ప్రొద్దుటూరు : ‘మేము ఏ సమస్య చెప్పినా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదా అని చిన్నచూపు చూడొద్దు.. సామాన్యుల తరఫున మాట్లాడుతున్నాం.. కొన్ని సమస్యలను పదే పదే విన్నవించినా న్యాయం జరక్కపోవడంతో పదే పదే ప్రశ్నిస్తున్నాం.. అంతే కానీ మాకు అధికారులెవరిపై వ్యక్తిగత కక్షలేదు.. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించి ప్రజలకు న్యాయం చేయాల’ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నా రు.
శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించలేదని ఆత్మహత్యకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బం దిని పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణ ఏజెన్సీ తరఫున అధికార పార్టీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ 18 మంది సెక్యూరిటీ సిబ్బందితో పనిచేయిస్తూ వారికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించలేదన్నారు.
ఆస్పత్రిలో పారిశుద్ధ్యం సరిగా లేదని, అతని తీరు సరిగా లేదని గతంలో జరిగిన అడ్వైజరి కమిటీ సమావేశంలో తనతోపాటు కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డిలతో కలిసి ఫిర్యాదు చేశామన్నారు. కాం ట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పినా ఫలితం లేదన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పినాపని కాలేదంటే తమ విలువ ఏమేడ్చిందన్నారు. వేతనాల కోసం ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది గత వారం ఆత్మహత్యకు ప్రయత్నిస్తే వారికి వేతనాలు చెల్లించలేదు కదా కనీసం వారిని పరామర్శించేందుకు కూడా కాంట్రాక్టర్ బాలనారాయణరెడ్డి ఆస్పత్రికి రాకపోవడం విచారకరమన్నారు.
గతంలోనే జిల్లా కలెక్టర్ స్పందించి ఉంటే ఈ సమస్య పరిష్కారమయ్యేదన్నారు. కష్టాల్లో ఉన్న వారికి జిల్లా కలెక్టర్ దేవుడని, కనిపించని దేవుడు వారి సమస్యను పరిష్కరించకపోగా కళ్లేదుటే కనిపిస్తున్న కలెక్టర్ దేవుడు కూడా వీరిని పట్టించుకోకపోవడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు గైనకాలజిస్టులను నియమించాలని, మం దుల కొరత తీర్చాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తాము పదే పదే కలెక్టర్‌ను వేడుకుంటున్నా పరిస్థితి మారలేదన్నారు. ఇప్పటికే ఆస్పత్రి సమస్యలపై తనతోపాటు సీపీఐ, సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి పలుమార్లు ఆందోళన చేశామన్నారు. అయినా ఆయన మనసు కరగలేదన్నారు. కాలేకడుపుతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక మానసిక ఆవేదనకు గురవుతున్న సెక్యూరిటీ సిబ్బంది చివరికి ఆత్మహత్యే శర ణ్యమని భావించారన్నారు.
పొరపాటున కార్మికులకు ఏమైనా జరిగితే కలెక్టర్ ఇంటి వద్ద తిష్ట వేస్తామన్నారు. కేసులకు, అరెస్టులకు భయపడబోమన్నారు. స్వయంగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పినా కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు వేతనాలు చెల్లించకపోవడం ఒక తప్పు అయితే బాధ్యతగా ఆ కాంట్రాక్టర్ ప్రతినెల వీరికి వేతనాలు ఇవ్వకపోవడం మరో తప్పిదమన్నారు.
మా గోడు ఆలకించండి
Published Sat, Jul 4 2015 2:21 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement