
మహీంద్రా అర్జున్ నోవోకు ఆదరణ
♦ 48 పనులు చేయడానికి వీలుగా తయారీ
♦ ఆధునిక టెక్నాలజీతో మార్కెట్‌లోకి...
కరీంనగర్ : రైతులకు అవసరమైన ట్రాక్టర్స్ తయారీలో పేరున్న మహీంద్రా కంపెనీ సరికొత్త డిజైన్‌లో ఇటీవల విడుదల చేసిన‘అర్జున్ నోవో’ ట్రాక్టర్‌కు మంచి ఆదరణ లభిస్తుందన్నదని కంపెనీ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సౌరభ్ వాత్స తెలిపారు. రైతులు వివిధ సందర్భాల్లో ఏకంగా 48 రకాల పనులు చేసేలా ఈ ట్రాక్టర్‌ను రూపొందించింది. బుధవారం కరీంనగర్‌లోని మహీంద్రా కంపెనీడీలర్ షోరూంకు వచ్చిన ఆయన ‘అర్జున్ నోవో’ ట్రాక్టర్ ప్రత్యేకతను, వీటి అమ్మకాల తీరు తెన్నులను ‘సాక్షి’కి వివరించారు. వివరాలు...
పొలాల్లో సునాయాసంగా పనులు
అడ్వాన్స్‌డ్ ఎర్గొనామిక్స్, ఫ్లాట్‌ఫారం డిజైన్‌తో రూపొందించిన ‘అర్జున్ నోవో’తో సమయం ఎలా గడిచిపోతుందన్నది తెలియదు. గంటల పనిని కొద్ది నిమిషాల్లోనే సునాయాసంగా పూర్తి చేస్తుంది. ఫుల్ ఫ్లాట్‌ఫారం వేడి రాని విధానం, సులువుగా ఎక్కి దిగే సౌకర్యం, పవర్‌ఫుల్ ర్యాప్ అరౌండ్ హెడ్ ల్యాంప్స్, ఫోర్‌వే అడ్జస్టబుల్ డీలక్స్ సీట్, కారులాంటి సస్పెండెడ్ పెడల్స్ ఈ ట్రాక్టర్ ప్రత్యేకతలు.
ఆధునిక ఇంజిన్
ఆధునిక ఇంజిన్ కలిగిన ‘ఆర్జున్ నోవో’ ఎక్కువ శక్తి కలిగివుంటుంది. 4 సిలిండర్ ఉన్న శక్తివంతమైన ఇంజిన్, తక్కువ ఇంధన ఖర్చు, అన్నింటికన్నా పెద్ద ఎయిర్‌క్లీనర్, రేడియేటర్‌లతో రూపొందించిన ట్రాక్టర్. గట్టి గరుకైన భూములను సైతం సునాయసంగా దున్నే సామర్థ్యం. అన్నిటికంటే ఎక్కువగా 15 ఫార్వర్డ్, 3 రివర్స్ గేర్లు, గంటకు 1.69 కిలోమీటర్ల అతి తక్కువ స్పీడ్‌కాగా, అధికంగా గంటకు 33 కిలోమీటర్లు ప్రయాణించే సౌకర ్యం. పీటీవో లీవర్లు కలిగి ఉంది. ఆధునిక క్లచ్, డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంది.
రైతులకు అత్యంత అనువు
నూతనంగా విడుదల చేసిన ‘మహీంద్రా నోవో’ ట్రాక్టర్‌కు అన్ని ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉంది. కరీంనగర్ జిల్లాలోని రెండు గుర్తింపు కలిగిన షోరూం లలో వీటిని అందుబాటులో ఉంచాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వందలాది ట్రాక్టర్లు అమ్మడుపోయాయి. ఆధునిక టెక్నాలజీతో దీనిని డిజైన్ చేశాం. రైతులకు అత్యంత అనువుగా ఉండటమే కాకుండా దాదాపు 48 పనులు చే సేలా దీనిని తయారు చేశాం.