న్యూఢిల్లీ: హెచ్‌ఎంటీ సంస్థ స్వచ్ఛంద పదవీ విరమణ/ స్వచ్ఛంద విభజన స్కీమ్‌ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వాచ్‌లు, ట్రాక్టర్లు తయారు చేస్తున్న ఈ సంస్థ గత 15 సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తోంది. సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడానికి హెచ్‌ఎంటీ ఈ ప్రతిపాదనలను సమర్పించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1.045 మంది ఉద్యోగులున్నారు. వీరి వార్షిక వేతన బిల్లు రూ.45కోట్లుగా ఉంది.
భారీ పరిశ్రమల విభాగం ఆదేశాలననుసరించి ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్రానికి సమర్పించామని హెచ్‌ఎంటీ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు నివేదించింది. కాగా ఈ సంస్థను మూసేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. గత పదేళ్లుగా వేతనాలకు, ఇతర బకాయిలకు బడ్జెటరీ మద్దతు లభిస్తోంది. గత ఏడాది కేంద్రం రూ.1,083 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఆధునీకరణ, ఐదేళ్లలో టర్న్ అరౌండ్ కావడానికి తోడ్పటటానికి ఈ ప్యాకేజీని కేంద్రం ఆమోదించింది.
హెచ్‌ఎంటీలో వాలంటరీ రిటైర్మెంట్ !
Published Thu, Sep 25 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement