
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో సోనాలిక ట్రాక్టర్స్ అక్టోబర్‌లో 20,000 ట్రాక్టర్లను విక్రయించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసిన 7అమ్మకాల వృద్ధిని అధిగమించి ఏకంగా 16 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఒక నెలలో తమకు ఇవే అత్యధిక అమ్మకాలని కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ తెలిపారు. తమ ట్రాక్టర్ల తయారీలో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నందున రైతుల నుంచి తమ బ్రాండ్‌కు విశేషమైన ఆదరణ లభిస్తుందని రమణ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment