ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | sand tractors captured | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Published Thu, Jun 15 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

నగర శివారులోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ గిరిబాబు తన సిబ్బందితో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కర్నూలు: నగర శివారులోని తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో ఎస్‌ఐ గిరిబాబు తన సిబ్బందితో దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. పంచలింగాల గ్రామానికి చెందిన షేక్‌ మౌలాలి, ఆంజనేయులు, బోయ రాజు నాయుడు, బిచ్చన్న నాయుడు, వెంకటనారాయణ, నిడ్జూరు గ్రామానికి చెందిన సయ్యద్‌మహబూబ్, సయ్యద్‌ రాజుబాష, బోయ రఘుబాబు, పంచలిగాల గ్రామానికి చెందిన బోయ మహేంద్ర, శివప్రసాద్, అయ్యస్వాములు, మునగాలపాడుకు చెందిన బోయ శివుడు, ఆంబోతు అంత్య, రంగారెడ్డి జిల్లా చెంగారెడ్డి గూడెంకు చెందిన ఐచ్చర్‌ లారీతో పాటు 12 ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. అందరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement