అనంతపురం: ఎన్పీకుంట సోలార్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై సీపీఎం జాతీయ నాయకులు ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. గురువారం ఎన్పీ కుంట సోలార్ ప్రాజెక్టు బాధిత రైతులను కలుసుకున్న ఆయన.. ప్రభుత్వం రైతుల కడుపుకొట్టి భూ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.
సోలార్ ప్రాజెక్టులో భూములు నష్టపోయినటువంటి పట్టాలున్న రైతులకు కూడా ఎందుకు పరిహారం చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రకాశ్ కారత్ ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రైతులందరికి న్యాయం జరిగేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్పీ కుంట రైతు సమస్యలను జాతీయ ఉద్యమంగా మార్చనున్నట్లు ప్రకాశ్ కారత్ తెలిపారు.