ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Published Mon, Mar 13 2017 11:52 PM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM
కర్నూలు సీక్యాంప్: కర్నూలు మండలం తుంగభద్ర తీరాన ఉన్న బావాపురంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. కొంతకాలంగా తుంగభద్ర తీరాన ఇసుక తవ్వకాలు ప్రభుత్వం నిలుపుదల చేసింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కొందరు వ్యాపారులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం కర్నూలు తహసీల్దార్ టీవీ రమేష్‌బాబు సిబ్బందితో దాడి చేసి తిమ్మిది ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. యజమానులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2 లక్షల చొప్పున జరిమానా వేస్తున్నట్లు తహసీల్దార్ వివరించారు.
Advertisement
Advertisement