మల్లికార్జున్ మెరుపు శతకం | mallikarjun hits 146 runs | Sakshi
Sakshi News home page

మల్లికార్జున్ మెరుపు శతకం

Published Mon, Dec 16 2013 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

mallikarjun hits 146 runs

 జింఖానా, న్యూస్‌లైన్: స్టార్లెట్స్ బ్యాట్స్‌మన్ మల్లికార్జున్ (146) మెరుపు సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 244 పరుగులు భారీ తేడాతో కాంకార్డ్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్టార్లెట్స్ 356 పరుగులకు ఆలౌటైంది. హర్ష (73) అర్ధ సెంచరీతో రాణించాడు. కాంకార్డ్ సీసీ బౌలర్ నితిన్ 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన కాంకార్డ్ సీసీ 112 పరుగులకే కుప్పకూలింది. శ్రీనివాస్ (74) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు.
 
  స్టార్లెట్స్ సీసీ బౌలర్లు సాయి అనూప్ రెడ్డి,  సాయి తేజ చెరో 4 వికెట్లు తీసుకున్నారు. మరో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో జితేందర్ గౌడ్ (101), సందీప్ కుమార్ (102) బౌలింగ్‌లో అరవింద్ (6/10) రాణించడంతో అంబర్‌పేట్ సీసీ జట్టు 278 పరుగుల భారీ తేడాతో ఎల్‌ఎన్‌సీసీ జట్టు గెలుపు దక్కించుకుంది.  
 
 మొదట బ్యాటింగ్‌కు దిగిన అంబర్‌పేట్ సీసీ 7 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. రాజ్‌కుమార్ (78) అర్ధ సెంచరీతో రాణించగా... ముబాషీర్ (48) మెరుగ్గా ఆడాడు. ఎల్‌ఎన్‌సీసీ బౌలర్లు జితేష్ 3, అజయ్ 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎల్‌ఎన్‌సీసీ... అరవింద్ ధాటికి 79 పరుగులకే చేతులెత్తేసింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు...
 ఆర్‌కె పురం: 243/9 (శుభమ్ 87, విజయ్ కుమార్ 35; వినోద్ 3/53, కిరణ్ 3/61, హ ర్షిత్ 2/48); సదరన్ స్టార్స్ : 61 (అరుణ్ కుమార్ 5/26, రమేష్ 5/28).
 
 హెచ్‌జీసీ: 221 (రణధీర్ 110, సాయి చరణ్ 46; అబ్బాస్ 2/41, మహేష్ 2/54); యంగ్ మాస్టర్స్ సీసీ: 225 (సయ్యద్ అజ్మద్ 79, ఉజైర్ 53; భరత్ ముంద్ర 4/60, శ్రవణ్ నాయుడు 3/55).
 
 రుషిరాజ్ : 257 (ఎండీ ఖాజా నిజాముద్దీన్ 85, అలీమ్ 53; అద్వైత్ ఆర్యన్ 4/60); హెచ్‌యూసీసీ: 119 (పాషా 5/36, రషీద్ 5/29).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement