. వేసిన పంటలను ఇప్పుడు యంత్రాలతో పీకేయటం దారుణమన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పూర్తిగా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేవరకు భూములు సాగు చేస్తామని స్పష్టం చేశారు. మా భూముల్లోని పంటలే తొలగించాం.. ఈ విషయమై హిమామి సిమెంట్స్ ప్రతినిధి ఏఎస్సార్ మూర్తి వివరణ కోరగా 800 ఎకరాలకు పూర్తిగా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పారు. వీటిలో సుమారు 250 ఎకరాల్లో వేసిన పంటలను మాత్రమే తొలగించామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయని భూముల జోలికి పోలేదన్నారు. కొంతమంది వ్యక్తులు కంపెనీకి చెందిన పొలాలను కౌలుకు ఇస్తున్నారని, కంపెనీ ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ భూములను కాపాడుకునేందుకే పంట లను తొలగించామన్నారు. -
తవ్వేస్తున్నారు..!
నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. వాగుల్లోంచి ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా ప్రధాన రహదారుల వరకు తీసుకెళ్తున్నారు. అక్కడినుంచి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళలో లారీల్లో రాజధానికి తరలిస్తున్నారు. నడిరేయి జిల్లా సరిహద్దులు దాటుతున్న ఇసుక వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేయాల్సిన రెవెన్యూ, పోలీసు శాఖలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారంతో సంబంధం ఉన్న బడా వ్యక్తులను వదిలిపెట్టి గ్రామాల్లో చిన్నా, చితక అవసరాల కోసం ఇసుకను తరలిస్తున్న వారిపై అధికారులు తమ ప్రతాపాన్ని చూపుతున్న విమర్శలున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఆయకట్టు ప్రాంతాలైన మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ ప్రాంతాల్లో కృష్ణా నది తీరం వెంబడి ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. పాలేరు, మూసీ వాగుల వెంబడి ఇసుక డంప్‌లు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్లు సిండికే ట్లుగా ఏర్పడి ఇసుక దందా కొన సాగిస్తున్నారు. నల్లగొండ : కనగల్ మండలంలోని రేగట్టె, శాబ్దులాపురం, కురంపల్లి, పగిడిమర్రి, దోరెపల్లి, పర్వతగిరి, కనగల్, బుడుమర్లపల్లి, బోయినపల్లి, బొమ్మెపల్లి, శేరిలింగోటం, తిమ్మన్నగూడెం, తేలకంటిగూడెం, జి.యడవల్లి తదితర గ్రామాల్లో ఇసుక రవాణా కొనసాగుతోంది. తిప్పర్తి మండలం మామిడాల, గోదోరిగూడెం గ్రామాల మీదుగా వేములపల్లి మండలంలోని చిరుమర్తి, ఆగ మోత్కూరు గ్రామాలలోని పాలేరు వాగు నుంచి ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నల్లగొండ మండంలోని నర్సింగ్‌భట్ల వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లి ఎస్ఎల్బీసీ కాల్వకట్ల వెంట, దమన్నగూడెం గ్రామంలో డంపులు ఏర్పాటు చేసి లారీల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మునుగోడు : మునుగోడువాగు, కొరటికల్వాగుల నుంచి రాత్రిపూట ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మునుగోడువాగులో ఇసుకను రాత్రిపూట ట్రాక్టర్లలో నింపి, చిట్యాల, పుట్టపాక, నారాయణపురం, కొరటికల్వాగు నుంచి చండూరు, కనగల్ ఏరియాలకు తరలిస్తున్నారు. అక్కడ డంప్ చేసి లారీల్లో ఎత్తి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి, నాగారం చెరువుల్లో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలువాగు నుంచి కూడా ఇసుక రవాణా అవుతోంది. మిర్యాలగూడ : మిర్యాలగూడ, వేములపల్లి మండలాల్లో పాలేరు వాగు నుంచి ఇసుక రవాణా సాగుతోంది. దామరచర్ల మండలంలో మూసీ, అన్నమేరు, తుంగపాడు బంధం నుంచి ఇసుక రవాణా అవుతోంది. మిర్యాలగూడ, వేములపల్లి మండలం నుంచి మిర్యాలగూడకు రోజుకు సుమారుగా 80 ట్రాక్టర్ల ద్వారా రవాణా అవుతోంది. వేములపల్లి మండలంలో పాలేరు వాగు లోనే జల్లెడతో ఇసుక పట్టి విక్రయిస్తున్నార. దామరచర్ల మండలంలోని వీర్లపాలెం, కేశవపురం, తాల్లవీరప్పగూడెం పరిసర ప్రాంతాలలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. భువనగిరి: వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మూసీ వెంట ఇసుకను తరలిస్తున్నారు. బీబీనగర్ మండలంలోని జమీలాపేట, జియాపల్లి, నెమరగోములలో 10 కిపైగా ఇసుక ఫిల్టర్లు నడుస్తున్నాయి. పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలతో ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. భువనగిరి, బస్వాపురం చెరువులు, ముగ్దుపల్లి, ముత్తిరెడ్డిగూడెం, హన్మాపురం, రామకృష్ణాపురం, గచ్చుబావిల వాగులు వంకల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. హుజూర్నగర్ : నేరేడుచర్ల మండలంలోని దాచారం, ఎల్లాపురం, సోమారం,చిల్లేపల్లి, మూసీఒడ్డుసింగారం, శూన్యంపాడ్ వద్ద మూసీ నుంచి గరిడేపల్లి, నేరేడుచర్ల, మిర్యాలగూడ మండలాలకు ఇసుక రవాణా చేస్తున్నారు. మేళ్లచెరువు మండలంలోని క్రిష్ణపట్టె గ్రామాలైన చింత్రియాల, రేబల్లే, కిష్టాపురం,అడ్లూరు, కృష్ణాపరీవాహకప్రాంతంలో వివిధ పార్టీలకు చెందిన కొంత మంది నాయకులు సిండికేట్‌గా ఏర్పడి కృష్ణా నది నుంచి అక్రమంగా ఇసుక తోడి డంపింగ్ చేసి హైదరాబాద్, విజయవాడ,కోదాడ తదితర పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. నకిరేకల్ : నకిరేకల్ మండలంలోని చందుపట్ల వాగు నుంచి ప్రతి రోజూ వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చందుపట్ల గ్రామానికి చెందిన పలువురు గ్రూపులుగా ఏర్పడి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా సమీప ప్రాంతంలో డంపింగ్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌కు లారీల ద్వారా తరలిస్తున్నారు. కేతేపల్లి మండలంలోని మూసీ పరీవాహక ప్రాంతాలైన కాసనగోడు, కేతేపల్లి, ఉప్పలపహాడ్, తుంగతుర్తి, కొప్పోలు, బీమారం గ్రామాలలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మూసీ, పాలేరు వాగుల నుంచి ఇసుకను తోడి ట్రాక్టర్ల ద్వారా ఆయా గ్రామాలలోని నిర్మానుష్యప్రాంతాలలో గుట్టలు గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. కట్టంగూర్ మండలంలోని పెద్దోనిబావి, మల్లారం, కట్టంగూర్, పరడ, నారెగూడెం, మునుకుంట్ల గ్రామాల్లో రాత్రి వేళల్లో లారీల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సూర్యాపేట : పెన్‌పహాడ్, సూర్యాపేటరూరల్, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా కోనసాగుతోంది. సూర్యాపేట మండలంలోని కాసరబాద, టేకుమట్ల, కే.టీ అన్నారం, రాయినిగూడెం గ్రామాల సమీపంలోని మూసీ వాగుల నుంచి జోరుగా సూర్యాపేట పట్టణానికి ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కోదాడ : కోదాడ, నడిగూడెం, మోతె మండలాల్లో ఇసుక వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఈ మూడు మండలాల్లోని పాలేరువాగు నుంచి ట్రాక్టర్ల ద్వార తీసుకొని వచ్చి కోదాడలో విక్రయిస్తున్నా రు. మేళ్లచెరువు మండలంలోని కృష్ణా నది నుంచి కూడా కోదాడకు ఇసుక రవాణా అవుతోంది. -
దుందుబీ చెంత దుర్భిక్షం
జిల్లాలోని దుందుబీ పరివాహక ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. విచ్చలవిడిగా ఇసుకను తరలించేస్తున్నారు. డార్క్ ఏరియాగా గుర్తించిన ఈ ప్రాంతంలో వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం తగ్గిపోతుండటం చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా బాలానగర్, నవాబ్‌పేట, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో అక్రమ ఇసుకరవాణా నిత్యం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి ప్రారంభమయ్యే దుందుబీ వాగు నియోజకవర్గం గుండా ముందుకు సాగుతోంది. జడ్చర్ల, న్యూస్‌లైన్: నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో దుందుబీ నది నుంచి వందలాది ట్రాక్టర్ల లో ఇసుకను తరలిస్తుండటంతో తీవ్రమై న దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో 200 నుంచి 300 అడుగుల మేరకు బోర్లువేసినా..చుక్క పడటం లే దు. సాధారణంగా వంద నుంచి 150 అ డుగుల లోతుల్లోనే బోర్లు వేస్తే నీళ్లు ఉబికివస్తాయి. కానీ ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయి..వాటి ఊసే కనిపించలేదు. డార్క్ ఏరియాగా మిడ్జిల్ మిడ్జిల్ మండలాన్ని 1995లో అప్పటి ప్రభుత్వం డార్క్ ఏరియాగా గుర్తిం చింది. ఇక్కడ భూగ ర్భ జలవనరులను కావాల్సిన దానికంటే అధికంగా వినియోగించడం, అందుకు తగ్గట్లుగా భూగర్భజ లాల పెంపు లేకపోవడంతో ప్రత్యేక ప్రాంతంగా గుర్తించింది. దీంతో వ్యవసాయానికి కొత్తగా బోర్లు వేయడం, భూగర్భజలాలను హరించే కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించింది. అంతేకాకుం డా వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రు ణాలను సైతం నిలిపేసింది. అనంతరం నిపుణుల సూచనల మేరకు మండలంలో భూగర్భజలాల పెంపును చేపట్టేందుకు వివిధ పథకాలను అమలు చేసింది. తా గునీరు సైతం నీరు దొరకని పరిస్థితుల్లో ఈ మండలంలో వందలకోట్లతో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చే సింది. నేషనల్ వాటర్‌షెడ్, డీపీఏపీ వా టర్షెడ్, నీరుమీరు, ఈజీఎస్, డీఎఫ్ఐడీ తదితర పథకాల ద్వారా వ్యవసాయపొలాల్లో వాలుకట్టలు, చెక్‌డ్యాంలు, గల్లీకంట్రోల్, ల్యాండ్ లెవలింగ్, ఊట కుం టలు, పాంఫండ్లు, ఇంకుడుగుంతలు, తదితర అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. అంతేకాకుండా దుందుబీ వా గుపై బాలానగర్ మండలం నుంచి మొ దలుకుని జడ్చర్ల, తిమ్మాజీపేట, మిడ్జిల్ మండలాల పరిధిలోని దుందుబీ వా గుపై భారీ చెక్‌డ్యాంలను నిర్మించారు. వీ టన్నంటి ఉద్దేశం ఒక్కటే..డార్క్ ఏరియా గుర్తింపు పొందిన మిడ్జిల్ మండలంలో భూగర్భజలాలను పెంపొందించి గ్రీన్ ఏ రియాగా మార్పు చేయడం. అయితే ఇసుక తరలింపు కారణంగా భూగర్భజలాలు మరింత అట్టడుగు స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది. ఇసుక తరలుతోందిలా.. జడ్చర్ల మండలంలోని ఆల్వాన్‌పల్లి, కు ర్వగడ్డపల్లి, గుట్టకాడిపల్లి, అమ్మపల్లి, నె క్కొండ, కొండేడు, ఈర్లపల్లి, లింగంపేట గ్రామాల శివార్లు ప్రాంతాల గుండా ఇసుకను భారీ ఎత్తున తరలించేస్తున్నారు. అదేవిధంగా మిడ్జిల్ మండలంలోని వాడ్యాల, మిడ్జిల్, మున్ననూర్, చిల్వేరు, కొత్తూరు, వెలుగొమ్మల, వేముల, తదితర గ్రామాలపరిధిలోని దుందుబీ వాగునుంచి కొల్లగొడుతున్నారు. బాలానగర్ మండలంలోని రాజాపూర్, ముదిరెడ్డిపల్లి, నందిగామ, మల్లెపల్లి, చెన్నవెల్లి, తిర్మలాపూర్, రాయపల్లి, కుచ్చర్కల్ తదితర గ్రామాల్లో ఇదేపరిస్థితి కనిపిస్తోంది. నిత్యం సాగుతున్నా అక్రమ ఇసుకరవాణాను అరికట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు పెదవివిరుస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టి భూగర్భజలాలను పెంపొందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. భూగర్భ జలాలు పడిపోతున్నాయి... దుందుబీ వాగు నుండి నిత్యం ఇ సుకను తరలిం చడం పట్ల వాగు పరివాహక ప్రాం తంలోని వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పడిపోయింది. కొన్ని బోర్లు ఎండిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తాగునీరు దొరికే పరిస్థితి లేదు. భూగర్బ జలాలు ఇప్పటికే వందల అడుగులకు పడిపోవడంతో ఫ్లోరైడ్ నీటిని తాగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టాలి. - వెంకటయ్య, మాజీ సర్పంచ్, ఆల్వాన్‌పల్లి -
విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం
మర్రిపాడు, న్యూస్‌లైన్ : మండలంలోని నందవరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ కోతలను నిరసిస్తూ నందవరం, రామానాయుడుపల్లి గ్రామాల రైతులు గురువారం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం నెల్లూరు-ఉదయగిరి రహదారిపై ట్రాక్టర్లు, కంప అడ్డం పెట్టి రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన అధికారులు కనీసం గంటసేపు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధగంటకోసారి కోత విధిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం వరి పంట పొట్టదశలో ఉందని, నీరు అందక ఎండిపోతోందన్నారు. ఇదేంటని ప్రశ్ని స్తే సబ్‌స్టేషన్ సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. రాస్తారోకోతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఎస్ఐ విజయ్‌శ్రీనివాస్ సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. అయితే విద్యుత్ సబ్ స్టేషన్‌కు తాళాలు, కంప వేసి ఆశాఖ వచ్చే ఏఈ వచ్చే వరకు తీసేది లేదని భీష్మించారు. ఏఈని ఎస్ఐ పిలిపించి రైతులతో మాట్లాడించారు. ఇకపై వ్యవసాయానికి విద్యుత్‌ను ఏడుగంటలు సక్రమంగా సరఫరా చేస్తామని ఏఈ విశ్వనాథ్ హామీ ఇచ్చారు. రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో రైతులు కొప్పోలు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, నరసింహులు, లక్ష్మీరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. -
కళ్లలో ఇసుక!
కళ్లు మూసి జెల్ల కొట్టడమంటే ఇదే! పోలీసులను ఏమార్చుతున్న ఇసుక స్మగ్లర్ల తెలివితేటలు చూస్తే ఔరా అనని వారు అరుదే! అయితే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పోలీసులు మాత్రం కళ్లు మూసుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. కఠినంగా వ్యవహరించి నేరగాళ్లను నిరోధించాల్సిన వారు ఎందుకిలా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న సందేహం కలుగుతోంది. జవాబు చెప్పేదెవరో మరి.. యలమంచిలి/ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: ఆమధ్య ఓ సిన్మాలో ఓ హాస్యపాత్ర అతి తెలివితో పోలీసులకు టోపీ వేయడం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.. రోజూ ఇసు క తరలిస్తూ, పోలీసులకు పట్టుబడకుండా ఆడిన నాటకం భలేగా రక్తి కడుతుంది.. అసలు తరలిస్తున్నది దొంగిలించిన ద్విచక్రవాహనాలన్నది ఆఖరుకు పోలీసులకు అర్ధమవుతుం ది! జిల్లాలో ఇసుక స్మగ్లర్ల తీరు చూస్తే ఆ ప్రహసనమే గుర్తు కు వస్తుంది. జిల్లాలో నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తూనే పోలీసులకు టోకరా వేస్తున్న పరిణామం కడు విస్మ యం కలిగిస్తుంది. ఇసుక రవాణాను అటుంచితే, ఇందుకు వారు వాడుతున్న నంబర్ లేని ట్రాక్టర్ల వ్యవహారమే నివ్వెరపరుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నపుడు ఇసుక గురించి మాత్రమే ఆరా తీస్తున్నారు తప్ప, ట్రాక్టర్లకు నంబ ర్లు లేని విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. ఒకవేళ గుర్తించినా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం లేదని అర్ధమవుతుంది. నదుల్లో ఇసుక అక్రమరవాణా నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని ఉత్తర్వులు జారీచేసినా తాండవ, వరాహ, శారద నదుల నుంచి ఇసుక తరలింపు జరుగుతూనే ఉంది. చోడవరం ప్రాంతంలో ఏకంగా స్మగ్లర్లు ప్రభు త్వ సిబ్బందిపై దాడికి తెగబడుతున్నా ఉన్నతాధికారులు అనుసరించిన వైఖరి విమర్శలకు పాత్రమైంది. ఇసుక అక్రమంగా తరలించే ట్రాక్టర్లలో సగానికి పైగా నెంబర్లు లేనివే ఉంటున్నాయన్నది స్పష్టం. యజమానులెవరో తెలియకుండా ఉండడానికి ఇటువంటి ట్రాక్టర్లు వాడుతున్నారు. వీటిని పోలీసులు సీజ్ చేయాల్సి ఉంది. కానీ వారు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నంబర్లు లేని ట్రాక్టర్లు పట్టుబడ్డా పోలీసులు ఇసుక అక్రమ రవాణాపైనే కేసులు పెడుతున్నారు. నంబర్లు లేకపోవడంతో చిన్న చిన్న ప్రమాదాలైనా వాహనాల యజమానులు, డ్రైవర్లు తప్పించుకుంటున్నారు. అభివృద్ది పనుల ముసుగులో.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ది పనుల మాటున స్మగ్లర్లు పెద్దయెత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వంతెనలు, రోడ్ల పేరుచెప్పి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అపార్ట్మెంట్లు, ప్రైవేట్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు ఈ ఇసుకను వాడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడి చేస్తే పర్మిట్లు ఉన్నాయని తప్పించుకుంటున్నారు. రాత్రి 10 గంటలనుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకునే వారే కానరారు! -
అనుమతి.. అదే గతి!
గద్వాల, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్లనాటి సమస్యలవి..నేటికీ వాటికి పరిష్కారం లభించడం లేదు. ప్రజల కష్టాలకు ప్రభుత్వం స్పందించినా ఫలితం లేకుండా పోయింది. నిధులు విడుదల చేసినా అందుకుతగ్గ అనమతులు నేటికీ రాలేదు. ఓ వైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం.. మరోవైపు సమైక్య ఉద్యమం అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు సమ్మెలో ఉండటంతో సంబంధిత ఫైళ్లకు మోక్షం కలగలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో రెండు నెలల పాటు వీటిని పట్టించుకోకపోతే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే. సమస్యలివీ.. గద్వాల నియోజకవర్గం పరిధిలోని కృష్ణానది మధ్యలో జీవనం కొనసాగిస్తున్న ప్రజలకు బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం 2009 జనవరిలో మంజూరు ఇచ్చింది. అయితే నేటికీ సర్వేలు పూర్తి కాలేదు. కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ దీవి ప్రజలకు రవాణా కల్పించాలనే లక్ష్యంతో 2009 జనవరిలో రోప్‌వే బ్రిడ్జికి మంజూరైంది, గత ఏడాది క్రితం రోప్‌వే బ్రిడ్జి కాకుండా కాజ్వే బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై సర్వేలు చేశారు. చివరకు మూడో ప్రతిపాదనగా నదిలో పిల్లర్స్‌ను ఏర్పాటు చేసి సింగిల్ లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి తుది రూపు ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫైల్ ఈఎన్సీ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. గద్వాల మండల పరిధిలో కృష్ణానది మధ్యలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుర్రంగడ్డ దీవి 2100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ దీవిలో దాదాపు 150 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. కృష్ణానది నీటిని పొలాలకు తరలించి 850 ఎకరాల్లో మాగాణి పంటలను పండిస్తూ, దిగుబడిని బయటి ప్రాంతాలకు తరలించలేక వేసవి వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. మార్చిలో పేబ్బేరు వైపున నది పాయ తగ్గాక ట్రాక్టర్లలో పంట ఉత్పత్తులను గద్వాల, ఇతర ప్రాంతాల వ్యవసాయ మార్కెట్లకు తరలించి అమ్ముకుంటున్నారు. పెండింగ్‌లో గట్టు లిఫ్టు ఫైల్... కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును గద్వాల డివిజన్‌లోనే నిర్మించినప్పటికీ ఈ ప్రాంతంలో కేవలం 37వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది. దీంతో నడిగడ్డను సస్యశ్యామలం చేసేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సామర్థ్యంతో చేపట్టారు. ఈ పథకం ద్వారా కూడా అత్యంత వెనుకబడిన గట్టు మండల ప్రాంతానికి సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను కూడా పరిష్కరించి మరో మినీ ఎత్తిపోతల ద్వారా గట్టుకు సాగునీటిని అందించాలన్న ప్రతిపాదన మేరకు ఇప్పటికే జూరాల అదికారులు ప్రాథమిక సర్వే చేశారు. ఈ సర్వే నివేదికను ప్రభుత్వానికి గతంలో పంపారు. ఇదీ లక్ష్యం.. ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పడమర వైపున ఆలూరు గ్రామ శిశారులో రిజర్వాయర్ వద్ద ఇన్‌టేక్ వెల్‌ను నిర్మిస్తారు. అక్కడ కేవలం 0.3 మెగావాట్ విద్యుత్ వినియోగంతో నడిచే పంపింగ్ మోటారు ఏర్పాటు చేసి అక్కడి నుంచి గట్టు మండలలోని మల్లాపురం తాండ పక్కన ఉన్న గజ్జెలమ్మగుట్టపైకి నీటిని పంపింగ్ చేయాలన్నది ప్రతిపాదన. గుట్టపై నుంచి మండలంలోని చెరువులు, కుంటలకు నీళ్లు గ్రావిటిఫ్లో ద్వార వెళ్లేలా కాలువలను తవ్యుతారు. ఇలా మండలంలోని దాదాపు 30 నుంచి 40 చెరువుల కుంటలను నీటితో నింపుతారు. వీటితో పాటు లిప్టు ద్వార అదనంగా 3500 ఎకరాలకు సాగునీరు అందాలన్నది లక్ష్యం. -
అక్రమార్కులకు ‘వన’ భోజనం
బేస్తవారిపేట, న్యూస్‌లైన్: కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేసిన సామాజిక వనాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు-మోక్షగుండం గ్రామాల మధ్య హైవే పక్కన సర్వే నంబర్ 1లో 290 ఎకరాల కొండ పోరంబోకు స్థలం ఉంది. డీపీఏపీ పథకంలో బంజరు భూములను అభివృద్ధి చేసి మొక్కలు పెంచారు. వన సంరక్షణ బాధ్యతలు డీపీఏపీ, ఫారెస్టు అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పట్టించుకోలేదు. కొండపోరంబోకు స్థలాల ఆక్రమణలు అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు ఆక్రమించి పొలాలుగా మార్చుకుంటున్నారు. రెండు, మూడేళ్లలో దాదాపు 40 ఎకరాలు పరులపాలైంది. కొందరు రెవెన్యూ అధికారులకు భారీగా మామూళ్లు ముట్టజెప్పి పట్టాలు తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొనసాగుతున్న ఆక్రమణలు సామాజికవన కొండ పోరంబోకు స్థలంలో మోక్షగుండానికి చెందిన కొందరికి పట్టాలు ఇవ్వడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు రంగం సిద్ధం చేశారనే సమాచారం అందుకున్న స్థానికులు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. రాత్రి వేళల్లో హిటాచ్ యంత్రాలతో గతంలో నాటిన కుంకుడు, గంగరేగు, వేప చెట్లను పీకేసి ట్రాక్టర్లతో మరో 30 ఎకరాలను పొలాలుగా మార్చుకుంటున్నారు. ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు పరులపాలవుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఆక్రమించుకుంటున్నారు : వెంకటరెడ్డి, గ్రామస్తుడు ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేసిన సామాజిక వన సంరక్షణ భూమి ఆక్రమణకు గురవుతోంది. అసైన్మెంట్ కమిటీలో పట్టాలు ఇవ్వనున్నట్లు తెలియడంతో కొందరు యంత్రాలతో దున్నేసి పొలాలుగా మార్చుకుంటున్నారు. పశువుల మేతకు ఇబ్బంది : ఏ ఈశ్వరరెడ్డి, గ్రామస్తుడు రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారు. గ్రామంలో దాదాపు రెండు వేల పశువులున్నాయి. కొండ పోరంబోకు భూమి అన్యాక్రాంతమైతే పశువులను అమ్ముకోవాల్సిందే. ఆక్రమణదారులపై చర్యలు: పి.సావిత్రీదేవి, తహసీల్దార్ మోక్షగుండం సర్వే నంబర్- 1 కొండ పోరంబోకు భూమి. ప్రస్తుతం కొండ పోరంబోకు భూములకు పట్టాలు ఇవ్వవద్దని ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి. ఆక్రమణదారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. -
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
నల్లజర్ల, న్యూస్‌లైన్: ఎర్రకాలువ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, డీపీవో నాగరాజువర్మ హెచ్చరించారు. మగళవారం ఎర్రకాలువ పరిధిలో ఉన్న అనంతపల్లి, పోతవరం, కవులూరు ఇసుక ర్యాంపుల్లో దాడులు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తు న్న ఆరు ట్రాక్టర్లను సీజ్ చేయగా, మరో 9 ట్రాక్టర్లను, ట్రక్కులను వాటి యజమానులు కాలువలో వదిలి పరారయ్యారు. గ్రామ సర్పంచ్ పసుమర్తి రతీష్ ఆధ్వర్యంలో ట్రక్కుల వద్ద కాపలా ఉంచినట్టు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన ట్రాకర్ల యజమానులు 15 రోజుల్లో జరిమాన చెల్లించాలని, లేనిపక్షంలో ట్రాక్టర్లను కోర్టుకు అప్పగిస్తామని వారు తెలిపారు. వదిలి వెళ్లిన 9 ట్రాక్టర్ల యజమానులు అధికారులను సంప్రదించకపోతే రవాణ శాఖ ద్వారా వారి వివరాలు సేకరించి కోర్టు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎర్రకాలువ నుంచి ఇసుక అక్రమ రవాణ చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో లారీలపై ఇసుక అక్రమ రవాణ జరుగుతోందని వీటిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇసుక అక్రమ రవాణ చేసిన వారి వివరాలు అధికారుల దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకొంటామన్నారు. ఈ దాడుల్లో డీఎల్పీవో రాజ్యలక్ష్మి, ఏపీడీ శ్యామ్యూల్, ఏఎస్సై ప్రకాశరావు, కార్యదర్శి కొండలరావు పాల్గొన్నారు. -
ఆగని ఇసుక అక్రమ రవాణా
చందర్లపాడు, న్యూస్‌లైన్ : మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. కాసరబాద, ఏటూరు గ్రా మాల పరిధిలో కృష్ణానది, మునేరుల నుంచి రాత్రివేళల్లో కొంత మంది ట్రాక్టర్లతో ఇసుకను తరలించి గ్రామాల్లో కుప్పలుగా పోస్తున్నారు. తరువాత రాత్రి వేళల్లో పొక్లెయిన్‌తో లారీల్లోకి నింపి, ఎగుమతి చేస్తున్నారు. ఈ తతంగమంతా తెల్లవారుజాములోపు ముగించి ఇసుక లారీలను 20 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి పైకి ఎక్కిస్తున్నారు. హైవే మీదకు చేరుకున్నాక వాటిని అధికారులు పట్టుకోరు. దీంతో మండలంలో ఇసుక అక్రమ రవాణాదారుల పని ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఇసుక నాణ్యమైనది కావడంతో హైదరాబాద్‌లో మంచి ధర పలుకుతోంది. టన్ను రూ.1,000 ధర పలుకుతుండటంతో అక్రమ రవాణాదారులు మండలంలో ఈ ప్రాం తంపై కన్నేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా మండలంలోని వివిధ శాఖల అధికారులు విధులకు హాజరు కాకపోవడం ఇసుక అక్రమ రవాణాదారుల పాలిట వరంగా మారింది. ఇసుక అక్రమ రవాణా గురించి ఇటీవల స్థానిక ఎస్సైకి కొందరు సమాచారమందించగా ఆయన సిబ్బందితో దాడి చేసి లారీ, ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలకు భారీగా జరిమానా విధిస్తుండటంతో అక్రమ రవాణాదారులు వాటిని విడిపించుకోవడంలేదు. గతంలో అక్రమంగా ఇసుక రవాణా చేసిన వాహనాలపై వాల్టా చట్టం కింద అధికారులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అధికారులు ఆ చట్టం కింద కేసులు నమోదు చేయకపోవడంతో ఇసుక అక్రమ రవాణాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో అక్రమ ఇసుక రవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై దాడి చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, ఇసుక అక్రమ రవాణా నిరోధానికి తమ సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారన్నారు. ప్రజలు కూడా తమకు సమాచారమందిస్తే వెంటనే దాడులు చేస్తామన్నారు.