tractors Business
-
సోలిస్ ట్రాక్టర్స్ చేతికి జర్మనీ కంపెనీ థాలర్
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ గ్రూప్ అనుబంధ సంస్థ సోలిస్ ట్రాక్టర్స్ అగ్రికల్చరల్ మిషనరీ జర్మనీకు చెందిన థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ ని కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక విలీనంతో సోలిస్ ట్రాక్టర్స్ యూరప్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. అలాగే 19–75 హెచ్‌పీ శ్రేణికి చెందిన నాణ్యమైన జేసీబీలను తన పోర్ట్ ఫోలియోలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.200 కోట్ల ముందస్తు పెట్టుబడులతో ఈ డీల్‌ను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ఎండీ దీపక్ మిట్టల్ తెలిపారు. జర్మనీలోనీ థాలర్ ఫ్యాక్టరీ కార్యాలయంలో జరిగిన టేకోవర్ కార్యక్రమంలో ఐటీఎల్ గ్రూప్ ఎండీ దీపక్ మిట్టల్, థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ కంపెనీ అధినేత మ్యాన్‌ఫ్రెడ్ థాలర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆశావహంగా ట్రాక్టర్ల మార్కెట్
ముంబై: వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం పెరిగేలా సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ పరిశ్రమ పనితీరు ఆశావహంగా ఉండగలదని జాన్ డీర్ ఇండియా ఎండీ సాహిలేంద్ర జగ్తప్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ స్థాయిలో ట్రాక్టర్ల అమ్మకాలు 9,00,000 యూనిట్ల పైచిలుకు ఉండవచ్చని ఆయన చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు ఇదే స్థాయి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. 1998లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన జాన్ డీర్‌కు ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణెలోను, మధ్యప్రదేశ్‌లోని దేవాస్లోనూ చెరో ప్లాంటు ఉంది. వీటి వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 1.32 లక్షల ట్రాక్టర్లుగా ఉంది. -
మహీంద్రా జోరును తగ్గించిన ట్రాక్టర్లు
3 శాతం తగ్గిన నికర లాభం ముంబై : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.852 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం రూ.882 కోట్లతో పోలిస్తే 3 శాతం క్షీణత నమోదైందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. అమ్మకాలు క్షీణించడం, ట్రాక్టర్ల వ్యాపారం కుదేలవటంతో నికర లాభం తగ్గిందని మహీంద్రా గ్రూప్ ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. నికర అమ్మకాలు 3 శాతం క్షీణించి రూ.9,708 కోట్లకు తగ్గాయని వివరించారు. ఈ క్యూ1లో పరిశ్రమ అమ్మకాలు 7 శాతం పెరగ్గా, తమ అమ్మకాలు 3 శాతం తగ్గాయని పేర్కొన్నారు. కన్సాలిడేషన్ ప్రాతిపదికన ఆదాయం రూ.10,734 కోట్ల నుంచి రూ.10,474 కోట్లకు, ఇతర ఆదాయం రూ.189 కోట్ల నుంచి రూ.163 కోట్లకు తగ్గాయని చెప్పారు. జులైలో ట్రాక్టర్ల అమ్మకాలు 12% క్షీణించాయని, ప్రస్తుత క్వార్టర్(జూలై-సెప్టెంబర్)లో ట్రాక్టర్ల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం ఉండగలదని గోయెంకా వివరించారు. క్యూ1లో మార్జిన్లు 14 శాతం పెరిగాయని గ్రూప్ సీఎఫ్ఓ జి. పార్థసారధి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మహీంద్రా షేర్ 0.5 శాతం క్షీణించి రూ.1,388 వద్ద ముగిసింది.