సబ్సిడీ ట్రాక్టర్ల దరఖాస్తులపై డీడీఏ ఆరా
Published Fri, Aug 5 2016 12:23 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
రఘునాథపల్లి : సబ్సిడీ ట్రాక్టర్ల మంజూరుకి వచ్చిన దరఖాస్తులపై వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ (డీడీఏ) మోహన్‌రెడ్డి గురువారం ఆరా తీశారు. ముడుపులిస్తేనే ట్రాక్టర్ శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. స్థానిక వ్యవసాయ కార్యాయంలో సబ్సిడీ ట్రాక్టర్ల దరఖాస్తులు, రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర పర్టిలైజర్‌షాపులో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ రిని హుమేరానౌసిన్, ఏఈఓలు సుప్రజ్యోతి, రోజా పాల్గొన్నారు.
Advertisement
Advertisement