కీచకుడికే జేసీ ప్రభాకర్‌ అండ! | Tadpatri TDP Leader Harassment Case: JC No Justice For Victim | Sakshi

న్యాయం కోసం వెళ్తే.. కీచకుడికే జేసీ ప్రభాకర్‌ అండ!

Mar 12 2024 2:29 PM | Updated on Mar 12 2024 3:37 PM

Tadpatri TDP Leader Harassment Case: JC No Justice For Victim - Sakshi

ఆమెను లోపలికి రానిచ్చేది ఏంది?.. రానివ్వకండి.. అంటూ ఆయన అధికారులకు.. 

సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, కౌన్సిలర్ మల్లికార్జున కీచక పర్వం నియోజకవర్గంలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ అనూష​ అనే యువతి పోరాటానికి దిగింది. ఈ క్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. 

మల్లికార్జున్‌ వ్యవహారంపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నించింది. మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆమె అప్పాయింట్‌మెంట్‌ కోసం యత్నించగా.. జేసీ అందుకు నిరాకరించారు. ఆమెను లోనికి రానియొద్దంటూ సిబ్బందికి సూచించారు. దీంతో గేటు వద్దే ఆమె చాలాసేపు ఉండిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. కీచకుడికే అండగా నిలబడడం ఏంటని? జేసీ తీరుపై మండిపడుతున్నారు పలువురు.

టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున తనను శారీరకంగా వాడుకున్నాడని, రెండు సార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని, తనను చంపుతానని టీడీపీ నేత మల్లికార్జున బెదిరిస్తున్నాడని బాధితురాలు అనూష వాపోతోంది. ఈ క్రమంలో ఎస్పీని కలిసి ‘స్పందన’లో తన గోడును సైతం వెల్లబోసుకుందామె. 

https://www.sakshi.com/video/news-videos/tadipatri-tdp-councillor-mallikarjuna-cheated-woman-1984853

సంబంధిత వార్త: మల్లికార్జున కీచక పర్వమిది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement