సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం, రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ప్రమాదం కొందరు ఆకతాయిల కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది. భద్రతాలోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టు వైఎస్సార్‌సీపీ చెబుతోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్‌లో మంటలు చెలరేగాయి. బుధవారం సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్‌సీపీ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు ఇంటి వద్ద భద్రతా లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ భద్రతపై ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ భద్రత విషయంలో ఉదాసీనత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.
వైయస్ జగన్ గారి ఇంటి వద్ద అగ్నిప్రమాదం. సాయంత్రం మరియు రాత్రి మంటలు ఎగసిపడ్డాయి.@ysjagan గారి భద్రతపై ప్రజలు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/tst2y6stCq
— YSR Congress Party (@YSRCParty) February 5, 2025
Comments
Please login to add a commentAdd a comment