జిల్లాలోని దుందుబీ పరివాహక ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. విచ్చలవిడిగా ఇసుకను తరలించేస్తున్నారు. డార్క్ ఏరియాగా గుర్తించిన ఈ ప్రాంతంలో వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం తగ్గిపోతుండటం చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా బాలానగర్, నవాబ్‌పేట, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో అక్రమ ఇసుకరవాణా నిత్యం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి ప్రారంభమయ్యే దుందుబీ వాగు నియోజకవర్గం గుండా ముందుకు సాగుతోంది.
జడ్చర్ల, న్యూస్‌లైన్: నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో దుందుబీ నది నుంచి వందలాది ట్రాక్టర్ల లో ఇసుకను తరలిస్తుండటంతో తీవ్రమై న దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల్లో 200 నుంచి 300 అడుగుల మేరకు బోర్లువేసినా..చుక్క పడటం లే దు. సాధారణంగా వంద నుంచి 150 అ డుగుల లోతుల్లోనే బోర్లు వేస్తే నీళ్లు ఉబికివస్తాయి. కానీ ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయి..వాటి ఊసే కనిపించలేదు.
డార్క్ ఏరియాగా మిడ్జిల్
మిడ్జిల్ మండలాన్ని 1995లో అప్పటి ప్రభుత్వం డార్క్ ఏరియాగా గుర్తిం చింది. ఇక్కడ భూగ ర్భ జలవనరులను కావాల్సిన దానికంటే అధికంగా వినియోగించడం, అందుకు తగ్గట్లుగా భూగర్భజ లాల పెంపు లేకపోవడంతో ప్రత్యేక ప్రాంతంగా గుర్తించింది. దీంతో వ్యవసాయానికి కొత్తగా బోర్లు వేయడం, భూగర్భజలాలను హరించే కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించింది.
అంతేకాకుం డా వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రు ణాలను సైతం నిలిపేసింది. అనంతరం నిపుణుల సూచనల మేరకు మండలంలో భూగర్భజలాల పెంపును చేపట్టేందుకు వివిధ పథకాలను అమలు చేసింది. తా గునీరు సైతం నీరు దొరకని పరిస్థితుల్లో ఈ మండలంలో వందలకోట్లతో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చే సింది. నేషనల్ వాటర్‌షెడ్, డీపీఏపీ వా టర్‌షెడ్, నీరుమీరు, ఈజీఎస్, డీఎఫ్‌ఐడీ తదితర పథకాల ద్వారా వ్యవసాయపొలాల్లో వాలుకట్టలు, చెక్‌డ్యాంలు, గల్లీకంట్రోల్, ల్యాండ్ లెవలింగ్, ఊట కుం టలు, పాంఫండ్‌లు, ఇంకుడుగుంతలు, తదితర అనేక అభివృద్ధి పనులను చేపట్టారు.
అంతేకాకుండా దుందుబీ వా గుపై బాలానగర్ మండలం నుంచి మొ దలుకుని జడ్చర్ల, తిమ్మాజీపేట, మిడ్జిల్ మండలాల పరిధిలోని దుందుబీ వా గుపై భారీ చెక్‌డ్యాంలను నిర్మించారు. వీ టన్నంటి ఉద్దేశం ఒక్కటే..డార్క్ ఏరియా గుర్తింపు పొందిన మిడ్జిల్ మండలంలో భూగర్భజలాలను పెంపొందించి గ్రీన్ ఏ రియాగా మార్పు చేయడం. అయితే ఇసుక తరలింపు కారణంగా భూగర్భజలాలు మరింత అట్టడుగు స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది.
ఇసుక తరలుతోందిలా..
జడ్చర్ల మండలంలోని ఆల్వాన్‌పల్లి, కు ర్వగడ్డపల్లి, గుట్టకాడిపల్లి, అమ్మపల్లి, నె క్కొండ, కొండేడు, ఈర్లపల్లి, లింగంపేట గ్రామాల శివార్లు ప్రాంతాల గుండా ఇసుకను భారీ ఎత్తున తరలించేస్తున్నారు. అదేవిధంగా మిడ్జిల్ మండలంలోని వాడ్యాల, మిడ్జిల్, మున్ననూర్, చిల్వేరు, కొత్తూరు, వెలుగొమ్మల, వేముల, తదితర గ్రామాలపరిధిలోని దుందుబీ వాగునుంచి కొల్లగొడుతున్నారు. బాలానగర్ మండలంలోని రాజాపూర్, ముదిరెడ్డిపల్లి, నందిగామ, మల్లెపల్లి, చెన్నవెల్లి, తిర్మలాపూర్, రాయపల్లి, కుచ్చర్‌కల్ తదితర గ్రామాల్లో ఇదేపరిస్థితి కనిపిస్తోంది. నిత్యం సాగుతున్నా అక్రమ ఇసుకరవాణాను అరికట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు పెదవివిరుస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు చేపట్టి భూగర్భజలాలను పెంపొందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
భూగర్భ జలాలు
పడిపోతున్నాయి...
దుందుబీ వాగు నుండి నిత్యం ఇ సుకను తరలిం చడం పట్ల వాగు పరివాహక ప్రాం తంలోని వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పడిపోయింది. కొన్ని బోర్లు ఎండిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తాగునీరు దొరికే పరిస్థితి లేదు. భూగర్బ జలాలు ఇప్పటికే వందల అడుగులకు పడిపోవడంతో ఫ్లోరైడ్ నీటిని తాగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టాలి.
- వెంకటయ్య,
మాజీ సర్పంచ్, ఆల్వాన్‌పల్లి
దుందుబీ చెంత దుర్భిక్షం
Published Sat, May 24 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement