సోలిస్‌ ట్రాక్టర్స్‌ చేతికి జర్మనీ కంపెనీ థాలర్‌ | Solis Tractors acquires Thaler GmBH to enter wheel loader market | Sakshi

సోలిస్‌ ట్రాక్టర్స్‌ చేతికి జర్మనీ కంపెనీ థాలర్‌

Mar 7 2023 1:08 AM | Updated on Mar 7 2023 1:08 AM

Solis Tractors acquires Thaler GmBH to enter wheel loader market - Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ సోలిస్‌ ట్రాక్టర్స్‌ అగ్రికల్చరల్‌ మిషనరీ జర్మనీకు చెందిన థాలర్‌ జీఎంబీహెచ్‌ అండ్‌ కో.కేజీ ని కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక విలీనంతో సోలిస్‌ ట్రాక్టర్స్‌ యూరప్‌ మార్కెట్లోకి ప్రవేశించనుంది.

అలాగే 19–75 హెచ్‌పీ శ్రేణికి చెందిన నాణ్యమైన జేసీబీలను తన పోర్ట్‌ ఫోలియోలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.200 కోట్ల ముందస్తు పెట్టుబడులతో ఈ డీల్‌ను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ ఎండీ దీపక్‌ మిట్టల్‌ తెలిపారు. జర్మనీలోనీ థాలర్‌ ఫ్యాక్టరీ కార్యాలయంలో జరిగిన టేకోవర్‌ కార్యక్రమంలో ఐటీఎల్‌ గ్రూప్‌ ఎండీ దీపక్‌ మిట్టల్, థాలర్‌ జీఎంబీహెచ్‌ అండ్‌ కో.కేజీ కంపెనీ అధినేత మ్యాన్‌ఫ్రెడ్‌ థాలర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement