![Murugappa enters EV mkt with TI Clean Mobility Montra e 3 wheeler - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/7/Montra.jpg.webp?itok=9qjq4u6b)
హైదరాబాద్: ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియా అనుబంధ కంపెనీ టీఐ క్లీన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మోంట్రా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. సబ్సిడీ అనంతరం ధర రూ.3.02 లక్షలు. 10 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందు పరిచారు.
మురుగప్ప గ్రూప్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా (టిఐఐ) అనుబంధ సంస్థ ఐ క్లీన్ మొబిలిటీ (టిసిఎమ్) మంగళవారం చెన్నైలో మోంట్రా ఎలక్ట్రిక్ 3డబ్ల్యు ఆటోను ప్రారంభించడంతో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. ఏఆర్‌ఏఐ ధ్రువీకరణ ప్రకారం ఒకసారి చార్జ్ చేస్తే వాహనం 197 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈవీ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అనేది అతిపెద్ద వృద్ధి సామర్థ్యం కలిగిన ఒకటని ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ మురుగప్పన్ తెలిపారు. మెంట్రా ఎలక్ట్రిక్ బ్రాండ్‌తో ఇ-త్రీ-వీలర్ ఉత్పత్తులను, సెలెస్టియల్ ఎగాట్ బ్రాండ్‌లో ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లను, రైనో 5536 ద్వారా ఎలక్ట్రిక్ భారీ వాణిజ్య వాహనాలను పరిచయం చేయనుంది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూకుడుగా ఉంది.
చెన్నై సమీపంలోని అంబత్తూరు ప్లాంటులో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 100కుపైగా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా ఈ త్రిచక్ర వాహనాలను విక్రయించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈవీ విభాగంలో కనీసం నాలుగు ప్లాట్‌ఫారమ్స్ కోసం సుమారు రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment