కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిత్ తిరుమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో తలా అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద బాణాసంచా కాలుస్తూ అభిమాన హీరో సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
రిలీజ్ మొదటి రోజు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఓవరాక్షన్ చేశారు. ఏకంగా థియేటర్ లోపల బాణాసంచా పేల్చి అరాచకం సృష్టించారు. మరికొందరు అభిమానులైతే థియేటర్ వెలుపల పోలీసులతో గొడవపడ్డారు. కొందరు ఫ్యాన్స్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అగ్నిప్రమాదం జరిగి ఉంటే..
అజిత్ కుమార్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్స్ మండిపడుతున్నారు. థియేటర్ వెలుపల బాణాసంచా కాల్చి సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మీ అందరి ప్రాణాలు పోయేవని హెచ్చరిస్తున్నారు. పోలీసుల ఆదేశాలు పాటించకుండా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా హీరోపై అభిమానం ఉండాలే కానీ.. అది ప్రాణాలు తీసేలా ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Sambavam pannitanuga😭😭😭#VidaaMuyarchi #VidaaMuyarchiBookings https://t.co/GI1XfPHbM3 pic.twitter.com/yvQucbNe82
— 𝓐𝓻𝓪𝓿𝓲𝓷𝓭❤️ (@_Aravind_15) February 5, 2025
Comments
Please login to add a commentAdd a comment