ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రస్తుత రాజకీ య పరిస్థితుల దృష్ట్యా మనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచిదని పలువురు కార్యకర్తలు మున్సిపల్ ఇన్‌చార్జి మాజీ చైర్మన్ వీఎస్ ముక్తియార్‌కు సూచిం చారు. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఈయ న రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని వీడి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకుగా ను బుధవారం తన స్వగృహం వద్ద కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సభ నిర్వహించారు.
సభకు అధ్యక్షత వహిం చిన పోలీసు అధికారుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా మా ట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేర కు ముక్తియార్ వైఎస్సార్‌సీపీలో చేరాలని కోరారు. న్యాయవాది టప్పా అబ్దుల్ రసూల్ మాట్లాడుతూ వైఎస్ నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లింలకు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ముక్తియార్ వైఎ స్సార్ సీపీలో చేరాలని కోరారు.
మరో న్యాయవాది సబ్దర్ హుసేన్, ఎస్‌పీజీ చర్చి కార్యదర్శి భాస్కర్‌రావు, యూత్ కాంగ్రెస్‌జిల్లా మాజీ అధ్యక్షుడు, టౌన్ బ్యాంక్ డైరక్టర్ పీఎండీ నజీర్ మాట్లాడుతూ వైఎస్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్ పార్టీని స్థాపించారన్నారు. జగన్ జిల్లా వాసి కావడంతో ఆ పార్టీలో చేరితే మన భవిష్యత్తు బాగుం టుందన్నారు. అగస్త్యేశ్వర ఆలయ కమి టీ సభ్యుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ముక్తియార్ వైఎస్సార్ సీపీలో చేరి రాచమల్లు ప్రసాదరెడ్డి గెలుపుకు కృషి చేయాలని కోరారు.
సమావేశంలో మా జీ కౌన్సిలర్లు పాణ్యం సుబ్బరాయుడు, అగ్గారపు శ్రీనివాసులు, గంజికుంట ఆంజనేయులు, షహబుద్దీన్, సాలయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోతుకూరి సుబ్బారావు, డిపో మహబూబ్‌సాహెబ్, రిటైర్డు మున్సిపల్ అధికారి ఎస్‌పీ అహ్మద్‌హుసేన్, రిటైర్డు డీఎంఅండ్ హెచ్‌ఓ సాజహాన్, న్యాయవాది దాదాపీర్, పట్ట ణ చీఫ్ ఖాజీ ఇనాయతుల్లా, ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా, డాక్టర్ లియాఖత్, డా క్టర్ సత్తార్, మాజీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మండి అబ్దుల్ ఖాదర్, రిటైర్డు టీచర్ సులేమాన్, గౌస్‌లాజం, ఆర్టీసీ ఉద్యోగి బాబా, జయరాజ్‌లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీల్లో బెటర్ ఆప్షన్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నారు.
నేడు నిర్ణయాన్ని ప్రకటిస్తా :
ఆత్మీయ సభలో అందరి అభిప్రాయాలు విన్న అనంతరం తన రాజకీయ నిర్ణయాన్ని గురువారం ప్రకటిస్తానని వీఎస్ ముక్తియార్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీలో చేరండి
Published Thu, Mar 6 2014 2:58 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement