HMT
-
హెచ్ఎంటీ నుంచి ఇస్రోకు భారీ యంత్రం
హైదరాబాద్: హిందూస్థాన్ మెషీన్ టూల్స్ అరుదైన ఘనతను సాధించింది. దేశీయంగా ఇంతవరకు తయారు చేయని అతిపెద్ద యంత్రాన్ని తయారు చేసి ఇస్రోకు అందించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కోసం సాలిడ్ రాకెట్ మోటార్స్ త్రీ యాక్సెస్ మెషినరీని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్‌కు హెచ్ఎంటీ (హైదరాబాద్) సంస్థ అందజేసింది. హై ఫ్రీక్వెన్సీ, ప్రెజరైజ్డ్ కంట్రోల్ రూమ్, చిప్ అండ్ డస్ట్ కలెక్షన్ వంటివి మెషీన్ ప్రత్యేకతలు. 200 టన్నుల లోడ్ సామర్థ్యం, 12.7 మీటర్ల ఎత్తు ఉన్న ఈ యంత్రం హెచ్ఎంటీ నిర్మించిన యంత్రాల్లో అతిపెద్దది. ఇది ఇస్రో సాలిడ్ రాకెట్ మోటార్ల ఉత్పత్తిని పెంచడానికి ఉపకరిస్తుందని, దీన్ని రూపొందించడానికి రూ.18 కోట్లు వెచ్చించినట్లు హెచ్ఎంటీ హైదరాబాద్ యూనిట్ జనరల్ టెక్నికల్ మేనేజర్ బీవీఎస్ఎస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంటీ సేల్స్ డీజీఎం నరేశ్, డిజైన్స్ డీజీఎం రాజబాబు, ప్రొడక్షన్ డీజీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఈసీఐఎల్, హెచ్ఎంటీలో ఉద్యోగాలు...
ఈసీఐఎల్‌లో 14 పోస్టులు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టులు: సైంటిస్ట్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసన్, సీనియర్ ఆర్టిసన్. ఖాళీలు: 14 అర్హత: 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. ఆర్టిసన్ పోస్టులకు అర్హత: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ ఫిట్టర్ / షీట్ మెటల్ విభాగాల్లో రెండేళ్ల వ్యవధి గల ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి. ఎంపిక విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తుని నిర్దేశిత నమూనాలో పూర్తి చేసి ఆగస్టు 3న ‘ఇంటి నెం: 47-09-28, ముకుంద సేవా అపార్ట్మెంట్స్, థర్డ్ లేన్ ద్వారకా నగర్, విశాఖపట్నం’లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 3 వివరాలకు: www.ecil.co.in ...................... హెచ్ఎంటీలో 16 పోస్టులు బెంగళూరులోని హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు: జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఫైనాన్స్ ఆఫీసర్. విభాగాలు: ఫైనాన్స్, హెచ్ఆర్ ఖాళీలు: 16 అర్హత: సంబంధిత విభాగంలో ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ (ఇంటర్)/ ఎంబీఏ (ఫైనాన్స్/హెచ్), ఎంఎస్‌డబ్ల్యూ/ ఎన్ఐపీఎం/ పీజీడీపీఎం/తత్సమాన అర్హత. ఎంపిక విధానం: అర్హత గల వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 20 వివరాలకు: www.hmtmachinetools.com -
ఇక ‘ముద్రా’ బ్యాంక్..!
♦ ముద్రా(సిడ్బి) బ్యాంకుగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ♦ ముద్రా రుణాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటుకు కూడా ఓకే ♦ ఈ బడ్జెట్లో ముద్రా బ్యాంకుకు ♦ రూ.20వేల కోట్లు; ఫండ్‌కు రూ.3వేల కోట్లు! న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ(ఎన్బీఎఫ్సీ).. ముద్రా లిమిటెడ్‌ను ముద్రా బ్యాంకుగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రా(ప్రధాన మంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన కింద రుణాలను అందించే పథకాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీనిద్వారా ఇచ్చే రుణాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఓకే చేసింది. బుధవారమిక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడున్న ముద్రా లిమిటెడ్... ముద్రా(సిడ్బి) బ్యాంక్‌గా మారుతుందని, ఇది ప్రస్తుతం ఉన్న భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్(సిడ్బి)కి పూర్తిస్థాయి అనుసంబంధ సంస్థగా కొనసాగుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ముద్రా బ్యాంక్.. రీఫైనాన్స్ కార్యకలాపాలతో పాటు వివిధ సేవలు, పోర్టల్ మేనేజ్మెంట్, డేటా విశ్లేషణ వంటివి చేపడుతుందని కూడా వెల్లడించింది. ముద్రా యోజన కింద సూక్ష్మ, చిన్న వ్యాపార యూనిట్లకు బ్యాంకులు అందించిన రూ.లక్ష కోట్లకు పైబడిన రుణాలకు తొలి దశలో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద ప్రభుత్వం గ్యారంటీని అందిస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల ఈ స్కీమ్‌లో ఎదురయ్యే డిఫాల్ట్‌ల (ఎగవేతలు) విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిస్కు తగ్గుతుంది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ ముద్రా యూనిట్స్ (సీజీఎఫ్ఎంయూ) పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తారు. 2015, ఏప్రిల్ 8 నుంచి ఈ స్కీమ్ కింద మంజూరైన రుణాలన్నిటికీ ప్రభుత్వ గ్యారంటీ వర్తిస్తుంది. నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ(ఎన్సీజీటీసీ)... ఈ సీజీఎఫ్ఎంయూకు ట్రస్టీగా వ్యవహరిస్తుంది. రుణ పోర్ట్‌ఫోలియో ఆధారంగా మొత్తం రుణంలో డిఫాల్ట్ అయిన దానిలో గరిష్టంగా 50 శాతం వరకూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఈ సీజీఎఫ్ఎంయూ గ్యారంటీని అందించేందుకు వీలవుతుంది. ప్రతిపాదిత ముద్రా బ్యాం కుకు రూ.20,000 కోట్ల వరకూ రీఫైనాన్స్ మూలనిధి(కార్పస్), క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌కు రూ.3,000 కోట్ల మూలనిధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) బడ్జెట్ నుంచే అందించనున్నారు. మూడు రకాల రుణాలు... పీఎం ముద్రా యోజనలో ప్రస్తుతం శిశు, కిశోర్, తరుణ్ పేర్లతో మూడు రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహిక చిన్న వ్యాపారవేత్తలు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోడానికి రుణ సదుపాయం కల్పించడమే ఈ స్కీమ్ ముఖ్యోద్దేశం. శిశు విభాగంలో రూ.50,000 వరకూ, కిశోర్ విభాగంలో రూ.50,000 పైబడి రూ.5 లక్షల వరకూ రుణాలు లభిస్తాయి. ఇక తరుణ విభాగంలో రూ.5 లక్షలపైన, రూ. 10 లక్షల వరకూ రుణ సదుపాయం ఉంటుంది. విదేశీ సంస్థలతో ఒప్పందాలకు ఓకే... వివిధ దేశాల ప్రభుత్వ సంస్థలతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ(ఎంసీఏ), కాంపిటీషన్ కమిషన్(సీసీఐ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) కుదుర్చుకున్న ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిద్వారా మేధోపరమైన, సమాచార మార్పిడి, సాంకేతిక భాగస్వామ్యం, అనుభవాలను పంచుకోవడం ఇతరత్రా అంశాల్లో కుదిరిన మొత్తం 8 ఒప్పం దాలు అమల్లోకి రానున్నాయి. నెదర్లాండ్స్ ఆర్థిక శాఖ వ్యవహారాల శాఖతో ఎంసీఏ కుదుర్చుకున్న ఎంఓయూ, రష్యా ఫెడరల్ యాంటీ-మోనోపోలీ సర్వీస్, ఈయూ డెరైక్టరేట్ జనరల్ ఫర్ కాంపిటీషన్, కెనడా కాంపిటీషన్ కమిషన్‌తో సీసీఐ చేసుకున్న ఒప్పందం వంటివి ఇందులో ఉన్నాయి. అదేవిధంగా అసంఘటిత రంగంలోని కార్మికులు, యూనిట్లను సంఘటిత ఆర్థిక వ్యవస్థలోకి చేర్చేందుకు వీలుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ప్రతిపాదించిన సిఫార్సులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు హెచ్ఎంటీ యూనిట్ల మూసివేత... ప్రభుత్వ రంగ హెచ్ఎంటీ లిమిటెడ్‌కు చెందిన మూడు నష్టజాతక యూనిట్లను మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. 2007 వేతన స్కేల్స్ ప్రకారం సంబంధిత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) అందించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మూసివేతకు ప్రతిపాదించిన యూనిట్లలో హెచ్ఎంటీ వాచెస్, హెచ్ఎంటీ చినార్ వాచెస్, హెచ్ఎంటీ బేరింగ్స్ ఉన్నాయి. ఈ మూడూ హెచ్ఎంటీ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఈ మూడింటికీ రూ.427.48 కోట్ల నగదు సాయాన్ని అందించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటిలోని దాదాపు 1,000 మంది ఉద్యోగులకు ఇప్పటివరకూ ఇవ్వాల్సిన బకాయిలతో పాటు ఆకర్షణీయమైన వీఆర్ఎస్/వీఎస్‌ఎస్‌ను కల్పించడం ద్వారా హెచ్ఎంటీ నుంచి విడదీసి ఆ తర్వాత మూడు యూనిట్లను మూసివేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన అధికార ప్రకటన పేర్కొంది. ప్రభుత్వ విధానాన్ని అనుసరించి వీటికున్న స్థిర, చరాస్తుల విక్రయం జరుగుతుందని కూడా తెలిపింది. మొత్తం 31 కేంద్ర పీఎస్‌యూల్లో 12 మాత్రమే ప్రస్తుతం లాభాలతో నడుస్తున్నాయి. -
ఉద్యోగాలే.. ఉద్యోగాలు..
ఎయిమ్స్-రిషికేష్‌లో రెసిడెంట్లు రిషికేష్ (ఉత్తరాఖండ్)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయి మ్స్).. తాత్కాలిక పద్ధతిన వివిధ విభాగాల్లో జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 118. ఇంటర్వ్యూ తేదీలు డిసెంబర్ 17, 18. వివరాలకు www.aiimsrishikesh.edu.inచూడొచ్చు. ‘కేశవ్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కేశవ్ మహావిద్యాలయ.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 44. ఆన్లైన్ దరఖాస్తుకు గడువు జనవరి 5. వివరాలకు keshav.du.ac.inచూడొచ్చు. హెచ్ఎంటీలో వివిధ పోస్టులు హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ -టెక్నికల్ (ఏ/బి), సీనియర్ అసోసియేట్ (ఏ/బి), జూనియర్ అసోసియేట్ (ఏ/బి) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 24. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 21. వివరాలకు www.hmtmachinetools.comచూడొచ్చు. డబ్ల్యూబీఎస్ఈడీసీఎల్లో 298 పోస్టులు వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (డబ్ల్యూబీఎస్ ఈడీసీఎల్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, జూ. ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జి క్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 298. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. వివరాలకు www. wbsedcl.inచూడొచ్చు. ఢిల్లీ ఈఎస్ఐలో స్టెనో, యూడీసీ, ఎంటీఎస్ ఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 213. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు. ఏఐఏలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఐఏ).. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 200. వివరాలకు www.aai.aeroచూడొచ్చు. ఈఎస్ఐసీలో 181 పోస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 181. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు. హైదరాబాద్ ఐఐటీలో వివిధ పోస్టులు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఎలక్ట్రీషియన్ (హైలీ స్కిల్డ్), ఎలక్ట్రీషియన్ (హెల్పర్), ఫిట్టర్ జనరల్ మెకానిక్, మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 15. వివరాలకు www.iith.ac.inచూడొచ్చు. ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్లో ప్రాజెక్ట్ ఆఫీసర్లు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయ తీరాజ్ (ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంట ర్వ్యూ తేదీలు డిసెంబర్ 18, 22, 23. వివరాలకు www.nird. org.inచూడొచ్చు. నైవేలీ లిగ్నైట్‌లో గ్రాడ్యుయేట్ ట్రైనీస్ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 100. దరఖాస్తుకు చివరి తేది జనవరి 22. వివరాలకు www.nlcindia.comచూడొచ్చు. పశ్చిమ బంగాలో మెడికల్ పోస్టులు పశ్చిమ బంగా ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 75. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 15. వివరాలకు http://onlineapplication. healthyhowrah.org/చూడొచ్చు. కర్ణాటక యాంటీబయాటిక్స్‌లో పోస్టులు కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్, ఏరియా మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 19. వివరాలకు www.kaplindia.comచూడొచ్చు. ఎంఎంటీసీలో మేనేజర్ పోస్టులు న్యూఢిల్లీలోని ఎంఎంటీసీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 9. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 28. వివరాలకు www.mmtclimited. gov.inచూడొచ్చు. సీబీఎఫ్లో వివిధ పోస్టులు కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ.. కెన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స లిమిటెడ్ (సీబీఎఫ్).. వివిధ విభాగాల్లో జూనియర్ ఆఫీసర్స, ఆఫీసర్స, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది జనవరి 25. వివరాలకు www.canbankfactors.comచూడొచ్చు. మిధానిలో మెల్టర్స, లాడిల్మెన్ పోస్టులు హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని).. మెల్టర్స, లాడిల్మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 23. వివ రాలకు www.midhani.gov.inచూడొచ్చు. చెన్నై ఈఎస్ఐసీలో 92 పోస్టులు తమిళనాడు రీజియన్‌లో ఈఎస్ఐసీ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌స/హాస్పిటల్స్.. వివిధ విభాగాల్లో పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 92. దరఖాస్తుకు చివరి తేది జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు. కొంకణ్ రైల్వేలో వివిధ పోస్టులు నవీ ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.konkanrailway.comచూడొచ్చు. సెంట్రల్ డిజైన్ బ్యూరోలో క్యాడ్ ఆపరేటర్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టమెంట్ పరిధిలోని సెంట్రల్ డిజైన్ బ్యూరో కాంట్రాక్టు ప్రాతిపదికన క్యాడ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 18. వివరాలకు www.mohfw.nic.inచూడొచ్చు. -
వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతాం
యాజమాన్యం అగ్రిమెంట్ ప్రకారం వేతనాలను చెల్లించకపోతే.. సమ్మెకు సైతం వెనుకాడేది లేదని హెచ్ఎంఎస్ కార్మిక నేత, హోంమత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. హెచ్ఎంటీ కాలనీలోని హెచ్ఎంటి ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన హెచ్ఎంఎస్ పరిశ్రమ కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యలరైజ్ చేయడం లేదని, రైగ్యులరైజ్ చేయాలని అడిగిన వారిని విధుల్లో నుండి తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వేతన ఒప్పందం ప్రకారం సమాన వేతనాలతో పాటు, కార్మికులందరిని రైగ్యులరైజ్ చేయనట్లయితే లేబర్ యాక్ట్ 303 ప్రకారం సమ్మెకు సిద్దంగా ఉండాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ మూర్తి, కార్మికులు పాల్గొన్నారు. -
హెచ్ఎంటీలో వాలంటరీ రిటైర్మెంట్ !
న్యూఢిల్లీ: హెచ్ఎంటీ సంస్థ స్వచ్ఛంద పదవీ విరమణ/ స్వచ్ఛంద విభజన స్కీమ్‌ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వాచ్‌లు, ట్రాక్టర్లు తయారు చేస్తున్న ఈ సంస్థ గత 15 సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తోంది. సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడానికి హెచ్ఎంటీ ఈ ప్రతిపాదనలను సమర్పించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1.045 మంది ఉద్యోగులున్నారు. వీరి వార్షిక వేతన బిల్లు రూ.45కోట్లుగా ఉంది. భారీ పరిశ్రమల విభాగం ఆదేశాలననుసరించి ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్రానికి సమర్పించామని హెచ్ఎంటీ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు నివేదించింది. కాగా ఈ సంస్థను మూసేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. గత పదేళ్లుగా వేతనాలకు, ఇతర బకాయిలకు బడ్జెటరీ మద్దతు లభిస్తోంది. గత ఏడాది కేంద్రం రూ.1,083 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఆధునీకరణ, ఐదేళ్లలో టర్న్ అరౌండ్ కావడానికి తోడ్పటటానికి ఈ ప్యాకేజీని కేంద్రం ఆమోదించింది. -
చుక్కల్లో నిత్యావసరాల ధరలు!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నారుు. బియ్యం, కందిపప్పు, పెసర పప్పు ధరలు భగ్గుమంటున్నాయి. వేరుశనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు ధరలూ కొండెక్కాయి. చుక్కలనంటుతున్న రేట్లతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొత్త ధాన్యం మార్కెట్లోకి రాగానే బియ్యం ధరలు దిగిరావాల్సి ఉండగా మరింత పెరగడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో సోనా మసూరి పాత బియ్యం కిలోకు రూ.46 నుంచి రూ.48 వరకూ పలుకుతున్నారుు. అరుుతే సోనామసూరి కొత్త బియ్యం కూడా కిలో రూ.36కు తగ్గడం లేదు. నాణ్యతను బట్టి వ్యాపారులు రూ.38 వరకూ అమ్ముతున్నారు. ప్రథమ శ్రేణి బియ్యంగా పరిగణించే హెచ్ఎంటీ పాత బియ్యం ధర కిలో రూ.54 నుంచి రూ.56 వరకూ పలుకుతున్నారుు. ఇక కంది పప్పు కిలో రూ.60 నుంచి రూ.85 - 90కి చేరింది. వేరుశనగపప్పు ధర రూ.75 - 80 నుంచి రూ.130కి పెరిగిపోయింది. ఎండుమిర్చి మరింత ఘాటెక్కి కిలో రూ.120 పలుకుతోంది. మూడు నెలల కిందట రూ. 65 -70 ఉన్న కిలో పెసర పప్పు ధర ప్రస్తుతం రూ.120 - 130కి పెరిగింది. బెల్లం ధర కిలో రూ. 40 నుంచి రూ. 60కి పెరిగిపోయింది. పుట్నాలు రూ.60 నుంచి రూ. 90కి చేరారుు. పచ్చడన్నమూ భారమే.. పెసరపప్పు ధర రెట్టింపయిన నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొంగలికి స్వస్తి చెప్పారు. హోటళ్ల పొంగలిలో పెసరపప్పు పలుచబడింది. పప్పుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పచ్చడన్నంతో సరిపెట్టుకుందామన్నా అదీ భారంగానే ఉందని పేదలు వాపోతున్నారు. చింతపండు, ఎండుమిర్చి, నువ్వులు, పల్లీల ధరలు కూడా భారీగా పెరగడమే ఇందుకు కారణం. చింతపండు ధర కిలో రూ. 50 నుంచి రూ.100కు చేరింది. ఎండుమిర్చి రూ.120 వరకూ పలుకుతోంది. కిలో రూ.250తో నువ్వులు సామాన్యులకు అందుబాటులోనే లేవు. ప్రత్యామ్నాయంగా పల్లీలు తీసుకోవాలన్నా కిలో రూ.130 పైనే పలుకుతుండటంతో పేదలకు దిక్కుతోచడం లేదు. అమ్మో! పెసరపప్పూ, పానకమా? ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో వడపప్పూ, పానకంతో కూడిన ప్రసాదం పంపిణీ అంటేనే పేద, మధ్య తరగతి వారు బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నారుు. అరుుతే బెల్లం, పెసరపప్పు ధరలు భారీగా పెరగడం పట్ల ఉత్సవాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రసాద వితరణ ఖర్చు భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. -
హెచ్‌ఎంటీకి రూ. 77 కోట్ల ఆర్థిక ప్యాకేజీ
కేంద్ర కేబినెట్ ఆమోదం... వేతనాలు, పీఎఫ్ ఇతరత్రా బకాయిల చెల్లింపు కోసమే న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హెచ్ఎంటీ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ హెచ్ఎంటీ మెషీన్ టూల్స్‌కు రూ.77.4 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు ఆమో దం లభించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన వేతనాలు, పీఎఫ్, గ్రాట్యుటీ ఇతరత్రా బకాయిల చెల్లింపు కోసం ఈ ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నారు. హెచ్‌ఎంటీకి 2013 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బకాయిల కోసం రూ.27.06 కోట్లను, హెచ్ఎంటీ మెషీన్ టూల్స్‌కు 2012 సెప్టెంబర్ నుంచి 2013 మార్చి కాలానికి బకాయిలకు గాను రూ.55.34 కోట్లను బడ్జెట్లో ప్రణాళికేతర కేటాయింపుగా ఇచ్చేందుకు సీసీఈఏ లైన్‌క్లియర్ చేసింది. ఈ రెండు కంపెనీల పునరుద్ధరణ, పునర్వ్యవస్థీకరణ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగుల్లో స్థైర్యాన్ని నింపేలా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. హిందుస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్‌గా 1953లో ఏర్పాటైన ఈ కంపెనీ పేరు 1973లో హెచ్ఎంటీ లిమిటెడ్‌గా మారింది. గతేడాది అక్టోబర్ 31 నాటికి సంస్థలో 1439 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్యాకేజీ నేపథ్యంలో గురువారం హెచ్ఎంటీ షేరు 5% లాభపడి రూ.31.15 వద్ద ముగిసింది. గ్లాక్సో రూ.6,400 కోట్ల ఎఫ్‌డీఐకి ఓకే... గ్లాక్సో స్మిత్‌క్లైన్ భారత్‌లో రూ.6,400 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదనకు కూడా సీసీఈఏ ఆమోదముద్ర వేసింది. భారత్‌లోని అనుబంధ సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాలో 24.33 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయడం కోసం మాతృ సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఓపెన్ ఆఫర్ ప్రకటించడం తెలిసిందే. ఇందుకోసం రూ.6,400 కోట్లను వెచ్చించనుంది. ఈ కొనుగోలు పూర్తయితే జీఎస్కే ఫార్మాలో జీఎస్కే గ్రూప్ వాటా ఇప్పుడున్న 50.67% నుంచి 75 శాతానికి చేరనుంది. హిటాచీ.. ప్రిజమ్ పేమెంట్ కొనుగోలుకూ ప్రిజమ్ పేమెంట్ సర్వీసెస్‌ను కొనుగోలు చేసేందుకు జపాన్ కంపెనీ హిటాచీ ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. ఈ డీల్ విలువ రూ.1,540 కోట్లు. ప్రిజమ్ పేమెంట్‌లో 100 శాతం వాటాను హిటాచీ కన్సల్టింగ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇండియా, హిటాచీ లిమిటెడ్‌లు దక్కించుకోనున్నాయి.ప్రిజమ్ పేమెంట్ నిర్వహణలో ప్రస్తుతం 10వేలకు పైగా ఏటీఎంలు, 52,500 పాయింట్ ఆఫ్ సేల్ డివైజ్‌లు ఉన్నాయి.