సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నారుు. బియ్యం, కందిపప్పు, పెసర పప్పు ధరలు భగ్గుమంటున్నాయి. వేరుశనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు ధరలూ కొండెక్కాయి. చుక్కలనంటుతున్న రేట్లతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొత్త ధాన్యం మార్కెట్‌లోకి రాగానే బియ్యం ధరలు దిగిరావాల్సి ఉండగా మరింత పెరగడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్‌లో సోనా మసూరి పాత బియ్యం కిలోకు రూ.46 నుంచి రూ.48 వరకూ పలుకుతున్నారుు. అరుుతే సోనామసూరి కొత్త బియ్యం కూడా కిలో రూ.36కు తగ్గడం లేదు. నాణ్యతను బట్టి వ్యాపారులు రూ.38 వరకూ అమ్ముతున్నారు.
ప్రథమ శ్రేణి బియ్యంగా పరిగణించే హెచ్‌ఎంటీ పాత బియ్యం ధర కిలో రూ.54 నుంచి రూ.56 వరకూ పలుకుతున్నారుు. ఇక కంది పప్పు కిలో రూ.60 నుంచి రూ.85 - 90కి చేరింది. వేరుశనగపప్పు ధర రూ.75 - 80 నుంచి రూ.130కి పెరిగిపోయింది. ఎండుమిర్చి మరింత ఘాటెక్కి కిలో రూ.120 పలుకుతోంది. మూడు నెలల కిందట రూ. 65 -70 ఉన్న కిలో పెసర పప్పు ధర ప్రస్తుతం రూ.120 - 130కి పెరిగింది. బెల్లం ధర కిలో రూ. 40 నుంచి రూ. 60కి పెరిగిపోయింది. పుట్నాలు రూ.60 నుంచి రూ. 90కి చేరారుు.
పచ్చడన్నమూ భారమే..
పెసరపప్పు ధర రెట్టింపయిన నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొంగలికి స్వస్తి చెప్పారు. హోటళ్ల పొంగలిలో పెసరపప్పు పలుచబడింది. పప్పుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పచ్చడన్నంతో సరిపెట్టుకుందామన్నా అదీ భారంగానే ఉందని పేదలు వాపోతున్నారు. చింతపండు, ఎండుమిర్చి, నువ్వులు, పల్లీల ధరలు కూడా భారీగా పెరగడమే ఇందుకు కారణం. చింతపండు ధర కిలో రూ. 50 నుంచి రూ.100కు చేరింది. ఎండుమిర్చి రూ.120 వరకూ పలుకుతోంది. కిలో రూ.250తో నువ్వులు సామాన్యులకు అందుబాటులోనే లేవు. ప్రత్యామ్నాయంగా పల్లీలు తీసుకోవాలన్నా కిలో రూ.130 పైనే పలుకుతుండటంతో పేదలకు దిక్కుతోచడం లేదు.
అమ్మో! పెసరపప్పూ, పానకమా?
ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో వడపప్పూ, పానకంతో కూడిన ప్రసాదం పంపిణీ అంటేనే పేద, మధ్య తరగతి వారు బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నారుు. అరుుతే బెల్లం, పెసరపప్పు ధరలు భారీగా పెరగడం పట్ల ఉత్సవాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రసాద వితరణ ఖర్చు భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు.