వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని బాహుదా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పది ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు.
సుండుపల్లి(వైఎస్సార్): వైఎస్సార్ జిల్లా సుండుపల్లి సమీపంలోని బాహుదా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న పది ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. నిత్యం నది నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పడ్డబలిజపల్లి గ్రామస్తులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు.
ఈ మేరకు వారు ఎమ్మార్వో సుబ్రమణ్యంరెడ్డికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన వీఆర్వోను సంఘటన స్థలికి పంపారు. ఆయన అక్కడికి చేరుకుని పది ఇసుక ట్రాక్టర్లను ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు.