
ఆరు ఇసుక ట్రాక్టర్ల సీజ్
పెద్దకందుకూర్ (యాదగిరిగుట్ట) : మండలంలోని పెద్దకందుకూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు, ఒక జేసీబీసీ యాదగిరిగుట్ట ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సీజ్ చేశారు. గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో వాగులో నిఘాపెంచిన ఎస్‌ఐ ఆదివారం పక్క సమాచారంతో అక్కడి వెళ్లి పట్టుకున్నారు. దీంతో ఆ ట్రాక్టర్లను స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే సహించేది లేదన్నారు.