Viral Video: Rajasthan Groom Drives To Wedding Venue With 51 Tractors - Sakshi
Sakshi News home page

రైతు బిడ్డగా ఓ వరుడి ఆలోచన..మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్లతో..

Published Tue, Jun 13 2023 4:32 PM | Last Updated on Tue, Jun 13 2023 5:09 PM

Viral Video: Rajasthan Groom Drives To Wedding Venue With 51 Tractors  - Sakshi

ఓ వరుడి వినూత్న ఆలోచన అందర్నీ ఆలోచింపచేసేలా చేసింది. తమ వివాహాన్ని వెరైటీగా లగ్జరీగా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. ఐతే దానికో విలువ, అర్థం వచ్చేలా జరుపుకునేవారు కొందరే. ఇక్కడ ఓ వరుడు తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టగుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకోసం ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున్న ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్‌ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు. ఈ ఘటన రాజస్తాన్‌ బార్మర్‌లో జరిగింది.

వివరాల్లోకెళ్తే..గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్‌ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో వివాహం నిశ్చయం అయ్యింది. వధువు ఇల్లు వరుడి ఇంటికి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో వరడు వధువు గ్రామానికి అంతే సంఖ్యలో  51 ట్రాక్టర్లతో పెద్ద ఊరేగింపుగా వెళ్లి సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నాడు. వారంతా అలా రావడం చూసి వధువు తరుపు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు వరుడు ప్రకాశ్‌ మాట్లాడుతూ..నా కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయం. అందరూ వ్యవసాయమే చేస్తారు. అలాగే ట్రాక్టర్‌ను రైతుకు గుర్తింపుగా భావిస్తారు.

మా నాన్న పెళ్లి ఊరేగింపుకి ఒక ట్రాక్టర్‌ ఉపయోగించారు. నేనెందుకు 51 ట్రాక్టర్లు ఉపయోగించకూడదు అని అనుకుని ఇలా చేసినట్లు వివరించాడు వరుడు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తండ్రి జేతారామ్‌ మాట్లాడుతూ..ట్రాక్టర్‌ను భూమి కొడుకుగా పరగణిస్తాం. మా నాన్న, తాతయ్యల ఊరేగింపు ఒంటెలపై సాగింది. అదీగాక మా కుటుంబంలో ఇప్పటికే 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉన్నాయి. నా రైతు మిత్రులతో కలిసి ఇన్ని ట్రాక్టర్లను ఏర్పాటు చేశాం. ట్రాక్టర్లతోనే వ్యవసాయం చేస్తున్నప్పుడూ వాటిపై ఎందుకు ఊరేగింపు చేయకూడదన్న ఆలోచనతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు  జేతారామ్‌.

(చదవండి: దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? ఒక సారి మీ సబ్బు సంగతి తేల్చండి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement