tadipathi
-
కీచకుడికే జేసీ ప్రభాకర్ అండ!
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, కౌన్సిలర్ మల్లికార్జున కీచక పర్వం నియోజకవర్గంలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ అనూష అనే యువతి పోరాటానికి దిగింది. ఈ క్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మల్లికార్జున్ వ్యవహారంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నించింది. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆమె అప్పాయింట్మెంట్ కోసం యత్నించగా.. జేసీ అందుకు నిరాకరించారు. ఆమెను లోనికి రానియొద్దంటూ సిబ్బందికి సూచించారు. దీంతో గేటు వద్దే ఆమె చాలాసేపు ఉండిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. కీచకుడికే అండగా నిలబడడం ఏంటని? జేసీ తీరుపై మండిపడుతున్నారు పలువురు. టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున తనను శారీరకంగా వాడుకున్నాడని, రెండు సార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని, తనను చంపుతానని టీడీపీ నేత మల్లికార్జున బెదిరిస్తున్నాడని బాధితురాలు అనూష వాపోతోంది. ఈ క్రమంలో ఎస్పీని కలిసి ‘స్పందన’లో తన గోడును సైతం వెల్లబోసుకుందామె. సంబంధిత వార్త: మల్లికార్జున కీచక పర్వమిది! -
సోలార్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
తాడిపత్రి: పెద్దవడుగూరు మండలం గంజిగుంటపల్లి వద్ద మెయిల్ సంస్థకు చెందిన సోలార్ ప్లాంట్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. సోలార్ ప్యానెల్ నుంచి వెళ్లే అయిల్ పైపులు తీవ్ర ఒత్తిడికి గురవడంతో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపిం చాయి. ఆ సమయంలో వీచిన గాలులకు మంటలు చెలరేగి ప్యానెల్‌కు అనుకొని ఉన్న పైప్లైన్లు, 50 సోలార్ పలకలు కాలిపోయినట్లు జనరల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పైప్‌లైన్‌లో ఉన్న 100 లీటర్ల అయిల్ కూడా లీకై కాలిపోయినట్లు వివరించారు. సుమారు రూ.3 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఇక్కడి ప్లాంట్‌లో 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. అత్యధిక వేడి కారణంగా పైప్లైన్లు వత్తిడికి గురై ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. హిందూపురంలో సోఫా దుకాణం... హిందూపురం అర్బన్ : స్థానిక త్యాగరాజనగర్‌లోని మసీదు వద్దనున్న సోఫా సెట్ మరమ్మతులు, పరుపులు తయారీ షాపులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. షాపు ఆవరణలోని మామిడి చెట్టు వద్ద పిల్లలు ఆడుకుంటూ టపాసులు కాల్చడంతో నిప్పురవ్వలు షాపు ఆవరణలోని స్పాంజ్ వస్తువులపై పడటంతో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపకSసిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే షాపు బయట ఉంచిన స్పాంజ్లు, చెక్కలు కాలిపోయాయి. సుమారు రూ.70 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు హబీద్lతెలిపారు. ఘటనపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రజనీ వివరాలడిగి తెలుసుకున్నారు.