అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన సబ్ కలెక్టర్ 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు
జగిత్యాల: అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన సబ్ కలెక్టర్ 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన సబ్ కలెక్టర్ శశాంక్ ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివారు నుంచి తరలుతున్న 25 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.