సోలార్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం | Fire Accident in solar plant | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Published Sat, Oct 15 2016 11:34 PM | Last Updated on Mon, Oct 22 2018 8:26 PM

Fire Accident in solar plant

తాడిపత్రి: పెద్దవడుగూరు మండలం గంజిగుంటపల్లి వద్ద మెయిల్‌ సంస్థకు చెందిన సోలార్‌ ప్లాంట్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. సోలార్‌ ప్యానెల్‌ నుంచి వెళ్లే అయిల్‌ పైపులు తీవ్ర ఒత్తిడికి గురవడంతో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపిం చాయి. ఆ సమయంలో వీచిన గాలులకు
 
మంటలు చెలరేగి ప్యానెల్‌కు అనుకొని ఉన్న పైప్‌లైన్లు, 50 సోలార్‌ పలకలు కాలిపోయినట్లు జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పైప్‌లైన్‌లో ఉన్న 100 లీటర్ల అయిల్‌ కూడా లీకై కాలిపోయినట్లు వివరించారు. సుమారు రూ.3 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఇక్కడి ప్లాంట్‌లో 50 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. అత్యధిక వేడి కారణంగా పైప్‌లైన్లు వత్తిడికి గురై ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.
 
హిందూపురంలో సోఫా దుకాణం...
హిందూపురం అర్బన్‌ : స్థానిక త్యాగరాజనగర్‌లోని మసీదు వద్దనున్న సోఫా సెట్‌ మరమ్మతులు, పరుపులు తయారీ షాపులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. షాపు ఆవరణలోని మామిడి చెట్టు వద్ద పిల్లలు ఆడుకుంటూ టపాసులు కాల్చడంతో నిప్పురవ్వలు షాపు ఆవరణలోని స్పాంజ్‌ వస్తువులపై పడటంతో మంటలు చెలరేగాయి.
 
చుట్టుపక్కల వారు గమనించి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపకSసిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే షాపు బయట ఉంచిన స్పాంజ్‌లు, చెక్కలు కాలిపోయాయి. సుమారు రూ.70 వేలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు హబీద్‌lతెలిపారు. ఘటనపై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ రజనీ వివరాలడిగి తెలుసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement